వంద సభలు.. నిండా సమస్యలు
ఏలూరు : జిల్లాలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు గ్రామ సభలు మంగళవారం నాటికి వందచోట్ల పూర్తయ్యూరుు. వివిధ సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల వర్తింపు కోరుతూ ఇప్పటివరకూ 27,487 అర్జీలు అందాయి. వీటిలో ఏ ఒక్క దానికి పరిష్కారం దొరకలేదు. ప్రజలిచ్చిన అర్జీల వివరాలను కేటగిరీల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 78 గ్రామాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 22 సభలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 13,403 వినతి పత్రాలు అందాయన్నారు. ఇప్పటివరకూ 256 వైద్య శిబిరాలు నిర్వహించి, 18,636 మందికి వైద్య సేవలందించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 28,884 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.2 కోట్ల 71 లక్షల 97 వేల నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్టు వివరించారు.
ప్రసంగాలకే పెద్దపీట
ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో చేపట్టిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారుు. ప్రజలకేదో చేశామని చెప్పుకునేందుకు అన్నట్టుగా పింఛన్లు పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో జన్మభూమి కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోం దని, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ప్రజాప్రతినిధులు వీధుల్లో తిరిగి అక్కడి సమస్యలను తెలుసుకోవడంతోపాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఊళ్లను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు చేపడుతున్న దాఖలాలు కానరావడం లేదు. మొదటి రోజు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు చేతబట్టి మొక్కుబడిగా వీధులను ఊడ్చారు. మరోవైపు గ్రామసభ వేదికలపై మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్షమై ప్రసంగాలు ఇస్తూ విలువైన సమయూన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారుు. ఏలూరు నగరంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు వేదికలెక్కి ప్రసంగించారు. కాగా ఈ సభల్లో ఏర్పాటు చేసిన వైద్య, పశువైద్య శిబిరాలకు ఆదరణ కరువైంది.
సమస్యలపై నిలదీత
నాలుగో రోజు జన్మభూమి సభల్లో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీ శారు. లింగపాలెం మండలం కలరాయనగూడెంలో రోడ్లు, డ్రెయిన్లు బాగోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ గుత్తా పెదబాబు కల్పించుకుని వారిని వారించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెంలో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు హాజరు కాగా, విద్యుత్ సమస్యపై గ్రామస్తులు నిలదీశారు. యాదవోలు సభలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం కోసం రైతులు బ్యాంకులకు వెళ్తుంటే దొంగల్లా చూస్తున్నారని వాపోయూరు. వెంటనే పూర్తిస్థారుులో రుణాలు మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి గ్రామసభలో తమ పింఛన్లు ఎందుకు నిలుపుదల చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆచంట మండలంలోని ఆచంట, శేషమ్మ చెరువు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రభుత్వ దృష్టికి అరటి రైతుల డిమాండ్
దెందులూరు మండలం సోమవరప్పాడులో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అరటి రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయూలన్న డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఉంగుటూరు మండలం గోపాలపురం, గోకవరం గ్రామ సభల్లో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం, దూబచర్ల గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నిడదవోలు నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవం, చాగల్లు మండలం గౌరీపల్లి గ్రామసభల్లో ఎమ్మెల్యే కేఎస్ జవ హర్, మొగల్తూరు మండలం కే పీపాలెం సౌత్, నార్త్, నరసాపురం పట్టణంలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొయ్యలగూడెం మండలం సీతంపేట సభలో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు.