ఈ నెల 5 నుంచి 9 వరకు 10 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని సంచార, ఉపసంచార జాతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ జాతుల సంస్కృతి, కళలు, సంప్రదాయాల పరిరక్షణ, సంక్షేమపథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వారు లబ్ధిపొందేందుకు చర్యలను చేపట్టనుంది. ఇందుకోసం ఆధార్ కార్డులు, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ ప్రతిపాదిత డబుల్ బెడ్‌రూమ్ పథకం వర్తింపజేయడం వంటి తదితర రూపాల్లో వారిని ఆదుకోవాలని యోచిస్తోంది.
వీరి పిల్లలను విద్యావంతులను చేయడంపై బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇందుకోసం ఈ నెల 5-9ల్లో రాష్ట్రంలోని పది జిల్లాల్లో సంచారజాతుల కులసంఘాల కులపెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. మే 5న మెదక్, నల్లగొండ, 6న వరంగల్, కరీంన గర్, 7న ఖమ్మం, నిజామాబాద్, 8న మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, 9న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తారు.
జిల్లాస్థాయిలో డిప్యూటీ డెరైక్టర్ (బీసీడబ్ల్యూ)/జిల్లా బీసీసంక్షేమ అధికారులు, ఏబీసీడబ్ల్యూలు, ఈడీ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంచారజాతుల జిల్లా అధ్యక్షులతో సమావేశమై వివరాలతో బీసీసంక్షేమ శాఖ డెరైక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదికలపై ఈ నెల 15న హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో సంఘాల రాష్ట్రస్థాయి నాయకులతో చ ర్చిస్తారు. అనంతరం వారి కోసం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ నివేదిక సమర్పిస్తుంది.
సంచార జాతుల సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి
Published Sat, May 2 2015 3:53 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement