BC commision
-
ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ వి చారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ తీర్పునకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యా యస్థానం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, రెండు వారాల్లో స్థాయీ నివేదిక న్యాయస్థానం ముందు ఉంచాలని స్పష్టం చేశారు. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సమీక్ష నిమిత్తం బీసీ కమిషన్ ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలో బీసీ కమిషన్నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసమే జీవో: ఏజీ వాదనల అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేయగా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేసి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మధ్యాహ్నం న్యాయమూర్తిని కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అభ్యంతరాలుంటే కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్‌గా పరిగణించాలంటూ ఇచ్చిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా, హైకోర్టు తీర్పుపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని కోరారు. -
గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్
విజయవాడ: తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఎన్ మారేష్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే,స్థానిక పోలీసులతో బీసీ కమిషన్ సభ్యులు మాట్లాడారు. వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సాక్షితో బీసీ కమిషన్ మెంబర్ మారేష్ మాట్లాడారు. ‘గీతాంజలి మరణం వెనుక కుట్ర కోణం ఉంది. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని చెప్పిన లబ్ధిదారులు భయబ్రాంతులకు గురై చనిపోతే ఇంకెవరూ అలా మాట్లాడకూడదనేది ప్రత్యర్ధుల కుట్ర. బీసీలు విశ్వాసానికి ప్రతీక.. నవరత్నాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రభుత్వం ద్వారా మేలు పొందిన ప్రభుత్వానికి అండగా ఉంటారనే అక్కసుతోనే ఈ కుట్ర. చేసిన తప్పేంటి.. లబ్ధి కలగడంతో ఆనందపడడమే ఆమె చేసిన తప్పా. గీతాంజలి మరణం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకోవాలి. గీతాంజలి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెపై కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరం. బీసీలు కన్నెర్ర చేసే బీసీ వ్యతిరేకులు రోడ్లపై తిరగలేరు. ఆ రాజకీయ పార్టీలు ఇంకెంతమంది బీసీలను బలి తీసుకుంటాయి. రైల్వే అధికారులు, పోలీసులతో మాట్లాడాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విశ్వ బ్రాహ్మిన్ మహిళ చనిపోవడం బాధాకరం. అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఎంతో మానసిక ఒత్తిడికి గురై గీతాంజలి చనిపోయింది’ అని మారేష్ అన్నారు. -
మరాఠాలకు రిజర్వేషన్లు
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం చెప్పారు. ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గం’ (ఎస్ఈబీసీ – సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్) కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిందనీ, రిజర్వేషన్ ఎంత శాతం ఇవ్వాలనేది మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయిస్తుందన్నారు. తమిళ నాడులో మాదిరిగా 16 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశ ముందని భావిస్తున్నారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 68 శాతా నికి చేరతాయి. నేడు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది. కీలకమైన మరాఠాలు రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. గతవారం బీసీ కమిషన్ నివేదిక సమర్పించిన వెంటనే మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై ఫడ్నవిస్ సానుకూలగానే స్పందించారు. ఎన్నో ఏళ్లుగా మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలు చాలా తక్కువగా ఉన్నారనీ, కాబట్టి వారిని ఎస్‌ఈబీసీలుగా పరిగణిస్తున్నట్లు బీసీ కమిషన్ పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణం 15 (4), 16 (4)ల ప్రకారం ఎస్‌ఈబీసీలకు రిజర్వేషన్ల ఫలాలను అనుమతించవచ్చు. మరాఠాలకు రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్ల శాతం 50కి పైగా పెరిగితే అది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ఇది ప్రత్యేక అంశమని ఫడ్నవిస్ చెప్పారు. -
నివేదిక ఇవ్వకుండానే 9వ షెడ్యూల్‌లోనా?
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ, శాసనమండలిలో చేసిన ఈ రెండు ప్రకటనలను చదివిన వారికి ఏం అర్థమవుతుంది? త్వరలో కమిషన్ నివేదిక వస్తుందని, సమగ్రంగా చర్చించిన అనంతరం చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారని భావిస్తాం. కీలకమైన బీసీ కమిషన్ నివేదికను ఇంకా ఇంతవరకు ప్రభుత్వానికి ఇవ్వలేదని సాక్షాత్తు ఆ కమిషన్ ఛైర్మనే చెబుతున్నా అసెంబ్లీలో బిల్లు పెట్టేసి కేంద్రంపై తోసేస్తే కాపులకు నిజంగానే రిజర్వేషన్లు వస్తాయా?.. కాదనే కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటే కమిషన్ నివేదిక కచ్చితంగా ఉండాలి. ఏదైనా రాష్ట్రం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వదలచుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేలా సరైన గణాంక సమాచారం ఉండాలని సుప్రీంకోర్టు 1992లో ఇంద్రా సహానీ కేసులో తీర్పు ఇచ్చింది. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఇచ్చినట్లు చైర్మన్‌కే తెలియదు! సమగ్ర సమాచారం కోసం బీసీ కమిషన్‌ను నియమించామని, అది వచ్చేంత వరకు ఆగాలని చెప్పిన చంద్రబాబే హడావిడిగా అసెంబ్లీలో బిల్లు పెట్టడంలో ఆంతర్యమేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చిత్రమేమిటంటే ఏ కాపుల కోసం కమిషన్ వేశారో ఆ కమిషన్ ఛైర్మనే తమ సభ్యులు నివేదిక ఇచ్చారన్న సంగతి తనకు తెలియదనడం దేనికి సంకేతం? నిజంగా చంద్రబాబుకు కాపుల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? అన్న అనుమానాలు ఎవరికైనా రాకమానవు. న్యాయసమీక్షకు లోబడే... రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినప్పటికీ అది అత్యున్నత న్యాయస్థానాల న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమగ్ర సమాచారం ఉండాలి. అందుకు ప్రాతిపదికలు కమిషన్ నివేదికలు మాత్రమే. కానీ అటువంటిదేమీ లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లపై తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపింది. హడావుడిగా తీర్మానం... కాపుల రిజర్వేషన్ల కల సాకారం కావాలంటే సమగ్ర సమాచారం ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధీ అంతే అవసరం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీ ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ సేకరించిన సమగ్ర సమాచారం ఆధారంగా కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో చేర్చకుండా.. అసలు కమిషన్ నివేదికనే తెప్పించకుండా హడావుడిగా తీర్మానం చేయించిన తీరు కాపుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. కమిషన్ పని తీరు ఎలా ఉంటుందో తెలియకుండానే మెజారిటీ సభ్యులు కాపు రిజర్వేషన్ల కోసం సిఫార్సు చేశారని శనివారం రాత్రి ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని కాపునేతలే విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఏమిటో? అందులో ఏముందో తెలియకుండానే చట్టాలు చేస్తే అవి ఎలా చెల్లుబాటవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల కంటి తుడుపు కోసం ప్రభుత్వం ఈ పని చేసినట్టు అనిపిస్తోందని వాపోవడం గమనార్హం. రెండు నాల్కలు- రెండు మాటలు కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న మా ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం. అందుకే బీసీ కమిషన్‌ను నియమించాం. శాస్త్రీయంగా, పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చేయాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఆలస్యమైంది... (శనివారం శాసన మండలిలో చంద్రబాబు) బీసీ కమిషన్‌లో మెజారిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రాతిపదికనే సభలో బిల్లు ప్రవేశపెడుతున్నాం. దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపుతున్నాం. కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయమై రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై అన్ని పార్టీలూ ఒత్తిడి చేయాలి... (శాసనసభలో చంద్రబాబు) -
ఆ కులాలను బీసీల్లో చేర్చండి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దశాబ్ధాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పలు కులాలను బీసీల్లో చేర్చాలని ఎంపీ అసదసుద్దీన్ ఒవైసీ బీసీ కమిషన్‌ను కోరారు. ఈమేరకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహిర్ యాదవ, గవిలి, సారోల్లు తదితర కులాలు హైదరాబాద్‌లో దశాబ్ధాలనుంచి నివసిస్తున్నాయని, వీరంతా ఆర్థిక, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కులాలను బీసీల్లో కలిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు. అంతకుముందు సంచార కులాలకు చెందిన ప్రతినిధులు బీసీ కమిషన్‌ను కలిసి వాదనలు వినిపించారు. బాగోతుల, బొప్పల, శ్రీక్షత్రియ రామజోగి, ఓడ్, గౌలి, బైలుకమ్మర, కాకిపగడాల, సాధనాశూరుల, తెరచీరల కులాల ప్రతినిధులు తమను డీఎస్టీ(డీనోటిఫైడ్ ట్రైబ్స్) కేటగిరీలో పరిగణించాలన్నారు. ఎంబీసీల్లో చేర్చితే ఫలాలు అందవన్నారు. దీంతో స్పందించిన చైర్మన్ బీఎస్ రాములు పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు. -
అన్ని లెక్కలున్నా బీసీలపై అధ్యయనం ఎందుకు?
- ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో బీసీ జనాభా కులాల వారీగా స్పష్టంగా తెలిసినా, రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ కమిషన్ ద్వారా ఆరు నెలలపాటు అధ్యయనం చేయిస్తామనడంలో అర్థం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. సమగ్ర సర్వేలో బీసీల స్థితిగతులు, సామాజిక, ఆర్థిక, విద్య పరిస్థితిపై సమగ్ర వివరాలు తేలాయని, వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచొచ్చని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రటకనలో పేర్కొన్నారు. అధ్యయనం పేరిట కాలయాపన చేయడం తప్ప పెద్దగా ఒరిగేదేంలేదని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52శాతం ఉందని, ఆమేరకు నెలరోజుల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో ఎలాంటి అధ్యయనం లేకుండా, అతి తక్కువ వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం... బీసీ రిజర్వేషన్ల పెంపులో మాత్రం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, పదోన్నతులు, రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. -
ముస్లిం రిజర్వేషన్ల విచారణ పొడిగింపు
బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లిం,బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందు కు తలపెట్టిన బహిరంగ విచారణ కార్య క్రమాన్ని రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో కూడా కార్యాలయంలో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించి వాదనలు వింటామన్నారు. శనివారంతో గడువు ముగిసినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయంతీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం బీసీ కమిషన్ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 13,780 వినతులు వచ్చాయన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని పరిగణించి అత్యుత్తమ రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు వకులాభరణం క్రిష్ణమోహన్, ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి జీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సొంత డబ్బుతో చేయించాల్సింది: వీహెచ్
హైదరాబాద్: భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన బంగారు కిరీటాన్ని ప్రజల సొమ్ముతో కాకుండా ఆయన సొంత డబ్బుతో చేయించి ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ప్రజల సొమ్మును మొక్కుల కోసం ఎలా ఉపయోగిస్తారు అని వీహెచ్ ప్రశ్నించారు. కులాల సర్వే చేయించిన కేసీఆర్ ఆ వివరాలను బయటపెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వెనుకబడిన వర్గాలకు ఒరిగేదేమీ లేదని, జనాభా దామాషా ప్రకారం బీసీల సంక్షేమానికి నిధులివ్వాలన్నారు. అలాగే.. బీసీలకు క్రిమిలేయర్ పరిధిని రూ. 15 లక్షలకు పెంచాలని వీహెచ్ డిమాండ్ చేశారు.