
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రాయితీ పథకాల అమలును వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ హాలులో బీసీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్‌తో సమావేశం నిర్వహించారు.
ఫెడరేషన్ల ద్వారా అమలు చేసే పథకాల లబ్ధిదారులను వేగవంతంగా పూర్తి చేస్తే రాయితీ పంపిణీకి మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు.