అనంతపురం: టీడీపీ దాడులపై ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ దాడుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ధర్నా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో నేడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు.
టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైఎస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు. చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ దాడులు'
Published Sun, Jun 5 2016 4:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM
Advertisement