Minister joguramanna
-
ఒకటీ.. రెండూ.. మూడూ..
సాక్షి, హైదరాబాద్/ఉట్నూర్ రూరల్ (ఖానాపూర్): రాష్ట్రంలో పులులు, ఇతర అటవీ జంతువుల గణన ప్రారంభమైంది. నల్లమల, కవ్వాల్, బెల్లంపల్లి, తూర్పు కనుమలు తదితర అడవుల్లోని మూడు వేల ఫారెస్టు బీట్లలో అధికారులు సోమవారం ఏక కాలంలో జంతు గణన ప్రారంభించారు. దాదాపు 10 వేల మంది అటవీ, స్వచ్ఛంద సేవా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 29 వరకు లెక్కలను సేకరిస్తారు. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారి పీకే ఝా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు గతంలో పాద ముద్రల ఆధారంగా పులి కదలికలను, ఉనికిని గుర్తించేవారు. ఇప్పుడు తొలిసారిగా ‘ఫేజ్4 మానిటరింగ్ విధానం’ ద్వారా పులులను లెక్కిస్తున్నారు. అంటే ఛాయా చిత్రాలు, పాద ముద్రలు, పెంటిక విశ్లేషణ, భౌతిక గమనం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. ఒక పులి చారలు, పాద ముద్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక పులితో సరిపోలవు. వీటి ఆధారంగానే అటవీ శాఖ అధికారులు పులుల సంఖ్యపై స్పష్టతకు వస్తున్నారు. జంతు గణన వారం పాటు చేస్తారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు(మాంసాహారులు) మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కలు సేకరిస్తారు. జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ జంతుగణన దేశవ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని కొలాంగూడ, రాంపూర్ అటవీ బీట్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫారెస్ట్‌లో అటవీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న పులులు, వన్య జంతువుల గణనలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అటవీ శాఖ అధికారులతో కలసి 6 కిలోమీటర్లు కాలినడకన పర్యటించి ఆయన జంతు గణనను పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. చారలను సరిచూసి... పులుల లెక్కింపులో ఇప్పుడు సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. పులి శరీరానికి కుడి, ఎడమ వైపు ఉన్న చారలను కెమెరాలతో చిత్రీకరిస్తారు. చారల్లో ఉంటే తేడాల ఆధారంగా ఒక ఫొటోతో మరో ఫొటో సరిపోల్చుకుంటూ ఒక పులి నుంచి మరో పులిని వేరుగా గుర్తిస్తారు. రెండేళ్ల లోపు పులి కూనలను లెక్కలోకి తీసుకోరు. మరో పద్ధతిలో నీటి ముడుగుల సమీపంలో ఫారెస్టు అధికారులు తడిగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చే పులి ఆ ఫలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. ఆ అచ్చుల ఆధారంగా కూడా పులులను లెక్కిస్తారు. పెంటిక పరీక్ష... పులులు సంచరించే అవకాశం ఉన్న ఆవాసంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. వాటికి సీసీఎంబీలో డీఎన్ఏ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్ఏలలో తేడా ఉంటే అక్కడ మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు. డీఎన్ఏ నిర్ధారణ పరీక్షల్లో 100 శాతం విశ్వసనీయత ఉంటుందని అధికారులు చెప్తున్నారు. -
బీసీలకు సబ్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ కమిటీ ప్రతిపాదనల్లో మొదటి అంశంగా చేర్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీసీల జనాభాను కచ్చితంగా తేల్చేందుకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే నిర్వహించనున్నామన్నారు. బీసీల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 100 ఎకరాల్లో పూలే పేరిట బీసీ ఆత్మగౌరవ భవన్‌ను ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం, ఎలక్టెడ్, సెలక్టెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీఎంకు నివేదించనున్నామన్నారు. 31 జిల్లాల్లో రెండేసి చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. కొత్తగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. -
నిర్దిష్ట సమాచారమిస్తే విచారణ
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంటే ఇవ్వాలని, విచారణ జరిపిస్తామని అటవీశాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో మాట్లాడారు. హరితహారం కింద అవినీతి జరుగుతోందని, మొక్కలు నాటకున్నా, మొక్కలకు నీళ్లు పోయకపోయినా.. ఇవన్నీ చేసినట్లు కాగితాలపై తప్పుడు లెక్కలు చూపి కొందరు అధికారులు నిధులను స్వాహా చేస్తున్నారని విపక్ష నేత షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సభ్యులు ఆకుల లలిత, పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి బదులిచ్చారు. 2019 నాటికి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది నాటిన మొక్కల్లో 27.72 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. మొక్కల సంరక్షణకు వేసవిలో 3,200 ట్యాంకర్లతో నీరు అందించామన్నారు. అధికార పార్టీ సభ్యులు బి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్ రెడ్డి, పూల రవీందర్, భూపాల్ రెడ్డి, ఎ.కృష్ణారెడ్డి.. హరితహారం ప్రయోజనాలు వివరించారు. భవిష్యత్తులో జరగనున్న జాతీయ రహదారుల విస్తరణను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన స్థలాన్ని విడిచిన తర్వాతే హరితహారం కింద మొక్కలను నాటాలని బీజేపీ సభ్యుడు ఎం.రాంచంద్రరావు సూచించారు. హరితహారం కార్యక్రమంలో కక్కుర్తికి పాల్పడి దొంగ లెక్కలు చూపితే దేవుడు కూడా క్షమించడని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. 2019 నాటికి 140 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ఎంఐఎం సభ్యుడు అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రశ్నించారు. -
ఆదిలాబాద్‌లో పత్తి రైతుల ఆందోళన
సాక్షి,ఆదిలాబాద్/ఖమ్మం వ్యవసాయం: ఆదిలాబాద్‌లో పత్తి రైతులు ఆందో ళన బాట పట్టారు. తేమ పేరిట ధరను అడ్డగోలుగా తగ్గించడంపై బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మార్కెట్‌యార్డులో బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగినా వ్యాపారులతో అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో యార్డు నుంచి రోడ్డుపైకి వచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. తేమ విషయంతో మొదలు.. ఆదిలాబాద్ మార్కెట్లో ఉదయం 8.30 గంటలకు పత్తి ధర కోసం వేలం నిర్వహించారు. 8 శాతం తేమ ఉన్న పత్తి క్వింటాలుకు రూ.4,570 ధర నిర్ణయించారు. యార్డు నుంచి జిన్నింగ్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ తేమ శాతాన్ని చూస్తూ క్వింటాలుకు రూ.3,800 వరకే ఇస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. 8 శాతం నుంచి కాకుండా 12 శాతం నుంచి తేమను పరిగణన లోకి తీసుకోవాలని, ఆపై అదనంగా వచ్చే తేమ శాతానికి ధర కోత విధించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జేసీ కృష్ణారెడ్డి మంత్రి జోగురామన్నతో సమస్యపై వివరించగా, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వ్యాపారులు దిగిరాకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 25వేల క్వింటాళ్ల వరకు పత్తిని రైతులు వాహనాల్లో తీసుకొచ్చారు. ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేదు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌కు బుధవారం సుమారు 30వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చింది. 24,700 బస్తాల పత్తి విక్రయానికి వచ్చినట్లు రికార్డు అయింది. బాగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసి విక్రయానికి తెచ్చిన పత్తిని కూడా వ్యాపారులు కుంటిసాకులు చెబుతూ క్వింటాల్‌కు సగటున రూ. 2,500 నుంచి రూ.3 వేలకు మించి ధర పెట్టడం లేదు. -
ఆదివాసీలకు అండగా ఉంటాం
సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందని అటవీ, పర్యాటక, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. 2014 కంటే ముందు పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేసుకునే గిరిజనులకు తప్పకుండా పట్టాలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో జరిగిన కుమురం భీం 77వ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం సమాధి వద్ద మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా గిరిజనులంతా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల పట్టాల విషయంలో అక్కడక్కడ సమస్యలు తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. -
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
-
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు కృషి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం సచివాలయంలో బాపూజీ 102వ జయంతి వాల్ పోస్టర్‌ను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ వీజీ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ.. బాపూజీ 102వ జయం తిని బుధవారం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాపూజీ ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్‌కు మార్, అదనపు కార్యదర్శి సైదా, బాపూజీ 102వ జయంతి ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్లు గోషిక యాదగిరి, ఎస్.దుర్గయ్య గౌడ్, భాగ్యలక్ష్మి, సలహాదారులు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
రాష్ట్ర వేడుకగా కొండా లక్ష్మణ్ జయంతి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఈ నెల 27న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వ హించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వేడుకను బీసీ సంక్షేమ శాఖ నిర్వహించాలని, ఇందుకు రూ.8 లక్షలు కేటాయించింది. వేడుకల నిర్వహణకు 84 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, 11 మందిని ఉపాధ్యక్షులుగా, 27 మందిని కన్వీనర్లుగా, 36 మందిని కో కన్వీనర్లుగా, 9 మందిని గౌరవ సలహాదారులుగా నియమించింది. జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు రూ.20 వేలు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం
భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్ టౌన్: రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందు ల కొనుగోళ్లను ప్రారంభించారు. క్వింటా లుకు రూ. 5,050 మద్దతు ధర నిర్ణయిం చారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే వారిని తరిమికొట్టాలని రైతులకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు కుడి కాల్వ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రులు వెళ్లగానే కొను గోళ్లు నిలిచిపోయాయి. సాయంత్రం 4గంట లకు కొనుగోళ్లు ప్రారంభించగా.. 5 గంట లకు తేమ శాతాన్ని మార్కెటింగ్ అధికారులు పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ఎండబెడితేనే కొనుగోలు చేస్తా మన్నారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. రాత్రి 7.30 గంటల వరకూ కొనుగోళ్లు ప్రారంభించ లేదు. మార్కెట్ చైర్మన్ రాజన్న వచ్చి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతు కష్టాలను తీరుస్తున్నాం: రైతుల కష్టాలను తీరుస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలు స్తోందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తి పోత ల పథకం నీటిని తానిమడుగు వద్ద గల డెలి వరీ సిస్టర్న్ నుంచి కడెం ప్రధాన కాల్వలోకి మంత్రి జోగు రామన్నతో కలసి మంగళ వారం విడుదల చేశారు. ప్రభుత్వ విప్ నల్లా ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
► మంత్రి జోగురామన్న ► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ రూరల్ : గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తుంద ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామం లో మిషన్ కాకతీయ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేఆర్కే కాలనీలో ఇండ్ల స్థలాల పట్టాలను లబ్ధిదారుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలన లో రెండు సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 112 కోట్లు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ఏర్పాటు అనంతరం 22 మాసాల్లోనే వివిధ రోడ్డు పనులకు రూ.1471 కోట్లను మం జూరు చేసి పనులు సైతం పూర్తి చేయడం జరి గిందని తెలిపారు. అభివృద్ది పనుల్లో భాగంగా మావల గ్రామపంచాయతీలో సీఆర్ఆర్ గ్రాం ట్ కింద చేపట్టిన పనులు ప్రారంభించారు. 7వ నెంబర్ జాతీయ రహదారి నుంచి సుభాష్‌నగర్ వరకు 1.17 కిలో మీటర్లతో రూ. 73 లక్షల వ్యయంతో, కేఆర్కే కాలనీలో 2.3 కిలో మీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డు రూ.1.22 లక్షల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టడం జరి గిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుం దని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగి రి అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీలు ఉమాకాంత్ రెడ్డి, మెస్రం సంగీ త, రాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరె రాజ న్న, పీఆర్ ఈఈ, డీఈ రవిప్రకాష్, ఏఈ మనోహర్, అసిస్టెంట్ ఏఈ అనిల్‌రెడ్డి, పాల్గొన్నారు. -
దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి
► అంబేద్కర్ పుణ్యంతోనే తెలంగాణ సిద్ధి ► దళితులు, గిరిజనులకు డబుల్బెడ్రూమ్లో మొదటి ప్రాధాన్యం ► మంత్రి జోగురామన్న ఆదిలాబాద్: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో బడుగు, బలహీన, దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్‌చౌక్‌లో వేడుకలు నిర్వహించారు. ఎంపీ గొడం నగేష్, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, జేసీ సుందర్ అబ్నార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జెమ్స్ కల్వాలలతో కలిసి మంత్రి జోగురామన్న మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు. జ్యోతిప్రజ్వలన చేసి వేదిక వద్ద బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్తోనే తెలంగాణ వచ్చిందని, దీనికి ముఖ్య కారణం అంబేద్కరేనని పేర్కొన్నారు. అంబేద్కర్ పుణ్యంతోనే తనకు పదవి దక్కిందని మంత్రి జోగు రామన్న చెప్పుకొచ్చారు. దళితులు, గిరిజనులకు డబుల్బెడ్రూమ్ పథకంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ పార్లమెంట్లో గత నవంబర్‌లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలకు సంబంధించి చర్చలు ప్రారంభం సందర్భంగా తాను పాల్గొనడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై డెహ్రాడూన్‌లో ప్రశంసలు లభించాయని పేర్కొన్నారు. మజిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గురించి చర్చా కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని, ప్రపంచానికే గొప్పదార్శనికుడు అంబేద్కరని కొనియాడారు. పథకాలను పేద దళితులకు ఆస్తుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, ఆర్డీవో సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు బాబు గజ్బారె, భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు గంగారాం బోరేకర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి సోగల సుదర్శన్, ప్రజ్ఞకుమార్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైట్ ప్రొటక్షన్ సొసైటీ సభ్యులు సుశీల, రాజారాం, రమా బాయి అంబేద్కర్ సంఘం నుంచి కమలాబాయి, ఎమ్మార్పీఎస్ సంఘం సభ్యులు మారంపల్లి శంకర్, నక్కరాందాస్, మల్యాల మనోజ్, మహా ఎమ్మార్పీఎస్ నుంచి నర్సింగ్, ప్రసాద్, దళిత సంఘాల నాయకులు మేకల మల్లన్న, బాలకృష్ణ, గణేష్ జాదవ్, బండారి దేవన్న, మల్యాల భాస్కర్, సంతోష్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు విశ్వప్రసాద్, దయానంద్ గైక్వాడ్ పాల్గొన్నారు. -
‘పూలే’ పోస్టర్ విడుదల చేసిన జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే 109వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ చక్రహరి రామరాజులతో కలసి సచివాలయంలో శనివారం విడుదల చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు పడక గదుల కేటాయింపులో బీసీలకు 50 శాతం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే స్చేచ్ఛ, సమానత్వాలు లభించిన ట్లని ఆర్.కృష్ణయ్య అన్నారు. వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్లో శనివారం ఆయన వన్యప్రాణి సంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ వైడ్ ఫండ్ సహకారంతో వన్యప్రాణి సంరక్షణ, ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నల్లమలలోని అమ్రాబాద్ అడవుల్లోని వాతావరణంపై అధ్యయనం చేసి కొత్తగా అడవిదున్నలు, గేదె, మూషిక జింకలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక గిరిజనులకు హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి అటవీశాఖ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే కార్యాచరణను రూపొందించాలని మంత్రి రామన్న అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, పర్యావరణ వేత్త కె. సురేశ్‌రెడ్డి, అటవీశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు పీసీసీఎఫ్‌లు ఏకే శ్రీవాస్తవ, పృథ్వీరాజ్, వరల్డ్ వైడ్ ఫండ్ ప్రతినిధులు అనిల్‌కుమార్, ఫరీదా టంపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ నిధులన్నీ ఖర్చు చేస్తాం
శాసనమండలిలో సంక్షేమ పద్దులపై లఘు చర్చలో మంత్రులు పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేయాలని సభ్యుల సూచన సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చే సేందుకు చర్యలు చేపడతామని వివిధ సంక్షేమ శాఖల మంత్రులు తెలిపారు. శాసనమండలిలో సంక్షేమ పద్దులపై ఆదివారం జరిగిన లఘు చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్ భూములతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పి.సుధాకరరెడ్డి (కాంగ్రెస్), కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు ఇస్తున్న రూ.51 వేలని రూ.75 వేలకు పెంచాలని ఫారుఖ్ హుస్సేన్ (కాంగ్రెస్) కోరారు. కళ్యాణలక్ష్మికి ఇస్తున్న మొత్తాన్ని రూ.1.16 లక్షలకు పెంచాలని, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని రాములు నాయక్ (టీఆర్ఎస్) కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతమున్న చట్టాలతోనే వాటిని రక్షించవచ్చునని అల్తాఫ్ రిజ్వీ (ఎంఐఎం) సూచించారు. ఏ కులమైనా, మతమైనా అభివృద్ధికి కొలమానం మంచి విద్య, శిక్షణ, ఆరోగ్యమని, ఈ దిశలో ఆయా వర్గాలను తీసుకెళ్లాలని రామచంద్రరావు (బీజేపీ) అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వ్యయం చేయని శాఖలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ (కాంగ్రెస్) కోరారు. రెండింతలు ఖర్చు చేశాం: ఎస్సీ అభివృద్ధి శాఖ జగదీశ్‌రెడ్డి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను రెండింతలు ఖర్చు చేశామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ‘సబ్‌ప్లాన్ కింద రూ.8,089 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.4,236 కోట్లు వ్యయం చేశాం. ఈ ఏడాది స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల ద్వారా 28 వేలమందికి రూ.283 కోట్ల రుణాలు అందించాం. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.1,550 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. 2014-15లో రూ.2వేల కోట్లు ఇచ్చాం’ అని ఆయన వివరించారు. కల్యాణలక్ష్మి కోసం రూ.300 కోట్లు ఏప్రిల్ నుంచి బీసీలు, ఈబీసీల కళ్యాణలక్ష్మిని ప్రారంభిస్తున్నామని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. 26 సంచార జాతుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని. ప్రస్తుత బడ్జెట్ రూ.2,170 కోట్లలో ఇప్పటివరకు రూ.1,250 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్య, వైద్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, 2015-16లో గిరిజన ఉపప్రణాళిక కింద రూ.2,664.33 కోట్లు విడుదల చేసి, వాటిని పూర్తిగా ఖర్చు చేశామని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు.