![పేరులో నేముంది](/styles/webp/s3/article_images/2017/09/3/71443635383_625x300.jpg.webp?itok=2aTJmlq4)
పేరులో నేముంది
అర్మేనియా
అర్మేనియా... చాలా చిన్నదేశమైనా, పురాతన కాలం నుంచి మనుగడలో ఉన్న దేశం. కనీసం గాలి కూడా చొరబడదేమో అన్నంత ఇదిగా టర్కీ, ఇరాన్, జార్జియా దేశాలు ఆవరించి ఉంటాయి ఈ దేశం చుట్టూ. అంతేకాదు, క్రైస్తవమతాన్ని అధికార మతంగా స్వీకరించిన మొట్ట మొదటి దేశం అర్మేనియానే.
అర్మీనా అనే ప్రాచీన పర్షియన్ పదం నుంచి పుట్టింది అర్మేనియా...దీనికే హేక్ అనే మరో పేరు కూడా ఉంది. నోవా సంతతికి చెందిన హేక్ అనే రాజు పాలించిన దేశం కాబట్టి దీనికి హేక్ అనీ, హయస్థాన్ అనీ కూడా పేరు వచ్చింది. అదేవిధంగా హేక్ వంశస్థుడైన అరమ్ అనే రాజు పాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఈ దేశానికి అర్మేనియా అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర పరిశోధకులు చెబుతారు.