కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: క్రైస్తవ మతంలోకి మారిన తొగుట కులానికి చెందిన వారికి సీరియల్ నంబర్-20 కింద బీసీ ‘బి’ సర్టిఫికెట్లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ సూచించారు. దీనికి సంబంధించిన కేసులో గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి డీఆర్వోల వరకు తెలియజేయాలని ఆదేశించారు. తొగుట కులానికి చెందిన వారికి బీసీ ‘బి’ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కోరిన వివరణపై బీసీ సంక్షేమ శాఖ స్పష్టతనిచ్చింది.
ఆ క్రైస్తవులకు బీసీ ‘బి’ సర్టిఫికెట్లు ఇవ్వండి
Published Sat, Nov 7 2015 12:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement