చంద్రబాబుకు రఘువీరా లేఖ | raghuveera reddy letter to chandrababu over ten issues | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు రఘువీరా లేఖ

Published Sun, Sep 28 2014 3:03 PM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

చంద్రబాబుకు రఘువీరా లేఖ - Sakshi

చంద్రబాబుకు రఘువీరా లేఖ

హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల అధ్యక్షతనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రుణమాఫీ ద్వారా లబ్ది పొందే రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికుల వివరాలు గ్రామస్థాయిలో వెల్లడించాలని ఆయన సూచించారు.
 

ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, రేషన్షాపు డీలర్లు, అంగన్వాడీ, ఔట్సోర్సింగ్, రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో అర్హులకు రేషన్ కార్డులు తొలగించడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తో లింక్ చేయొద్దని రఘువీరా రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement