Konda Laxman
-
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
-
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు కృషి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం సచివాలయంలో బాపూజీ 102వ జయంతి వాల్ పోస్టర్‌ను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ వీజీ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ.. బాపూజీ 102వ జయం తిని బుధవారం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాపూజీ ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్‌కు మార్, అదనపు కార్యదర్శి సైదా, బాపూజీ 102వ జయంతి ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్లు గోషిక యాదగిరి, ఎస్.దుర్గయ్య గౌడ్, భాగ్యలక్ష్మి, సలహాదారులు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
రాష్ట్ర వేడుకగా కొండా లక్ష్మణ్ జయంతి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఈ నెల 27న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వ హించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వేడుకను బీసీ సంక్షేమ శాఖ నిర్వహించాలని, ఇందుకు రూ.8 లక్షలు కేటాయించింది. వేడుకల నిర్వహణకు 84 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, 11 మందిని ఉపాధ్యక్షులుగా, 27 మందిని కన్వీనర్లుగా, 36 మందిని కో కన్వీనర్లుగా, 9 మందిని గౌరవ సలహాదారులుగా నియమించింది. జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు రూ.20 వేలు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బలహీనవర్గాలు సామాజికంగా ఎదిగేందుకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతగానో కృషి చేశారని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సహకార సంఘాలను, కుల వృత్తులను ప్రోత్సహించిన బాపూజీ బడుగు వర్గాల బాంధవుడని కొని యాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, 90 ఏళ్ల వయసులోనూ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. మంగళవారమిక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనందబాస్కర్ పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిషన్‌ను ఏర్పాటు చేసి, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంచార జాతులను గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారిని అభివృద్ధి పరచాలన్నారు. బీసీ సాధికారిత భవనాన్ని నిర్మించి అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నిజాం పాలనలో మొదటిసారి ఆబిడ్‌సలోని హెడ్ పోస్టాఫీసుపై జాతీయ జెండా ఎగురవేసిన గొప్ప ధీశాలి బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారన్నారు. ఆ పోరాట పటిమ అందరిలో రావాలి స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు లక్ష్మణ్ బాపూజీ చూపిన పోరాట పటిమ అందరిలోనూ రావాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని బలహీనవర్గాలు అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. బాపూజీ విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తాను, బాపూజీ ఒక కుటుంబ సభ్యులుగా మెలిగామని ఎంపీ కేశవరావు గుర్తుచేసుకున్నారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి బాపూజీ అని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ది సాధ్యమని, 50 శాతం ఉన్న బీసీలకు, విద్య, రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని బాపూజీ జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ , మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ పై ప్రభుత్వం చర్చ జరుపుతోందన్నారు. బీసీలకు ఉపకార వేతనాలను పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. జలదృశ్యంలో బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు. నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. కొద్దిగా రాజీపడ్డా ఆయన సీఎం అయ్యేవారని అన్నారు. కార్యక్రమంలో సామాజిక దర్శిని పుస్తకం, బాపూజీ పాటల సీడీ, బీసీ మీడియా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ, కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉత్సవ సమితి వైస్ చైర్మన్లు యాదగరి, కాల్లప్ప, మల్లయ్య, వెంకటేశ్వర్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జీవితమే సందేశమైన ‘బాపూజీ’
ప్రజల మనిషి. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద వులకోసం ఎన్నడూ రాజీపడ లేదు. అర్రులు చాచలేదు. నిర్మొహమాటంగా ఉంటూనే, అందరినీ కలుపుకుపోయే శైలి వారిది. 1915, సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ వాంకిడిలో పుట్టి; 2012 సెప్టెంబర్ 21న హైదరాబాద్ అశోక్‌నగర్‌లో తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. వెంట ఎవరూ లేనప్పుడు కూడా ఒంట రిబాటసారిగా సమాజానికి వేగుచుక్కగా ముందుకు నడిచిన జీవితం బాపూజీది. బాపూజీ చరిత్రలో అనేక విజయాలు ఉన్నాయి. వెనక్కి నెట్టివేసిన క్రమాలున్నాయి. కానీ, ఆయన ఎన్నడూ దొడ్డిదారిలో ఎదగడానికి ఇచ్చగించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నుంచి యువతరం నాయకులుగా ఎదగా లని ఆయన ఎంతో ఆశించారు. అయితే వ్యక్తి స్వార్థం ప్రబలి పోయి గ్రూపు రాజకీయాలు, కులవివక్ష పెరిగిపోవ డంతో బడుగు, బలహీన వర్గాల నాయకత్వం ఎదగలేక పోవడం బాపూజీలో తీరని క్షోభను మిగిల్చింది. బహుజనులు అన్ని రంగాల్లో సాధికారత సాధిం చాలని బాపూజీ కలలుగన్నారు. ఆధునిక విద్య అందు కోవడానికి హాస్టళ్లు అవసరమని పద్మశాలీ హాస్టల్ కోసం దశాబ్దాలు చేయూతనిచ్చిన బాపూజీ ఎన్నో కుల సంఘా లకు, సహకార సంఘాలకు మార్గదర్శకులు, స్ఫూర్తిదాత అయ్యారు. దళిత సంఘాలకు నిరంతరం మద్దతునిస్తూ ముందుకు సాగారు. బీసీల రిజర్వేషన్లు, ఆయా కులాల వృత్తి, సహకార సంఘాలకు సబ్సిడీలు, రాయితీలు- చేనేత అభివృద్ధి, దళితుల హక్కులు వంటి అంశాలలో సాంఘిక సంక్షేమం కోసం ఆయన చేపట్టని కార్యక్రమం లేదు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘా నికి అధ్యక్షులుగా నియమించినప్పుడు నిక్కచ్చిగా ఎవరూ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారో వారి కేసులను ప్రతిదీ ప్రత్యక్షంగా పరిష్కరించారు. కొడుకుని భారత్-పాకిస్తాన్ యుద్ధానికి పంపించారు. భార్య యుద్ధంలో డాక్టర్‌గా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మహోన్నతమైనది. వయోభారాన్ని తోసిరాజని తెలంగాణ రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేశారు. పదవుల కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. జీవించి ఉన్నప్పుడే బాపూజీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం గొప్ప చారిత్రక సంఘటన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుని జయంతి, వర్ధంతు లను ఏటా అధికారికంగా నిర్వహించాలని సంకల్పిం చడం శుభపరిణామం. (నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి) వ్యాసకర్త పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్ మొబైల్ : 98499 12948 - వకుళాభరణం కృష్ణమోహన్‌రావు