
ఇంటి వాతావరణం ఏది నేర్పిస్తే అది నేర్చుకోవడం సహజం. అలా ప్రియాంకా చోప్రాకి నేర్పించిన విషయాల్లో ‘ఆధ్యాత్మికత’ ఒకటి. ఆధ్యాత్మికత గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘భారతదేశం పలు మతాల సమాహారం. నేను చదువుకున్నది క్రిస్టియన్ కాన్వెంట్‌లో. దాంతో నాకు క్రిస్టియానిటీ గురించి తెలుసు. మా నాన్నగారు మసీదులో పాడేవారు. దాంతో నాకు ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. నేను హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని. హిందుత్వం గురించి సహజంగానే తెలిసిపోతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికం అనేది ఓ పెద్ద భాగం. దాన్ని విస్మరించలేం. నేను హిందువుని. మా ఇంట్లో గుడి ఉంది. నేను పూజలు చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా చేస్తుంటాను. ఆ విషయం పక్కనపెడితే, ఏదో పెద్ద శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తిపై నాకు చాలా నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment