Distribution pensions
-
వాలంటీర్లను పక్కన పెట్టి టీడీపీ నేతలతో పెన్షన్ల పంపిణీ
-
పెన్షన్లకు రాజకీయ రంగు..
-
ఎట్టకేలకు..
సిద్దిపేట జోన్ : స్వయం సహాయక సంఘాల మహిళల్లోని అభయహస్తం లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. సంవత్సర కాలంగా అభయహస్తం పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఫలించాయి. తొమ్మిది నెలల బకాయిలను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 5290 లబ్ధి్దదారులకు సంబంధించిన రూ.2.36 కోట్లు విడుదల అయ్యాయి. సోమవారం నుంచి పంపిణీ ప్రక్రియకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) అధికారులు శ్రీకారం చుట్టారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో అభయహస్తం పంపిణీ పక్రియ జరిగింది. డ్వాక్రా సంఘాల్లోని 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలు రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు రూపంలో జమచేసుకోవాలి. 58 సంవత్సరాల తర్వాత పొదుపు చేసిన మొత్తం ఆధారంగా అభయహస్తం లబ్ధిదారురాలికి రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు పింఛన్ రూపంలో ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుంది. అయితే, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత యేడు జనవరి నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. వేలాదిమందికి ఊరట రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం బకాయిలను విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2016–17 ఆర్ధిక సంవత్సరానికి పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సంబంఅభయ హస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం సంబంధిత శాఖకు నిధులు చేరడంతో సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియను సెర్ఫ్ అధికారులు చేపట్టారు. ఈ లెక్కన జిల్లాలోని 22 మండలాలతో పాటు, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక పట్టణాలకు చెందిన 5290 మంది లబ్ధిదారులకు రూ.2.36 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో అత్యధికంగా కొహెడ మండలంలోని 441 మందికి రూ.19 లక్షలు, చేర్యాల మండలంలో 408మందికి రూ.18లక్షలు, చిన్నకోడూరు మండలంలో 358 మందికి రూ.15 లక్షలు, బెజ్జంకిలో 333 మందికి రూ.14లక్షలు, దుబ్బాకలో 287 మందికి రూ.12 లక్షలు, హుస్నాబాద్‌లో 346 మందికి రూ. 15 లక్షలు, నంగునూరులో 373 మందికి రూ.16లక్షలు, సిద్దిపేట పట్టణంతో పాటు, అర్బన్, సిద్దిపేట మండలంలో 617 మందికి రూ.30 లక్షలు మొత్తంగా జిల్లాలో రూ.2.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న లద్ధిదారులకు సర్కార్ నిర్ణయం కొంత ఊరటను కలిగించింది. నిధులు విడుదల చేసిన విషయం వాస్తవమేనని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ధ్రువీకరించారు. -
ఎన్టీఆర్ పింఛన్‌కు ఎన్ని పాట్లో
► బ్యాంకు ఖాతా తప్పనిసరి చేసిన వైనం ► వృద్ధులు, వికలాంగులకు అవస్థలు ► జిల్లాలో ప్రహసనంగా పింఛన్ల పంపిణీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందిస్తున్న సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు ఎన్నో పాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. పంపిణీ విషయంలో ఇప్పటికే చేసిన మార్పులతో గగ్గోలు పెడుతున్నారు. పదేపదే పంపిణీ విధానాన్ని మార్చడంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కొన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు, మరికొన్ని రోజులు సర్వీస్ ప్రొవైడర్లు, ఇంకొన్ని రోజులు పోస్టాఫీసులు ద్వారా తాజాగా బ్యాంకుల్లో నేరుగా నగదు జమ చేస్తామని అంటున్నారు. ఇచ్చే వెయ్యి రూపాయల కోసం ఎన్ని పాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందనని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆవేదన చెందుతున్నారు. సత్తెనపల్లి/గురజాల: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీకి బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉన్న వారు ఖాతా నెంబర్లు, ఆధార్, రేషన్ కార్డులు నకళ్లు అందజేస్తుండగా లేని వారు ఖాతాలను ప్రారంభించి ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో కదల్లేని వృద్ధులు, వికలాంగులు, ఇంటి వద్ద ఒక్కరే ఉన్న వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కనీసం కాలకృత్యాలైనా తీర్చుకోవడానికి బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వృద్ధులు తమ పరిస్థితి ఏమిటని లబోదిబో మంటున్నారు. 60 శాతం మందికి ఖాతాలు నిల్ జిల్లాలో పింఛన్ల పంపిణీ త్వరలో బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడానికి గాను లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఖాతాల నకళ్లను తీసుకొని అంతర్జాలం లో పొందుపర్చనున్నారు. కొంత మంది వృద్ధులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వృద్ధులు 1,61,241 మంది, వితంతువులు 1,28,997 మంది, వికలాంగులు 42,621 మంది, చేనేత 6,398 మంది, కల్లు గీత కార్మికులు 868 మంది, అభయహస్తం 23,517 మంది, మొత్తం 3,69,642 మంది ఫింఛను దారులు ప్రతి నెలా రూ. 36.84 కోట్లు సొమ్ము పొందుతున్నారు. కాగా సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 81 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. 60 శాతం మందికి పైగా వృద్థులు, వికలాంగులు, వితంతువులకు బ్యాంకు ఖాతాలు లేవు. పంచాయతీల ద్వారా అందించాలి నాకు 85 ఏళ్లు. పింఛను కోసం నడవ లేక ఇక్కడ వరకు వస్తున్నా. ఇక్క రోజులు తరబడి ఉండాల్సి వస్తుంది. గతంలో పంచాయతీ కార్యదర్శి ఇంటికే వచ్చి ఇచ్చి పోయే వాడు. ఇప్పడు మళ్ళీ బ్యాంకులు అంటే చాలా ఇబ్బంది. నర్రా రాములు, వృద్ధుడు బ్యాంకులంటే ఇబ్బందే బ్యాంకుల ద్వారా పింఛను పంపిణీ చేస్తే ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకులకు వెళ్ళటం అలవాటు లేక పోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికి పింఛను కోసం మూడు రోజుల నుంచి వస్తున్నా. మా లాంటి వృద్ధులు ఇక బ్యాంకులకు వెళ్ళి తీసుకోవడం అంటే ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవాలి. అల్లు పున్నమ్మ, వృద్ధురాలు మెలికలతో అవస్థలు పింఛన్లు నేరుగా ఇచ్చేస్తే ఎంతో బాగుండేది. మెన్నటి వరకు పోస్టాఫీసులు చుట్టూ తిప్పారు. నిన్నటి వరకు పంచాయతీ కార్యాలయానికి రమ్మన్నారు. ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి రావాలంటున్నారు. తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కలిగివుండాలని మరో కొత్త నిబంధన పెట్టడంతో ఏమి చేయాలో అర్థంకావడం లేదు. కొత్తపల్లి దయమ్మ, గురజాల. -
‘ఆసరా’ పంపిణీలో ఆలస్యం జరగొద్దు!
♦ పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో మంత్రి కేటీఆర్ ♦ నిధుల విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడతా.. సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పథకాల అమలుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగాల ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని పంచాయతీరాజ్ డెరైక్టర్ అనితా రామచంద్రన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్థిక శాఖ నుంచి ‘ఆసరా’ పింఛన్లకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా ఆ శాఖ ఉన్నతాధికారులతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. అలాగే, ఎండ తీవ్రత పెరిగినందున ఉపాధిహామీ పనులకు హాజరవుతున్న కూలీల ఆరోగ్యం దెబ్బతినకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 19న కేంద్రమంత్రి పర ్యటన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ చౌదరి ఈనెల 19న రాష్ట్రంలో పర్యటించనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం-పాలేరు సెగ్మెంట్‌తో పాటు మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలిస్తారని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. -
ఇంటింటికీ పింఛను.. ఎవరికి పట్టేను!
కర్నూలు(హాస్పిటల్): ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ అభాసుపాలవుతోంది. మొదటి మూడు రోజుల్లోనే అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలనే ఒత్తిళ్ల నేపథ్యంలో అందరినీ ఒక్క చోటికి పిలిపించి మమ అనిపించేస్తున్నారు. ఇప్పటికీ ప్రతి నెలా ఆరు శాతానికి పైగా పింఛన్లు ఇవ్వకుండానే ఖాతాలు మూసేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,43,916.. వితంతు పింఛన్లు 1,23,053.. వికలాంగుల పింఛన్లు 39,844.. చేనేత కార్మిక పింఛన్లు 3,617.. కల్లు గీత కార్మికులు 161 మందికి కలిపి ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొత్తం 3,10,591 పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రూ.34,51,13,500 ఖర్చు చేస్తోంది. జిల్లాలో ఈ నెల బుధవారం వరకు 94.25 శాతం మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. ఇక ఒకరోజు మాత్రమే గడువుంది. ఏడు రోజుల అనంతరం సర్వర్‌ను మూసేస్తారు. మిగిలిన వారికి మళ్లీ వచ్చే నెలలోనే పింఛన్ల పంపిణీ జరగనుంది. అదేవిధంగా పంచాయతీ కార్యాలయాలు, నీళ్లట్యాంకులే అడ్డాలుగా చేపడుతున్న పంపిణీ లబ్ధిదారులకు విసుగు తెప్పిస్తోంది. ప్రతి నెలా 18వేల మందికి మొండిచెయ్యి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేయకపోవడం, వారం రోజుల్లోనే పంపిణీ ముగించేస్తుండటంతో ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ప్రతి నెలా వచ్చే రూ.1000 కోసం ఎంతో ఆశగా ఎదురుచూసే వారికి వచ్చినట్లే వచ్చి పింఛన్ రాకుండా పోయేసరికి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లాలో 3,19,591 మందికి పింఛన్లు పంపిణీ చేస్తుండగా.. అందులో 6 శాతం అంటే 18వేల మందికి పైగా పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వీరికి మరుసటి నెలలో ఇస్తామని చెబుతున్న అధికారులు.. తిరిగి ఆ నెలలోనూ అంతే శాతం మందికి మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. -
పింఛన్ ఠంఛన్‌గా అందేనా?
గజపతినగరం: పాత సీసాలో కొత్త సారాలా ఉంది పింఛన్ల పంపిణీ విధానం మార్పు పరిస్థితి! పోస్టాఫీసుల ద్వారా సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం దీనికి తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా పోస్టాఫీసులకు బదలాయిస్తోంది. జిల్లాలో ఎంతో మంది సిబ్బంది, అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ పింఛన్ల పంపిణీలో నిత్యం సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీస సౌకర్యాలు కానీ, వసతులు, సిబ్బంది కానీ లేని పోస్టాఫీసులకు ఈ భారీ కార్యక్రమాన్ని అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.41లక్షల పింఛన్ల పంపిణీని ఇక నుంచి పోస్టల్ శాఖ చేస్తుందని సెర్ఫ్ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, జిల్లా మంత్రి కిమిడి మృణాళినితో పాటు కలెక్టర్ కూడా ప్రకటించి సిబ్బందికి అప్పగించేశారు. జిల్లాలో 921 పంచాయతీలుండగా వీటి పరిధిలో కేవలం 600 పోస్టల్ కార్యాలయాలున్నాయి. ఇందులో సబ్ పోస్టు కార్యాలయాలతో పాటు బ్రాంచి కార్యాలయాలు, హెడ్‌పోస్టాఫీసులున్నాయి. అయితే జిల్లాలో బ్రాంచి పోస్టాఫీసులే ఎక్కువ. వాటిలో సిబ్బంది చాలా తక్కువ ఉంటారు. అలాగే ఇరుకైన అద్దెగదుల్లో ఈ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు చాలా తక్కువ! ఇటువంటి కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సిబ్బందికి పింఛన్ల పంపిణీపై కనీసం అవగాహన లేదు. ఎంతో అనుభవం ఉన్న జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీకి తలమునకలై నానా అగచాట్లూ పడిన సందర్భాలున్నాయి.ప్రస్తుతం 19 మండలాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నప్పటికీ ఎక్కువగా పోస్టాఫీసులు లేని చోట్ల సీఎస్పీల ద్వారా పంపిణీ చేసేవారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది సీఎస్పీలను ఇటీవలే తొలగించిన యంత్రాంగం వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. అలాగే ఇంకా బయోమెట్రిక్ ప్రింట్లు పింఛనర్ల నుంచి ఇప్పటికీ తీసుకోవట్లేదు. దీంతో బయోమెట్రిక్ ద్వారా పంపిణీ ఎలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి. ఇందుకోసం జిల్లాలో జనవరిలో మాన్యువల్‌గా కొన్నిచోట్ల పింఛన్లు పంపిణీ చేసి వచ్చే ఫిబ్రవరి నుంచి అన్ని పింఛన్లనూ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయంలో సడలింపు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారత తపాలాశాఖ తమ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం బాగా వెనక బడింది. ఇటీవల ఉపాధి కూలీల వేతనాల చెల్లింపు తప్ప పెద్దగా పనుల్లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు వెనుకాడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులను బ్రాంచ్ పోస్టాఫీసులుగా మార్చారు. ఇవి సబ్ పోస్టాఫీస్ కంట్రోల్లో ఉంటాయి. బ్రాంచ్ పోస్టాఫీస్ పని3గంటలు మాత్రమే.అయితే ఇప్పు డు పింఛన్ల పేమెంట్ బయోమెట్రిక్ పద్ధతిలో జరుపుతారు. పీఓటీడీ(పాయింట్ ఆఫ్ ట్రాంజాక్షన్ డివైస్) మిషన్లద్వారా పింఛనుదారుల వేలిముద్రలను తీసుకుని పేమెంట్ చేయాలి. ఈ విధంగా ఆయితే 3గంటల సమయంలో ఎంత మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందనేది ప్రశ్న. దీనికి తోడు గ్రామా ల్లో విపరీతంగా కరెంట్ కోతలు ఉన్నాయి. మిషన్లు చార్జింగ్లేకపోతే అవి మొరాయిం చే పరిస్థితి ఉంది. ఇక సబ్ పోస్టాఫీసుల్లో సాధారణ లావాదేవీలతో పాటు ఈపిం ఛన్ల పంపిణీ చేయాలంటే కష్టసాధ్యమే. చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండ వు. దీని కోసం సిగ్నల్ ఉన్న చోటుకు పీఓటీడీని తీసుకువెళ్లాలి. అక్కడికే వృద్ధు లు, వికలాంగులు రావాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి తపాలాశాఖ విజయవంతంగా ఈ పింఛన్లను సక్రమంగా పంపిణీ చేస్తుందో లేక పిం ఛనుదారులను ఇబ్బందులకు గురిచేస్తుందో మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది. -
వంద సభలు.. నిండా సమస్యలు
ఏలూరు : జిల్లాలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు గ్రామ సభలు మంగళవారం నాటికి వందచోట్ల పూర్తయ్యూరుు. వివిధ సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల వర్తింపు కోరుతూ ఇప్పటివరకూ 27,487 అర్జీలు అందాయి. వీటిలో ఏ ఒక్క దానికి పరిష్కారం దొరకలేదు. ప్రజలిచ్చిన అర్జీల వివరాలను కేటగిరీల వారీగా ఆన్లైన్లో పొందుపర్చాలని అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 78 గ్రామాలు, ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 22 సభలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 13,403 వినతి పత్రాలు అందాయన్నారు. ఇప్పటివరకూ 256 వైద్య శిబిరాలు నిర్వహించి, 18,636 మందికి వైద్య సేవలందించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 28,884 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.2 కోట్ల 71 లక్షల 97 వేల నగదును పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రసంగాలకే పెద్దపీట ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో చేపట్టిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నారుు. ప్రజలకేదో చేశామని చెప్పుకునేందుకు అన్నట్టుగా పింఛన్లు పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో జన్మభూమి కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోం దని, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ప్రజాప్రతినిధులు వీధుల్లో తిరిగి అక్కడి సమస్యలను తెలుసుకోవడంతోపాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఊళ్లను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు చేపడుతున్న దాఖలాలు కానరావడం లేదు. మొదటి రోజు మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు చేతబట్టి మొక్కుబడిగా వీధులను ఊడ్చారు. మరోవైపు గ్రామసభ వేదికలపై మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్షమై ప్రసంగాలు ఇస్తూ విలువైన సమయూన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారుు. ఏలూరు నగరంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు వేదికలెక్కి ప్రసంగించారు. కాగా ఈ సభల్లో ఏర్పాటు చేసిన వైద్య, పశువైద్య శిబిరాలకు ఆదరణ కరువైంది. సమస్యలపై నిలదీత నాలుగో రోజు జన్మభూమి సభల్లో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీ శారు. లింగపాలెం మండలం కలరాయనగూడెంలో రోడ్లు, డ్రెయిన్లు బాగోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ గుత్తా పెదబాబు కల్పించుకుని వారిని వారించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెంలో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు హాజరు కాగా, విద్యుత్ సమస్యపై గ్రామస్తులు నిలదీశారు. యాదవోలు సభలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం కోసం రైతులు బ్యాంకులకు వెళ్తుంటే దొంగల్లా చూస్తున్నారని వాపోయూరు. వెంటనే పూర్తిస్థారుులో రుణాలు మాఫీ చేయూలని డిమాండ్ చేశారు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి గ్రామసభలో తమ పింఛన్లు ఎందుకు నిలుపుదల చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆచంట మండలంలోని ఆచంట, శేషమ్మ చెరువు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ దృష్టికి అరటి రైతుల డిమాండ్ దెందులూరు మండలం సోమవరప్పాడులో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అరటి రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయూలన్న డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఉంగుటూరు మండలం గోపాలపురం, గోకవరం గ్రామ సభల్లో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం, దూబచర్ల గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నిడదవోలు నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవం, చాగల్లు మండలం గౌరీపల్లి గ్రామసభల్లో ఎమ్మెల్యే కేఎస్ జవ హర్, మొగల్తూరు మండలం కే పీపాలెం సౌత్, నార్త్, నరసాపురం పట్టణంలో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొయ్యలగూడెం మండలం సీతంపేట సభలో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు.