‘ఎంబీసీ జాబితాను సమర్పించాలి’ | to submit the mbc list ask the state mbc welfare committee | Sakshi
Sakshi News home page

‘ఎంబీసీ జాబితాను సమర్పించాలి’

Published Wed, Jun 14 2017 2:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

to submit the mbc list ask the state mbc welfare committee

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని బీసీ కమిషన్‌ను రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంబీసీ కులాల సామా జిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించాలని పేర్కొంది. ఏ కులాలను ఎంబీసీలుగా గుర్తించాలో తేలితే కాని ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇవ్వలేమని ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రతినిధిబృందం బీసీ కమిషన్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement