నేడు బి.ఎస్. రాములు 75వ జన్మదినం
సామాన్యుణ్ణి కేంద్రంగా చేసుకుని కొన్ని దశాబ్దాలుగా సాహిత్య సృష్టి చేస్తున్న రచ యిత బీఎస్ రాములు. పదిహేనేళ్ల ప్రాయంలోనే రాయడం ప్రారంభించారు. 1968లో ‘బాలమిత్ర’లో తొలి కథ వచ్చింది. విరసంలో చేరి ఎక్కువగా కథలపైనే దృష్టి పెట్టారు కానీ నవలలూ రాశారు. 1982లో ‘బతుకు పోరు’ తొలి నవల వెలువ డింది. బీడీ కార్మికుల జీవితాల్లోని వేదనలను, దోపిడీని ఉన్నదున్నట్లుగా, వారి భాష లోనే అద్భుతంగా చిత్రించిన నవల అది. ‘చూపు’, ‘జీవనయానం’ ఇతర నవలలు. ఇప్పటివరకూ 200 దాకా కథలు రాశారు.
తెలంగాణ దృష్టితో, బీసీ దృష్టితో తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేయాలనే కొత్త చూపుతో బీఎస్ రచనా వ్యాసంగం సాగుతోంది. అట్లాగే సి. నారాయణ రెడ్డి కోరిక మేరకు ‘తెలంగాణ కథల్లో, నవలల్లో తెలంగాణ అస్తిత్వం’ అనే పుస్తకం రాశారు. ఒక టీవీ ఛానల్‌లో గొల్ల పూడి మారుతీరావు నిర్వహించిన ‘నూరేళ్ళ కథ’ శీర్షికలో బీఎస్ రాములు ‘బతుకు పయనం’ కథ పరిచయమైంది. ఒక బట్టలు నేసే పద్మశాలీ సామాజిక వర్గం నుండి ఒక యువ కుడు బీటెక్ చేసి, అమెరికాకు ఎట్లా పోగలిగాడో చెప్పే ఒక పరిణామాన్ని ఆవిష్కరించిన కథ అది. విశాలాంధ్ర వారి ‘నూరేళ్ళ తెలంగాణ కథ’ పుస్తకంలో ఆయన కథ ‘దక్షయజ్ఞం’ చోటు పొందింది.
ఈ కథలో బీఎస్ విప్లవ విమర్శను లేవనెత్తారు. పైన పేర్కొన్న రెండు కథలూ భిన్న ధ్రువాల వంటివి. మొదట్లో తన జీవితంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్ళ గురించి రాశారు. ఆ తర్వాతి కథలన్నీ విప్లవానికి సంబంధించినవి. చివరగా ‘ఉద్యమం ఉద్యమం కోసం కాదు. జీవితం గెలవడం కోసం’ అనే మాటకు బలమిచ్చే కథలు రాశారు. విద్య ప్రాధాన్యం, విద్యావ్యవస్థ తీరు, కుటుంబ వ్యవస్థ పరిణామాలు, ప్రాజెక్టులు తెచ్చిన పరిణామాలు, అభివృద్ధి తెచ్చిన పరిణా మాలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి ఆయన కథా వస్తువులయ్యాయి. కమ్యూని జాన్ని భారతీయ సమాజ కోణంలో విశ్లేషించి, దేశ అవసరాలకు సరిపడే ప్రత్యా మ్నాయ మార్గాలను సూచించినవిగా బీఎస్ రాములు కథలు నిలుస్తాయి. – బి. నర్సన్, రచయిత, సాహితీ విశ్లేషకులు, 94401 28169
Comments
Please login to add a commentAdd a comment