మీడియాతో మాట్లాడుతున్న మంత్రి గంగుల. చిత్రంలో బుర్రా వెంకటేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రూ.50 కోట్ల వ్యయంతో 16 స్టడీ సర్కిళ్లతోపాటు 103 స్టడీ సెంటర్లలో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వాలని నిర్ణయిం చింది.
ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీ వర్గాలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీ లకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.
ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక
1.25 లక్షల మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రవేశ పరీక్ష కోసం ప్రతిష్టాత్మక ‘అన్ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని గంగుల తెలిపారు. ‘16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25వేల మందికి నేరు గా, మరో 50వేల మందికి హైబ్రిడ్ మోడ్ (ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానం)లో శిక్షణ ఇస్తాం. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా 50వేల మందికి శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 16న ఉద యం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్ టెస్ట్ ఉం టుంది. దీనికోసం బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
ఈనెల 16 ఉదయం 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుం ది. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్–1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్‌తోపాటు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ ఇస్తాం. మిగతావారిని మెరిట్ ఆధారంగా గ్రూప్–2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తాం. వీరికి 3 నెలల శిక్షణలో నెలకు రూ.2వేల స్టైపెండ్ ఇస్తాం. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్ ఇస్తాం. ఈనెల 20 లేదా 21 నుంచి క్లాసులు ప్రారంభిస్తాం’ అని మంత్రి చెప్పారు.
100 మార్కులకు పరీక్ష
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను https://studycircle. cgg.gov.in/, https://mjpabcwreis. cgg. gov.in/, https://unacademy.com/ scholarship/tsgovt&scholarship& test తోపాటు బీసీ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లోనూ చేసుకో వచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 90 నిమిషాలపాటు నిర్వహిం చే ఈ పరీక్షలో 5 విభాగాలు ఉంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగె టివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో టాంపరిం గ్‌కు అవకాశం ఉండదన్నారు. మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేలు విలువ చేసే స్టడీ మెటీరియ ల్‌ను ఇస్తామని ‘అన్ అకాడమీ’ ప్రతినిధి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment