padhayatra
-
లోకేష్ వ్యాఖ్యలను ఖండించి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దళితులు
-
లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు
-
పాదయాత్రతోనే కొండా సురేఖ రీ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ!
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కొండా సురేఖ తూర్పు నుంచి బరిలోకి దిగుతారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మారారు. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వరంగల్ తూర్పులో యాక్టివ్‌గా లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొన్నారు. దీంతో ఇన్నాళ్లూ.. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే ముఖ్య నాయకుడు వరంగల్ తూర్పులో లేకపోవడంతో హస్తం శ్రేణులు ఉన్నామా.. అంటే ఉన్నాం.. అన్నట్లుగా పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. శ్రేణుల్లో జోష్ కొండా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని, అది కూడా కొండా సురేఖ గతంలో పోటీ చేసి గెలిచిన వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటారని స్పష్టమైన ప్రకటన రావడంతో.. హస్తం శ్రేణుల్లో జోష్ పెరిగింది. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా తమ సామాజిక ఓట్లను రాబట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయక ఓట్లు అనుకూలంగా మలుచుకుంటే విజయఢంకా మోగించవచ్చన్న ధీమాలో ఉన్నారు. అయితే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు కలిసొస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో జనాలను కలుస్తూ పాజిటివ్ వైబ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సమయంలో, టీఆర్ఎస్లో ఉన్న సమయంలో అన్ని డివిజన్ల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఇలా.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారు కావడంతో ఈ దఫా త్రిముఖ పోరు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రసవత్తరంగా రాజకీయాలు ఈనెల తొమ్మిది నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గడప గడపకూ పాదయాత్రతో మళ్లీ ప్రజల నుంచి కొండంత అభిమానాన్ని దక్కించుకోవాలని కొండా సురేఖ ప్రణాళిక రచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టనున్న ‘హథ్ సే హథ్ జోడో’ పాదయాత్రకు మద్దతుగా తూర్పులో పాదయాత్ర చేస్తామని కొండా మురళి ప్రకటించడంతో తూర్పులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లూ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపే నాయకులు పెద్దగా కాంగ్రెస్‌లో లేకపోవడంతో హస్తం డీలా పడింది. తూర్పు నియోజకవర్గం అణువణువునా తెలిసిన కొండా సురేఖ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగడుతూనే ప్రజా సమస్యల్ని ఎత్తిచూపేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకో వైపు ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని కొండా అనుయాయులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో తూర్పులో రాజకీయ వేడి మొదలైందన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా జనహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇతర పార్టీ నేతలను గులాబీ పార్టీలో చేరుస్తూ అభివృద్ధి నినాదంతో ఇప్పటికే జనాల్లో తిరుగుతున్నారు. ఇక బీజేపీ కూడా ఈసీటుపై గురిపెట్టడంతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మార్గదర్శకాల ప్రకారం కమలనాథులు ఏకతాటిపైకి వచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకే టికెట్ అవకాశాలు ఉండడంతో ఆయన జనాలతో మమేకమవుతున్నారు. పార్టీలో సభ్యత్వాలు పెంచుతూ ముందుకెళ్తున్నారు. ఈ ముగ్గురు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నవాళ్లే కావడంతో వచ్చే ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
లోకేశ్ పాదయాత్ర.. సాధారణ షరతులతో అనుమతి
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని దేశవ్యాప్తంగా పోలీసులు షరతులు విధిస్తున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధనలను అనుసరించే లోకేశ్ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు మంగళవారం విడివిడిగా అనుమతులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని పోలీసుశాఖ తెలిపింది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్న కుప్పం నియోజకవర్గం పలమనేరు డీఎస్పీ అనుమతి ఇచ్చారు. పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొనేవారి భద్రత కోసమే నిబంధనల మేరకు అనుమతి జారీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. అతి సాధారణ షరతుల్లో ముఖ్యమైనవి ఇవీ.. ►పాదయాత్రతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగించరాదు. ►ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రదేశాల్లో ముఖాముఖి నిర్వహించుకోవాలి. ►పురుషులు, మహిళా వలంటీర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక యూనిఫాం కేటాయించాలి. రోప్‌లు అందచేసి నియంత్రించేలా చూడాలి. ►పాదయాత్రలో డీజే సౌండ్ బాక్సులు, పెద్ద స్పీకర్లకు అనుమతి లేదు. ►పాదయాత్రలో పాల్గొనేవారు, సభలకు హాజరయ్యేవారు ఎలాంటి మారణాయుధాలు, రాళ్లు తదితరాలను తేకూడదు. ►మద్యం, మత్తు పదార్ధాలను సేవించరాదు. ►పాదయాత్రలో పాల్గొనేవారి వ్యక్తిగత భద్రత, ఆరోగ్య బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు, ఇతర దుర్ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తగినంత మంది వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలి. రాత్రి బస చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తగినంత లైటింగ్ సమకూర్చుకోవాలి. ►ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►బహిరంగ సభలను రోడ్లపై కాకుండా ఏదైనా మైదానంలోగానీ ప్రత్యేక ప్రదేశంలోగానీ ఏర్పాటు చేసుకోవాలి. అంచనా కంటే 20 శాతం మంది అధికంగా పట్టేందుకు వీలున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ►ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. -
పునీత్ అభిమాని పాదయాత్ర
Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్‌కు పునీత్ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. -
బండి పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ నిమగ్నం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాద యాత్రకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పార్టీ యంత్రాంగం దృష్టి పెట్టింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర ప్రచార విభాగం, ప్రచార సామాగ్రి వితరణ విభాగం, అలంకరణ విభాగాలకు చెందిన ప్రముఖ్‌లతో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్ సమావేశమయ్యారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పాద యాత్ర సాగనున్న మార్గంలో వసతి, రక్షణ, ప్రచార రథాలు, భోజన ఏర్పాట్ల కోసం స్థలాల పరిశీలనలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. మొదటిదశ యాత్రలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఈ సభ్యులు పర్యటించారు. పాదయాత్రలో గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, వికారాబాద్, మోమి న్‌పేట, సదాశివపేట ప్రాంతాల్లో బహిరంగసభలకు అనువైన స్థలాలను పరిశీలించారు. -
సర్కార్ వైఫల్యాలను ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి తాను చేపట్టనున్న పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు రాబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ యా త్రతో తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించనుందని చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, బీజేపీని అధికా రంలోకి తీసుకురావడమే తన పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో పాద యాత్ర సన్నాహాలపై జరిగిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు పాదయాత్రకు సంఘీభావం తెలు పుతారని అన్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో జిల్లా నుంచి 20 మందికి అవకాశమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే వరకు పోరాడతామన్నారు. పాదయాత్ర ఏర్పాట్లు, దీనిలో వివిధ అంశాలు, రంగాలకు సంబంధించిన పనుల సమన్వయం కోసం 28 కమిటీలను ఏర్పాటు చేశారు. యాత్రా ప్రముఖ్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.జి. మనోహర్‌రెడ్డిని నియమించారు. -
నగరిలో ఆర్కే రోజా పాద్రయాత్ర
సాక్షి, తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అనేక మంది జాతీయ నేతలు సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పుత్తూరులోని నగరి నియోజకవర్గంలో సోమవారం ఆమె పాదయాత్ర చేసిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మెరపు వేగంతో నడిపిస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారని, కరోనా కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదని, దేవుళ్ల యజ్ఞాలను రాక్షసులు అడ్డుకున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకోకపోతే ఈసారి 23 సీట్లు కూడా రావని ఆర్కే రోజా పేర్కొన్నారు. కాగా తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. -
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్థుల పాదయాత్ర
సాక్షి, అమరావతి : అరకు ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు చెందిన నల్ల క్వారీని మూసివేయాలంటూ హుకుంపేట మండలం గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. 14 రోజులుగా గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే నోరు మెదపట్లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా గూడ గ్రామం నుంచి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామస్థులు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్థుల పాదయాత్రకు వైఎస్సార్సీపీ అరకు సమన్వయ కర్త చెట్టి ఫాల్గుణ సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర యువజన కార్యదర్శి చెట్టి వినయ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొండలరావు పాల్గొన్ని అక్రమ క్వారీని మూసివేయాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
–వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కడియం : రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. కడియం మండలం వేమగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు స్వగృహంలో గురువారం ఆమె విలేకర్లుతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లోకి చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులను మోసగించారన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. వేలాది మంది పోలీసులను రోడ్డు ఎక్కించారని రాష్ట్రంలో న్యాయం కోసం ఎవరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఎగిసిపడుతుందన్నారు. 72 గంటల్లో ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా హత్యానంతరం ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన విధంగానే రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర హోంశాఖామంత్రి నిమ్మకాల చినరాజప్పను చంద్రబాబునాయుడు కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి కాపుల కోసం పోరాడిన ఘనత ముద్రగడ పద్మనాభానికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు మాట్లాడుతూ ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుకు లేదని పేర్కొన్నారు. -
6 రోజులు...125 కిలోమీటర్లు
ముద్రగడ పాదయాత్ర కోసం జేఏసీ నేతల సన్నాహాలు అమలాపురం : నవంబర్ 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ చేపట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర ఆరు రోజుల పాటు 125 కిలోమీటర్ల మేర సాగేలా కాపు జేఏసీ నాయకులు ప్రణాళిక రూపొందించారు.కాపు రాష్ట్ర జేఏసీ జాయింట్ కన్వీనర్ ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు రిజర్వేష పోరాటసమితి కన్వీనర్ నల్లా విష్ణుమూర్తి, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, నల్లా కుమార్ తదితరులు అమలాపురంలో శనివారం సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్ర విజయవంతానికి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కాపులతో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. నవంబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిల్లో జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి పాదయాత్రకు సమాయత్తం చేయనున్నట్టు నల్లా విష్ణుమూర్తి వెల్లడించారు. నవంబర్ 7న కాకినాడ లోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించే జిల్లా కాపు జేఏసీ సమావేశానికి జిల్లాలోని కాపులంతా హాజరు కావాలని నల్లా కుమార్ కోరారు. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై కూడా కాపు నాయకులు చర్చించారు. కాపు నాయకులు యేడిద దొరబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, అరిగెల నాని, సలాది నాగేశ్వరరావు పాల్గొన్నారు.