వాళ్లు ముందే సర్దుకున్నారు | ysrcp mla roja in Queue for money change | Sakshi
Sakshi News home page

వాళ్లు ముందే సర్దుకున్నారు

Published Mon, Nov 14 2016 1:45 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

వాళ్లు ముందే సర్దుకున్నారు - Sakshi

వాళ్లు ముందే సర్దుకున్నారు

బాబు, అంబానీలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా విమర్శ

పుత్తూరు రూరల్ :  పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందే తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, అంబానీ లాంటి వాళ్లు జాగ్రత్త పడ్డారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఆదివారం ఆమె తన నియోజకవర్గంలోని పుత్తూరులో స్టేట్ బ్యాంకుకు వెళ్లారు.

బ్యాంకులో డబ్బులు లేకపోవడంపై మేనేజర్, సిబ్బందిని నిలదీశారు. ఆదివారం సెలవు కనుక సామాన్య, మధ్య తరగతివారు, ఉద్యోగులు అధిక సంఖ్యలో బ్యాంకుల వద్ద బారులు తీరారని.. తీరా బ్యాంకుల్లో డబ్బులు లేవంటే వారు ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి నేడు డబ్బులులేని పరిస్థితి ఎదురైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement