వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన రోజా హర్షం వ్యక్తం చేశారు.
నగరి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన రోజా హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపుకు కృషి చేసిన అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పైనుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఆశీర్వదించారని, ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని రోజా అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్ని ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేశాయని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనను రెండుసార్లు మోసం చేశారని రోజా అన్నారు. మీడియాతో మాట్లాడిన రోజా ఉద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు.