
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు కృషి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం సచివాలయంలో బాపూజీ 102వ జయంతి వాల్ పోస్టర్‌ను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ వీజీ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ.. బాపూజీ 102వ జయం తిని బుధవారం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాల్‌లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాపూజీ ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్‌కు మార్, అదనపు కార్యదర్శి సైదా, బాపూజీ 102వ జయంతి ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్లు గోషిక యాదగిరి, ఎస్.దుర్గయ్య గౌడ్, భాగ్యలక్ష్మి, సలహాదారులు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.