Telangana BC Commission
-
బీసీల స్థితిగతులపై ఆర్నెల్లలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగ తుల సామాజిక, ఆర్థిక స్థితిపై అధ్యయన ప్రక్రియ ను తెలంగాణ బీసీ కమిషన్ వేగ వంతం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసిన కమిషన్... తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలతో వరుసగా భేటీలు నిర్వహించి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. పూర్తిస్థాయి నివేదికను 6నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు అందుతున్న అవకాశాలు తదితరాలపై తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిషన్ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీసీల స్థితిగతులను పరిశీలించింది. తాజాగా తెలంగాణలో శాఖల వారీగా స్థితిగతులను అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల ద్వారా బీసీలకు అందుతున్న లబ్ధి, ఉద్యోగావకాశాలు, ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలు, తదితరాలపై ఈనెల 25వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సమీక్షించింది. వకుళాభరణం అధ్యక్షతన సమీక్ష ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన స మావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు సీ హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్గౌ డ్, బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కా ర్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ శాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీసీ సంక్షే మ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు–తీరుతెన్నులు, కులాల వారీగా నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఉద్యోగుల వారీ గా లబ్ధిదారుల పూర్తి వివరాలను సమీక్షించారు. బీ సీ సంక్షేమ శాఖ ద్వారానే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో బీసీ లబ్ధిదారులను తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిష న్ ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఈ ఫార్మా ట్ ఆధారంగా ప్రతి ప్రభుత్వ శాఖ సమాచారం ఇ వ్వాల్సి ఉంటుందని బీసీ కమిషన్ స్పష్టం చేసింది. బీసీల్లోని కులాలు, ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ఏ యే కేటగిరీకి ఎంతమేర అవకాశాలు పొందాయి... ఏమేరకు అవకాశాలు కల్పించాలి, అందుకు సంబంధించి చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణ యాలను సైతం కమిషన్ సూచించనుంది. నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్ మ రో ఆరునెలల్లోగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తూ ఆ మేరకు చర్యలు చేపట్టింది. -
తమిళనాడు సీఎంతో రాష్ట్ర బీసీ కమిషన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో రాష్ట్ర బీసీ కమిషన్ మూడురోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె.కిశోర్‌గౌడ్‌లు వివిధ అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించారు. శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అక్కడ అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లతోపాటు కులగణనకు సంబంధించిన అంశాలను చర్చించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై తమిళనాడులో అధ్యయనం చేసినట్లు స్టాలిన్‌కు చెప్పారు. అనంతరం ఆ రాష్ట్ర బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్, బీసీ, ఎంబీసీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్తీక్, పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్యకార్యదర్శి ఆముదలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చివరగా ఈవీ పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని సందర్శించారు. -
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్‌ని నియమించింది. -
ఓబీసీ ఉప వర్గీకరణకు సూచనలిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కీలకమైన ఓబీసీ కోటా ఉపవర్గీకరణపై రాష్ట్ర బీసీ కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఓబీసీ ఉపవర్గీకరణ అధ్యయనం కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీకి తెలంగాణ స్థితిగతులను వివరించేందుకు బీసీ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలదే. అయితే ప్రస్తుతం 50 శాతంలోపు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీల వాటా 60 శాతం దాటుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బీసీ కమిషన్ ఇప్పటికే అధ్యయనం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాలు, నిరుద్యోగులు, బీసీల ఆర్థిక స్థితిగతులపై పరిశీలన దాదాపు పూర్తి చేసింది. క్షేత్రస్థాయి సర్వే మినహా మిగతా ప్రక్రియ పూర్తయిందని సమాచారం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ఉపవర్గీకరణకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర బీసీ కమిషన్ ఈమేరకు సమగ్ర నివేదిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో పరిస్థితులను ఇందులో వివరించబోతోంది. ఇదే క్రమంలో ఓబీసీ ఉపవర్గీకరణపై దక్షిణాది రాష్ట్రాల్లోని బీసీ కమిషన్లతో హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేయబోతోంది. ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, సదస్సు నిర్వహించే తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర బీసీ కమిషన్లను ఆహ్వానించనుంది. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సదస్సు అనంతరం ఓబీసీ ఉపవర్గీకరణపై చేసే తీర్మానాలను అధ్యయన బృందానికి అందించే అవకాశం ఉంది. -
తెలంగాణ బీసీ కమిషన్ నియామకం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బీసీ కమిషన్‌ను నియమించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను శనివారం అధికారికంగా ప్రకటించారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా ప్రముఖ సామాజిక వేత్త బీఎస్ రాములును నియమించారు. ప్రముఖ రచయిత జూలురు గౌరీశంకర్, డా.ఆంజనేయులు గౌడ్, వకుళా భరణం కృష్ణమోహన్ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. బీసీ కమిషన్ పదవీకాలం మూడేళ్లగా నిర్ణయించారు. రాష్ట్రంలో బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కమిషన్ పనిచేస్తుంది. త్వరలో కమిషన్ చైర్మన్, సభ్యులు బాధ్యతలను స్వీకరించనున్నారు. -
త్వరలో తెలంగాణ బీసీ కమిషన్
• వెంటనే ప్రక్రియ ప్రారంభానికి సీఎం ఆదేశం • బాలబాలికలకు చెరి సగం స్కూళ్ల కేటాయింపు • బీసీ సంక్షేమంపై సమీక్షలో కేసీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కేబినెట్ సమావేశమై బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని...అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తామన్నారు. బీసీ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలోనే విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి తీసుకునే చర్యలపై వారితో చర్చించనున్నట్లు వెల్లడించారు. నిరుపేద బీసీల సామాజిక ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీల సంక్షేమం పేరిట గతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు హాస్యాస్పదంగా, నామమాత్రంగా ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాలు వాస్తవికంగా ఉండాలని... దీనిపై సమగ్ర అధ్యయనం చేసి అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రి జోగు రామన్న, సీఎం ముఖ్య కార్యదర్శి సి.నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఈ పాఠశాలలు ప్రారంభం కావాలని, వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలన్నారు. వచ్చే జూన్ నాటికే ఈ పాఠశాలలకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, విద్యార్థుల చేరిక, వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిలబస్, ఇతర విద్యా సంబంధ అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందించాలన్నారు. ఆట స్థలంతోపాటు మంచి ప్రాంగణాన్ని బీసీ గురుకులాలకు సిద్ధం చేయాలని చెప్పారు. సమాజంలో సగ భాగం ఉన్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్యను అందించటం ద్వారా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీల పిల్లల చదువుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు నిర్వహిస్తున్న విధంగానే బీసీ గురుకుల పాఠశాలలు నడవాలని, అందుకు నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిం చారు. పాఠశాలలకు ఇప్పట్నుంచే స్థలాన్వేషణ జరపాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల పరిస్థితి, భవనాలు, స్థలాలు తదితర అంశాలపైనా అధ్యయనం చేయాలని... వాటిని గురుకులాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. అకాడమీల తరహాలో స్టడీ సర్కిళ్లు రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్లు నామమాత్రంగానే ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు అన్ని స్టడీ సర్కిళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు కచ్చితంగా ఉద్యోగం సంపాదించేలా అకాడమీల తరహాలో వాటిని నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్‌లలో పోలీస్ కమిషనరేట్లు నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న ఈ రెండు నగరాల్లో జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను పటిష్టం చేయాలని ఆయన సూచించారు.