చంద్రబాబు ఫేక్‌ నేత | Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఫేక్‌ నేత

Published Wed, Feb 17 2021 3:51 AM | Last Updated on Wed, Feb 17 2021 6:33 AM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నకిలీ నాయకుడని, టీడీపీనీ నకిలీగా మార్చేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ అభిమానులకు ఘన విజయం అందిస్తే, ఈ నిజాన్ని పక్కదారి పట్టించేలా ఫేక్‌ వెబ్‌సైట్‌ను టీడీపీ సృష్టించడం నీచమైన రాజకీయమన్నారు. ప్రజాదరణ కోల్పోయిన ఆ పార్టీ ఫేక్‌ వార్తల ప్రచారానికి దిగజారిందని మండిపడ్డారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఉద్యమం చేస్తానంటున్న చంద్రబాబు.. మోదీకి లేఖ రాయడానికీ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో వణికిపోతున్న చంద్రబాబు రోజుకో డ్రామా.. పూటకో మాటగా నెట్టుకొస్తున్నారని విమర్శించారు. 

ఓడినా నకిలీ బతుకేనా?
► పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి పట్టుమని 15 శాతం పంచాయతీలు కూడా రాలేదు. చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాడని జనం భావించారు. అందుకే గత అసెంబ్లీలో ఆయనకు ఓటేసిన వారు కూడా ఈసారి వైఎస్సార్‌సీపీ అభిమానులకే మద్దతిచ్చారు.
► ఈ నిజాన్ని దారిమళ్లించేందుకు ఫేక్‌ వెబ్‌సైట్‌ సృష్టించి, అసత్య ప్రచారం చేయడం నీచ రాజకీయం. తననే నమ్ముకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు చేస్తూ కొత్త డ్రామాకు తెరతీశారు.
► చంద్రబాబు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ చోట టీడీపీ వాళ్లు నామినేషన్‌ వేయించారని ఓ పత్రికలో వార్త వచ్చింది. మునుముందు ఇలాంటివే పెద్ద వార్తలు అవుతాయేమో!  

మోదీకి లేఖ రాస్తే జైల్లో వేస్తాడనే భయం
► విశాఖలో దీక్షలో చంద్రబాబో, ఆయన కొడుకో, ఎంవీవీఎస్‌ మూర్తి మనవడో కూర్చుంటే బాగుండేది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు.. మోదీకి లేఖ రాస్తే ఎక్కడ జైల్లో పెడతాడోనని భయపడుతున్నారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయన కొడుకు

విశాఖ వాసుల దగ్గరకు వెళ్లగలరా?  
► హెరిటేజ్‌ సంస్థను ప్రభుత్వం అమ్మితే చంద్రబాబు ఊరుకుంటాడా? అలాంటిది కేంద్ర సంస్థ విశాఖ స్టీల్‌ను రాష్ట్రం ఎలా అమ్మగలదు? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? 54 ప్రభుత్వ రంగ సంస్థలను తన వాళ్లకు పప్పూ బెల్లాలకు అమ్మేసిన చంద్రబాబు.. ఆర్టీసీనే ప్రభుత్వంలో కలిపేసిన జగన్‌పై నిందలేయడం విడ్డూరం.
► విశాఖ ఉక్కును కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 25 కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement