తెలంగాణ బీసీ కమిషన్ నియామకం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బీసీ కమిషన్ను నియమించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను శనివారం అధికారికంగా ప్రకటించారు.
బీసీ కమిషన్ చైర్మన్గా ప్రముఖ సామాజిక వేత్త బీఎస్ రాములును నియమించారు. ప్రముఖ రచయిత జూలురు గౌరీశంకర్, డా.ఆంజనేయులు గౌడ్, వకుళా భరణం కృష్ణమోహన్ ఈ కమిషన్లో సభ్యులుగా ఉంటారు. బీసీ కమిషన్ పదవీకాలం మూడేళ్లగా నిర్ణయించారు. రాష్ట్రంలో బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కమిషన్ పనిచేస్తుంది. త్వరలో కమిషన్ చైర్మన్, సభ్యులు బాధ్యతలను స్వీకరించనున్నారు.