
మీ సర్వేలెలా ఉన్నాయ్..?
బీసీ రిజర్వేషన్లు, ఎంబీసీ కులాల అధ్యయనాన్ని బీసీ కమిషన్ వేగవంతం చేసింది.
అక్కడ బీసీ రిజర్వేషన్లపై చేసిన సర్వేకు సంబంధించి ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ హెచ్ కాంతరాజ్, సభ్యులు కేఎన్ లింగప్ప, గురులింగయ్య, ధర్మరాజులతో సోమవారం సమావేశమైంది. ఆరు గంటల పాటు చర్చించిన సభ్యులు.. సర్వే ప్రక్రియలో ఎదురైన అవాంతరాలు, న్యాయపర సమస్యలు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. కర్ణాటకకు వెళ్లిన బృందంలో వకులాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ ఉన్నారు.