గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ | BC Commission Serious On Geetanjali Incident Tenali | Sakshi
Sakshi News home page

గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్

Published Wed, Mar 13 2024 2:33 PM | Last Updated on Wed, Mar 13 2024 3:38 PM

BC Commission Serious On Geetanjali Incident Tenali - Sakshi

విజయవాడ: తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఎన్ మారేష్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే,స్థానిక పోలీసులతో  బీసీ కమిషన్ సభ్యులు మాట్లాడారు. వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సాక్షితో బీసీ కమిషన్ మెంబర్ మారేష్ మాట్లాడారు.

‘గీతాంజలి మరణం వెనుక కుట్ర కోణం ఉంది. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని చెప్పిన లబ్ధిదారులు భయబ్రాంతులకు గురై చనిపోతే ఇంకెవరూ అలా మాట్లాడకూడదనేది ప్రత్యర్ధుల కుట్ర. బీసీలు విశ్వాసానికి ప్రతీక.. నవరత్నాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రభుత్వం ద్వారా మేలు పొందిన ప్రభుత్వానికి అండగా ఉంటారనే అక్కసుతోనే ఈ కుట్ర. చేసిన తప్పేంటి.. లబ్ధి కలగడంతో ఆనందపడడమే ఆమె చేసిన తప్పా. గీతాంజలి మరణం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకోవాలి.

గీతాంజలి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెపై కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరం. బీసీలు కన్నెర్ర చేసే బీసీ వ్యతిరేకులు రోడ్లపై తిరగలేరు. ఆ రాజకీయ పార్టీలు ఇంకెంతమంది బీసీలను బలి తీసుకుంటాయి. రైల్వే అధికారులు, పోలీసులతో మాట్లాడాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విశ్వ బ్రాహ్మిన్ మహిళ చనిపోవడం బాధాకరం. అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఎంతో మానసిక ఒత్తిడికి గురై గీతాంజలి చనిపోయింది’ అని మారేష్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement