
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
► మంత్రి జోగురామన్న
► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆదిలాబాద్ రూరల్ : గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తుంద ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామం లో మిషన్ కాకతీయ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేఆర్‌కే కాలనీలో ఇండ్ల స్థలాల పట్టాలను లబ్ధిదారుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలన లో రెండు సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 112 కోట్లు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ఏర్పాటు అనంతరం 22 మాసాల్లోనే వివిధ రోడ్డు పనులకు రూ.1471 కోట్లను మం జూరు చేసి పనులు సైతం పూర్తి చేయడం జరి గిందని తెలిపారు. అభివృద్ది పనుల్లో భాగంగా మావల గ్రామపంచాయతీలో సీఆర్‌ఆర్ గ్రాం ట్ కింద చేపట్టిన పనులు ప్రారంభించారు.
7వ నెంబర్ జాతీయ రహదారి నుంచి సుభాష్‌నగర్ వరకు 1.17 కిలో మీటర్లతో రూ. 73 లక్షల వ్యయంతో, కేఆర్‌కే కాలనీలో 2.3 కిలో మీటర్ల మేర నిర్మించిన బీటీ రోడ్డు రూ.1.22 లక్షల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టడం జరి గిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుం దని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగి రి అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీలు ఉమాకాంత్ రెడ్డి, మెస్రం సంగీ త, రాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరె రాజ న్న, పీఆర్ ఈఈ, డీఈ రవిప్రకాష్, ఏఈ మనోహర్, అసిస్టెంట్ ఏఈ అనిల్‌రెడ్డి, పాల్గొన్నారు.