సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగ తుల సామాజిక, ఆర్థిక స్థితిపై అధ్యయన ప్రక్రియ ను తెలంగాణ బీసీ కమిషన్ వేగ వంతం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసిన కమిషన్... తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలతో వరుసగా భేటీలు నిర్వహించి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది.
పూర్తిస్థాయి నివేదికను 6నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు అందుతున్న అవకాశాలు తదితరాలపై తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కమిషన్ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీసీల స్థితిగతులను పరిశీలించింది. తాజాగా తెలంగాణలో శాఖల వారీగా స్థితిగతులను అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల ద్వారా బీసీలకు అందుతున్న లబ్ధి, ఉద్యోగావకాశాలు, ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలు, తదితరాలపై ఈనెల 25వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సమీక్షించింది.
వకుళాభరణం అధ్యక్షతన సమీక్ష
ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన స మావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు సీ హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్‌గౌ డ్, బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కా ర్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ శాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీసీ సంక్షే మ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు–తీరుతెన్నులు, కులాల వారీగా నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఉద్యోగుల వారీ గా లబ్ధిదారుల పూర్తి వివరాలను సమీక్షించారు. బీ సీ సంక్షేమ శాఖ ద్వారానే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో బీసీ లబ్ధిదారులను తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిష న్ ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఈ ఫార్మా ట్ ఆధారంగా ప్రతి ప్రభుత్వ శాఖ సమాచారం ఇ వ్వాల్సి ఉంటుందని బీసీ కమిషన్ స్పష్టం చేసింది.
బీసీల్లోని కులాలు, ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ఏ యే కేటగిరీకి ఎంతమేర అవకాశాలు పొందాయి... ఏమేరకు అవకాశాలు కల్పించాలి, అందుకు సంబంధించి చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణ యాలను సైతం కమిషన్ సూచించనుంది. నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్ మ రో ఆరునెలల్లోగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తూ ఆ మేరకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment