నారా ఆదర్శంగా గ్రామానికో నయీం తయారు | GADIKOTA Srikanth Reddy comments on Chandrababu | Sakshi
Sakshi News home page

నారా ఆదర్శంగా గ్రామానికో నయీం తయారు

Published Thu, Sep 29 2016 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

నారా ఆదర్శంగా గ్రామానికో నయీం తయారు - Sakshi

నారా ఆదర్శంగా గ్రామానికో నయీం తయారు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యారని, ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు నారా చంద్రబాబు కాదు, నయీం చంద్రబాబు అని అంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతి అనే పదమే ఆశ్చర్యపోయేలా ఏపీలో రెండేళ్లనుంచి భారీగా అవినీతి వెల్లువై పారుతోందని, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీలు, దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యేలు, మంత్రులంతా నయీం ముఠాలాగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది నదుల అనుసంధానం కాదని, నిధుల్ని అవినీతితో చంద్రబాబు అనుసంధానం చేస్తున్నారని గడికోట దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇసుకమాఫియా, నియోజకవర్గస్థాయిలో ఎల్లోట్యాక్స్ విధానం తెచ్చి అవినీతికి గేట్లు ఎత్తేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement