BS Ramulu
-
జీవితం.. గెలవడం కోసం!
సామాన్యుణ్ణి కేంద్రంగా చేసుకుని కొన్ని దశాబ్దాలుగా సాహిత్య సృష్టి చేస్తున్న రచ యిత బీఎస్ రాములు. పదిహేనేళ్ల ప్రాయంలోనే రాయడం ప్రారంభించారు. 1968లో ‘బాలమిత్ర’లో తొలి కథ వచ్చింది. విరసంలో చేరి ఎక్కువగా కథలపైనే దృష్టి పెట్టారు కానీ నవలలూ రాశారు. 1982లో ‘బతుకు పోరు’ తొలి నవల వెలువ డింది. బీడీ కార్మికుల జీవితాల్లోని వేదనలను, దోపిడీని ఉన్నదున్నట్లుగా, వారి భాష లోనే అద్భుతంగా చిత్రించిన నవల అది. ‘చూపు’, ‘జీవనయానం’ ఇతర నవలలు. ఇప్పటివరకూ 200 దాకా కథలు రాశారు.తెలంగాణ దృష్టితో, బీసీ దృష్టితో తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేయాలనే కొత్త చూపుతో బీఎస్ రచనా వ్యాసంగం సాగుతోంది. అట్లాగే సి. నారాయణ రెడ్డి కోరిక మేరకు ‘తెలంగాణ కథల్లో, నవలల్లో తెలంగాణ అస్తిత్వం’ అనే పుస్తకం రాశారు. ఒక టీవీ ఛానల్లో గొల్ల పూడి మారుతీరావు నిర్వహించిన ‘నూరేళ్ళ కథ’ శీర్షికలో బీఎస్ రాములు ‘బతుకు పయనం’ కథ పరిచయమైంది. ఒక బట్టలు నేసే పద్మశాలీ సామాజిక వర్గం నుండి ఒక యువ కుడు బీటెక్ చేసి, అమెరికాకు ఎట్లా పోగలిగాడో చెప్పే ఒక పరిణామాన్ని ఆవిష్కరించిన కథ అది. విశాలాంధ్ర వారి ‘నూరేళ్ళ తెలంగాణ కథ’ పుస్తకంలో ఆయన కథ ‘దక్షయజ్ఞం’ చోటు పొందింది.ఈ కథలో బీఎస్ విప్లవ విమర్శను లేవనెత్తారు. పైన పేర్కొన్న రెండు కథలూ భిన్న ధ్రువాల వంటివి. మొదట్లో తన జీవితంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్ళ గురించి రాశారు. ఆ తర్వాతి కథలన్నీ విప్లవానికి సంబంధించినవి. చివరగా ‘ఉద్యమం ఉద్యమం కోసం కాదు. జీవితం గెలవడం కోసం’ అనే మాటకు బలమిచ్చే కథలు రాశారు. విద్య ప్రాధాన్యం, విద్యావ్యవస్థ తీరు, కుటుంబ వ్యవస్థ పరిణామాలు, ప్రాజెక్టులు తెచ్చిన పరిణామాలు, అభివృద్ధి తెచ్చిన పరిణా మాలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి ఆయన కథా వస్తువులయ్యాయి. కమ్యూని జాన్ని భారతీయ సమాజ కోణంలో విశ్లేషించి, దేశ అవసరాలకు సరిపడే ప్రత్యా మ్నాయ మార్గాలను సూచించినవిగా బీఎస్ రాములు కథలు నిలుస్తాయి. – బి. నర్సన్, రచయిత, సాహితీ విశ్లేషకులు, 94401 28169 -
కూడు పెట్టే భాష కావాలి!
వచ్చే నెలలో స్కూళ్లు, పాఠాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక నుండి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు! దాంతో తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతీ పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా... సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ పేరిట ఆకలి తీర్చని భాషల్లో చదువు నెందుకు నేర్చుకోవాలి? ఆత్మగౌరవమీయని భాషా సంస్కృతులు; వివక్ష, అసమానతలకు నిలయమైన పురుషాధిపత్య సంస్కృతిని మనదనే పేరిట తలకెత్తుకోవాలా అని మరికొందరు విమర్శిస్తున్నారు. లోకంలో అనేక భాషలున్నాయి. అవన్నీ కాలగతిలో రూపొం దుతూ, మార్పు చెందుతూ ప్రస్తుత రీతిలో వాడకంలో ఉన్నాయి. ఎవరి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇతర భాషల వారితో మాట్లాడడానికి ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుండి 1970 నుండి లక్షలాది ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. భాష విషయంలో ఏదో రీతిలో అడ్జస్టయి పోయారు. బట్టల మిల్లుల్లో పని చేయడానికి 150 ఏళ్ల క్రితం వలసపోయిన తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్, భివండి వంటి మహారాష్ట్ర ప్రాంతాల్లో; అహమ్మద్ నగర్ వంటి గుజరాత్ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కున్నారు. ఆయా ప్రాంత భాషలను మాట్లాడుతూ ఉండటమే కాదు, తమ భాషా రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు. లోకంలో ఇట్లా అవసరా లను అనుసరించి అడ్జస్టయిపోతున్నారు జనం. ప్రజలు ఇలా బతుకుతుంటే భాషావాదులు బయల్దేరి మాతృభాషలోనే పాఠాలు ఉండాలి అంటుంటే... మరోవైపు ఇంగ్లిష్‌లో చదివితే ఎక్కడికి పోయినా ఉపాధి రంగంలో అవకాశాలు పెరుగుతాయనీ, పరస్పర వ్యక్తీకరణలో సౌలభ్యం పెరుగుతుందనీ అంటున్నారు మరికొందరు. ఈ వాదం వల్లనే కొన్ని రాష్ట్రాలలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం పెరిగింది కూడా! ఒక రాష్ట్రంలో వివిధ భాషలు మాతృ భాషలుగా కలిగిన సమూహాలు అనేకం ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజలు మాట్లాడే ఒకటి రెండు భాషల్లోనే పాఠ్య పుస్తకాలు ముద్రించి చదువులు చెబుతున్నారు. ఇలా చేస్తే మరి మిగిలిన సమూహాలు మాతృభాషలో చదువుకుంటున్నట్లే భావించాలా? మాతృ భాషలో ఎందుకు చదువుకోవాలట? అని అడిగితే ‘సంస్కృతీ పరిరక్షణ కోసమ’ని అంటారు. భాష మారితే సంస్కృతీ మారి పోతే ... అదేమి సంస్కృతి? అది విశ్వజనీన సంస్కృతి కానట్టే గదా అంటారు ఇంగ్లిష్ చదువులు కావాలనేవారు. కానీ, లక్షలాది మంది ఇంగ్లిష్‌లో విద్యాభ్యాసం చేసినందువల్లే ఉద్యోగాలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి. ఏ భాషనైనా బలవంతంగా రుద్దకూడదు. అవసరాలను బట్టి, భవిష్యత్ అవకాశాలను బట్టి ఎటువంటి భాషనైనా కష్టపడి నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్, సైన్సు, టెక్నాలజీ రంగాలలో అవకా శాలను అందిపుచ్చుకోవడానికీ, విదేశాలకు వెళ్లి మంచి ఉద్యో గాలు పొందడానికీ ఇంగ్లిష్ చదువులే ఉపయోగం అని స్పష్టమ వుతున్నది. ఈ వాస్తవాలను గుర్తించి మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ఇంగ్లిష్ మీడియం చదువులకు పెద్దపీట వేయడం అభినందనీయం. చివరిగా... మొక్కిన వరమీయని వేల్పును, ఎంత చదివినా ఉపాధి దొరకని చదువును గ్రక్కున విడువంగ వలయు... ఏమంటే నేడు కూడా కోటి విద్యలు కూటి కొరకే! కూడు పెట్టని చదువులెందుకు? ముసుగులో గుద్దులాటలెందుకు? అంటున్న తరానికి పరిష్కారాలు అవసరం! వ్యాసకర్త: బి.ఎస్. రాములు సామాజిక తత్వవేత్త మొబైల్: 83319 66987 -
జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు
సాక్షి, బోధన్: రాష్ట్రంలో తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులను పరిగణంలోకి తీసుకుని ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. కుళ్లె కడిగి కులస్తులు తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో శుక్రవారం బోధన్ మండలంలోని తగ్గెల్లి, పెంటా కుర్దు గ్రామాల్లో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పర్యటించి కుళ్లెకడిగె కులస్తుల స్థితిగతులను పరిశీలించారు. వారి జీవన విధా నం, వారు నిర్వహిస్తున్న వృత్తులు, ఆర్థిక పరిస్థితు లు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2009 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ప్రక్రియ ఆగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కమిషన్లనను పునరుద్ధరించినందున కులాల ను మార్చాలని, బీసీ కులాల్లోకి తమను తీసుకోవాలని కోరే ప్రజల నుంచి విజ్ఞప్తులు, దరఖాస్తు లు తీసుకుని వారికి న్యాయం చేయ్యడానికి బీసీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 70 కులాలకు చెందిన ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 20 కులాల నుంచి విజ్ఞప్తులు అందయని వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు మొదటి విడతలో ఆయా కులాలను తమ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించామని, రెండో దశలో వారికి సంబంధించిన సమాచారం సేకరించామని, మూ డో దశలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ప రిశీలన చేస్తున్నామని అందులో భాగంగా బోధన్ మండలంలోని పెంటాకుర్దు, తగ్గెల్లి గ్రామాల్లో కుల్లె కడిగి కులస్తుల వివరాలు, వారి జీవన శైలి పరిశీలించి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం, బీసీ కమిషన్ పూర్తి పరిశీలన అనంతరం వారిని ఏ కులం, ఏ కేటగిరిలో చేర్చా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో గోపిరాం, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్ ము జీబ్, ఆర్.సాయిలు, సీఐ షకీల్ అలీ, ఎస్సై యా కుబ్, కుల్లె కడిగి కులస్తుల పెద్దలు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. జీవన, అర్థిక స్థితిగతుల పరిశీలన వర్ని(బాన్సువాడ): చిట్టెపు కులస్తుల జీవన, అర్థిక పరిస్థితులపై మండలంలోని జాకోరా గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ బి.ఎస్.రాములు అధ్యయనం చేశారు. గతంలో తమను బీసీ జాబితాలో చేర్చి జీవన స్థితిగతులను మెరుగు పర్చాలని చిట్టెపు కులస్థులు పలుమార్లు వినతిపత్రాలు అందచేశారు. ఈ నేపథ్యంలోలో తొలుత గ్రామ పంచాయతీ వద్ద చిట్టెపు కులస్థులతో బీసీ కమిషన్ చైర్మెన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్లకు వెళ్లి జీవన విధానం, ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు, చేస్తున్న వృత్తి, వస్తున్న ఆదాయం వివరాలు తెల్సుకున్నారు. పిల్లలను చదివించాలని సూచించారు. చిన్నప్పుడు తాను బీడీలు చు ట్టానని చైర్మన్ చెప్పడం విశేషం. అనంతరం ఆ యన మాట్లాడుతూ చిట్టెపు కులానికి చెందిన కు టుంబాలకు విద్యా, సంక్షేమ పథకాలలో ఎలాం టి ఫలితం ఉండడం లేదని, బీసీ జాబితాలో చే ర్చాలని వినతిపత్రాలు ఇచ్చిన నేపద్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని పేర్కొన్నారు. చైర్మన్ వెంట బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శంకర్, బోధన్ ఆర్డీవో గోపిరాం, తహసీల్దార్ నా రాయణ, వీఆర్వో అశోక్, చిట్టెపు కుల సంఘం జిల్లా కార్యదర్శి నాందేవ్, జాకోరా సర్పంచ్ గోదావరిగణేష్, మాజీ ఎంపీటీసీ కలాల్గిరి ఉన్నారు. కలెక్టర్, సీపీలకు అభినందన ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దఎత్తున అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ సమర్ధవంతంగా పనిపూర్తి చేసినందు కు కలెక్టర్ రామ్మోహన్రావు, సీపీ కార్తికేయను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అభినందించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తమను బీసీ కులంలోకి మార్చాలని కోరిన ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణం గా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నా రు. జిల్లాకు సంబంధించి విషయాలపై ఇరువు రు కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జ రిగిన పలు ఎన్నికలను విజయవం తంగా నిర్వహించినందుకు కలెక్టర్, సీపీలను అభినందించారు. ముఖ్యంగా ఇరువురినీ అభినందించా రు. గెస్ట్‌హౌస్‌లో పలు కులాలకు చెందిన సభ్యుల నుంచి విన్నపాలు స్వీకరిచారు. -
బీసీల్లోకి కొత్త కులాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లో (బీసీ)కి మరిన్ని కొత్త కులాలు చేరబోతున్నాయి. ఈ దిశగా బీసీ కమిషన్ చర్యలు చేపట్టింది. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కొత్త కులాల చేరికపై పరిశీలన నివేదిక రూపొందించిన బీసీ కమిషన్ అప్పట్లో ఆయా కులాల నుంచి వినతులు, సూచనలు, సలహాలు స్వీకరించింది. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం క్షేత్ర పరిశీలన నిర్వహించాలనుకుంటున్న సందర్భంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ పూర్తికావడంతో బీసీ కమిషన్ తిరిగి పరిశీలన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మరోమారు ఆయా కులాల నుంచి సూచనలు, వినతులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ వరకు వినతులను స్వీకరించనుంది. అనంతరం ఈనెల 11వ తేదీ వరకు నిర్దేశిత కులాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు లిఖిత పూర్వక ఆధారాలు, డాక్యుమెంటరీలు తదితరాలను స్వీకరిస్తుంది. ఇప్పటివరకు 22 కులాలకు చెందిన ప్రతినిధులు వినతులు, సలహాలు, సూచనలు సమర్పించారు. ఆర్థిక స్థితిగతులే ప్రామాణింకంగా బీసీ కేటగిరీల్లో కొత్త కులాల చేర్పు అంశంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో భాగంగా నిర్దేశిత కులాల్లోని ప్రజల జీవన విధానంతో పాటు వారి ఆర్థికస్థితులను పరిశీలిస్తారు. అదేవిధంగా కుల జనాభాలోని వ్యక్తుల వయసు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యను సైతం పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రత్యక్షంగా పరిశీలించి విచారణ చేపడతారు. ఈనెల రెండో వారంనుంచి క్షేత్రపరిశీలన చేపట్టేందుకు బీసీ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. పురపాలిక ఎన్నికల కోడ్ రాకముందే విచారణ పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈమేరకు చర్యలను చకచకా పూర్తి చేస్తోంది. మొత్తంగా రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి పరిశీలన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఆ కులాల జనాభా గరిష్టంగా 2లక్షలే ‘బీసీ కులాల్లోకి కొత్తగా 30 కులాల చేర్పుపై పరిశీలన చేపట్టాం. ఈ కులాల మొత్తం జనాభా గరిష్టంగా 2లక్షలే. కొన్ని కులాల జనాభా 200–500 మాత్రమే ఉంది. అతి తక్కువ జనాభా ఉండడం, వీరికి గుర్తింపు లేకపోవడంతో ఈ కులాలన్నీ ఇప్పటికీ నిరాదరణకు గురయ్యాయి. ప్రస్తుతం మా కమిషన్ ద్వారా చేపడుతున్న పరిశీలనతో ఈ కులాలన్నింటికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కులాలన్నీ చాలా వెనుకబాటుకు గురయ్యాయి. వీటికి ఆదరణ అవసరం. ఇప్పటివరకు చేపట్టిన ప్రాథమిక పరిశీలనలో ఈ కులాల నుంచి పెద్దగా విద్యావంతులు లేరు. ఉద్యోగవంతులూ లేరు. కనీసం ఆర్థికంగా ఎదిగిన వారు సైతం లేరు. కొన్ని కులాల్లో కనీసం పదో తరగతి సైతం చదవలేదు. ప్రధాన కారణం రిజర్వేషన్లు లేకపోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కలగకపోవడం, జనరల్ కేటగిరీలో పోటీపడే సత్తా లేక పోవడంతో వెనుకబాటుకు గురయ్యారు. రెండు నెలల్లో కులాల చేర్పు పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ కులాలకు ఆర్థిక, సామాజికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది’ – బీఎస్ రాములు, బీసీ కమిషన్ చైర్మన్ బీసీల్లోకి చేర్చాలని భావిస్తున్న కులాలు .బీసీల్లో 112 కులాలే ఉండగా.. అనాథలను సైతం చేర్చడంతో ఈ సంఖ్య 113కి పెరిగింది. వీటికి అదనంగా కాకి పగ డాల, మందెచ్చుల,బత్తిన, కుల్ల కడగి, సన్నాయోల్లు/బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజి కూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు కమిషన్ పరిశీలన చేస్తోంది. -
‘దేశానికి దిక్సూచి తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే అభివృద్ధి నమూనాగా నిలిచాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘దేశానికి దిక్సూచి తెలంగాణ’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఎస్ రాములు బహుగ్రంథ రచయిత అని, తెలంగాణ సిద్ధాంత భావజాలంతో ఆయన అనేక పుస్తకాలు రచించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన రచనల్లో గొప్పగా విశ్లేషించారని కొనియాడారు. కాగా, రాములు రచనపై కర్రె సదాశివ్ రచించిన ‘బీఎస్ రాములు సాహిత్యం–సమగ్ర పరిశీలన’అనే మరో పుస్తకాన్ని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు
మిరుమిట్లు గొలుపుతూ ప్రపంచానికి వెలుగులు అందించిన చేనేత.. జౌళిమిల్లుల విస్తరణతో గుడ్డికాయ పట్టింది. మసిబారుతూ వచ్చింది. చేనేత నిపుణులే వృత్తి వదిలి బట్టల మిల్లు కార్మికులుగా వలసపోవలసి వచ్చింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ ఉపాధి కల్పించిన రంగంగా చేనేత శతాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం చేనేత వృత్తి సామాజిక వర్గాలు ఆ వృత్తినుంచి వైదొలగి ఇతర వృత్తుల్లో చేరిపోయారు. చేనేత వృత్తి కులాల జనాభాలో ఐదు, ఆరు శాతం మాత్రమే చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ప్రజల మనస్సుల్లో చేనేతపట్ల ఆదరణ పెరగడం. ఎంత ధర అయినా పట్టు బట్టలు, గార్మెంట్స్, రెడీమేడ్, సూటింగ్స్ కొంటున్నట్లుగా చేనేతను ప్రతిష్టాత్మకంగా కొనే స్థితి పెరగాలి. స్వయం పోషకంగా ఎదగడానికి ప్రభుత్వం నుండి అనేక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికగా అందించడం అవసరం. చేనేత కోసం కొన్ని రకాలను ప్రత్యేకంగా కేటాయిం చడం, దాన్ని పవర్‌లూమ్‌లు, బట్టలమిల్లులు ఉత్పత్తి చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం మరొక కార్యక్రమం. చాలాకాలం నుండి బట్టలపై ప్రభుత్వం రిబేటు ఇవ్వడం ద్వారా సహకరించే కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దీని ద్వారా దొంగ లెక్కలు రాసి, ఉత్పత్తి, మార్కెట్, అమ్మకాలు లేకుండానే కాగితాలపై వాటన్నిటిని సృష్టించి భోంచేసే యంత్రాంగం పెరుగుతూ వచ్చింది. పైగా సహకార రంగంలో ఉన్న మగ్గాలు నాలుగింట ఒకటవ వంతు మాత్రమే. మిగతా మూడు వంతుల నేత కార్మికులకు ఆ సౌకర్యం కూడా అందేది కాదు. అందువల్ల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ప్రావిడెంట్ ఫండ్, జియో ట్యాగింగ్ వంటి వాటిని అనుసంధానించి పక్కాగా ప్రత్యక్షంగా చేనేత వృత్తివారికి లాభం కలిగించడం అవసరం. తిరిగి చేనేత అభివృద్ధికి కొత్త దృక్పథం అవసరమవుతున్నది. చిరిగిన బట్టలను, చింపుకుని బట్టలను వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఎంత చినిగితే అంత ఫ్యాషన్. అలా జీన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా ఒక ఫ్యాషన్‌గా చేనేతను అందరికీ ఆకర్షణీయంగా మార్చినపుడే దాని మార్కెట్, ప్రాచుర్యం పెరుగుతుంది. పట్టుచీర కట్టుకోవడం ఒక సామాజిక గౌరవం. ఖాదీ బట్టలు వేసుకోవడం ఒక సామాజిక గౌరవం. అలాగే సూటు వేసుకోవడం సామాజిక గౌరవాన్ని తెలుపుతుంది. ఈ విధంగా ఆలోచించి చేనేతను ఒక ఫ్యాషన్‌గా, ఒక సామాజిక గౌరవానికి ప్రతిష్టగా మార్చే కృషి చేయడం అవసరం. చేనేతలో కాళ్ళతో తొక్కడంగానీ, చేతులతో షట్టర్ కొట్టడంగానీ ప్రతిసారీ 25 కిలోల బరువును మోయడం, నెట్టడం జరుగుతున్నది. ఎని మిది, పది గంటలు ప్రతిసారీ 25 కిలోల బరువు నెట్టడం అనే పరిశ్రమ చేనేత కార్మికులను, వారి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, దేహదారుఢ్యాన్ని దెబ్బతీస్తున్నది. చీరలకు అంచులు, డిజైన్లు, కొంగులు ప్రత్యేకంగా రూపొందించడానికి పింజర అవసరం పడుతుంది. ఈ పింజర తిరగడానికి 25 కిలోలకు తోడుగా మరో పది కిలోల బరువు చేతులు, కాళ్ళపై పడుతున్నది. అందువల్ల ఈ బరువును కుట్టుమిషన్ మోటార్వలె హాఫ్ హెచ్‌పీ మోటారు బిగించి చేనేత కార్మికులకు బరువు, భారం తగ్గించడం చేయవచ్చు. దీనికి తోడు ప్రభుత్వం పత్తిని సేకరించి నూలు వడికించి, ఆ నూలును చేనేత కార్మికులకు అందించే ఒక సమగ్ర కార్యక్రమ రూపకల్పన కలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలను నివారించవచ్చు. సబ్సిడీ ఇవ్వడంలో భాగంగా గతంలో అనేక పర్యాయాలు ప్రతిపాదించిన ప్రతిపాదనను ఇప్పటికైనా ఆచరణలో తీసుకోవడం అవసరం. చేనేత రంగానికి సబ్సిడీతోపాటు చేనేత వృత్తివారికి వంద రోజుల పనికల్పనతో పని కల్పించి ఆ ఉత్పత్తులను సేకరించి ఆయా పండుగల్లో ప్రజలకు ఉచి తంగా గానీ, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్ధులకు అందించడం ద్వారా ఒకేసారి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా ప్రభుత్వం ఏటా ఇవ్వదలచుకున్న గ్రాంట్లు, సబ్సిడీలు తిరిగి చేనేత కార్మికులకే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా దాని ప్రయోజనం అందే విధంగా పథకాలను రూపొందించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం నిజంగానే నూతన చరిత్ర సృష్టించడానికి మార్గం వేస్తుంది. (నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా) బి.ఎస్.రాములు వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్ ‘ 83319 66987 -
మీ సర్వేలెలా ఉన్నాయ్..?
కర్ణాటకలో పర్యటిస్తున్న బీసీ కమిషన్ బృందం సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, ఎంబీసీ కులాల అధ్యయనాన్ని బీసీ కమిషన్ వేగవంతం చేసింది. ఆర్నెల్లలో రిజర్వేషన్లు, ఎంబీసీ కులాలపై స్పష్టతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఓవైపు వినతులు స్వీకరిస్తూనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో సర్వే తీరును అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు నేతృత్వంలోని సభ్యుల బృందం సోమవారం కర్ణాటకలో పర్యటించింది. అక్కడ బీసీ రిజర్వేషన్లపై చేసిన సర్వేకు సంబంధించి ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ హెచ్ కాంతరాజ్, సభ్యులు కేఎన్ లింగప్ప, గురులింగయ్య, ధర్మరాజులతో సోమవారం సమావేశమైంది. ఆరు గంటల పాటు చర్చించిన సభ్యులు.. సర్వే ప్రక్రియలో ఎదురైన అవాంతరాలు, న్యాయపర సమస్యలు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. కర్ణాటకకు వెళ్లిన బృందంలో వకులాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ ఉన్నారు. -
‘బీసీల ఆరోగ్య ప్రమాణాలపై నివేదికివ్వండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీల ఆరోగ్య ప్రమాణాలు, మహిళలు, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై విశ్లేషణాత్మక నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు వైద్యారోగ్య శాఖను కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అధ్యయనంలో భాగంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న బీసీ కమిషన్.. శనివారం వైద్యారోగ్య శాఖతో సమావేశమైంది. ఈ సందర్భంగా బీఎస్ రాములు మాట్లాడుతూ.. బీసీల స్థితిగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓసీ జాబితాలోని సామాజిక వర్గాల ఆరోగ్య ప్రమాణాల్లోని వ్యత్యాసాలను కూడా పేర్కొనాలన్నారు. ప్రస్తుత అభివృద్ధి, నూతన నైపుణ్యాలను బీసీలలోని కొన్ని కులాలు అందుకోలేక పోతున్నాయని, ఆ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంబీసీలు, సంచార జాతులపైనా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. -
బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!
♦ ‘సాక్షి’తో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ♦ జనాభా ప్రాతిపదికన అంటే 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది ♦ బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాల్సి ఉంటుంది ♦ ప్రస్తుతం బీసీలకు కేటాయింపు 27%గా ఉన్నా లబ్ధి పొందుతున్నది 11% ♦ పలు కులాలు అత్యధికంగా లబ్ధిపొందాయనే అభిప్రాయముంది ♦ వాటికి ప్రాధాన్యం తగ్గించేలా ప్రతిపాదనలు ఉంటాయి ♦ కొన్ని ఆదివాసీ కులాలకూ తాత్కాలికంగా బీసీల్లో చోటు ♦ దీంతో బీసీ వర్గీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయి ♦ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక నమూనా.. 6 నెలల్లో నివేదిక ఇస్తాం ♦ తమ అధ్యయనంలో ఎంబీసీలపైనా స్పష్టత వస్తుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్ అధ్యయ నాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వంలోని ప్రతిశాఖతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో కులాల వారీగా ఉన్న బీసీ ఉద్యోగులు, ఆయా శాఖల పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నవారి సంఖ్యపై పరిశీలన జరుపుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసేం దుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్ర వారం బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తమ అధ్యయనం వివరాలను ‘సాక్షి’కి వెల్ల డించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కులాలపై సమగ్ర అధ్యయనం.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండడం మంచిదే. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం బీసీల సమగ్ర అధ్యయనానికి ఆదేశించింది. బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణలోని కులాలపై సమగ్ర అధ్యయనం చేస్తాం. జీవన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం, సమాజంలో వివక్ష తదితర అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, సంపద పెరిగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. ఆరు నెలల్లో మా నివేదిక సమర్పిస్తాం. ప్రత్యేక కార్యాచరణతో.. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక కార్యచ రణ రూపొందిస్తున్నాం. వివరాలు సేకరిం చేందుకు 8 పేజీలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. దాన్ని నాలుగు పేజీలకు కుదించి, అన్ని వివరాలు వచ్చేలా కొత్త నమూనా తయారు చేస్తున్నాం. ప్రతి కుటుం బంలో వయసు వారీగా సభ్యులు, వారిలో నైపుణ్యాలు, ప్రభు త్వ పథకాల లబ్ధి, ఉద్యో గాలు, నిరుద్యోగం, జీవన స్థితిగతులు, కులవృత్తులు తదితర విధాలుగా పరిశీలన చేస్తాం. ఎంబీసీల జాబితా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొ రేషన్ ఏర్పాటు చేసింది. దాని పరిధిలోకి వచ్చే కులాల జాబితా కూడా సిద్ధం చేస్తాం. కానీ ఇది కేవలం ఆర్థిక చేయూతనిచ్చే పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకుంటాం అధ్యయనంలో భాగంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావు లు, కవులు, కళాకారులు, యువజన సంఘాలు, సామాన్యుల నుంచి వినతు లు తీసుకునేందుకు ప్రత్యే కంగా సమయం కేటాయి స్తాం. ఆన్లైన్ విధానం లోనూ వినతులు తీసుకు నేలా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి కులానికి 10 పేజీ లతో మొత్తంగా 1,500 పేజీల నివేదిక ఇవ్వాలని యోచిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులతోనే.. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వ హించి, పూర్తి వివరాలు సేకరించింది. కానీ నిబంధ నల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జనాభా లెక్కల విభాగానికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సమగ్ర సర్వే వివరాలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం కేటగిరీల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయి. దీంతో కులాల వారీగా వివ రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. 2011 జనగణ న ఆధారంగా పరిశీలన చేపట్టాలని భావిస్తున్నాం. 85 శాతానికి చేరుతాయి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. ప్రస్తుతం 4 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నాం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు ఉన్నారు. అందులో బీసీలు 52 శాతం నుంచి 55 శాతం వరకు ఉన్నట్లు అంచనా. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేపడితే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా పరిశీలన పూర్తయితే రిజర్వేషన్లు ఏమేరకు ఇవ్వాలో స్పష్టత వస్తుంది. కేంద్రం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. వాస్తవంగా 11 శాతం బీసీలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. ఇతర కులాలు ఆ వాటాను దక్కించుకుంటున్నాయి. లబ్ధి పొందిన కులాలు కింది వరుసలోకి.. వెనుకబడిన తరగతుల్లో 113 కులాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 కులాలు అత్యధికంగా లబ్ధి పొందాయనే అభిప్రాయా లున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేస్తాం. అత్యధికంగా లబ్ధి పొంది నట్లు గుర్తిస్తే.. ఆ కులాలను కిందవరుసలో చేర్చుతాం. వాస్తవానికి ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. బీసీల్లోనే ఉంచుతూ ప్రాధాన్యతను తగ్గించాలని యోచిస్తున్నాం. మరోవైపు కొన్ని ఆదివాసీ కులాలు ఏ జాబితా లోనూ నమోదు కాలేదు. వారిని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడం దీర్ఘకాల ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. అందువల్ల అలాంటి కులాలను బీసీల్లో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్గీకరణలోనూ మార్పులు చేర్పులు జరుగుతాయి. -
ముస్లిం రిజర్వేషన్ల విచారణ పొడిగింపు
బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లిం,బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందు కు తలపెట్టిన బహిరంగ విచారణ కార్య క్రమాన్ని రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కూడా కార్యాలయంలో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించి వాదనలు వింటామన్నారు. శనివారంతో గడువు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయంతీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం బీసీ కమిషన్ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 13,780 వినతులు వచ్చాయన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని పరిగణించి అత్యుత్తమ రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు వకులాభరణం క్రిష్ణమోహన్, ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి జీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల్లో చైతన్యం కల్పిస్తాం..
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ రాములు హన్మకొండ అర్బన్: అలెగ్జాండర్, ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో బీసీల్లో చైతన్యాన్ని నింపేలా బాటలు వేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. వారికి వ్యక్తిత్వ వికాసం కల్పించి జ్ఞానమార్గం చూపిస్తామని అన్నారు. కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలసి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్ధేశించిన ప్రకారం రాష్ట్రంలో బీసీల ఆర్థిక స్థితిగతులు, కుల వృత్తులపై 3 నెలల పాటు అధ్యయనం చేసి వెరుు్య పేజీలకు తగ్గకుండా నివేదిక ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలను నిరాశ, నిస్పృహల నుంచి విముక్తులను చేయడమే కమిషన్ లక్ష్యమన్నారు. ప్రతీ గ్రామం, కుటుంబం, వ్యక్తికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలపై నివేదిక ఇస్తామన్నారు. ఆధునిక పరిజ్ఞానం అందు బాటులోకి రావడంతో కుల వృత్తులకు కాలం చెల్లిందన్నారు. లాభసాటిగా ఉండే ఏ వృత్తిని అరుునా ఇతర కులాలు స్వీకరిస్తాయని.. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తామని రాములు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోందని, ఉపకారవేతనాలు, విదేశీ చదువులకు రుణాలు, బ్యాంకుల ద్వారా రుణాలు, ఆసరా పెన్షన్లు వంటివి ఇందులో ఉన్నాయని బీఎస్.రాములు అన్నారు. అరుుతే, ఆయా పథకాలు అర్హులకు ఏ మేరకు చేరుతున్నాయన్న విషయంలో అధ్యయనం చేస్తామని తెలిపారు. తమకు వందల సంఖ్యలో వినతులు అందాయని, వాటిని పరిశీలించి అవసరం ఉన్నవాటిని నివేదికలో పొందుపరుస్తామని తెలిపారు. -
మార్పు కోసమే బీసీ కమిషన్: ఈటల
⇒ కొన్ని వర్గాలు అధర్మ పద్దతిలో అటుఇటు అయ్యాయి ⇒ బీఎస్ రాములు కమిషన్ వాటన్నిటినీ క్రమ పద్ధతిలోకి మార్చాలి ⇒ బీసీ కులాలపై పూర్తిస్థాయిలో అద్యయనం చేయాలి ⇒ అన్ని వర్గాల ప్రజల అభివద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఈటల హైదరాబాద్: వెనుకబడిన వర్గాల స్థితిగతులు మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశకంర్ గురువారం రవీంద్రభారతిలో శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో బీసీ కులాల పరిస్థితులను అధ్యయనం చేసి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా నివేదిక సమర్పించాలని కమిషన్ బృందానికి సూచించారు. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, కానీ ఇప్పటివరకు ఈ జనాభాపై స్పష్టమైన అంకెను తేల్చలేకపోవడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లను మాజీ న్యాయమూర్తులచే ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇచ్చిన నివేదికలతో ఇప్పటికీ బీసీల్లో మార్పులు రాలేదన్నారు. బీఎస్ రాములు కమిషన్ ద్వారా బీసీ కులాలకు న్యాయం జరగాలని, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు తెలిపారు. యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహించేందుకు ఏకంగా 80శాతం రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యల్ని వీలైనంత త్వరగా అధిగమించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెస్తామని, ఒక్కో పాఠశాలలో 6 వందలకు పైగా పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీసీ కమిషన్‌లో ఇతర అణగారిన కులాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలని ఎంపీ వివేక్ మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మధు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయాలని, ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల 2 రోజుల శిక్షణ తరగతుల్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ బీసీ విద్యానిధి పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఈ పథకం కింద అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశంకర్‌లు మంత్రితో భేటి అయ్యారు. -
తెలంగాణ బీసీ కమిషన్ నియామకం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బీసీ కమిషన్‌ను నియమించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను శనివారం అధికారికంగా ప్రకటించారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా ప్రముఖ సామాజిక వేత్త బీఎస్ రాములును నియమించారు. ప్రముఖ రచయిత జూలురు గౌరీశంకర్, డా.ఆంజనేయులు గౌడ్, వకుళా భరణం కృష్ణమోహన్ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. బీసీ కమిషన్ పదవీకాలం మూడేళ్లగా నిర్ణయించారు. రాష్ట్రంలో బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కమిషన్ పనిచేస్తుంది. త్వరలో కమిషన్ చైర్మన్, సభ్యులు బాధ్యతలను స్వీకరించనున్నారు. -
విశ్వ మహామేధావి బి.ఆర్. అంబేద్కర్
సందర్భం ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒకరు. భారతీయ సమా జాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాల ను చర్చించారు. అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. వాటన్నిటిలోని మౌలికాంశాలను పరి చయం చేస్తూ వ్యాఖ్యానించే సంపుటాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్ సమగ్ర అధ్యయనం సాగలేదు. మరోవైపు మార్క్సిజం సిద్ధాంతాలను ముందుకు నెట్టి అంబేడ్కర్ అర్థశాస్త్ర అధ్యయనాన్ని, అది అస లు ఉందనే విషయం కూడా తెలియకుండా దశా బ్దాలు గడిపేశారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, గాంధీ, నెహ్రూల ఆర్థిక సామాజిక, రాజ కీయ సిద్ధాంతాలతో అంబేడ్కర్ రచన లను తులనాత్మక అధ్యయనం చేసిన ప్పుడు.. భారతీయ సమాజాన్ని పట్టిం చుకుని దాని అభివృద్ధి కోసం నిరంత రం పలవరించిన వారిలో అంబేడ్కర్ తప్ప మరొక జాతీయ నాయకులెవరైనా ఉన్నారా? అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే అంబే డ్కర్ లాగా మన సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి, గ్రంథస్థం చేసినవారు మరెవరూ లేరు. అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంప దగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉం దని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు బౌద్ధం మరొక మార్గమని ఆచరించి చూపారు. ప్రజాస్వామిక సం స్కృతికి హిందూ మతం, హిందూ సం స్కృతి, మహమ్మదీయ మతం, ఇస్లాం సంస్కృతి పనికిరావని బౌద్ధ సంస్కృతే అందుకు మార్గమని స్పష్టం చేశారు. పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు, మా ర్క్స్, లెనిన్, మావో మొదలైన మార్క్సి స్టులు అర్థశాస్త్రానికి, మతానికి, కులానికి, భావజా లానికి, సామాజికాభివృద్ధికి మధ్య సంబంధం ఉం దని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయని లోతు గా విశ్లేషించలేదు. భారతీయ మార్క్సిస్టు విశ్లేషణలో వర్గం అనే పదంతోనే రాజకీయాలు, ఉద్యమాలు నడిపించారు. మార్క్స్, ఎంగెల్స్‌లు మతం వ్యక్తిగత విషయం అని వదిలేసినట్టు, భారతదేశంలో మార్క్సిస్టులు, కులాన్ని కూడా మతం లాగే వ్యక్తిగత విషయమని వదిలేశారు. తద్వారా ఆధిపత్యంలో ఉన్నవారే సామాజిక, రాజకీయ నాయకత్వంగా ఎదిగే క్రమం కొనసాగుతూ వచ్చింది. స్త్రీవాదులు వ్యక్తిగతమైనదంతా సామాజికమై నదే, రాజకీయమైనదే అని నిర్ధారించారు. అయిన ప్పటికీ ఇప్పటికీ వాళ్లు కులాన్ని, మతాన్ని సామా జిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యగా పట్టించుకోలేదు. అంబేడ్కర్ వీరికి భిన్నంగా కులం, మతం, జెండర్, భావజాలం జీవితంలో నిర్వహి స్తున్న పాత్రను పట్టించుకుని వాటికి వ్యతిరేకంగా వేల పేజీల గ్రంథాలను వెలువరించారు. మార్క్సి స్టులు, పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పని చేయడం లేదు. పైగా ఆ పని చేయడం ప్రధాన అం శాలను పక్కదారి పట్టిస్తుందని ప్రచారం చేశారు. నిజానికి ఇవే ప్రధాన అంశాలని అంబేడ్కర్ జీవిత మంతా స్పష్టం చేస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య విధానాల్లో బహుళ పార్టీ వ్యవస్థలో ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల సంక్షేమాన్ని సామాజి కాభివృద్ధిని సాధించే అర్థశాస్త్రాన్ని అంబేడ్కర్ కలగ న్నాడు. ఆయన రచనల్లో పరుచుకుని ఉన్న అర్థశాస్త్ర అంశాలను ఒకచోట క్రోడీకరించి, సంశ్లేషించి అంబే డ్కరిస్టు అర్థశాస్త్రాన్ని రూపొందించి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం అవసరం. (నేడు డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి) (వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, హైదరాబాద్, మొబైల్: 83319 66987) -
చక్రపాణి.. విజయవాణి!
జన్మనిచ్చిన ఊరిని ప్రాజెక్ట్ మాయం చేసేసింది. అన్నం పెట్టిన పొలమూ అందులోనే కలసి‘పోయింది.’ చదువూ వెక్కిరించే ప్రయత్నం చేసింది. మెడిసిన్ సీటు ఊరించి... ఉసూరుమనిపించింది. ఉన్న ఊరిని వదిలి మరో చోటుకు వెళితే... అక్కడి పరిస్థితులు ‘దూరంగా వెళ్లిపోమని’ సలహా ఇచ్చాయి. కుటుంబం.. తల్లిదండ్రులు.. బాధ్యతను గుర్తు చేశాయి.. సాధారణంగా ఎవరికైనా ఇలాంటి స్థితి ఎదురైతే ఈ ముళ్లబాటలో ముందుకెళ్లలేమని ఆగిపోతారు. క్రుంగిపోతారు. కానీ ఆయన హాస్టల్‌ను అమ్మ ఒడిగా మలుచుకున్నారు. అక్షరాలను ఆసరాగా చేసుకున్నారు. ‘దూరంగా వెళ్లిపొమ్మని’ చెప్పిన పరిస్థితులను ఎదగడానికి బాటగా చేసుకున్నారు. వైద్య శాస్త్రం తనను వద్దనుకుంటే.. సామాజిక శాస్త్రాన్ని అస్త్రంగా అందుకున్నారు. అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఆయనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు ఆ ఊరు లేదు. కానీ ఒకప్పుడు కరీంనగర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉండేది యాష్వాడ. చిన్న పల్లెటూరు. మానేరు డ్యామ్ నిర్మాణంలో మాయమైన 18 ఊళ్లలో అదొకటి. ఊరు మాయమైనట్లే అక్కడ పుట్టి పెరిగిన ఎంతోమంది అస్తిత్వమూ ప్రశ్నార్థకమైంది. సరిగ్గా అక్కడ మొదలైన జీవన పోరాటం... సంఘర్షణ... కోట్లాది తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాట ప్రతీకై... ఆత్మగౌరవ పతాకై ఎగసింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను సమున్నతంగా ఆవిష్కరించింది. ఒక గొంతుకై నిలిచింది. ఆ గొంతు ప్రొఫెసర్ చక్రపాణిది. ఆ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, సామాజిక, రాజకీయ విశ్లేషకుడుగా మాత్రమే తెలిసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఇంకో మెట్టు ఎక్కారు. ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న ఆ ఊళ్లో కిరోసిన్ దీపం గుడ్డి వెలుతురులో అక్షరాలు దిద్దుకున్నారు. బతకడమే పోరాటమైన చోట చదువూ భారమైంది. సంక్షేమ హాస్టల్ ఆదుకొని ఒడ్డున చేర్చింది. ఎక్కడ చేజారిపోతుందోననుకున్న విద్యను గట్టెక్కించింది. అలా ఒక్కో మెట్టూ పెకైక్కారు. టీపీఎస్సీ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. తన అనుభవాలను... అంతరంగాన్ని ‘సాక్షి’ వద్ద ఆవిష్కరించారు. అందని వైద్య విద్య... చరిత్ర, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్స్ అంటే పెద్దగా ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ తమ్ముడిని మెడిసిన్ చదివించాలనుకున్న అన్నయ్య సత్యనారాయణ కోరిక మేరకు బైపీసీలో చేరారు. ఇష్టం లేకపోయినా కష్టపడి చదివారు. ఎంసెట్ రాశారు. తనకు మెడిసిన్‌లో సీటొచ్చిందన్న సంగతి ఆరు నెలల తరువాత తెలిసింది. దాని కోసం పెద్ద న్యాయపోరాటమే చేయవలసి వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో మరో విషయం గుర్తించారు. ఆర్థిక భారంతో కూడిన మెడిసిన్ కంటే టీచర్ ఉద్యోగమే మంచిదనుకున్నారు. టీటీసీ రాశారు. 1985లో ధ ర్మారం మండలం బొమ్మారెడ్డి పల్లెలో రూ.398 వేతనంతో ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ రోజుల్లోనే కరీంనగర్లో ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రికలో పాత్రికేయుడిగా ప్రవేశించారు. అల్లం నారాయణ, నరేందర్, కేఎన్ చారి, మరికొందరు మిత్రులతో కలిసి ‘జీవగడ్డ’ విలేకరిగా విధి నిర్వహణ. అప్పటికే తెలంగాణ సమాజం ఒక భయానకమైన పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. నక్సలైట్ ఉద్యమాలతో అప్పటి యువత బాగా ప్రభావితమవుతోంది. ఆ ప్రభావం చక్రపాణిపైనా ఉంది. అదే సమయంలో మార్క్సిజంపైకి దృష్టి మళ్లింది. రెండు, మూడేళ్ల పాటు బాగా అధ్యయనం చేశారు. టీచర్‌గా కంటే విలేకరిగా పని చేయడమే తనకు ఎంతో సంతృప్తినిచ్చింది. 1987 నాటికి కరీంనగర్లో నిర్బంధం మరింత తీవ్రమైంది. ఆ పరిస్థితుల్లో స్నేహితుల సలహా మేరకు కరీంనగర్‌ను వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. సామాజిక ఉద్యమ పథం బ్రెజిల్లో 2003లో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరమ్, ఇట లీలోని యూరోపియన్ సోషల్ ఫోరమ్‌తో పాటు, లెఫ్ట్ థింకర్స్ సారథ్యంలో అమెరికాలో స్థాపించిన ‘న్యూ స్కూల్’ విశ్వవిద్యాలయంలో ‘ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, చైనా సోషలిజంలో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై పరిశోధనాత్మక అధ్యయనం గొప్ప సంతృప్తి. 2006లో హైదరాబాద్‌లో వరల్డ్ సోషల్ ఫోరమ్ నిర్వహణలో కీలకమైన బాధ్యతలు. అంతకంటే ముందు మావోయిస్టు పార్టీకి, ప్రభుత్వానికి నడుమ చర్చల కోసం పీస్ ఇనిషియేటివ్ కమిటీలో ఎస్ఆర్ శంకరన్ వంటి పెద్దలతో కలిసి పని చేశారు. చర్చల సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగకుండా ఏర్పాటైన కాల్పుల నియంత్రణ కమిటీకి కన్వీనర్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో... 2009లో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఉద్యమ గమనంపై ఆయన సంధించిన ‘ఘంటాపథం’, వార్తా కథనాల విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా, ఉస్మానియా విద్యార్థి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి సాగించిన పోరాటం ఆయనను తిరుగులేని ఉద్యమకారుడిగా నిలిపాయి. రాత్రింబవళ్లు టీవీ చానళ్లలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభిరుచులు అధ్యయనం, రాయడం, సామాజిక అంశాలపై విశ్లేషణ. బాధపడిన క్షణాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకవైపు పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మన సును ద్రవింపజేశాయి. అప్పటి వరకు ఉద్యమంలో కలియ తిరుగుతూ, అంతటా తానై కనిపించిన విద్యార్థి యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సజీవ దహనమైన సంఘటన ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుందంటారు. కుటుంబ నేపథ్యం... రెండెకరాల మెట్ట పొలం మాత్రమే ఉన్న పెద్ద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు...ముగ్గురు అక్కచెల్లెళ్లు. అమ్మ జనని. నాన్న మొగులయ్య. తాము అనుభవించిన సామాజిక అణచివేత, వివక్ష పిల్లల అనుభవంలోకి రావద్దనుకున్నారా దంపతులు. వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని కష్టపడ్డారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా... ఒక వైపు పొలం దున్నుతూ, పశువులను మేపుతూ, పొలంలో పండిన కూరగాయలను అమ్ముతూ... మరోవైపు బడికెళ్లారు చక్రపాణి. ఊళ్లో ఐదో తరగతి పూర్తయింది. పై చదువులు అసాధ్యమనుకొంటున్న తరుణంలో అప్పటి సాంఘిక సంక్షే మ హాస్టల్ వార్డెన్ బీఎస్ రాములు (ప్రముఖ రచయిత) ఆపన్న హస్తం అందించారు. తాను వార్డెన్‌గా పని చేస్తున్న ఎలగందుల హాస్టల్లో చేర్చుకున్నారు. అలా చదువు వైపు మళ్లారు. పదో తరగతి వరకు ఆ హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. అప్పటి కి మానేరు డ్యామ్ పనులు మొదలయ్యాయి. యాష్వాడతో పాటు 18 ఊళ్లు ఖాళీ చేయవలసి వచ్చింది. దాంతో చక్రపాణి కుటుంబం ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం దూలికట్టకు మకాం మార్చింది. సుల్తానాబాద్‌లోనే 1983లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆదర్శ వివాహం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పతో పరిచయం ప్రేమగా మారింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. స్నేహితులు, సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో 1994 ఆగస్టు 13వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దండలు మార్చుకొని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పాప అమేయ ఇంటర్ చదువుతోంది. కొడుకు రాహుల్ మిళింద్ ఏడో తరగతి. మధుర జ్ఞాపకం హైదరాబాద్‌లో ఒకవైపు దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1990లో ఎంఏ సోషియాలజీ, 1992 నాటికి ఎంసీజే పూర్తి చేశారు. యూజీసీ నెట్‌కు ఎంపికయ్యారు. అప్పటికి 25 ఏళ్ల వయస్సు. ఆ సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ లెక్చరర్‌గా ఉద్యోగం. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు టీచింగ్. బియ్యాల జనార్దన్, డాక్టర్ బుర్రా రాములు, ప్రొఫెసర్ బొబ్బిలి వంటి అధ్యాపక మిత్రుల పరిచయం. 20 నెలల పాటు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు. చిన్న వయస్సులోనే లెక్చరర్‌గా పని చేయడం ఒకవైపు... మరోవైపు అప్పటి ఉద్యమ వాతావరణం, సామాజిక, రాజకీయ అంశాలపైన చర్చలు, విశ్లేషణలు. 1993లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పయనం. ప్రజా సంబంధాల అధికారిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా, రిజిస్ట్రార్‌గా ఇటీవల వరకు అనేక కీలకమైన బాధ్యతల నిర్వహణ. అక్కడి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొత్త బాధ్యతలు.