కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మందికి అందని రుణమాఫీ
ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం పంట రుణాలు రూ.49,500 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది రూ.26,000 కోట్లు
కేబినెట్ లెక్కతేలి్చన సొమ్ము రూ.31,000 కోట్లు
చివరికి మూడు విడతల్లో కలిపి చేసిన మాఫీ రూ.17,933 కోట్లే..
ఎన్నికల నుంచి పంద్రాగస్టు దాకా ‘తగ్గిపోతూనే’ ఉన్న రుణాల లెక్కలు
గత ప్రభుత్వంలో ‘లక్ష’ మాఫీకే 36.68 లక్షల రైతులు.. ఇప్పుడు రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే!
గతం కంటే రైతుల సంఖ్య పెరగాల్సిందిపోయి.. 14.31 లక్షల మంది తగ్గడమేంటి?
అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు, సంఘాల నేతలు, వ్యవసాయ నిపుణులు
మూడో విడత జాబితాలోనూ తమ పేర్లు లేవంటూ అనేకచోట్ల రైతుల ఆందోళన
ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
2023–24కు సంబంధించి మార్చి 31 వరకు ఎస్‌ఎల్‌బీసీ పంట రుణాల కింద పెట్టుకున్న లక్ష్యం రూ. 73,437 కోట్లు.. అందులో డిసెంబర్ ఆఖరు నాటికి æరూ. 49,500 కోట్లు, మార్చి ఆఖరుకు రూ. 64,940 కోట్లు రైతులకు మంజూరు అయ్యాయి.
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువరైతు పేరు జెల్ల మహేశ్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం తొండకూర్ గ్రామం. 2017లో కుద్వాన్‌పూర్ స్టేట్ బ్యాంకులో రూ. 1.10 లక్షలు రుణం తీసుకున్నారు. అర్హత ఉన్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. మూడో విడతలోనూ పేరు రాలేదు. కారణమేంటని వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్‌కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాలేదని సమాధానం ఇచ్చారు. విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అంటే ఇక తన బ్యాంకు రుణం తీరనట్టేనా? అని ఆయన ఆందోళనలో పడిపోయారు.
ఈయన పేరు పాతకుంట వెంకటరెడ్డి. నల్లవెల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా. ఒకే రేషన్‌కార్డుపై ఉన్న వెంకటరెడ్డికి, ఆయన తల్లికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి ఇండియన్ బ్యాంకులో రూ.1.40 లక్షల పంట రుణం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ ఆయన పేరు రాలేదు. అర్హత ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని అధికారులను అడిగితే సమాధానమేదీ రావడం లేదని ఆయన వాపోతున్నారు.
నల్లగొండలోని గొల్లగూడకు చెందిన జక్కుల యాదయ్య.. 2022 మార్చిలో రూ.99 వేలు రుణం తీసుకున్నారు. 2023 మార్చిలో రూ.6,800 వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.7 వేల వడ్డీ చెల్లించి మళ్లీ రెన్యువల్ చేయించుకున్నారు. నిజానికి యాదయ్యకు తొలివిడతలోనే రుణమాఫీ జరగాల్సి ఉన్నా.. జాబితాలో పేరు రాలేదు. దీంతో నల్లగొండ వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. వెబ్‌సైట్‌లో బ్యాంకు వివరాలు లేవని అధికారులు చెప్పారు. దీనితో యాదయ్య బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకెళ్లి ఇచ్చారు. అయినా మాఫీ కాలేదు.
సూర్యాపేట జిల్లా ఏపూరుకు చెందిన మున్నా ముత్తిలింగం ఏపీజీవీ బ్యాంకులో 2023లో రూ.64 వేల రుణం తీసుకున్నారు. మార్గదర్శకాల ప్రకారం ఆయనకు రుణమాఫీకి పూర్తి అర్హత ఉంది. ఆయన కుటుంబంలో ఎవరికీ బ్యాంకులో రుణాలేవీ లేవు. అయినా మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఇప్పగూడెంకు చెందిన పిట్ట రాజేందర్‌కు రూ.1.10 లక్షల వ్యవసాయ రుణం ఉంది. రుణమాఫీ జాబితాలో ఆయన పేరు రాలేదు. ఇదేమని వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్‌కార్డు సమస్య అని చెప్పారు. రాజేందర్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. విడిగా తన కుటుంబానికి కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనితో అధికారులు తల్లిదండ్రులతో ఉన్న రేషన్‌కార్డులోంచి ఆయన పేరును తొలగించారు. కొత్త కార్డు మాత్రం జారీ కాలేదు. దీనితో రుణమాఫీ కాలేదు.
...వీరే కాదు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు లేవని, గతంలో జరిగినట్టుగానే చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్నారు. అటు బ్యాంకుల చుట్టూ, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ.. తమకు రుణమాఫీ కాకపోవడానికి కారణాలేమిటని నిలదీస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పుడు ఏవేవో కొర్రీలు పెడుతూ మాఫీ చేయకపోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు.
మాఫీ సొమ్ము తగ్గిందెందుకు..?
ఏటా బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య, రుణాల సొమ్ము పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల సంఖ్య, సొమ్ము భారీగా తగ్గిపోవడం ఏమిటనే అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టిందని రైతులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తంతో పోలిస్తే.. మాఫీ చేసినది మూడో వంతు మేర మాత్రమే ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రైతులకు రూ.64,940 కోట్ల పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది డిసెంబర్ వరకే లెక్కలోకి తీసుకుంటే.. రూ.49,500 కోట్ల రుణాలు ఇచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా మూడు దశల్లో కలిపి 22.37 లక్షల మందికి.. మొత్తంగా రూ. 17,933 కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అర్హత ఉన్నప్పటికీ కొందరికి రుణమాఫీ ఎందుకు జరగలేదో తమకు కూడా అంతుబట్టడంలేదని వ్యవసాయశాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
ఏటేగా పెరుగుతూపోతున్న రుణాలు
రైతులకు ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2014–15లో రూ.17,019 కోట్లు పంట రుణాలు ఇవ్వగా.. 2023–24కు వచ్చేసరికి రూ.64,940 కోట్లకు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలోని లెక్కలను చూసినా.. 2014–18 మధ్య 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ కోసమే రూ.19,198 కోట్లు అయినట్టు లెక్క తేల్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి అర్హుల సంఖ్యను 22.37 లక్షలకు, మాఫీ సొమ్మును రూ.17,933 కోట్లకే పరిమితం చేయడం వెనుక మాయ ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రుణమాఫీ పరిస్థితి ఇదీ
⇒ నల్లగొండ జిల్లాలో తమకు రుణమాఫీ కాలేదంటూ వ్యవసాయ శాఖకు ఇప్పటివరకు 4 వేలకుపైగా ఫిర్యాదులు అందాయి.
⇒ జనగామ జిల్లా కేంద్రం యూనియన్ బ్యాంక్ బ్రాంచీ లో రుణాలు తీసుకున్న లింగాల ఘణపురం, రఘునాథపల్లి, జనగామ, దేవరుప్పుల తదితర మండలాలకు చెందిన 317 మంది రైతుల పేర్లు జాబితాలో లేవు.
⇒ జగిత్యాల జిల్లాలో గల్ఫ్ వెళ్లిన కుటుంబాల్లో చాలా వరకు రుణమాఫీ అందలేదు. కలెక్టరేట్‌లో ఇప్పటివరకు 1,145 మంది మాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు.
⇒ కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ రాలేదంటూ 2,898 ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు వేర్వేరుగా ఉన్న 1,127 మంది ఆర్జీ పెట్టుకున్నారు.
పారదర్శకంగా రుణమాఫీ జరగడం లేదు
రైతు రుణమాఫీ అందరికీ కావడం లేదు. రేషన్‌కార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో అర్హులను తగ్గిస్తూ వచ్చారు. బ్యాంకు ఖాతాలు కూడా పెరిగాయి. గత వ్యవసాయ సీజన్ నాటికే 60 లక్షల రైతు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇంత తక్కువ మంది ఎలా ఉంటారు? పారదర్శకంగా రుణమాఫీ జరగడం లేదు. ఇచ్చామని మభ్యపెడుతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వం రైతుల వాస్తవ రుణమాఫీ డేటాను దాస్తున్నాయి. ఎంత అప్పుంది? ఇంత తీర్చారన్నది స్పష్టంగా చెప్పడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కొర్రీలు పెడుతున్నారు. ఎవరికి, ఎందుకు రుణమాఫీ జరగలేదో స్పష్టతనివ్వడం లేదు. – దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు
రూ. 49,500 కోట్లు
(గత ఏడాది డిసెంబర్ నాటికి ఇచి్చన వ్యవసాయ రుణాలపై బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) లెక్క)
రూ. 31,000 కోట్లు
(జూన్ 21న కేబినెట్ భేటీ తర్వాత రైతులకు చేసే రుణమాఫీపై సీఎం రేవంత్ స్వయంగా చెప్పిన లెక్క ఇది. జూలై 18న సచివాలయంలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తూ.. మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.)
రూ. 26,000 కోట్లు
(బడ్జెట్‌లో రైతులకు పంట రుణాల మాఫీ కోసం కేటాయించిన మొత్తం ఇది. ఇందులో నేరుగా 15,470 కోట్లు చూపగా.. మరో రూ.7,410 కోట్లను ఎస్సీ ఫండ్ కింద, రూ.3,120 కోట్లను ఎస్టీ ఫండ్ కింద కేటాయించారు)
రూ. 17,933.18 కోట్లు
(మొదటి విడతలో రూ.6,098.93 కోట్లు, రెండో విడత రూ.6,190.01 కోట్లు, మూడో విడత రూ.5,644.24 కోట్లు కలిపి మొత్తంగా రూ.17,933.18 కోట్లు రుణ మాఫీ చేశారు)
అలా అలా తగ్గిపోతూనే...
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం 2023–24 మార్చి 31 నాటికి రైతులకు ఇచి్చన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఆ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. అధికారంలోకి వచ్చాక కసరత్తు చేపట్టి.. రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవుతాయని ప్రాథమిక అంచనా వేసింది. కానీ మంత్రివర్గ సమావేశంలో రూ.31 వేల కోట్లుగా నిర్ణయించింది. బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఈ ‘లెక్క’రూ.26 వేల కోట్లకు తగ్గిపోయింది. చివరికి రుణమాఫీ మూడు విడుతల్లో కలిపి రూ. 17,933 కోట్లు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment