నగరి : చిత్తూరు జిల్లా నగరిలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాపై దాడికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ నేతలు శనివారం నగరి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే రోజా, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణస్వామి, అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో నగరి పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. మహిళా శాసనసభ్యురాలు అని చూడకుండా దాడికి దిగటం దారుణమని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆ బాధ్యతను విస్మరించటం దురదృష్టకరమన్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ఆందోళన నేపథ్యంలో మరోవైపు నగరిలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు.
నగరిలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత
Published Sat, Sep 13 2014 12:14 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM
Advertisement
Advertisement