సాక్షి, తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అనేక మంది జాతీయ నేతలు సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పుత్తూరులోని నగరి నియోజకవర్గంలో సోమవారం ఆమె పాదయాత్ర చేసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మెరపు వేగంతో నడిపిస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారని, కరోనా కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు.
గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదని, దేవుళ్ల యజ్ఞాలను రాక్షసులు అడ్డుకున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకోకపోతే ఈసారి 23 సీట్లు కూడా రావని ఆర్కే రోజా పేర్కొన్నారు. కాగా తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment