ముస్లిం రిజర్వేషన్ల విచారణ పొడిగింపు | BC commision Chairman BS Ramulu on muslim reservations | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్ల విచారణ పొడిగింపు

Published Sun, Dec 18 2016 4:53 AM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

BC commision Chairman BS Ramulu on muslim reservations

బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లిం,బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందు కు తలపెట్టిన బహిరంగ విచారణ కార్య క్రమాన్ని రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కూడా కార్యాలయంలో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించి వాదనలు వింటామన్నారు. శనివారంతో గడువు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయంతీసుకుంటున్నట్లు వెల్లడించారు.

శనివారం బీసీ కమిషన్‌ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 13,780 వినతులు వచ్చాయన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని పరిగణించి అత్యుత్తమ రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు వకులాభరణం క్రిష్ణమోహన్, ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి జీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement