న్యూఢిల్లీ: దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ తెలిపారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా ఆయిల్ పామ్ సాగు నిర్వహిస్తున్న తాము ఈశాన్య రాష్ట్రాల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు యాదవ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా ఆయిల్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 5 వరకూ ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ సమావేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ది సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment