Christianity
-
క్రైస్తవ్యం చెప్పే యుగాంతం
పరిశుద్ధ గ్రంథంలో యుగాంతం గురించిన ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. దీనిని యేసు ప్రభువు రెండవ రాకడ, ప్రభువు దినం, యుగసమాప్తి, కడవరి దినాలు, అంత్యకాలంగా పేర్కొనడం జరిగిందిప్రారంభంలో ఈ సృష్టిని చేసిన దేవుడు చివరిగా మానవులను సృజించాడు.బైబిల్లో మొదటి గ్రంథమైన ఆదికాండంలో రాసి ఉన్నట్లుగా నరులు భూమ్మీద విస్తరించే సమయంలోనే మానవులపై దేవుడికి ఎంతో కోపం వచ్చినట్లుగా గమనిస్తాం. కారణం వారు దేవుని మార్గాన్ని విడిచారు. చీకటి మార్గాలు, సాతాను మార్గాలు వెదకడంప్రారంభించారు. నరుల చెడుతనం భూమిమీద బహుగా విస్తరించడం వారి హృదయ తలంపులు, ఊహలన్నీచెడ్డవిగా ఉండటం దేవుడు గమనించి, భూమి అంతా బలత్కారంతో నిండబడి ఉండటం దేవునికి సంతా΄ాన్ని కలుగజేసింది. ఫలితంగా నీతిమంతుడైన ఒక్క నోవహు కుటుంబాన్ని సకల పశుపక్ష్యాదులు, జంతువులను రెండేసి చొప్పున ఓ ప్రత్యేక ఓడ ద్వారా రక్షించి మిగతా మానవులందరినీ మహాజలప్రళయం ద్వారా నశింప చేసినట్లుగా చూస్తాం. నోవహు సంఘటన క్రీస్తుపూర్వం సుమారు 2,400 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా బైబిల్ పండితులు చెబుతుంటారు. మరల భూమి మీద పాపం విస్తరించినప్పుడు రెండువేల సంవ్సరాల క్రితం దేవుడే యేసుక్రీస్తు రూపంలో నరరూపుధారుడై ఈ భూమ్మీదకి వచ్చాడు.. పాపుల రక్షణార్థమై సిలువమీద మరణించాడు. 3వ రోజున పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు తన బోధల్లో ఈ భూమి అంతం గురించి చాలా స్పష్టంగా తెలియ చేశాడు. త్వరలోనే యుగసమాప్తి ఉంటుందని పాపపు జీవితాన్ని వదిలివేసి దేవుని నమ్ముకొని మారుమనస్సు పోంది దేవుడిచ్చే ఉచిత రక్షణను స్వీకరించడం ద్వారా పరలోకానికి వారసులవుతారని, పాపులందరి కోసం నరకం సిద్ధంగా ఉందని చెప్పాడు. యుగ సమాప్తి సమయంలో దీనిని యేసుక్రీస్తు మరల రెండవసారి భూమ్మీదకు వస్తాడు. ఆ తర్వాత అంతం ఉంటుంది. దీనిని యేసు ద్వితీయ ఆగమనంగా, క్రీస్తు రెండవ రాకడగా పిలుస్తారు. అయితే ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? దానికి సూచనలేంటి అని శిష్యులు ఏసుప్రభువును అడిగినప్పుడు యుద్ధాలను గూర్చిన సమాచారం ఎక్కువగా వింటారని, జనాలమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయని, కరువులు, భూకంపాలు కలుగుతాయి. భూమ్మీద దేవుని బిడ్డలకు మహాశ్రమ వేదన కలుగుతుందని, మనుష్యుల్లో ఒకరిపట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుందని, అక్రమం విస్తరించి మనుషుల్లో ప్రేమ చల్లారుతుందని, అలాగే యుగసమాప్తంలో సూర్యుడు వెలుగు ఇవ్వడని, చంద్రుడు కాంతి కోల్పోతాడని, ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయని, తుదకు క్రీస్తు మహా ప్రభావంతో భూమ్మీదకు వస్తాడని పేర్కొన్నాడు. అయితే ఆయన రాకడ అందరికీ తెలిసే విధంగా ఉండక అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు ఉంటుందని, అందుకే దేవుని భయం కలిగి పరిశుద్ధ జీవితం కలిగి జాగరూకతతో జీవించాలని యేసు చె΄్పాడు. అంత్యదినాలలో అ΄ాయకరమైన దినాలు వస్తాయని భక్తుడైన పాలు చెప్పాడు. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అబద్ధాలాడే వారు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రు లు, తల్లిదండ్రులను గౌరవించని వారు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరేవారుగా ఉంటారని భక్తుడు చెప్పాడుఅయితే యేçసు చెప్పిన రెండవ రాకడ గురుతులు చాలా ఇప్పటికే జరిగాయని, ప్రస్తుత సమాజం చూసినా అది బహిర్గతమౌతుందని, యేçసు రాకడ త్వరలో ఉందని దైవజనులు చెపుతున్నారు. ఏ దినమైనా ఏ సమయంలోనైనా ఈ యుగ సమాప్తి జరగవచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నారు. – బందెల స్టెర్జి రాజన్అంత్యకాలంలో జరిగే విషయాలన్నీ బైబిల్లోని ప్రకటన గ్రంథంలో వివరంగా రాయబడ్డాయి. ఆయా కాలాలలో దేవుడు తన భక్తులకు భూమి అంతం గురించి తెలియజేస్తూనే ఉన్నాడు. అంతిమంగా ఈ భూమ్మీద జన్మించిన ప్రతిమనిషి దేవుని తీర్పును ఎదుర్కొంటాడని, దేవుని నమ్ముకున్నవారు, భూమ్మీద పాపం లేకుండా పవిత్రంగా జీవించిన వారు మాత్రమే దేవునితో సదాకాలం జీవించడానికి పరలోకానికి కొనిపోబడతారు. అక్రమంగా జీవించిన వాళ్ళంతా నిత్య నరకాగ్నిలో నిరంతరం వేదన అనుభవిస్తూ జీవిస్తారు. -
ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం
ఇంటి వాతావరణం ఏది నేర్పిస్తే అది నేర్చుకోవడం సహజం. అలా ప్రియాంకా చోప్రాకి నేర్పించిన విషయాల్లో ‘ఆధ్యాత్మికత’ ఒకటి. ఆధ్యాత్మికత గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘భారతదేశం పలు మతాల సమాహారం. నేను చదువుకున్నది క్రిస్టియన్ కాన్వెంట్లో. దాంతో నాకు క్రిస్టియానిటీ గురించి తెలుసు. మా నాన్నగారు మసీదులో పాడేవారు. దాంతో నాకు ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. నేను హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని. హిందుత్వం గురించి సహజంగానే తెలిసిపోతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికం అనేది ఓ పెద్ద భాగం. దాన్ని విస్మరించలేం. నేను హిందువుని. మా ఇంట్లో గుడి ఉంది. నేను పూజలు చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా చేస్తుంటాను. ఆ విషయం పక్కనపెడితే, ఏదో పెద్ద శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తిపై నాకు చాలా నమ్మకం ఉంది’’ అన్నారు. -
క్రైస్తవుల ఓట్లతో గెలిచి ఇప్పుడు కించపరుస్తారా?
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నీతివంతుడైతే క్రిస్టియన్ల ఓట్లు అడగకుండా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) గౌరవాధ్యక్షుడు ఎం.సురేష్ కుమార్ సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేస్తారని ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. శుక్రవారం గాజువాక కాపు తుంగ్లాంలోని బిషప్ శామ్యూల్ లోపింట్ ఎంహెచ్‌జేసీ చర్చిలో క్రిస్టియన్ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలవడానికి ఎక్కువగా క్రిస్టియన్ల ఓట్లే కారణమని, ఇప్పుడు క్రిస్టియన్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంయ చేశారు. రాష్ట్ర సీఆర్పీఎస్ అధ్యక్షుడు వై.బాలారావు, ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్, కోశాధికారి వై.జార్జిబాబు, రాష్ట్ర ఇన్చార్జి జాషువా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విధేయులైన పామరులతోనే మహాద్భుతాలు
గమలీయేలు పౌలు వంటి ఎంతో మంది ఉన్నత విద్యాధికుల్ని తయారు చేసిన గొప్ప మేధావి, మహోపాధ్యాయుడు, నాటి యూదుల సన్ హెడ్రిన్ చట్టసభలో ముఖ్యుడుగా,. యేసుప్రభువును సిలువ వేయాలన్న తీర్మానం అతని కనుసన్నల్లోనే జరిగింది. అయితే, పిరికివాడు, పామరుడైన పేతురు, యేసుప్రభువు పునరుత్థానం తర్వాత ఎంతో ధైర్యంగా సువార్త బోధిస్తుంటే, యూదయ, యెరూషలేము ప్రాంతాల సామాన్య ప్రజలంతా క్రైస్తవంలోకి వేల సంఖ్యలో చేరుతున్న రోజులవి. సామాన్యులందరికీ అదంతా పండుగలా ఉంటే, యేసును చంపిన యూదుమతపెద్దలకేమో చాలా అవమానకరంగా ఉంది. ప్రభువు పునరుత్థాన శక్తిని పొందిన పేతురు తదితరుల ప్రసంగాలు, పరిచర్యతో క్రైస్తవం ఇలా ఉపిరి పోసుకొని విస్తరిస్తోంది. ‘మీరంతా కలిసి యేసును చంపారు, కాని దేవుడాయనను తిరిగి సజీవుని చేశాడు, దానికి మేమంతా సాక్షులం’ అంటూ యూదుపెద్దలను దుయ్యబట్టుతూ పేతురు సువార్త ప్రకటించాడు (అపో.కా.3:15). అది విని తట్టుకోలేక ఇక వాళ్ళందరినీ చంపాల్సిందేనంటూ యూదుమత పెద్దలు నిర్ణయించారు. అయితే ‘పేతురు పరిచర్య దేవుని వల్ల కలిగినదైతే మీరు అడ్డుకోలేరు, అలా కాకపోతే, గతంలో ఇలా వచ్చి అలా మాయమైన చాలామంది కోవలోకి వాళ్ళు కూడా చేరుతారు. కాబట్టి మీరు కంగారుపడొద్దు’ అంటూ గమలీయేలు ఇచ్చిన సలహాతో, వాళ్ళు పేతురును ఇతరులను చంపకుండా, కేవలం దెబ్బలు కొట్టి వదిలేశారు(అపో.కా.5:33–40).. పేతురు ప్రసంగాలు విని యేసుప్రభువును అంగీకరించిన వాళ్ళు, పేతురు ప్రసంగాలతో రెచ్చిపోయి అతన్ని చంపాలనుకున్నవాళ్ళు ఆనాడు వేలల్లో ఉన్నారు. కాని కర్రవిరక్కుండా పాము చావాలనుకునే గమలీయేలు లాంటి మూడవ తెగ వాళ్ళు కూడా కొందరున్నారు. మేధావి వర్గం అంటే ఇదే!! ‘నువ్వు జోక్యం చేసుకోకు, దేవుడే చూసుకుంటాడు’ అన్నది వీళ్ళ ఊతపదం!! సువార్తకన్నా, సిద్ధాంతాల మీద వీళ్లకు శ్రద్ధ, పట్టు ఎక్కువ. చర్చిల్లో, పరిచర్యల్లో కళ్లెదుటే అపవిత్రత, అనైతికత కనిపిస్తున్నా అందుకు వ్యతిరేకంగా ఉద్యమించరు, కాని వాటిని ‘విశ్లేషిస్తూ’, ఉద్యమించేవారికి ఉచిత సలహాలిస్తూ ‘బ్రేకులేసే’ పరిచర్య వాళ్ళది. గమలీయేలు నాటి యూదులందరికీ పితామహునిలాంటి వాడు.పాత నిబంధననంతా అధ్యయనం చేసి, అందులోని యేసుప్రభువు ఆగమన ప్రవచనాలు, ఆనవాళ్ళన్నీ ఎరిగిన మేధావిగా గమలీయేలు, ‘యేసుప్రభువే మనమంతా ఎదురుచూసే మెస్సీయా’ అని ఆనాడు ధైర్యంగా ప్రకటించి ప్రభువు పక్షంగా నిలబడి ఉంటే ఎంత బావుండేది. చాందస యూదులంతా పశ్చాత్తా్తపం పొంది క్రైస్తవులై ఉండేవారు కదా!! గమలీయేలు అలా పరలోకానికి వెళ్లి ఉండేవాడు, దేవుడు ఉజ్వలంగా వాడుకున్న సువార్తికుడుగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కాని గమలీయేలు, ఉచితాసలహాలిచ్చే పాత్రతో సరిపెట్టుకున్నాడు. అతని వద్దే విద్యనభ్యసించిన పౌలు మాత్రం గొప్ప సువార్తోద్యమకారుడై గురువును మించిన శిష్యుడయ్యాడు.. పేతురులాంటి పామరులు లోకాన్నంతా దేవుని కోసం జయించే పనిలో ఉంటే, గమలీయేలు లాంటి వారు పూలదండలు, సన్మానాలు, తాము పెట్టుకున్న దుకాణాలే తమకు చాలనుకున్నారు. అలా జీవితకాలపు ఒక మహత్తరమైన అవకాశాన్ని గమలీయేలు చేజార్చుకున్నాడు. అర్థం కాని శాస్త్రాలెన్నో చదివిన మేధావుల వల్ల క్రీస్తుకు, క్రైస్తవ ఉద్యమానికి ఒరిగేదేమీ లేదు. దేవుని ఆదేశాలకు విధేయులైన పామరుల వల్లే దేవుని రాజ్యం అద్భుతంగా నిర్మితమవుతుందన్నది చారిత్రక సత్యం. దేవుని రాజ్య స్థాపనకు కావలసిందల్లా దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన విధేయతే తప్ప, సకలశాస్త్ర పాండిత్యం, మేధోసంపత్తి కానేకాదు !! రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం మాసపత్రిక ఈమెయిల్: prabhukirant@gmail.com -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
తప్పిపోయింది పెద్దోడా, చిన్నోడా?
తండ్రిని ధిక్కరించి, ఆస్తిలో తన వంతు భాగం తీసేసుకొని దూరదేశానికి వెళ్లి అదంతా దుబారా చేసి, జీవితంలో పూర్తిగా చితికిపోయిన చిన్న కుమారుడు పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సంతోషంతో వాద్యాలు, నాట్యాలతో తండ్రి తన ఇంట్లో గొప్ప సంబరాలు, మహా విందు చేస్తున్నాడు. తండ్రి తనను క్షమించి కుమారుడిగా కాకున్నా కనీసం ఒక పనివాడిగా తనను ఇంట్లో చేర్చుకున్నా చాలనుకుని తిరిగొచ్చిన చిన్న కుమారుడికి ఇదంతా అనూహ్యం, అత్యానందకరం!!! అయితే ఆదినుండీ తండ్రి వెంబడే ఉంటూ, తండ్రి పనులు చేస్తూ, తండ్రితో పాటే జీవిస్తున్న పెద్దకుమారుడికి కూడా, తనకు చెడ్డపేరు తెచ్చిన చిన్న కొడుకు తిరిగి ఇంటికొస్తే తన తండ్రి ఇంతగా సంతోషించడం అనూహ్యంగానే ఉంది. భరించలేకుండా కూడా ఉంది. తర్వాత వెళ్లి, ‘‘ఇన్నాళ్లూ నిన్ను అంటిపెట్టుకొని సేవచేస్తున్న నాకోసం ఎన్నడూ నీవు ఇలాంటి సంబరాలు చేయలేదు, నా విషయంలో సంతోషించలేదు, విందు చేసుకొని సంతోషించడానికి ఎన్నడైనా నాకొక మేకపిల్లనిచ్చావా?’’ అంటూ తండ్రితో గొడవ పెట్టుకున్నాడు(లూకా 15:11–32). యేసుక్రీస్తు చెప్పిన ‘తప్పిపోయిన కుమారుని’ ఉపమానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బైబిల్ భాగం ఇది. అయితే నిజంగా తప్పిపోయింది చిన్నకొడుకా, పెద్ద కొడుకా అన్న సంశయం వస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ, అభీష్టం కాగా, తండ్రితోనే ఉంటూ తండ్రి ప్రేమను, హృదయాన్ని అర్థం చేసుకోకుండా, తన సొంత తమ్ముణ్ణి క్షమించలేకపోయిన పెద్దకుమారుడే నిజంగా తప్పిపోయిన కుమారుడా? అన్న అభిప్రాయం కలగడం సహజమే, న్యాయమే. తండ్రిని వదిలి తప్పి పోయినవాడు చిన్న కొడుకైతే, తండ్రితోనే ఉంటూ తప్పిపోయినవాడు పెద్ద కొడుకు. ఈ పెద్దకొడుకు లాంటి తప్పిపోయిన కుమారులే సమాజంలో, చర్చిల్లో చాలా సమస్యలకు కారకులు. చిన్నవాడితో సమానంగా బోలెడు ఆస్తిని తండ్రి తనకు పంచి ఇచ్చినా, విందు చేసుకోవడానికి తనకొక మేక పిల్లనివ్వలేదంటూ తండ్రిని నిందించిన అల్పుడు ఆ పెద్దవాడు. చిన్నవాడు, పెద్దవాడితో సహా లోకంలో అంతా పాపం చేసి దేవునికి దూరమైన వారే అంటుంది బైబిల్ (రోమా 3:23). కాకపోతే చిన్నవాడు తిరిగొచ్చాడు, పెద్దవాడికి తాను తిరిగి తండ్రిని పరిపూర్ణంగా ఆశ్రయించాలన్న ఆలోచనే ఇంకా లేదు. కొత్తనిబంధన తాలూకు ఈనాటి కృపాయుగంలో ’యాజకత్వం’ అనే మధ్యవ్యవస్థను యేసుప్రభువు రద్దు చేసి, విశ్వాసులు తనను అంటే దేవుణ్ణి నేరుగా ఆశ్రయించే వీలుకల్పిస్తే, ఎందుకీ సంబరాలంటూ నేరుగా తండ్రినే అడిగే హోదా, చనువూ ఉన్నా, పనివాడిని పిలిచి తన సొంతింటి విషయాలు వాకబు చేసిన పెద్దకొడుకు లాగా, దేవుణ్ణి వదిలేసి ‘‘మా పాదిరి, మా పాస్టర్, మా అయ్యగా’’రంటూ బోధకులకు, పరిచారకులకు ప్రాధాన్యతనిచ్చే అవగాహన లేని ఈనాటి విశ్వాసులు ఇంకా తప్పిపోయే ఉన్న ఆ పెద్దకొడుకులే!! తండ్రితోనే ఉన్నా తండ్రి క్షమా హృదయం, ఔదార్యం, ప్రేమనూ అర్థం చేసుకోకుండా బయటి వాళ్లలాగే సద్వర్తన, మార్పు లేకుండా జీవించేవారు ఆ పెద్దకొడుకులే. తండ్రితోనే ఉన్నా తండ్రి ఆనందాన్ని ఆవగింజంత కూడా సొంతం చేసుకోలేక, ఎంతున్నా తమకు దేవుడు ఇంకా ఏదో ఇవ్వలేదన్న అసంతృప్తితో బతికే నిరంతర నిరాశావాదులు, నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదంటూ తండ్రిని నిందించిన ఆ పెద్దకొడుకులాంటివారే!! మార్పునొందిన విశ్వాసి లోకానికే కాదు పరలోకంలో కూడా ఆనందకారకమవుతాడు. మార్పునొందిన ఒక్క పాపి వల్ల పరలోకంలో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుందని ప్రభువే చెప్పాడు( లూకా 15:7). విశ్వాసిలో వచ్చే ‘మార్పు’ అతని వ్యక్తిగత జీవితంలో, పిదప అతని వల్ల సమాజంలోనే కాదు, పరలోకంలో కూడా ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది. తన హృదయంలో లేని ఆనందాన్ని విశ్వాసిలోకంలో, పరలోకంలో కూడా నింపలేడు. మారిన జీవితమే ఆనందానికి నిలయమవుతుంది. జీవితం మారకుండా సమాజంలో, చర్చిల్లో ఎంత ప్రముఖంగా జీవిస్తున్నా వారిలో ఆనందం తప్ప అన్నీ ఉంటాయి. చిన్నకొడుకు తప్పిపోయి దొరికాడు, పెద్దవాడు ఇంకా తప్పిపోయే ఉన్నాడు, దేవునికింకా దొరకలేదు, అదీ ఈనాటి క్రైస్తవం సంక్షోభం!! శుచి కరువైన పాయసంలో రుచి కూడా కరువైనట్టే, మార్పులేని జీవితంలో ఆనందం కూడా కరువవుతుంది. అదే ఆ పెద్దకొడుకు జీవిత తాత్పర్యం!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సమోసా ఇచ్చి.. మతం మారాలన్నారు!
సాక్షి, లక్నో: బస్తీలో నివసించే కొందరికి సమోసాలు ఇచ్చి, క్రైస్తవమతంలోకి మార్పించే యత్నం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆగ్రాలోని జగదీశ్ పురలో మూడురోజుల కిందట జరిగిన దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. జగదీశ్ పురలోని సెక్టార్-4 వికాస్ కాలనీలో మురికివాడల్లో కొందరు నివాసం ఉంటున్నాం. గురువారం రోజు కొందరు క్రైస్తవమత ప్రచారకులు మా వద్దకు వచ్చారు. వారిలో ఓ పాస్టర్, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. మొదట మమ్మల్ని కలిసిన వెంటనే వారు మాకు, మా పిల్లలకు సమోసాలు పంచిపెట్టారు. సమోసాలు తింటుంటూ క్రైస్తవ మతంలోకి మారాలంటూ సూచించారు. తాము ఆశ్చర్యపోయి చూస్తుంటే మీరే ఆందోళన చెందొద్దు.. మీకు ఎన్నో వసతులు కల్పిస్తాం. మీ పిల్లలకు చదువు చెప్పిస్తామని ఆ పాస్టర్, సిస్టర్స్ చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఏం జరుగుతుందని ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే పాస్టర్ తన దుస్తులు మార్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారని మాయా అనే స్థానికురాలు తెలిపారు. ఆగ్రా ఎస్పీ సన్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ.. ఓ సంస్థ నుంచి ఫిర్యాదు అందగా విచారణ చేపట్టాం. చిన్నారుల విద్య గురించి బస్తీ వారికి అవగాహన కల్పించడానికి మహిళా దినోత్సవరం రోజు వెళ్లినట్లు క్రైస్తవ మిషనరీ పేర్కొంది. అవగాహన కల్పించి అక్కడినుంచి వెళ్లిపోయామని వారు చెప్పారు. కాగా, మురికివాడ నుంచి మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వివరించారు. అయితే ఓ వర్గం మాత్రం మత మార్పిడి యత్నం జరిగిందని ఆరోపించింది. -
క్రైస్తవం సంస్కరణోద్యమం!!
చప్పదనం, చీకటి క్రైస్తవంలో, విశ్వాసుల్లో ఉండేందుకు వీల్లేదు. ఎందుకంటే మీరు లోకానికి ఉప్పు, వెలుగు వంటివారని యేసు ప్రభువు ప్రకటించారు (మత్తయి 5:13–16). ఉప్పుకు, వెలుగుకు ఉన్న ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే, వాటి ధర్మాన్ని, బాధ్యతను ఎంతో మౌనంగా అవి చేసుకు పోతాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా అవి లోకాన్ని రుచిమయం, వెలుగుమయం చేయకుండా మానవు. క్రైస్తవం కేవలం ప్రసంగాలు, రచనలు, పాటలు, ఉపవాస ప్రార్థనలు, చర్చిల నిర్మాణం కాదు. క్రైస్తవం ఒక మహాసంస్కరణోద్యమం. అది తనను తాను నిరంతరం సంస్కరించుకుంటూ, సమాజ సంస్కరణ, సమాజ కల్యాణానికి పాటు పడుతూ ఉంటుంది. క్రైస్తవంలో చీకటి కోణాలకు, మోసాలకు, అపవిత్రతకు ఏమాత్రం తావులేదు. క్రైస్తవులను లోకం కోటి కళ్లతో నిశితంగా చూస్తుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. క్రైస్తవం ద్వారా లాభపడిన ప్రతిసారీ లోకం క్రైస్తవాన్ని కళ్లకద్దుకుంది. కాని క్రైస్తవం పేరిట ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసినప్పుడు కూడా ఎవరూ మాట్లాడకూడదు, అడ్డురావద్దు అనుకోవడం ఆత్మవంచనే కాదు అనాగరికం కూడా. తప్పులెత్తి చూపిన వారు విలన్లని అనుకోకుండా, మన తప్పులు మనం సవరించుకుని, మరింత శక్తితో ముందుకు సాగితే అదెంత ఆశీర్వాదకరం, దేవునికి అదెంత మహిమకరం? పూర్వం పదోతరగతి ఫెయిలయిన వాడికి ఏదైనా వృత్తివిద్యా కోర్సు నేర్పించి, ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేర్చేవారు. ఇప్పుడు అలాంటి వారి చేతికొక బైబిలిచ్చి ‘సేవ చే సుకో, లోకాన్ని దున్నుకో’ అని చెబుతున్నారంటే మన పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవమంటే కర్ణభేరిని పగలగొట్టి ముక్కలు చేసే లౌడ్ స్పీకర్ల నుండి వెలువడే అరుపులు, కేకలు, పాటలు, డప్పువాయిద్యాలనుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. క్రైస్తవం 4,500 ఏళ్ల ప్రాచీన మతం. లౌడ్ స్పీకర్లను కనుక్కుని వందేళ్లు కూడా కాలేదు. అలాటి లౌడ్స్పీకర్లు క్రైస్తవానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎలా అవుతాయి? అంటే స్వస్థతల్ని, దేవుని అద్భుతాల్ని నేను విశ్వసించనని కాదు. దేవుని శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నేను, ఆరోగ్యపరంగా చాలా బలహీనుణ్ణి. రాత్రి పడుకున్నాక మర్నాడు ఉదయాన్ని నేను సజీవంగా చూసిన ప్రతిసారీ అదొక దేవుని అద్భుతమని, దేవుడిచ్చిన స్వస్థత అని, నమ్మి, తల వంచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. కాని వాటిని అడ్డుపెట్టుకుని పేరు, డబ్బు సంపాదించుకునే వారిని, అమాయకులను దేవుని శక్తి ప్రదర్శన పేరిట మోసం చేసేవారిని తప్పక ఖండిస్తాను. మారమని వారికి చెబుతున్నా కూడా! యేసు వస్త్రపు చెంగు పట్టుకుని, అపొస్తలుల వస్త్రాలు, నీడ తాకి ప్రజలు బాగయ్యారు కదా! అంటారేమో!! నిజమే, కాని వారి వస్త్రాలను అపొస్తలులు అంగట్లో పెట్టి అమ్మ లేదు కదా! సమర్థించుకోవడానికి, మారకుండా ఉండేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. కాని సంస్కరించుకోవడానికున్న ఒక చిన్న కారణం చాలు మనం లోకానికి ఆశీర్వాదకరంగా మారడానికి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు
లక్నో: బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా అవమానించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది. జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు. వివరాల్లోకి వెళితే ముగ్గురు హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చి, వారితో బీఫ్ తినిపించారనే ఆరోపణలతో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ చేసి వారిని సత్సంగ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడంటూ వీరంగం సృష్టించారు. దాదాపు 200 మంది కార్యకర్తలు జలౌన్ జిల్లాలోని ఆద్వేష్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. కనుబొమ్మలు, మీసాన్ని సైతం తీసివేయించారు. అనంతరం గాడిదపై ఊరేగిస్తూ ఒరాయ్ జిల్లాకు తీసుకొచ్చారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. -
ఆ క్రైస్తవులకు బీసీ ‘బి’ సర్టిఫికెట్లు ఇవ్వండి
కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం సాక్షి, హైదరాబాద్: క్రైస్తవ మతంలోకి మారిన తొగుట కులానికి చెందిన వారికి సీరియల్ నంబర్-20 కింద బీసీ ‘బి’ సర్టిఫికెట్లు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ సూచించారు. దీనికి సంబంధించిన కేసులో గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి డీఆర్వోల వరకు తెలియజేయాలని ఆదేశించారు. తొగుట కులానికి చెందిన వారికి బీసీ ‘బి’ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కోరిన వివరణపై బీసీ సంక్షేమ శాఖ స్పష్టతనిచ్చింది. -
పేరులో నేముంది
అర్మేనియా అర్మేనియా... చాలా చిన్నదేశమైనా, పురాతన కాలం నుంచి మనుగడలో ఉన్న దేశం. కనీసం గాలి కూడా చొరబడదేమో అన్నంత ఇదిగా టర్కీ, ఇరాన్, జార్జియా దేశాలు ఆవరించి ఉంటాయి ఈ దేశం చుట్టూ. అంతేకాదు, క్రైస్తవమతాన్ని అధికార మతంగా స్వీకరించిన మొట్ట మొదటి దేశం అర్మేనియానే. అర్మీనా అనే ప్రాచీన పర్షియన్ పదం నుంచి పుట్టింది అర్మేనియా...దీనికే హేక్ అనే మరో పేరు కూడా ఉంది. నోవా సంతతికి చెందిన హేక్ అనే రాజు పాలించిన దేశం కాబట్టి దీనికి హేక్ అనీ, హయస్థాన్ అనీ కూడా పేరు వచ్చింది. అదేవిధంగా హేక్ వంశస్థుడైన అరమ్ అనే రాజు పాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఈ దేశానికి అర్మేనియా అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర పరిశోధకులు చెబుతారు. -
గుడ్ మార్నింగ్... 2015!
బాధ జీవితానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నింటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం కాబట్టే, నర కాన్ని అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహ లోక కాలంలోని కొన్ని రోజులను ఏటా తాత్కాలిక స్వర్గం కోసం కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవ దూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. మానవుడు భగవంతుని అద్భుత సృష్టి. మనం భగవంతుణ్ణి విశ్వసించడానికి కారణం మాత్రం అది కాదు. నైతికంగా రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉన్న మానవ జాతి ఇంతవరకు తాను సాధించిన దాని నుండి ఇంకా నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. గతంలో సుల్తాన్ మొహ్మద్ గజనీ భారత దేశాన్ని కొల్లగొట్టి వెళ్లాక, సూఫీ శాంతి ప్రబోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చాడు. వర్తమానంలోనైతే నరహంతక తాలిబాన్‌కు ముందటి గాంధేయ వాది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను అలాగే చెప్పుకోవచ్చు. ఇలాంటి పోలిక తేవడం... ఉద్రిక్తపూరితమైన ఈ భూమి అనే తిరిగే గోళం మీద మంచీచెడు సగం-సగం, ఒకదానికొకటి సరి అనే బూటకపు సమానత్వా న్ని సూచించనూ వచ్చు. హింసను, దాని ఆటవిక చుట్టపట్టాలను చల్లార్చడంతోనే లేదా వ్యవహరించడంతోనే మన సమయంలో చాలా ఖర్చయిపోతోంది. బాధ జీవించడానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నిటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం. కాబట్టే నర కాన్ని మనం అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహలోక కాలంలోని కొన్ని రోజుల భాగాన్ని ఏటా తాత్కాలిక స్వర్గం కోసం విడిగా కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవదూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు. దాతృత్వం అనే పదం దర్పాన్ని సూచించే చికాకైన పదం. అందుకు ఇస్లాం సిద్ధాంతం పరిష్కారాన్ని సూచించింది. చీదర పుట్టించే విధంగా అహంకార ప్రదర్శనకు తావే లేకుండా నిర్మూలించడం కోసం దాతృత్వం గుప్తంగానే జరగాలని శాసించింది. ఇవ్వడానికి తగిన పద్ధతి ఉండేట్టయితే, తీసుకోడానికి కూడా అలాగే తగిన పద్ధతి ఉండాలి. తీసుకునేదాన్ని అది బాల దృష్టితో, హృదయంతో చూసేదిగా ఉండాలి. బాలలు కోరినది కావాలనుకుంటారంతే. డబ్బు విషయం వారికి పట్టదు. అలాంటప్పుడు విలువను లెక్కగట్టేది సంతోషంతోనే తప్ప, వ్యయంతో కాదు. మనకు కనిపించేదానికి భిన్నంగా పిల్లలు వాస్తవికవాదులు. పెద్దవారు దురాశతో లేదా ఆకాంక్షతో లేదా పైకి ఎగబాకడం లేదా కిందికి దిగజారడం వల్ల ప్రేరేపితులై ఉంటారు. కాబట్టి బెలూన్ అవసరమైన చోట అంతరిక్ష నౌక కావలసి వస్తుంది. అదే పిల్లాడైతే బెలూన్‌నే రోదసి నౌకగా మార్చేసుకోగలుగుతాడు. పిల్లవాడికి అతి మంచి కానుక... ఏ చెట్టుకో వేలాడదీసినది, చక్కగా ప్యాకింగ్ చేసి ఉన్నది కానవసరం లేదు. దాన్ని ఇచ్చిన సమయమనేదే ముఖ్యం. క్రిస్మస్కు కేంద్ర బిందువు జీసస్ క్రిస్ట్ జననం. ఆ కథనం స్థానికతను ఎప్పుడో అరుదుగా గానీ ప్రశ్నించరు. ఎందుకంటే పాత నిబంధన దాన్ని ముందుగానే చెప్పింది. రాజులు భగవంతుని పాదాల ముందు బంగారం, సాంబ్రాణి, గుగ్గిలం సమర్పించి కొలవడం ఆ వేడుక పాటలో ఉన్నాయి. ఆ బిడ్డకు తల్లి మేరీ అతను తన ఒడి నుండి శిలువనెక్కేవరకు ఏం ఇచ్చింది? ముగ్గురు జ్ఞానులు లేదా రుషులు లేదా రాజులు సమర్పించిన మూడు ద్రవ్యాలు అప్పటికే చాలా కాలంగా ఏ ఒక్క మతానికో చెందనివి అన్న గుర్తింపును పొందిన సుప్రసిద్ధ కానుకలు. జ్ఞాపకాలన్నిటిలాగే, ఈ విషయంలో కూడా ఒకటికి మించిన కథనాలున్నాయి. ఒక నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు రాజులు బెత్లహామ్‌కు చేరారని సెయింట్ మాథ్యూ నిబంధన తెలుపుతోంది. విశ్వాసాన్ని నిర్దిష్టమైన పుట్టుపూర్వోత్తరాల గొలుసుగా చూపాలని పండితులకు తెగ ఆత్రుత. ఆ ముగ్గురు రుషులు పర్షియాకు చెందినవారని, పవిత్రాగ్నికి కావలిదారులని, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఉద్దండులని వారు భావిస్తున్నారు. పర్షియా లేక భారతదేశం నుండి వారు వచ్చి ఉండాలి. నేడు దేవుడేలేని చైనా, కమ్యూనిస్టు వ్యామోహంతో వెంటబడుతున్న సిల్క్ రూట్ వెంబడే వాళ్లు అక్కడికి చేరి ఉండాలి. ఏదేమైనా వాళ్లు తూర్పు దిక్కు నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు. క్రైస్తవ మతం పాశ్చాత్య విశ్వాసంగా ఎంత ప్రబలంగా విస్తరించిందంటే... అది మనం దాని ఆసియా మూలాలను మరిచిపోయేట్టు చేస్తుంటుంది. ఆ మతానికి చెందిన ప్రథమ కుటుంబాన్ని గోధుమ వర్ణపు ఛాయలతో ప్రాచీన చర్చి మత చిత్రకళ సరిగ్గానే చిత్రించింది. ఆ తదుపరి తొలి పునరుజ్జీవనోద్యమ కాలంనాటి శ్వేత వర్ణ ఛాయలతో కూడిన చిత్రాలకు అవి భిన్నమైనవి. మేరీ తల అప్పుడూ, ఇప్పుడూ నిరాడంబరమైన శిరోవస్త్రాన్ని ధరించి ఉంటుంది. అది ఆమె యుగపు అలవాటు. ఖురాన్లో మేరీ గురించి ఒక అధ్యాయం ఉన్నదని, ముస్లింలు జీసన్‌ను (ఇసాగా పిలుస్తారు) తమ గొప్ప ప్రవక్తలలో ఒకరిగా మన్నిస్తారని కూడా మనం అంతే సులువుగా మరుస్తుంటాం. ఖురాన్, ఇసాను రుహుల్లా లేదా అల్లా ఆత్మగా స్తుతిస్తుంది. జీసస్‌ను శిలువ వేశారని ముస్లింలు అంగీకరించరు. ఆయనను రక్షించి, తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారని, ఆ తదుపరి ఆయన రోమన్ సామ్రాజ్యానికి వెలుపల తన బోధనను కొనసాగించడానికి తూర్పు దిశకు వెళ్లాడని చెబుతుంది. క్రిస్మస్ వివాదాలకు సంబంధించినది కాదు. ముస్లిం టర్కీ ఒకప్పటి తమ అత్యంత సుప్రసిద్ధ పూర్వీకులలో ఒకరైన శాంతాక్లాజ్ ఖ్యాతికి సంతోషించనిద్దాం. క్రిస్మస్ కానుకలకు ఉండే దైవాంశను కలిగిన స్లెడ్జిబండిపై పయనించే ముసలాయన నార్డిక్ జాతివాడు కాదు. ఆయన సెయింట్ నికోలస్. 270లో దక్షిణ టర్కీలో, అది ప్రధానంగా క్రైస్తవ ప్రాంతంగా ఉన్న కాలంలో జన్మించి, మైరాకు బిషప్‌గా ఎదిగాడు. నేడు ఆ పట్టణాన్ని దెమ్రెగా అని పిలుస్తారు. స్థానికులు తమ హీరోను ‘‘నోయెల్ బాబా’’గా గౌరవిస్తారు. ఆయన చ ర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. బిషప్ తన మహిమతో తండ్రులు నరికేయగా మరణించిన ముగ్గురు కుమారులను బతికించాడు. అందుకే మరణించిన కొద్దికాలానికే ఆయనను పవిత్ర ప్రబోధకునిగా గుర్తించారు. మరొక గాథ, వరకట్నం చెల్లించలేక బానిసలుగా అమ్మేస్తున్న ముగ్గురు కుమార్తెలకు సంబంధించినది. ఆయన సంచి నిండా బంగారాన్ని వారి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా సంతోషంగా గడిపారు. ఆసక్తి ఉన్నవారికి మరొక విశేషం... సెయింట్ నికోలస్ ఎన్నడూ ఎర్ర గౌను వేసుకొని ఎరగడు. అది కోకా కోలా మార్కెటింగ్ శాఖ పాప్ సంస్కృతికి చే సిన చేర్పు. ఎప్పటిలాగే మనమంతా భవిష్యత్తుపట్ల ఆత్రుతతో 2015 కోసం వేచి చూస్తూ, సుహృద్భావాన్ని కోరడం, శాంతి కోసం ప్రార్థించడం మరీ పెద్ద కోరికేమోనని ఎవరైనాగానీ ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి నేను కూడా ఓ పిల్లవాడిలాగా సాధ్యమైనదానితోనే సరిపెట్టుకుంటాను. భారతదేశంలో శాంతి విలిసిల్లాలని, వచ్చే 51 వారాల్లో భారతీయులందరి మధ్యనా సుహృద్భావం నెలకొనాలని కోరుకుంటాను. ఇక ఆ 52వ వారం సంగతి అదే చూసుకుంటుంది. -
తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జిలుకర రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కల నెరవేరేలా డిసెంబర్ మొదటి వారంలో మెదక్ జిల్లా గజ్వేల్‌లో మెగా క్రిస్మిస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పిల్లల మతంలోకి మారిపోదాం
దైవికం ద్వేషం కన్నా భయంకరమైనది దురభిమానం. ఈ రెండిటికన్నా భయంకరమైనవాడు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ ద్వేషం యూదుల మీద. హిట్లర్ దురభిమానం తన సొంత జాతి మీద. సొంత జాతి అంటే మళ్లీ క్రిస్టియానిటీ అని కాదు. యూదులు కాని వారెవరైనా తన సొంత జాతే అన్నట్లు ఉండేవారాయన. పైగా యూదులు అల్పులని, తక్కినవారు ఎంతో ఉత్కృష్టమైన ఆర్యసంతతి మూలాల నుంచి వచ్చినవారని హిట్లర్‌కి ఓ నమ్మకం. మనుషుల పోలికల మీద కూడా దీర్ఘమైన ఆయన పరిశీలన ఒకటి ఉండేది. ఆర్యులంటే ఇలా ఉంటారని, యూదులంటే అలా ఉంటారని ఏవో పిచ్చి అభిప్రాయాలు ఉండేవి. 1935లో ఆయన ప్రచార బృందం... ‘ఇదిగో మన ఆర్యజాతి ఇంత పరిపూర్ణంగా, ఇంత సర్వోత్కృష్టంగా ఉంటుంది’ అంటూ జాబిల్లి వంటి ముఖం, బూరెల్లాంటి బుగ్గలు ఉన్న ఆరు నెలల చిన్నారి ఫొటోను పోస్టర్ల మీద, చిన్న చిన్న కార్డుల మీద ప్రింట్ చేయించి జర్మనీ అంతటా పంచి పెట్టింది. దీన్ని బట్టి మనుషులలోని ద్వేషభావం, దురభిమానం ఏ స్థాయిలో ఉంటాయో అర్థమౌతుంది. హిట్లర్ చనిపోయాడు. యుద్ధం ఆగిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి. తాజాగా ఇప్పుడు బయట పడిన నిజం ఏమిటంటే, ఆ పాప.. హిట్లర్ అనుకున్నట్లుగా ‘ఆర్యన్ బేబీ’ కాదనీ, యూదుల బిడ్డ అని! హిట్లర్ బతికి ఉండగా ఈ సంగతి తెలిస్తే ఎలా ఉండేదో కానీ, ప్రొఫెసర్ హెస్సీ టఫ్ట్ మాత్రం ‘‘బాబోయ్, నాజీలు నన్ను బతకనిచ్చేవారు కాదు’’ అంటున్నారు చిరునవ్వుతో. ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసులో ఉన్న హెస్సీ ఎవరో కాదు, ఆనాటి ఆర్యన్ బేబీనే! ఇంతకీ ఆ పాప ఫొటో నాజీలకు ఎక్కడిది? హెస్సీ తండ్రి జాకబ్. తల్లి పాలైన్ లెవిన్సన్స్. ఇద్దరికీ మ్యూజిక్ తెలుసు. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదా అని 1928లో లాట్వియా నుంచి బెర్లిన్ వె ళ్లారు. ఒక అపేరా కంపెనీలో జాకబ్‌కి ఉద్యోగం వచ్చింది కానీ, అతడు యూదుడు అని తెలిసిన వెంటనే ఉద్యోగంలోంచి తొలగించారు. తర్వాత ఆయన సేల్స్‌మేన్‌గా చేరారు. 1935 నాటికి యూదులపై నాజీల ద్వేషం, దౌర్జన్యం మితిమీరిపోయాయి. అప్పటికి హెస్సీకి ఆరు నెలలు. బొద్దుగా, అందంగా ఉండేది. ఓ రోజు తన ముద్దుల బిడ్డను చంకనేసుకుని బెర్లిన్‌లో పేరున్న ఫొటోగ్రాఫర్ హాన్స్ బాలిన్ దగ్గరకు తీసుకెళ్లి ఫోటో తీయించుకొచ్చారు పాలైన్. తర్వాత కొన్నాళ్లకు అదే ఫొటో నాజీల పత్రిక ‘సనీ ఇన్స్ హవుజ్’ ముఖచిత్రంగా వచ్చింది. అది చూసి పాలైన్ విపరీతంగా భయపడిపోయారు. నాజీలకు తెలిస్తే తమ చిరునామా వెతుక్కుంటూ వచ్చి మరీ ముప్పు తిప్పలు పెడతారన్న ఆలోచన రాగానే ఆమె గొంతు తడారిపోయింది. పరుగున ఆ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి ‘‘ఇదెలా జరిగింది?’’ అని అడిగారామె. ‘‘ఓ అదా...’’ అంటూ నవ్వారాయన. ‘‘ఆ పత్రిక ఆర్యన్ బేబీల అందాల పోటీలు పెడితే మీ పాప ఫొటో పంపాను. నాజీల దురభిమానాన్ని దెబ్బతియ్యాలనే అలా చేశాను. పసికందుల్లో కూడా వీళ్లు జాతి భేదాలను చూడ్డం ఘోరం కదా’’ అన్నారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు పాలైన్ దంపతులు నాజీల కంటపడకుండా తమ బిడ్డను కాపాడుకున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు హెస్సీ వల్ల వెలుగులోకి వచ్చాయి. ఎనభయ్యేళ్ల క్రితం తన ముఖచిత్రంతో వచ్చిన పత్రికను ఆమె ఇజ్రాయిల్‌లోని మారణహోమ స్మారక పురావస్తుశాలకు విరాళంగా ఇస్తూ నాటి సంగతులను మీడియాకు వెల్లడించారు. ద్వేషానికి కారణాలు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రేమకు కార ణాలు ఉండకూడదు. ఉంటే అది దురభిమానమో, స్వార్థాభిమానమో అవుతుంది. అంతకన్నా అకారణమైన ద్వేషమే నయం. ఏ కారణమూ లేకుండా మొలకెత్తని ప్రేమ కన్నా అది హీనమైనదేం కాదు. పిల్లలు, దేవుడు ఒకటే నంటారు. హిట్లర్ పసిపిల్లల్లోనూ తన జాతినే వెతుక్కున్నాడు తప్ప దేవుణ్ని గానీ, దైవాంశ ఉండే పసితనాన్ని కానీ చూడలేకపోయాడు. పిల్లలందరిదీ ఒకే మతం. అది దైవమతం. అందుకే పిల్లలు పెద్దవాళ్లయ్యాక కట్టే గుడులు, చర్చిలు, మసీదుల కంటే కూడా చిన్నప్పుడు ఇసుకలో వాళ్లు కట్టే గుజ్జనగూళ్లే అసలైన దేవాలయాలు అనిపిస్తాయి ఒకోసారి. వాటిల్లోనూ దేవుడు సాక్షాత్కరిస్తాడు. మనం చూడగలిగితే! - మాధవ్ శింగరాజు