Geetanjali
-
యోగాంజలి – ఎందుకంటే సినిమా కంటే ధ్యానం ఇష్టం
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్‌గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్‌గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్‌గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్‌గా నటించారు గిరిజ (ప్రైమ్‌టైమ్‌లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.గీతాంజలి గర్ల్తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు. కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్‌గా మారారు.ఆమె చెప్తున్న విషయాలు→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్‌లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్‌గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట. → ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.యోగా ఒక రక్షణ‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి. నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ. -
గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదానికి బలైన తెనాలికి చెందిన గొల్తి గీతాంజాలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం అండగా నిలిచింది. ఆమె ఇద్దరు పిల్లలు రిషిత(10), రుషిక(6) పేర్లతో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను బ్యాంక్‌లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. డిపాజిట్ పత్రాలను శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి భర్త గొల్తి బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికకు అందజేశారు. పిల్లలను బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా వైఎస్సార్ సీపీని సంప్రదించాలని బాలచందర్‌కు సజ్జల సూచించారు. బాలచందర్ మాట్లాడుతూ గీతాంజలి చనిపోయిన కొన్ని గంటల్లోనే సీఎం వైఎస్ జగన్ స్పందించి బతుకుపై తమ కుటుంబానికి భరోసా కల్పించారని తెలిపారు. ‘వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ యూకే విభాగం కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యాన ఎ.సురేంద్రరెడ్డి, యూకేలోని వైఎస్సార్సీపీ విభాగం సభ్యులు అందరూ కలిసి మా పిల్లల పేరు మీద రూ.20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు అందజేశారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చల్లా మధు, ఎన్ఆర్ఐ కాశీపతి పాల్గొన్నారు. -
Geethanjali Malli Vachindi : శ్రీవారిని దర్శించుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీమ్ (ఫోటోలు)
-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్‌ను కోన వెంకట్‌గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్‌ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్‌గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
ట్రోలింగ్.. ‘సోషల్’ కిల్లింగ్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కో సందర్భంలో..ఒక్కో తరహా వేధింపులు తప్పడం లేదు. ఇందులో మహిళలే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. తాజాగా గీతాంజలి ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్చువల్లైఫ్ వేరు.. నిజజీవితం వేరు అని గుర్తించాలి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో, కొన్నిసార్లు ట్రోలింగ్‌కు గురవడం సహజమే అని గుర్తించాలి. పొగడ్తలకు పొంగిపోవడం కాదు..విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటికీ విరుగుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే అని వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీలపరంగా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తున్నారన్నది మరవొద్దని వారు సూచిస్తున్నారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టూ ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించాలంటున్నారు. కొన్ని రకాల ‘సోషల్’ వేధింపులు ఇలా.... సైబర్ బుల్లీయింగ్: ఈ తరహా సోషల్ మీడియా వేధింపులు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అమ్మాయిలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైబర్ బుల్లీయింగ్ తరహా వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ట్రోలింగ్: రాజకీయాల్లో ఉండేవారికి ఇవి తప్పడం లేదు. ప్రధానమంత్రి మొదలు అన్ని స్థాయిల్లోని రాజకీయనేతలు వీటి బారిన పడుతున్నారు. సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలకు సైతం ఇవి తలనొప్పిగా మారాయి. స్వాటింగ్: తప్పుడు మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరింపులకు గురి చేయడం. ఇది ఎక్కువగా యూఎస్, యూకేలో ఉంది. ఇది కూడా ఒక తరహా సైబర్ వేధింపులే. మన దగ్గర ఈ తరహా సైబర్ వేధింపులు ఎక్కువగా లోన్‌యాప్స్ మోసాల్లో చూస్తున్నాం. మేం చెప్పినంత డబ్బు చెల్లించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పరువు తీస్తాడు..అంటూ బెదిరింపులకు దిగి ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. రివేంజ్ పోర్న్: స్నేహితులుగా లేదా ప్రేమికులుగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను వారి రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత బెదిరింపుల కోసం వాడడమే రివేంజ్ పోర్న్. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతామని అమ్మాయిలను వేధించడం, మానసికంగా కుంగదీయడం దీని కిందకే వస్తుంది. ఈ జాగ్రత్తలు మరవొద్దు ♦ సోషల్ మీడియాలో అవసరానికి మించి మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే బెటర్. ♦ ఏ తరహా సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నామన్నది ముందుగా గుర్తించాలి. వాటికి సంబంధించి స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోవాలి. ఇవి భవిష్యత్‌లో ఆధారంగా పనికొస్తాయి. ♦వేధింపులు ఉన్నట్టు గమనిస్తే, సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వర్చువల్ ప్రపంచంలో ఎక్కడో కూర్చున్న అజ్ఞాత వ్యక్తులు చేసే కామెంట్లు పట్టించుకోవొద్దు. ♦ఎవరైనా మన సోషల్ మీడియా ఖాతాల్లోని గ్రూపులలో అభ్యంతరకర మెసేజ్‌లు పెడితే, వాటిని వెంటనే డిలీట్ చేయాలి. వాటిని ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాటిని వినియోగించుకోవాలి. ♦వేధింపులు మితిమీరితే 1930 నంబర్‌కు డయల్ చేసి సైబర్ క్రైం సెల్లో ఫిర్యాదు చేయాలి. ఠీఠీఠీ. ఛిyb్ఛటఛిటజీఝ్ఛ. జౌఠి. జీn పోర్టల్ ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేయడం ఉత్తమం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ భాగమైంది. విమర్శలు, వ్యక్తిగత దూషణలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలి. – డా.ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, న్యూఢిల్లీ -
గీతాంజలి కేసు దర్యాప్తు వేగవంతం
తెనాలి: గీతాంజలి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే. నిందితుల గుర్తింపునకు, అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఒక పక్క సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతున్నారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిష్పక్షపాతంగా, ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకండా అన్ని ఆధారాలతో సహా నిందితులను చట్టం ముందు నిలబెట్టాలనే భావనతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల ప్రకారం పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి స్థానిక ఎమ్మెల్యే చేతులమీదుగా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకుని పట్టరాని సంతోషాన్ని యూట్యూబ్ ఛానల్‌తో పంచుకోవటమే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో చెలరేగిపోయింది. అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. సభ్యసమాజంలో ఏ ఒక్కరూ అటువంటి ట్రోలింగ్‌ను విన్నా కూడా తట్టుకోలేనంత జుగుప్సాకరంగా ఉన్నాయా పోస్టింగ్‌లు. సాధారణ గృహిణి, ఏ అండా లేని బీసీ మహిళ, ఇద్దరు ఆడపిల్లల తల్లి గీతాంజలిని ఆ ట్రోలింగ్ ఎంతగా మానసిక వ్యధకు గురిచేశాయో? రేపో మాపో ప్రైవేటు స్కూల్లో చేరాల్చిన టీచర్ పోస్టును, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్‌ను కూడా మర్చిపోయేంత విరక్తిని కల్పించాయి. రైలుపట్టాలపై వస్తున్న రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కూడా సోషల్ మీడియా మూకల ట్రోలింగ్‌ను సమాజంలో ప్రతిఒక్కరూ అసహ్యించుకుంటున్నా, బాధ్యులైనవారు వక్రీకరించటానికి చేయని కుటిలత్వం అంటూ లేదు. గీతాంజలికి జరిగిన దారుణంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో అందించింది. మరణానికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రైల్వే పోలీసుల పరిధిలోని కేసును స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సోషల్‌మీడియా ట్రోలింగ్ వలనే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో సెక్షన్లు మార్చి, ఐటీ సెక్షనూ చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే దూకుడుగా విజయవాడ, ఉండికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వెయ్యికి పైగా కామెంట్లు అసభ్యకర పదజాలాన్ని వాడుతూ ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ కేసులో వెయ్యికి పైగా కామెంట్లు ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వాటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిలో చాలామంది సొంత పేర్లతో కాకుండా ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెడుతున్నారు. అలాంటి ఫేక్ అకౌంట్ల వెనుకున్న అసలు కూపీదారులను బయటకు లాగే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇప్పటికే గుర్తించిన నిందితుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు నిందితుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వీరు డేగ కళ్లతో గాలిస్తున్నారు. విషయం తెలిసి ఇప్పటికే కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు పరారీలో ఉన్నట్లు సమాచారం. -
ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య
ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం : ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఆనందంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ గీతాంజలి పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గీతాంజలి మృతికి బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారి నచికేత్ షెల్కే నేతృత్వంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), శ్రీనివాసరావు (ఎల్/ఓ), తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ రమేష్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విటర్ ద్వారా వచ్చిన ట్రోలింగ్‌లను పరిశీలించామన్నారు. గీతాంజలి నాలుగో తేదీన లోకల్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిందని, ఆమె మాట్లాడిన మాటలు అదే రోజు సోషల్ మీడియాలో వైరలయ్యాయని తెలిపారు. దీనికి అనేక వ్యూస్ వచ్చాయని, దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించామన్నారు. వీటిని చూసి అమె మనస్తాపానికి గురైందని, రెండు రోజులు డీలాగా గడిపినట్లు తెలిసిందన్నారు. ఏడో తేదీ ఉదయం ఈ ట్రోలింగ్‌పై తన సన్నిహితులు, బంధువులతో చర్చించిందని, వాటిని ఎలా తొలగించాలని వారిని అడగ్గా, అది సాధ్యం కాదని వారు ఆమెకు చెప్పారని తెలిపారు. ఈనెల ఏడో తేదిన ఆమెకు విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ పోస్ట్‌కు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిందని, ఆ తర్వాత కూడా బంధువులతో మాట్లాడిందని చెప్పారు. తనను, తన పిల్లలను, భర్తను కూడా అసభ్య పదజాలంతో తిడుతున్నారని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గీతాంజలి తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఆమెను గమనించి లోకో పైలెట్ అప్రమత్తమై, బ్రేక్ వేసి రైలును నిలిపారని, అప్పటికే రైలు తగలడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ల వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసు తీవ్రతను గుర్తించి క్రైమ్ నంబర్ 28/24/యు/ఎస్ 174 సీఆర్‌పీసీగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత కేసును తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కాగా, దానిని కేసు నంబర్ 65/24సెక్షన్ 509, 306 ఐపీసీ , సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌గా తిరిగి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వెయ్యికిపైగా కామెంట్లు ఉన్నట్లు విచారణ బృందాలు గుర్తించాయన్నారు. సోషల్ మీడియాలో అటువంటి భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. ట్రోలింగ్‌కు పాల్పడిన విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన వెంకట దుర్గారావుని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ట్రోల్స్‌పై ఫిర్యాదు చేయండి పిల్లలు, మహిళలు, ఎవరైనా ఇటువంటి దారుణమైన ట్రోల్స్‌కి గురైతే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, దిశ పీఎస్‌లో, దిశ యాప్, డయల్ 100, స్టేట్ మహిళా హెల్ప్‌లైన్ నంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. నేరుగా తనను కూడా సంప్రదించవచ్చన్నారు. -
ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
తణుకు అర్బన్/ భీమవరం/ కాకినాడ క్రైం/ విజయవాడస్పోర్ట్స్/ కడప/ సాక్షి,నెట్వర్క్:గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు తగ్గడం లేదు. బుధవారం నాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు టీడీపీ రాక్షస మూకలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా హంతకులు ఇద్దరు పిల్లల తల్లిని నిర్థాక్షిణ్యంగా చంపేశారని ధ్వజమెత్తారు. కక్షగట్టి ఆమె ప్రాణాలను బలిగొన్నారని, రాజకీయ లబ్ధే పరమావధిగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదొంగలే పొట్టన పెట్టుకున్నారు. గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలే పొట్టనపెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తణుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీపీ దొంగలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. మహిళలు, బాలికలను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో వే«ధించే వారికి కఠిన శిక్షలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన న్యాయవాది ఎం.చిత్రభాను స్పష్టంచేశారు. మహిళలు మానసికంగా ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపుల పట్ల ధైర్యంగా 111పోలీసులకు ఫిర్యాదు చేయాలని భీమవరానికి చెందిన వైద్యురాలు మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం ఎన్టీఆర్తోనే పోయింది టీడీపీపి స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలోనే ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండేదని డాక్టర్ నూరి పరి అన్నారు. ఆయన్ని వెన్ను పోటు పొడిచి ఈ లోకం నుంచి పంపించేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆ పార్టీకి ఆధిపత్యం చెలాయిస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. పదో తరగతి విద్యార్ధిని మేఘనని, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతున్న మరో విద్యార్ధినిని ఇదే విధంగా ట్రోల్ చేసి మానసిక హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలికేసులో అజయ్ సత్య అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై రాష్ట్రప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ముంబయి) కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షించాలని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి శిల్పా నాగినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా కోరారు. వందలాది మంది మహిళలతో కలిసి ఆమె బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థినులతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాక్షసుల వేధింపులకు బలైపోయిన ఆడబిడ్డ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాక్షసుల వేధింపులకు బలైపోయిన విశ్వబ్రాహ్మణ జాతి ఆడ బిడ్డ గీతాంజలిని బలి తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. గీతాంజలికి పట్టిన దుర్గతి భవిష్యత్‌లో మరొకరికి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు లబ్ది జరిగిన సంతోషాన్ని పంచుకుంటేనే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు, ఆయా పార్టీల సోషల్ మీడియా రాబందుల వికృతచేష్టలకు నిండుప్రాణం బలికావడం విచారకరమని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. వుయ్ స్టాండ్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బెంగళూరు బస్టాండులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెనాలిలో స్వర్ణకార దుకాణాల బంద్ గీతాంజలి మృతికి సంతాపంగా బుధవారం తెనాలిలో స్వర్ణకారులు బంద్ పాటించారు. పట్టణ నడిబొడ్డులోని వెయ్యికి పైగా స్వర్ణకార దుకాణాలను మూసివేశారు. శ్రీకామాక్షీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వందలాది కార్మికులు మాజేటి నాగేశ్వరరావు వీధిలోని అసోసియేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా దౌర్జన్యానికి బలైన గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించటంపై హర్షం వ్యక్తంచేశారు. -
సోషల్ మీడియా చీడ పురుగులు
సాక్షి, అమరావతి:పేదింటి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడితే వారికి కడుపు మంట..వారిపై సోషల్ మీడియాలో హేళనలు... వేధింపులు ప్రభుత్వ బడిలో చదువుకుని ప్రతిభా పాటవాలతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే చాలు... సోషల్ మీడియాలో ఈసడింపులు... చీత్కారాలు.. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని పేద మహిళ సంతోషం వ్యక్తం చేస్తే చాలు... సోషల్ మీడియాలో దూషణలు, దుర్భాషలు.. పేదలు, సామాన్యులు హాయిగా నవ్వితే ఓర్చుకోలేరు... సంతోషంగా ఉంటే తట్టుకోలేరు... జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కితే సహించలేరు. దూషణలతో వేధిస్తూ.. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానభారంతో నలుగురులోకి రాలేని పరిస్థితి తీసుకువస్తారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీడీపీ, జనసేనలు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్‌తో పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకోసం టీడీపీ, జనసేన పార్టీలు ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతుండటం ఆ రెండు పార్టీల దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట.. ఓటమిని జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరపరాజయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బరితెగించారు. సాధారణ మహిళలు, విద్యార్థులు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరతీశారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లతో దాడులు చేయమని తమ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు ఆదేశించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు పక్కా పన్నాగంతో సోషల్ మీడియా వేదికగా కుట్రకు తెరతీశాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వందలాది మందిని తమ సోషల్ మీడియా విభాగాల్లో నియమించాయి. వేలాది ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా సామాన్యులను వేధించడం మొదలుపెట్టాయి. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా సోషల్ మీడియా ద్వారా సామాన్యులను వేధించడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలకు చెందిన వందలాది మంది ట్రోలింగ్ పిశాచాలుగా మారి సామాన్యులను వేధింపులకు గురిచేశారు. లబ్ధిదారులే లక్ష్యం పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, వాహనమిత్ర, చేయూత, తోడు, చేదోడు, సున్నావడ్డీ, రైతు భరోసా తదితర పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే చాలు వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా కట్టడిచేయాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల కుట్ర. న్యాయ వ్యవస్థపైనా ట్రోలింగే టీడీపీ, జనసేన పార్టీలు చివరికి న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టకపోవడం పరాకాష్ట. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోనం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి లక్ష్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌ను గతేడాది నవంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, సీఐడీ కఠిన చర్యలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టింగులు పెడుతున్నవారిరి ఐపీ అడ్రస్‌లతో గుర్తించి కేసులు నమోదు చేస్తోంది. సైబర్ బుల్లీషీట్లను తెరచి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సీఐడీ 2,919 సైబర్ బుల్లీషీట్లను నమోదు చేసింది. సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీఐడీ విభాగం కోరుతోంది. సామాన్యుల గొంతు నొక్కే కుట్ర ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించవచ్చు... పథకాల్లో లోపాలను ప్రశ్నించవచ్చు. అందుకు విరుద్ధంగా పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యక్తిగతంగా వేధించేందుకు బరితెగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విధానంపై ప్రశంసలు వ్యక్తమవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చలేదు. కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించడంతో ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, జనసేన నేతలు, సోషల్‌మీడియా విభాగాలు వేధింపులకు పాల్పడ్డాయి. అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనూ అదే రీతిలో వేధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఆ రెండు పార్టీల లక్ష్యం. ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి మాట్లాడకుండా చేయాలన్నదే కుతంత్రం. వేధిస్తే కఠిన శిక్షలు ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. 67 ఐటీ చట్టం: ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 354: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మహిళను నేరుగా గానీ ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా అదే పనిగా సంప్రదించడం, వెంటపడటం, దూషించడం, అవమానించడం, వేధించడం తీవ్రమైన నేరాలు.. అందుకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 509: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను తమ మాటలు, చేతలు, సైగల ద్వారా అవమానించడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 306: ఒకర్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం. బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఐపీసీ 120ఎ: ఇద్దరు గానీ అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఒకరిని నేరుగా లేదా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా వేధించడం తీవ్రమైన నేరం. ఐపీసీ 504: ఉద్దేశ పూర్వకంగా గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఫిర్యాదు ఇలా...సైబర్ క్రైమ్ పోర్టల్: https:// cybercrime. gov. in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 ఇంగ్లిషులో మాట్లాడితే ఓర్వలేక.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ), ‘ లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం నేర్పించారు. అమెరికాలోని అట్లాంటా, జార్జియా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, వారి స్నేహితులతో ఆన్లైన్లో విద్యార్ధులతో డిబేట్ నిర్వహించారు. తోలెం మేఘన, తేజస్విని వంటి విద్యార్థినులు మెరికల్లా రాణించారు. అమెరికన్ యాసలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి టీడీపీ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ విద్యార్థినులకు వ్యతిరేకంగా ట్రోల్ చేయించారు. ఆ విద్యార్థినులు టెన్త్‌లో ఫెయిల్ అయ్యారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరుపారేసుకున్నారు. ఆ విద్యార్థిని టెన్త్‌లో 478 మార్కులతో పాసైంది. ఆ విద్యార్థిని తల్లి తొండంగి పోలీసులకు 2022 జూన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మేఘనపై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేశారు. ఆమె తల్లి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్ట్ 2020 సెక్షన్ 67 కింద ట్రోలర్స్‌పై అప్పటి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు. -
ఎంత మానసిక క్షోభ అనుభవించావో అమ్మా..!
తణుకు అర్బన్: తన ఇద్దరు కుమార్తెలను వదిలి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటే.. ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తనకు సొంతిల్లు వచ్చిందని.. జగనన్న తన కల నెరవేర్చాడని తెనాలికి చెందిన గీతాంజలి ఒక యూట్యూబ్ చానల్‌కు ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేని టీడీపీ పచ్చ దొంగలు ఆమైపె సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మటమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు చలించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయంతోపాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఐటీడీపీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని చెప్పారు. ఒక మహిళ ప్రభుత్వం వలన తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వలన ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముందుగా గీతాంజలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మనన్ నత్తా కృష్ణవేణి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి రాము, తణుకు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండ్రాజవరపు గీత, ఎం.లలిత, ఫహీమా, కొఠారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేనవి నీచ రాజకీయాలు బుట్టాయగూడెం: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ, జనసేన పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన నాలుగో విడత చేయూత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్స్‌ను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల భర్త, పిల్లలు అన్యాయమైపోతారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గీతాంజలి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు. నడిపల్లిలో రాస్తారోకో పెదవేగి : గీతాంజలిది ఆత్మహత్య కాదని టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్యగా పరిగణించి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టేటి స్టాలిన్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం నడిపల్లిలో గీతాంజలి మృతికి నిరసనగా రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ఉక్కుర్తి నాగేశ్వరరావు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు ఎం. గోపాలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవాపురంలో ర్యాలీ చింతలపూడి: గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ గిరి భోగారావు డిమాండ్ చేశారు. బుధవారం చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ పడమటి ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి గీతాంజలి మృతికి శ్రధ్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో చుండూరి కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన వల్లే గీతాంజలి చనిపోయింది తణుకు అర్బన్: టీడీపీ, జనసేన సామాజిక మాధ్యమాల్లో వేధించడం వల్లే తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని తణుకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పొడుగు రామాచారి (రాము) అన్నారు. గీతాంజలి మృతికి బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం తనకు దస్తావేజులతో కూడిన ఇంటిపత్రాలు ఇచ్చారని సంతోషంగా చెప్పిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన గీతాంజలిని ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించడం దారుణమని అన్నారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా తనకు అందిన సౌకర్యాన్ని చెప్పుకున్నందుకు ఆమె చనిపోయేంతగా వేధిస్తారా అని నిలదీశారు. వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొల్తి హరికృష్ణప్రసాద్, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు టేకు రాజు, ధవళేశ్వరపు సుబ్బారావు, కోరుమిల్లి సుబ్బారావు, నాగమల్లి సాయి, తమిరి శివకుమార్, ఉప్పరాపల్లి బాలు పాల్గొన్నారు. -
మీరో ‘గీతాంజలి’ కావద్దు
గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. రాజకీయపార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మరెవ్వరూ గీతాంజలిలా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సొరచేపలతో జాగ్రత్త... ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి ఉండదు. ఇంకా చెప్పాలంటే బాధపడుతుంటే చూసి ఆనందించే శాడిజం ఉంటుంది. అలాంటి సొరచేపల బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండువైపులా పదునున్న కత్తి... సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వక్రమార్గంలో వినియోగిస్తే ప్రాణాలు తీయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తిని ఒక మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వారు బాధపడతారేమోనని సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మనల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఎవరూ ఎవరికీ ప్రత్యక్షంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ముక్కూమొహం చూపించాల్సిన అవసరం లేదు. వివరాలు తెలియకుండా, రహస్యంగా ఉంటూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ట్రోలర్స్‌లో సహానుభూతి కనిపించదు. వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. వాటిని తట్టుకోవడం అందరికీ సులభం కాదు. గీతాంజలి లాంటి సున్నిత మనస్కులకు అసలే కాదు. చదవండి: టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర మరేం చెయ్యాలి? ►ఈత తెలిసినవారే సముద్రంలో అడుగుపెట్టాలి. అలాగే మాటల బాణాల నుంచి తప్పించుకోవడం తెలిసినవారే సోషల్ మీడియాలో అడుగుపెట్టాలి. చిన్న చిన్న విమర్శలకు కూడా విపరీతంగా బాధపడే సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఈ వైపు చూడకపోవడమే మంచిది. ►మనం రాసే రాతలు, పెట్టే ఫొటోలు వీలైనంత వరకూ వివాదాస్పదం కానివిగా చూసుకోవాలి. అయినా ఒక్కోసారి మనం ఊహించని కోణాలను మనకు అంటగట్టి విమర్శిస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►మీరు ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు, మీపై ట్రోలింగ్ నడుస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చూసి బాధపడటం కంటే, చూడకుండా ప్రశాంతంగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ►సోషల్ మీడియా వల్ల కొందరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటున్న మాట వాస్తవమే. వారి ఉద్దేశాలు స్పష్టం. వారు విమర్శలను పట్టించుకోరు. కానీ సామాన్యుల ఉద్దేశం.. కేవలం టైమ్ పాస్ లేదా కొంచెం గ్నానం సంపాదించుకోవడం. అందువల్ల సోషల్ మీడియా లైకులు, షేర్ల గురించి ఆందోళన చెందకుండా, ఆరాటపడకుండా ఉండటం నేర్చుకోవాలి. ►ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయిన వార్తలు నిత్యం పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం. అందువల్ల ఆన్లైన్ స్నేహాలను సీరియస్ గా తీసుకోకపోవడం, పరిధులు తెలుసుకుని మసలుకోవడం మంచిది. ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మీ ప్రమేయం లేకుండా మీపై ట్రోలింగ్ మొదలైనప్పుడు.. వెంటనే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు తీసుకోండి. ఆయా అకౌంట్లపై రిపోర్ట్ కొట్టించండి. అవసరమనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. ►ట్రోలింగ్ వల్ల మీలో ఆందోళన పెరుగుతుంటే, కుంగిపోతుంటే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను కలవండి. మీ ఆందోళన తగ్గేందుకు, ఆనందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతాడు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్
విజయవాడ: తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఎన్ మారేష్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే,స్థానిక పోలీసులతో బీసీ కమిషన్ సభ్యులు మాట్లాడారు. వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సాక్షితో బీసీ కమిషన్ మెంబర్ మారేష్ మాట్లాడారు. ‘గీతాంజలి మరణం వెనుక కుట్ర కోణం ఉంది. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని చెప్పిన లబ్ధిదారులు భయబ్రాంతులకు గురై చనిపోతే ఇంకెవరూ అలా మాట్లాడకూడదనేది ప్రత్యర్ధుల కుట్ర. బీసీలు విశ్వాసానికి ప్రతీక.. నవరత్నాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రభుత్వం ద్వారా మేలు పొందిన ప్రభుత్వానికి అండగా ఉంటారనే అక్కసుతోనే ఈ కుట్ర. చేసిన తప్పేంటి.. లబ్ధి కలగడంతో ఆనందపడడమే ఆమె చేసిన తప్పా. గీతాంజలి మరణం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకోవాలి. గీతాంజలి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెపై కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరం. బీసీలు కన్నెర్ర చేసే బీసీ వ్యతిరేకులు రోడ్లపై తిరగలేరు. ఆ రాజకీయ పార్టీలు ఇంకెంతమంది బీసీలను బలి తీసుకుంటాయి. రైల్వే అధికారులు, పోలీసులతో మాట్లాడాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విశ్వ బ్రాహ్మిన్ మహిళ చనిపోవడం బాధాకరం. అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఎంతో మానసిక ఒత్తిడికి గురై గీతాంజలి చనిపోయింది’ అని మారేష్ అన్నారు. -
టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర
ఈ నైచ్యానికి అంతులేదు. ఈ మానవ మృగాలకు బుద్ధి రానే రాదు. ప్రభుత్వ పథకాలు తమ కుటుంబానికి మేలు చేశాయన్నందుకు.. బీసీ మహిళ గీతాంజలిని వీధి కుక్కల్లా వెంటాడారు. వేధించారు. థర్డ్‌డిగ్రీకి పదింతల ఆన్లైన్ టార్చర్‌కు గురిచేశారు. తట్టుకోలేక ఆమె రైలు కింద పడి తనువు చాలించినా ఈ దరిద్రులకు సిగ్గురాలేదు. రైల్వేస్టేషన్ దగ్గర ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో ఎవరో తీసిన రెండు నిమిషాల వీడియోలో మాటల్ని ఎడిట్ చేసి మరీ.. చనిపోయాక కూడా ఆమెను చిత్రవధ చేయడం మొదలెట్టారు. ‘ఎవరో ఇద్దరు నెట్టేశారంట’ అనే మాటల్ని వీడియోకు కొత్తగా జోడించి దాన్ని ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే పోస్ట్ చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు సిగ్గూ.. లజ్జా.. ఏమైనా ఉన్నాయా? పైపెచ్చు అవే ఎడిటెడ్ మాటల్ని వైరల్ చేస్తూ.. నెట్టేసిన ఇద్దరూ ఎవరు? ఆమెతో ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా మాఫియా పలు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తోందంటే ఏమనుకోవాలి? గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే.. ఆమెపై చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించి తప్పించుకోవాలని చూస్తున్న ఈ రాక్షసుల్ని ఏం చేయాలి? వీళ్లదసలు మనిషి పుట్టుకేనా? వీళ్లకు కుటుంబాలున్నాయా? సాక్షి, అమరావతి/రేపల్లె రూరల్/తెనాలి రూరల్/ సాక్షి నెట్ వర్క్:‘పురాణాల్లో దుశ్శాసనుడు కూడా ఇంతదారుణంగా వ్యవహరించి ఉండకపోవచ్చు.. ఇప్పుడు ఆయనే ఉంటే మానమృగాలైన టీడీపీ–జనసేన సైకో మూకల తీరు చూసి సిగ్గు పడేవాడు.. ట్రోలింగ్‌తో వెంటపడి, వేటాడి గీతాంజలి మృతికి కారణమైన ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆడబిడ్డ అన్యాయంగా చనిపోయిందనే కనికరం కూడా లేని ఆ పార్టీల అధినేతలు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతుంటే తట్టుకోలేని ఈ మానవ మృగాల టార్గెట్‌తో ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమ కోల్పోయి దిక్కుతోచని వారయ్యారని, ఇందుకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబు, పవన్లేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా సైతం స్పందించింది. మితిమీరిన ట్రోలింగ్‌లకు ముకుతాడు వేయాలని వార్తలు ప్రసారం చేసింది. సర్వత్రా ఆగ్రహం ♦ టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. ఈ ఘటనను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ్, వైఎస్సార్సీపీ నెల్లూరు నాయకురాలు మోయిళ్ల గౌరి, విశాఖపట్నం వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ♦ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ శిఖామణి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ఐడీసీ ఛైర్పర్సన్ బండి నాగేంధ్ర పుణ్యశీల, మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. ఇది టీడీపీ, జనసేన సైకోల హత్య ‘గీతాంజలిది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు చిన ఆడబిడ్డలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడమే పాపమైపోయిందా? సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించుకుంటామని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా? టీడీపీ, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? మీ సోషల్ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా? తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే టీడీపీ, జనసేన సైకోలు సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని.. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్ మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని గీతాంజలి భర్త చెబుతుంటే బాధేస్తోంది. ఐటీడీపీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మహిళను బలితీసుకునే అధికారం ఎక్కడిది? టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాల కోసం మహిళను బలితీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఆ పార్టీల సోషల్ మీడియా రాబంధుల వికృత చేష్టలతో ఒక మహిళ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ–జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మనుషులా? మృగాలా? తన కూతురికి అమ్మ ఒడి వచ్చిందని, అత్తకు చేయూత, తన మామకు పింఛన్‌తో కలిపి మొత్తం ఇంటిలో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడంతో పచ్చ మందకు కళ్లు కుట్టాయి. ఇలాంటి ఘటనలతో పైశాచిక ఆనందాన్ని పొందేందుకేనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు రూ.కోట్లు వెచ్చించి సోషల్ మీడియాను నడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. మహిళల సంక్షేమానికి ఏం చేశారు. ఆయన హయాంలోనే బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ వేదికల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా ట్రోలింగ్‌తో నీచపు రాజకీయం చేశారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ కక్షగట్టి ట్రోలింగ్ గీతాంజలి మృతికి కారణమైన బాధ్యులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని గీతాంజలి గట్టిగా చెప్పడం టీడీపీ, జనసేనకు నచ్చలేదు. అందుకే పనిగట్టుకుని, కక్షతో ట్రోలింగ్‌కు గురిచేశారు. మానసిక చిత్రహింస తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఒక సామాన్య మహిళపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టేవారిని సభ్యసమాజంలోని ప్రతి వ్యక్తి ఖండించాలి. తాము పొందిన లబ్ధి గురించి తెలియజేస్తున్న ప్రజల స్వేచ్ఛను హరించేలా టీడీపీ–జనసేనల సోషల్ మీడియాల్లో వికృతంగా వ్యవహరించడం దారుణం. – మోపిదేవి వెంకట రమణారావు, ఎంపీ మనిషిని బతికించేలా మాట ఉండాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బతికించేలా ఉండాలి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బలైన గొల్తి గీతాంజలి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం ప్రశంసనీయం. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడేవారిని శిక్షించాలి. – జి.శాంతమూర్తి, వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు దోషులను వదిలేది లేదు: ఎస్పీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసు విచారణ వేగవంతం చేశామని, దోషులను వదిలేది లేదని గుంటూరు ఎస్పీ తుషార్‌డూడీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు తెనాలికి చెందిన గీతాంజలి(32) తెనాలి ఐదో నంబర్ ఫ్లాట్‌ఫాం సమీపంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఆమె 11వ తేదీ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించిందన్న సమాచారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు 174 సెక్షన్ కింద కేసునమోదు చేశారని చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి తెనాలి వన్‌టౌన్‌కు బదిలీ చేశారని, రైల్వే పోలీసుల విచారణ నివేదిక ఆధారంగా కేసును సెక్షన్ 174 నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306కి మార్పు చేయడం జరిగిందన్నారు. గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిందన్న ఉత్సాహంలో చేసిన వీడియోను పోస్టు చేసినందుకు ఆమెను చనిపోయేలా కించపరిచారన్నారు. ఇప్పటికే ట్రోల్ చేసిన వారి హ్యాండిల్స్‌ను గుర్తించామని, ఇందులో కొంతమంది తమ పేరుతోనే అకౌంట్ నడుపుతుంటే మరికొందరు ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారు. వీరందరిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు. మానవత్వం లేని నాదెండ్ల తెనాలి పట్టణం వహాబ్చౌక్ ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ప్రారంభంలోనే ఉన్న గీతాంజలి ఇంటి ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడి జరిగిన ఘటన గురించి చర్చించుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల తీరు విమర్శలకు దారితీసింది. గీతాంజలి ఇంటికి కూత వేటు దూరంలోనే ఆయన నవ్వుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ‘ఈయనేం లీడర్.. మానవత్వం లేదా?’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
చనిపోయినా 'చిత్రవధ'..
మధ్య తరగతి కుటుంబం.. ఎంతో విలువలతో కూడిన జీవితం. అత్తమామల మెప్పు పొందింది. పిల్లల అభిమానాన్ని... భర్త అనురాగాన్ని చూరగొంది. ప్రభుత్వం చేసిన సాయానికి పొంగిపోయింది. ఓ సాధారణ మహిళగా తన ఆనందాన్ని అందరితోనూ పంచుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. పచ్చ రాబందుల దుష్ట పన్నాగానికి బలైపోయింది. సోషల్ మీడియా వేదికగా చేసిన నీచాతినీచమైన వ్యాఖ్యలకు తల్లడిల్లిపోయింది. ఆమె ఆనందం ఎంతోసేపు నిలవనివ్వని సోషల్ మాఫియా వేధింపులకు మానసికంగా కలత చెందింది. నలుగురికి తన బాధను చెప్పుకోలేక రైలుకింద పడి ప్రాణం తీసుకుంది. ఇదీ తెనాలికి చెందిన బీసీ(విశ్వబ్రాహ్మణ) మహిళ గొల్తి గీతాంజలిది. ఇప్పుడు ఆమె చావుపైనా ఆ ‘పచ్చ’మూక తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. ఆ సంఘటనకు తమకేమాత్రం బాధ్యతలేదని తప్పించుకోజూస్తోంది. కానీ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి వాస్తవాలు వెలికి తీస్తోంది. ఆ నీచుల భరతం పట్టేందుకు సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి కుటుంబానికి చాలావరకూ వర్తించాయి. ఇటీవలే తనకు ఇంటి స్థలం ఇచ్చారని.. తనకు ఎంతో సంతోషంగా ఉందని, అమ్మఒడి, పింఛన్, వైఎస్సార్ చేయూత వంటి మరెన్నో పథకాలు వచ్చాయని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాతో ఎంతో అమాయకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పింది. సహజంగానే పచ్చనేతలకు ఆమె చెప్పిన విషయాలు రుచించలేదు. ఆమెపై టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్లు చూసి గీతాంజలి తట్టుకోలేకపోయింది. ఆమె భర్తను దుర్భాషలాడుతూ, అమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టింగులు చూసి విలవిలలాడి పోయింది. అవమానంతో కుంగిపోయింది. కనీసం ఇంట్లో వారితో కూడా తన బాధను పంచుకోలేక రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యకాదు... సోషల్ మీడియా చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని గీతాంజలి భర్త బాలచంద్ర తెలిపారు. అన్యాయంగా తన భార్యను బలి తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. రెచ్చిపోతున్న పచ్చ సోషల్ మూక సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన పోస్టింగ్‌లపై కేవలం సెక్షన్ 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఐటీడీపీ, జనసేన సోషల్‌మీడియా రెచ్చిపోతోంది. వారి దాష్టీకంవల్లే ఆ నిండుప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. పచ్చబ్యాచ్ దుర్మార్గాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆమె కుటుంబానికి పలువురు అండగా నిలిచారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టబోమని ప్రకటించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డిని కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గీతాంజలి కుటుంబ సభ్యులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ, ఎమ్మెల్సీ పోతుల సునీత, పార్టీ నేతలు వరుదు కళ్యాణి, వాసిరెడ్డి పద్మ, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మహిళా కమిషన్ సభ్యురాలు వెంకటలక్ష్మి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది సోషల్‌మీడియా టెర్రరిజమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ ముమ్మరం గీతాంజలి ఆత్మహత్యకు పురిగొల్పినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సోషల్‌మీడియాలో ఆమెపై అసభ్యంగా ట్రోలింగ్ చేసిన 26 మందిని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులే కాకుండా పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా ఘోరంగా ట్రోల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కనీసం విచారం వ్యక్తం చేయని తెలుగుదేశం నేతలు... మరింత బరితెగించి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది ఏడోతేదీ కాగా, ట్రోలింగ్ ఎనిమిది నుంచి మొదలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె వీడియో వైరల్ అయిన ఆరో తేదీనే అజయ్‌చౌదరి సజ్జా, స్వాతీరెడ్డి మరికొందరు నీచాతినీచంగా ట్రోల్ చేశారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ పోస్టులన్నీ డిలీట్ చేశారు. అయితే అప్పటికే పోలీసులు ఈ పోస్టులను సేకరించారు. రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలి పెట్టదని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. సెన్సేషనల్ అంటూ ఫేక్ వీడియో టీడీపీ, జనసైనికుల సోషల్‌మీడియా ట్రోలింగ్‌లకు బలైన గీతాంజలి విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తప్పుడు ప్రచారానికి సిద్ధం అయ్యింది. సెన్సేషనల్ అంటూ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో లోకో పైలెట్ ఆమెను రైలులోనే రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఆమెను ఎవరో ఇద్దరు తోసేశారంటగా మావా.. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు వాయిస్ ఓవర్‌తో ఒక వీడియో విడుదల చేశారు. ఇంటి పట్టా వచ్చినందుకు ఆనందంగా మీడియాతో మాట్లాడినందుకే ట్రోల్ చేసిన తెలుగుదేశం సోషల్‌మీడియా ఇప్పుడు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుండటంతో దాని నుంచి బయటపడేందుకు గీతాంజలి క్యారెక్టర్‌ను తప్పుగా చూపించేలా ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఎవరో ఇద్దరితో రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు, వారు ఆమెను రైలు కిందకి తోసేసి పారిపోయారన్నట్లుగా వాయిస్ ఓవర్‌తో ప్రచారం చేస్తోంది. ఆ వీడియో గమనించిన ఎవరికైనా అది ఎడిటింగ్ వీడియో అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ వ్యవహారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ వీడియోపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు గీతాంజలిని ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే బాధ్యులను గుర్తించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓవర్‌యాక్షన్ చేసి కొంత మందిని ఇబ్బంది పెట్టిన వారిపై 6,970 సోషల్‌మీడియా బుల్లీయింగ్ షీట్లు నమోదు చేశాం. సుమారు 7వేల మందిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 2023 సంవత్సరంలో ఆయా అకౌంట్‌దారులపై 327 కేసులు నమోదు చేశాం. హైకోర్టు జడ్జిని దూషించిన కేసులో 53 మందిపై కేసులు నమోదు చేశాం. దిశ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సైబర్, సోషల్ మీడియా అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేలా పొందుపరిచి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. – పాలరాజ్, ఐజీ, గుంటూరు రేంజ్ -
నా భార్యను కూడా వేధించారు: పోసాని భావోద్వేగం
తెనాలి మహిళ గీతాంజలి చావుకు టీడీపీ సోషల్ మీడియానే కారణమని విమర్శించారు ఏపీఎఫ్డీఎఫ్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. సాధారణ మహిళను వెంటాడి, వేధించడంతో మానసిక వేదనతో గీతాంజలి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చావుకు చంద్రబాబు, లోకేషే బాద్యత వహించాలన్నారు. ఈ మేరకు పోసాని మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించిన ప్రతి ఒక్కరిపై.. ఆయన వ్యక్తిగత దాడులకు పాల్పడుతుంటాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్, సాధారణ పౌరులతో సహా ఎవరిని బాబు వదిలిపెట్టడని అన్నారు. మోదీ చంద్రబాబును అవినీతిపరుడని విమర్శిస్తే.. తిరిగి బాబు ప్రధానిని భార్య, కుమారుడు లేడంటూ వ్యక్తిగతంగా దుయ్యబట్టారని అన్నారు. మోదీ కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నారు. గీతాంజలిపై కూడా అలాగే వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆమె చావుకు టీడీపీ కారణంగా నిలిచిందని మండిపడ్డారు. వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ బూతులు తిడుతున్నాడు. ఒకవేళ పవన్‌ను ప్రశ్నిస్తే.. వాళ్ల సైకో ఫ్యాన్స్ ఎమ్మెల్యేలను, వారి భార్య పిల్లలను బూతులు తిడతారు. టీడీపీ, జనసేన సైకో అభిమానులు నా భార్యను కూడా వదల్లేదు. తనపై కూడా బూతులు తిట్టారు. నాభార్య గురించి తన మొబైల్‌కే అసభ్యంగా మెసెజ్‌లు పంపారు. గీతాంజలి కంటే ఎక్కువ వేధింపులకు గురిచేశారు. ఇన్ని తిట్టినా నా భార్య ఏడవలేదు. ధైర్యంగా నిలబడింది. నా భార్య కూడా గీతాంజలిలాగా చనిపోయి ఉంటే నాకు దిక్కు ఎవరు ఉంటారు. నా భార్య నవ్వే నాకు ఇన్సిపిరేషన్. నాకు అప్పుడు ఏడుపు రాలే.. ఇప్పుడు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. అప్పుడు ఈ వెధవలను బహిరంగంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అప్పుడే మీడియాతో మీటింగ్ పెట్టి నా భార్యకు వచ్చిన మెసెజ్‌లు అన్నీ చూపించా. వాళ్లు ఎలా తిట్టారో నేను వాళ్లను అలాగే తిట్టిన. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరాడాలని సవాల్ విసిరాను. చంద్రబాబు దగ్గర ఉన్న విచ్చలవిడి డబ్బులతోటి దివంగత ఎన్టీఆర్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టించాడు. వెన్నుపోటు పొడిచి సీఎం పోస్టు లాక్కున్నాడు. సీఎం జగన్ నుంచి 23 ఎమ్మెల్యేలను కొన్నాడు. జైలు కెళ్లి మళ్లీ అదే డబ్బులు వెదజల్లి బయటకు వచ్చాడు. చంద్రబాబు ఓటర్లను ప్రేమిస్తాడు. సీఎం జగన్ ప్రజలను ప్రేమిస్తాడు . అదే ఇద్దరికిఉన్న తేడా కాబట్టే జనం గుండెల్లోఉన్నాడు. సిద్ధం సభకు లక్షల జనాలు వచ్చారు. మహిళలు ఎవరూ ఏడవకండి. అధైర్య పడకండి.. వేధవలు ఉంటారు.. తట్టుకొని ధైర్యంగా ఎదుర్కోండి. మనకేనా కన్నీళ్లు ఉంటాయి.. వాళ్లకు ఉండవా.. ప్రశ్నించి ఎదురుతిరగండి. రేపు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మహిళలు రోడ్డు మీదకు రండి.. గీతాంజలి నా చెల్లె కాదు కదా. నా అక్క కాదు కదా. నా కుంటుబ సభ్యురాలు కాదు కదా.. నా వరకు వస్తే చుద్దాంలే అప్పటి వరకు నారా లోకేష్ ఇంటికి వెళ్లండి.. వాళ్ల భార్య బ్రహ్మిణి దగ్గరకు వెళ్లి చెప్పండి. గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా ట్రోల్సింగ్స్తో చంపించాడు. నీ భర్తను చెప్పుతో కొట్టి బుద్ధి వచ్చేలా చేయ్ అని నిలదీయండి. ఇతడి వల్ల ఇంకెవరూ చనిపోకుండా మీరు వచ్చి నిలదీస్తే ఇలాంటి ఆత్మహత్యకు తగ్గుతాయి’ అని పోసాని పేర్కొన్నారు. గీతాంజలి అనే మహిళ తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ సీఎం జగన్‌ను పొగడటం ఆమె పాలిట శాపమైంది. టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెంటాడి వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రతిక్షణం నరకం చూపించారు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది.ట్రోలింగ్ భరించలేకపోవ్వడంతో చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. -
సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?
టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల టార్గెట్‌తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో సంతోష పడిన గీతాంజలిని.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేసి వేధించారు. గీతాంజలి మృతిపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి, తాడేపల్లి: గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. పచ్చపార్టీలను తరిమికొట్టాలి టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు ఘాటుగా స్పందించి పచ్చపార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తున్నా గీతాంజలి మరణం చాలా బాధాకరమని బొత్స ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ప్రతిపక్షాలు వేధించడం దుర్మార్గ చర్చ అని మండిపడ్డారు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన వేధింపులే కారణమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా అని అన్నారు. గీతాంజలి మృతికి ప్రధాన కారణమైన అజయ్ సజ్జాను విడిచిపెట్టకూడదని అన్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. అజయ్ సజ్జాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చనిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం..!
-
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్‌ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్‌తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్‌తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘యానిమల్’లో గీతాంజలిగా రష్మికా మందన్నా
‘మీ గీతాంజలి’ అంటూ ‘యానిమల్’లో రష్మికా మందన్నా చేస్తున్న పాత్ర పేరు ప్రకటించి, శనివారం లుక్‌ని విడుదల చేసింది యూనిట్. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ఈ 28న రిలీజ్ కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. -
ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. విశ్వప్రసాద్ తల్లి గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి గారు చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు. -
geetanjali iyer: ప్రముఖ యాంకర్ కన్నుమూత
గీతాంజలి అయ్యర్(70).. దేశంలోని మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్. సుమారు 30 ఏళ్ల పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్ పని చేసిన ఆమె ఇక లేరు. బుధవారం వాకింగ్ చేసి ఇంటికొచ్చిన ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ప్రకటించారు.గత కొంతకాలంగా పార్కిన్సన్స్తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1971లో దూరదర్శన్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా చేరిన ఆమె.. ఆంగ్లంలో వార్తలు చదివిన తొలి ప్రజెంటర్ కూడా. నేషనల్ బులిటెన్‌తో దేశవ్యాప్తంగా ఆమె మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాదు.. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్ అవార్డు అందుకున్నారు. మీడియా రంగంలో సేవలకుగానూ గీతాంజలి.. 1989లో అవుట్‌స్టాండింగ్ విమెన్ అవార్డుగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు.వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)తో కలిసి పనిచేశారు. గీతాంజలి మృతి విషయం తెలిసిన పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సైతం ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. గీతాంజలి అయ్యర్.. కోల్‌కతా లోరెటో కాలేజీలో ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డిప్లోమా సైతం పూర్తి చేశారు. దూరదర్శన్ కెరీర్ ముగిశాక.. కార్పొరేట్ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్ అనే సీరియల్లోనూ చివరిసారిగా నటించారు. గీతాంజలికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి కూడా అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ కూడా. My heartfelt condolences to the family of Geetanjali AyyarJi. Saddened to know that one of the best Doordarshan news presenters of yesteryears Geetanjali Ji passed away. She was a role model for news presenters .. May her soul rest in Peace pic.twitter.com/46ZKScrZ5R — Vijayasai Reddy V (@VSReddy_MP) June 8, 2023 Gitanjali Aiyar, India’s one of the best tv newsreaders, warm and elegant person and woman of immense substance passed away today. Deepest condolences to her family. 🙏 pic.twitter.com/4q1C6vFHbh — Sheela Bhatt शीला भट्ट (@sheela2010) June 7, 2023 -
నటి గీతాంజలికి సైబర్ వేధింపులు
-
డేటింగ్ యాప్‌లో ఫొటోతో నటికి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కొందరు పోకిరీలు తన ఫొటోను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ సినీ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్‌లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. చదవండి: నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2! -
నటి గీతాంజలికి సైబర్ వేధింపులు
-
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
గీతాంజలి
1989..మే..10 ‘గీతాంజలి’ విడుదలైన రోజు. కొత్త పోస్టర్లతో థియేటర్ తళతళలాడుతూ కవ్విస్తోంది. మార్నింగ్ షో అయిపోయింది. మాట్నీ టికెట్ల కోసం కౌంటర్ ముందు క్యూలో నిలబడ్డారు. అక్కడితో పోలిస్తే సోమరాజు సోడాషాపు దగ్గరే రద్దీ ఎక్కువుంది. ఎండాకాలం...పైగా కొత్త సినిమా వచ్చింది. మా ఊరంతటకీ సోమరాజు బాబాయ్ నిమ్మషోడా బాగా ఫేమసు. దాంతో కిష్యూమ్..కిష్యూమ్ అంటూ గోళీలు సౌండు చేస్తున్నాయి. థియేటర్‌కీ సోడా షాపుకీ రోడ్డే అడ్డు. నేనేమో బడ్డీ బయట ఉన్న బల్లమీద కూర్చుని పేపరు తిరగేస్తున్నా. డిగ్రీ పూర్తయి ఉద్యోగాల వేటలో ఉన్న నాబోటివాళ్లందరికీ అదే అడ్డా. కాస్త ఖాళీ దొరికినా సోమరాజు సోడా షాపు ముందు వాలిపోతాం. బాబాయ్ చెప్పే కబుర్లు, టేపురికార్డర్లోని పాటలు వింటుంటే భలే కాలక్షేపం అయిపోద్ది. ‘జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం...’ – టేపురికార్డర్లో ఇళయరాజా పాటలు దుమ్మురేపుతున్నాయి. థియేటర్లో ఏ సినిమా ఆడుతుంటే ఆ పాటలు మా బాబాయ్ షాపులో మోగడం ఆనవాయితీ. ఈసారి ‘గీతాంజలి’ వంతొచ్చింది. ‘‘నాగేశ్వర్రావుగారబ్బాయి సినిమా ఎలా ఉందట..’’ థియేటర్ ప్రహారీ గోడపై అతికించిన పోస్టర్ చూస్తూ అడిగాను. ‘‘బా స్లో అట్రా.. ఫైటింగులు కూడా లేవట. జనం కూడా పలచగానే ఉన్నారు మరి’’ సోడా కొడుతూనే సమాధానం చెప్పాడు బాబాయ్. ‘‘పాటలు మాత్రం అదిరిపోయాయ్ బాబాయ్’’ అన్నాన్నేను పేపరు మూస్తూ. నా మాటల్ని ఆలకించే స్థితిలో లేడు బాబాయ్. గళ్లా పెట్టెలో చిల్లర లెక్కేస్తూ బిజీ అయిపోయాడు. ‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తెల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే...’ బాలు గొంతులో పాట ఎక్స్‌ప్రెస్ రైలులా పరుగెడుతోంది. ఈలోగా సడన్ బ్రేకేస్తూ ఆగింది ఆర్టీసీ బస్సు. మా ఊరికి బస్స్టాండంటూ లేదు. కానీ బస్‌స్టాపులు ఎక్కడ పడితే అక్కడున్నాయి. అందులో ఇదొకటి. ‘‘రాజమండ్రి బస్సా..’’ గళ్లా పెట్టెలో ముంచిన తల బయటకు తీయకుండానే అడిగాడు బాబాయ్. ‘‘రెండున్నర అంటే రాజమండ్రి బస్సే కదా..’’ అన్నాను. ఎక్కేజనం. దిగే జనం. ‘‘ఎంతోసేపు ఆగదు...త్వరగా..’’ అంటూ కండక్టరు హడావుడి చేస్తున్నాడు. డ్రైవరేమో...బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ ‘‘బాబాయ్...సోడా...’’ అంటూ కేకేశాడు. షాపు ముందు బస్సు ఆపినందుకు డ్రైవరు గారికి ఇలా మామూలివ్వడం బాబాయ్‌కి మామూలే. ఆ కాసేపూ..పాసింజర్లు ఎవరైనా సోడా కోపం పిలుస్తారని బాబాయ్ ఆలోచన. బాబాయ్ సోడా పట్టుకుని పరుగెట్టాడు. నా కళ్లెందుకో బస్సుమీదకు మళ్లాయి. అందులో ఎండ ధాటికి మగ్గిపోతున్న జనాన్ని జాలిగా చూస్తున్నాను. ‘‘నాకూ ఓ సోడా..’’ బాబాయ్‌కి ఆర్డర్లు పెరుగుతున్నాయి. సడన్‌గా నా జాలి చూపులు ఓ చోట బలంగా అతుక్కుపోయాయి. కిటికీ పక్కన ఓ అందమైన అమ్మాయి. అందం అంటే మామూలు అందం కాదు. స్వర్గం నుంచి సెలవుల మీద భూమ్మీదకు వచ్చిన దేవకన్యలా అనిపించింది. చల్లని గాలి కోసమేమో...కిటికీలోంచి తలని బయటపెట్టింది. సురుక్కున తాకాల్సిన ఎండ కూడా ఆమె మేను చూసి వెనక్కి వెళ్లిపోతుందేమో అనిపించేంత అందంగా..తనని తాకిన గాలి కూడా మంచు ముత్యమైపోతోందేమో అన్నంత సుకుమారంగా ఉంది. కాటుకలో ముంచిన కళ్లు..గులాబీ రంగు పెదాలు...నుదుటిమీద చమటతో అతుక్కుపోయిన ముంగురులు.. ఇంత ఉక్కబోతలోనూ చెదిరిపోని నవ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ బీరువాలో జాగ్రత్తగా దాచుకున్న తన పెళ్లినాటి పట్టుచీరలా ఉంది. చలం చూసుంటే ఈ నిమిషమే ‘ప్రేమలేఖలు 2’ అంటూ మరో పుస్తకం వదిలేవాడు. తిలక్ అయితే ‘ఆర్టీసీ బస్సులో ఆడపిల్ల’ అంటూ సరికొత్త ప్రేమ కావ్యం రాసేవాడు. బుచ్చిబాబు ఇంత అందాన్ని ఇది వరకు చూడనందుకు తప్పకుండా చిన్నబుచ్చుకుందుడు. కవులంతా కలాలు వదిలి– కలల్లో విహరించేవారు. నేను కవిని కాదు కదా. అందుకే అలా చూస్తుండిపోయా. ఎందుకో తను కూడా నా వైపు చూసింది. ఆ క్షణం గుండె పేలినంత ఉద్వేగం. మరణం ముంగిట ఎవరి జీవితమైనా సరే కళ్లముందు గిర్రున తిరుగుతుందట. అలా నా జీవితం కూడా సినిమాలా ‘ప్లే’ అయితే..అందులోని తొలి సన్నివేశం ఇదే కావొచ్చు. ఈ తన్మయత్వం నుంచి తేరుకునేలోగా..బస్సు కదిలిపోయింది. నా చూపులు, మనసు, ఆత్మ...అన్నీ ఆ ఆర్టీసీ బస్సు వెనుకే వెళ్లిపోయినట్టు స్థబ్దుగా ఉండిపోయాను. ‘‘ఏంట్రా అలాగైపోయావ్..’’ బాబాయ్ నన్ను ఆరోసారో, ఏడోసారో గట్టిగా కుదిపితే ఈలోకంలో పడ్డాను. ‘‘ఏంలేదు బాబాయ్..అమ్మాయ్..అందమైన అమ్మాయ్..ఆర్టీసీ బస్సులో..’’ పెదాలు పొడిబారిపోతున్నాయ్. ‘‘ఓర్నీ..అదా సంగతి...అట్టా బిగుసుకుపోయావేంటా అనుకున్నా..సోడాగానీ తాగుతావా’’ అంటూ ఓ బుడ్డీ అందించాడు. చిమ్మ చీకట్లో ఓ మెరుపు మెరిస్తే కళ్లు కాసేపు మసకబారిపోతాయి. ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. బాబాయ్‌ని, సోడానీ వదిలేసి..ఇంటివైపుకు అడుగులేశా! పన్నెండో గంట కొట్టింది మా ఇంటి గడియారం. అయినా నిద్ర లేదు. నిజం చెప్పాలంటే నిద్రని నేనే నా దరికి రానివ్వలేదు. కళ్లు మూస్తే..పొద్దుట చూసిన అమ్మాయి కూడా కలలా మారిపోతుందని భయం. లాంతరు వెలుగుల్లో ఆ అమ్మాయే. అద్దం ముందు నిలబడితే..ఆ అమ్మాయే. గోడ మీద అతికించుకున్న పోస్టర్లలో శ్రీదేవి మాయమైపోయి, ఆ అమ్మాయే వచ్చి నిలబడుతోంది. మళ్లీ మళ్లీ ఊపిరి లాగేసుకుంటోంది. ‘‘ఎవరా అమ్మాయి..ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది?’’ నా ఆలోచనలన్నీ ఈ ప్రశ్నల చుట్టూనే. మళ్లీ ఆ అమ్మాయిని చూస్తానా? అంత అదృష్టం ఈ జన్మకి ఉందా? మంచమంతా అటూ ఇటూ దొర్లుకుంటూ, ఆ అమ్మాయిని ఊహల్లో ఇంకా ఇంకా నింపుకుంటుంటే ఏ తెల్లవారుఝామునో నిద్రపట్టింది. మరుసటి రోజు అలవాటు ప్రకారం...అదే సమయానికి బాబాయ్ కొట్టుకెళ్లా. ‘ఆమనీ పాడవే హాయిగా.. మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో...’ – మళ్లీ ‘గీతాంజలి’ క్యాసెట్టే. ‘‘నిన్న రాత్రి రెండో ఆటకెళ్లారా...మరీ అంత బ్యాడుగా ఏం లేదు..’’ – ‘గీతాంజలి’ సినిమాపై తన రిపోర్ట్ చెప్పేశాడు. బాబాయ్‌కి మంచి టేస్టు ఉంది. తనకి సినిమా నచ్చితే జనాలకు నచ్చినట్టే. అందుకే రెండోరోజుకి కాస్త జనం కూడా పెరిగారు. ‘‘అద్సరే గానీ, కొట్టు చూసుకుంటావా...భోజనానికి వెళ్లొత్తా. ఆకలౌతోంది. మీ పిన్నిని క్యారేజీ తీసుకురమ్మంటే ఇంకా రాలేదు. రాజమండ్రి బస్సొచ్చే టైమైంది. డ్రైవరుకి సోడా ఇవ్వడం మర్చిపోకురోయ్’’ అంటూ ఇంటిదారిపట్టాడు బాబాయ్. ‘రాజమండ్రి బస్సు’ అనగానే నిన్నటి అమ్మాయి గుర్తొచ్చింది. టైమ్ చూశా. 2.25. రాత్రి ఏడున్నరకు దూరదర్శన్‌లో టంచనుగా వార్తలొచ్చినట్టు..సరిగ్గా సమయానికి రాజమండ్రి బసొచ్చి ఆగింది. ‘బాబాయ్.. సోడా..’ అలవాటు ప్రకారం డ్రైవర్ అరిచాడు. పరుగు పరుగున వెళ్లి సోడా అందిస్తూనే, నిన్నటి కిటికీ వైపు ఆశగా చూశా. ఆనందం, ఆశ్చర్యం...మళ్లీ ఆ అమ్మాయే. ‘వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించిలే మరీచికా..’ ఈ పాట నాకోసమే రాశాడేమో వేటూరి. ఆ క్షణం నేనే బాలూనైపోయాను. ఇళయరాజానైపోయాను. నాగేశ్వర్రావు గారి అబ్బాయినీ అయిపోయాను. ఓ మగాడ్ని ఇన్ని రకాలుగా మార్చే శక్తి అమ్మాయిలకే ఉందనిపించింది. చిత్రంగా ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తోంది. ‘‘నాకో సోడా..’’ అంది. బాబాయ్ కొట్లో ఉన్న టేపురికార్డరు నా చేతుల్లో ఉండుంటే..ఆ మాటల్ని రికార్డు చేసుకుని మళ్లీ మళ్లీ వినేవాడ్ని. సినిమాల్లోలా..జీవితంలోనూ స్లో మోషన్ ఉండే బాగుణ్ణు. ‘‘నా...కో....సో....డా’’ అన్నప్పుడు ఆ పెదాల కదలికని కళ్లారా చూస్తూ, మనసారా దాచుకునేవాడ్ని. అయినా దేవతలు సోడా తాగుతారా.. వాళ్లకు అమృతం ఉంది కదా? ‘‘మిమ్మల్నే.. సోడా..’’ అంది ఈసారి గట్టిగా. ఇచ్చాను. సోడాలు తాగడం పెద్దగా అలవాటు లేదేమో..బుడ్డీ ఎత్తుతుంటే నీళ్లకు గోళీ అడ్డు పడుతోంది. ‘‘అటు కాదు..ఇటు తిప్పి తాగండి..’’ నా సూచన పనిచేసింది. ఈసారి ఎత్తిన బుడ్డీ దించకుండా తాగేసింది. ‘‘ఎంత..?’’ ‘‘ముప్పావలా...’’ చిల్లర చేతిలో పెట్టింది. బస్సు కదిలిపోయింది. ఓ చేతిలో తాను తాగేసిన సోడా. మరో చేతిలో ముప్పావలా. కపిల్‌దేవ్ వరల్డ్‌కప్ గెలిచినప్పుడు కూడా అంత సంతోషించలేదేమో? ఆ నిమిషంలో వరల్డు కప్పు కంటే ఈ సోడానే విలువైనది అనిపించింది. భోంచేసి బాబాయ్ వచ్చేశాడు. ‘‘బాబాయ్ ఈ ఖాళీ సోడా..నేను తీసుకెళ్లనా.’’ అని చిన్నపిల్లాడిలా అడిగాను. ‘‘దాన్నేం చేసుకుంటావ్‌రా...’’ జరిగింది చెప్పా. ‘‘ఓర్నీ..రెండోరోజుకే ముదిరిపోయావ్రో..’’ అంటూ నవ్వాడు. ఖాళీ సోడా..ముప్పావలా చూస్తూ ఆ రోజూ నిద్రని వీధి గుమ్మం దగ్గరే ఆపేశాను. గీతాంజలి విడుదలైన మూడోరోజు... టాక్‌తో పాటు జనాలూ పెరుగుతున్నారు. ఆ రోజు ఎప్పటికంటే ముందే వచ్చి కూర్చున్నా. ‘‘ఏంట్రోయ్..టైమ్ టేబుల్ మారింది’’ అన్నాడు బాబాయ్ నవ్వుతూ. నేనేం సమాధానం చెప్పలేదు. వాచీ వంక...రోడ్డు వంక చూస్తూ కుర్చున్నాను. ‘‘రాజమండ్రి బస్సు కోసమేనా..’’ బాబాయ్ మళ్లీ నవ్వాడు. ‘‘సోడాలమ్ముకో బాబాయ్...నాతో నీకేంటి..’’ అంటూ మళ్లీ రోడ్డు వైపుకు చూపు పోనిచ్చాను. గడియారంలో ముళ్లులు మొరాయించి, క్షణాలకు బద్దకం ఎక్కువై మెల్లిగా నడుస్తున్నట్టు అనిపించింది. ‘ఓ పాపాలాలీ.. జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా..’ – బాలు అలవాటు ప్రకారం గుండెల్ని మెలిపెట్టేస్తున్నాడు. అయితే ఈసారి నా మనసు బాలు పాటనీ, బాబాయ్ మాటనీ వినిపించుకునే స్థితిలో లేదు. ఈరోజూ అమ్మాయి వస్తుందా? నాకు మళ్లీ కనిపిస్తుందా? ఇవే ఆలోచనలు. వాటికి పుల్‌స్టాప్ పెట్టడానికి ఆర్టీసీ బస్సు సడన్ బ్రేకు వేస్తూ ఆగింది. పున్నమి వెన్నెల్లో..జాబిల్లిలా మళ్లీ మెరిసింది ఆ అమ్మాయి. నా జీవితంలో..వరుసగా మూడో వసంతం. ‘వచ్చిందిరా నీ పిల్ల..’ బాబాయ్ కళ్లతోనే మాట్లాడాడు. డ్రైవరుకి అందివ్వడానికి బాబాయ్ సోడాలు తీసుకుని పరుగెట్టాడు. నీనేమో ఆ పిల్లనే చూస్తూ నిలబడ్డా. ‘‘ఏవోయ్.. ఓ సోడా...’’ నన్నే చూస్తూ పిలిచింది. అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వాలిపోయా. సోడా తాగడంలో అనుభవం వచ్చేసినట్టుంది..ఈసారి గడ గడ తాగేసింది. పెదవంచున ఓ చుక్క..ఆమె ఎదపై దూకాలా వద్దా అని ఆలోచిస్తూ సిగ్గుపడుతున్నట్టు అనిపించింది. దూరం నుంచి... ‘ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః హృదయ లయలకు ఓం.. ఓం నమః అధర గతులకు ఓం నమః మధుర స్మతులకు ఓం...’ సందర్భానికి తగ్గట్టు పాట మొదలైంది. ఇళయరాజాకు మనసులోనే దండం పెట్టుకున్నా. సోడాతో పాటు ముప్పావలా చేతికిచ్చింది. ఒలంపిక్ జ్యోతి పట్టుకున్నట్టు మళ్లీ మురిసిపోయాను. బస్సు వెళ్లిపోయింది. అప్పటి నుంచీ రోజూ ఇదే తంతు. బస్సు కోసం నేను ఎదురుచూడడం, ఆ అమ్మాయి సోడా కోసం పిలవడం, ఖాళీ సోడా, ముప్పావలాతో ఇంటికి రావడం. నా గదంతా సోడాలతో నిండిపోతోంది. అర్థరూపాయి, పావలా బిళ్లలతో డిబ్డీ బరువెక్కింది. ‘‘నా కొట్లో కంటే..నీ గదిలోనే ఎక్కువ సోడాలున్నాయ్రా’’ అంటూ బాబాయ్ ఎన్నోసార్లు వేళాకోళం చేశాడు. నిస్సారంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఆ అమ్మాయి సమీరంలా వచ్చింది. చల్లగా తాకింది. తనని చూసేది కొన్ని క్షణాలే. కానీ ఆ క్షణాల కోసం రోజంతా ఎదురుచూడడంలో ఓ ఆనందం ఉండేది. పదమూడోవ రోజు పరికిణీ ఓణీలో వచ్చింది. పదహారో రోజు నారింజ రంగు పంజాబీ డ్రస్సు వేసుకుంది. ఇరవై ఆరో రోజు చేతికున్న వాచీ మారింది. ముఫ్ఫై రెండోవరోజు ‘‘ఈరోజు చిల్లర లేదు..రేపు ఇస్తాన్లెండి’’ అంది. ఆమె ప్రతి కదలికా నాకు గుర్తే. బస్సు ఆగిన కొద్దిసేపూ తను ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుందో కూడా నాకు లెక్కే. ‘‘కనీసం ఏమైనా మాట్లాడ్రా..అలా మొద్దులా చూస్తుండిపోక..’’ అని బాబాయ్ చాలాసార్లు చెప్పాడు. ‘మీ పేరేంటండీ..’ అని నాకెన్ని వందలసార్లు అడగాలనిపించిందో...ఆ బస్సెక్కి తనతో పాటు ప్రయాణించాలని ఎన్ని వేలసార్లు అనుకున్నానో..తాను ఎక్కడ దిగుతుందో కనుక్కోవాలని మనసు ఎన్ని లక్షల సార్లు ఆరాటపడిందో బాబాయ్కేం తెలుసు? అలా చేస్తే, తాను నొచ్చుకుంటే..మళ్లీ నా వైపు చూస్తుందా? కనీసం సోడా కోసమైనా నన్ను పిలుస్తుందా?– ఇలా ఎన్నో భయాలు. ఆ రాజమండ్రి బస్సు.. నాకో ప్రేమ చిహ్నం. నా రాజకుమారిని మోసుకొచ్చే పల్లకి. ఆ స్వప్నాల సారథి అయిపోయింది నా జీవితం మొత్తం ఆ బస్సు, అందులో కిటికీ పక్కన కూర్చున్న అమ్మాయీ ఆవహించేశాయి. గీతాంజలి విడుదలై 48వ రోజు రెండ్రోజులు ఆగితే 50 రోజుల పోస్టరు పడిపోతుంది. అయినా సరే..థియేటర్ దగ్గర సందడి తగ్గలేదు. అంతా కుర్రాళ్లే. ఒకటో రోజు బాలేదన్నవాళ్లు, రెండ్రోజులు ఆగి ఫర్లేదన్నారు. వారం గడిచాక హిట్టన్నారు. ఇప్పుడు ‘క్లాసిక్’ అంటున్నారు. అంటే ఏమిటో నాక్కూడా తెలీదు. తెలుసుకునే పరిస్థితుల్లోనూ నేను లేను. ఎందుకంటే నా ఆలోచనలన్నీ ఆ అమ్మాయే ఆక్రమించేసుకుంది. ఎప్పటిలా బాబాయ్ బడ్డీ దగ్గర బస్సు కోసం నేను.. అది వెళ్లగానే నన్ను ఆట పట్టించడానికి బాబాయ్ రెడీగా ఉన్నాం. ఆ రోజు కూడా బస్సు టంచనుగానే వచ్చింది. అలవాటు ప్రకారం..కిటికీ పక్క సీటు దగ్గరకు పరుగెట్టాను. చూస్తే...ఆ సీటు ఖాళీగా ఉంది. ఒకవేళ సీటు మారిందేమో అనుకుని బస్సంతా కళ్లేసుకుని వెదికా. ఎక్కడా కనిపించలేదు. గుండె ఆగినంత పనైంది. బాబాయ్ అప్పటికే డ్రైవరుకి సోడా అందించి తిరిగొచ్చేస్తున్నాడు. ‘‘రైట్.. రైట్’’ అంటూ కండెక్టరూ విజిలేశాడు. బస్సు ముందుకు కదులుతోంది. ‘‘ఆపండీ..’’ అని అరవాలనిపించింది. గొంతు పెగల్లేదు. ఆ బస్సుని వెనక్కి లాగాలని వుంది. నా శక్తి సరిపోదు. ఎంత బలహీనత ఆవహించిందంటే..చేతిలోని సోడా కూడా వేళ్ల సందుల్లోంచి చేజారి భళ్లుమంది. బాబాయ్‌కి నా పరిస్థితి అర్థమైంది. తనకీ ఏం చెప్పాలో తెలియడం లేదు. బస్సు వెళ్లిపోయింది. మోయలేనంత బాధ గుండె మీద పడుతున్న వేళ..ఆ పొగలోంచి ఓ ఆకారం కనిపించింది. తనే! మబ్బుల్లోంచి ఒళ్లు విరుచుకుంటూ బయటపడ్డ చందమామలా దర్శనమిచ్చింది. అప్పటి వరకూ నన్ను దహించి వేసిన నైరాశ్యం చిటికెలో మాయమైంది. కానీ అంతకు మించిన ఆశ్చర్యం నన్ను కమ్మేస్తోంది. ఈ పిల్ల బస్సు ఎందుకు దిగింది? ఎప్పుడు దిగింది? తను నా వైపే వడి వడిగా అడుగులేస్తూ వచ్చి నా ముందు నిలబడింది. బాబాయ్ కూడా కరెంటు షాకు తిన్నవాడిలా చూస్తున్నాడు. తనకూ నాకూ..మధ్య జానెడు దూరం కూడా లేదేమో. తన శ్వాస నాకు తగులుతోంది. లేదు...దహించి వేస్తోంది. ఆ కళ్లు సూటిగా నన్నే చూస్తున్నాయి. లేదు..ఏవో ప్రశ్నలు సంధిస్తున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. నాదైతే ఏకంగా శరీరమే కంపిస్తోంది. తానేమైనా మాట్లాడుతుందా? లేదా నా నుంచి ఏమైనా సమాధానం ఆశిస్తుందా? తెలియడం లేదు. ఈ నిశ్శబ్దాన్నీ, మౌనాన్నీ ఛేదిస్తూ..ఒక్కసారిగా నా చెంప ఛళ్లుమనిపించింది. నేను ఊహించని పరిణామమిది. సోడా అందుకుంటున్నప్పుడు సుతి మొత్తగా తన వేళ్లుతాకితే అవి చామంతులనుకున్నాను. ఛర్నాకోళ్లని అప్పుడే తెలిసింది. భయంతో బాబాయ్..బడ్డీ కొట్టులోనే ఉండిపోయాడు. ‘‘ఎందుకు ప్రతీరోజూ...అలా తినేశాలా చూస్తావ్? ఇలా ఎన్ని రోజులు చూస్తావ్?’’ నన్ను కొట్టి..తను కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది. ‘‘నిన్ను చూడగానే నచ్చావ్. ఎంత నచ్చావంటే..నీకోసమే ప్రతీ రోజూ నాకు పని లేకపోయినా ఇదే బస్సులో ప్రయాణించేంత..దాహం వేయకపోయినా నీ చేతితో ఇచ్చే సోడా తాగేంత.. ఈ మౌనం భరించలేక నీ చెంప ఛెళ్లుమనిపించేంత’’ కన్నీళ్లకు వెక్కిళ్లు తోడయ్యాయి. ‘‘ఏరోజైనా నాతో మాట్లాడతావేమో అని చూస్తుంటాను. కనీసం పేరైనా అడుగుతావని అనుకుంటాను. నువ్వు అడిగితే ఇద్దామని ఫోను నెంబరు కూడా కాగితం పై రాసుకుని పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటాను..’’ చేతిలోని కాగితాన్ని చింపి అవతల పారేసింది. అది కాగితం కాదు..నా మనసే. ‘‘నిన్ను చూసే ఈ కొన్ని క్షణాల కోసం రోజంతా పడిగాపులు కాస్తుంటాను తెలుసా.’’ అరె..అచ్చంగా ఇవన్నీ నా మాటలే కదా, తను చెబుతోందేమిటి? ‘‘చూస్తావు..సోడా ఇస్తావు..వెళ్లిపోతావు. ‘గీతాంజలి’ పాటలొకటి..’’ బాబాయ్ బడ్డీ కొట్టులోని టేపురికార్డర్ వైపు కోపంగా చూసింది. పాపం దానికి ఇవన్నీ ఏం తెలుసు? ‘ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్లిపో.. ఓ కోయిల పాడవే నా పాటనీ తీయని తేనెలే చల్లిపో..’ అంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతోంది. ‘‘మీ అబ్బాయిలకు ప్రేమించేంత తీరిక ఉంటుంది గానీ, దాన్ని బయట చెప్పడానికే ధైర్యం ఉండదు. నీ కళ్లల్లో నాకు కనిపించిన ప్రేమ, నా చూపుల్లో నీకు కనిపించలేదా? ‘కనీసం ‘నువ్వు నాకు నచ్చావ్..’ అని మీ మనసులోని మాటైనా చెప్పలేరా? ఆ మాత్రం ధైర్యం చేయలేరా?’’ నాకు నోరు విప్పే అవకాశమే ఇవ్వడం లేదు. ‘‘చెప్పేంత తెగువ లేనప్పుడు మా మనసుల్ని మీ చూపులతో ఆడుకోవడం కూడా మానేయండి. ఇక చాలు.. నాకు ఓపిక లేదు. నీ కోసం బస్సుల్లో నీ కోసం పిచ్చిదానిలా తిరగలేను. నీకూ నీ అర్థం కాని చూపులకూ, ఆ చూపుల కోసం వెంపర్లాడే నా అమాయకత్వానికీ ఇక సెలవు. ఇక జన్మలో ఇటువైపుకు రాను..’’ అంటూ వడివడిగా కదిలిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే అటువైపుగా వచ్చిన మరో బస్సు ఎక్కి వెళ్లిపోయింది. ‘వెళ్లిపోకు నేస్తమా..ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే..తెంచి వెళ్లిపోకుమా..’ పాట ప్రవహిస్తూనే ఉంది. మరుసటి రోజు..ఎప్పటిలానే బడ్డీ ముందు కూర్చున్నా. బాబాయ్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపుల్లో జాలి ఉంది. ప్రేమ ఉంది. ‘అయ్యో.. ఏమైపోతాడో’ అనే భయం ఉంది. ‘‘రాజమండ్రి బస్సు ఇంకా రాలేదు కదా బాబాయ్’’ అన్నాను వాచీ చూస్తూ. బాబాయ్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్. ‘‘రాలేదు..’’ అన్నాడు కన్నీళ్లని దిగమింగుకుంటూ. ‘‘సోడాలు రెడీ చేసుకున్నావా..’’ ‘‘ఉన్నాయ్ లేరా..’’ ఎప్పట్లా బస్సు వచ్చింది. వెళ్లింది. కానీ ఆ అమ్మాయి లేదు. అది మొదలు ఏ రోజూ..ఆ అమ్మాయి ఇక కనిపించలేదు. వారాలు..నెలలూ గడుస్తున్నాయి. ‘‘జీవితం అంటే ఇంతేరా...అన్నింటికీ తట్టుకోవాలి..’’ బాబాయ్ ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా తేరుకోలేకపోతున్నా. ఆ అందమైన ఆమె నవ్వు, చివర్లో చెంపదెబ్బ..ఏ ఒక్కటీ మర్చిపోలేకపోతున్నా. ఆ ఇల్లు, ఊరు వదిలి ఎక్కడి కైనా వెళ్లిపోవాలనిపించింది. కానీ తన జ్ఞాపకాలన్నీ కట్టిపడేస్తున్నాయి. ఎన్ని రోజులు నాతో నేను కలబడ్డానో, ఎన్నిసార్లు నాలో నేను కుమిలిపోయానో లెక్కగట్టలేను. సోడా బుడ్డీ పట్టుకుని రాజమండ్రి బస్సుకోసం ఎదురుచూస్తున్న ప్రతీసారీ.. ‘‘అమ్మాయి రాదు లేరా..అన్ని తిట్లు తిన్న అమ్మాయి ఎందుకొస్తుంది’’ అంటూ బాబాయ్ వారించేవాడు. ‘‘వస్తుంది బాబాయ్..తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి కళ్లలో కోపం కంటే ప్రేమే ఎక్కువ కనిపించింది బాబాయ్. నేను నా మనసులో మాట చెప్పలేదన్న కోపం. ఆమె మనసుని అర్థం చేసుకోలేదన్న కోపం. అందుకే కనిపించకుండా నాకు శిక్ష వేస్తూనే ఉంది. కానీ..ఏదో ఓ రోజు తప్పకుండా ఇదే బస్సులో వస్తుంది బాబాయ్. అదే బస్సులో, అదే కిటికీ పక్కన కూర్చుని ‘సోడా..’ అంటూ నన్ను పిలుస్తుంది. నాలో ఉన్న ప్రేమంతా చెప్పుకోవడానికి మరో అవకాశం ఇస్తుంది’’ ‘‘అంత నమ్మకం ఏంట్రా..’’ ‘‘ప్రేమ బాబాయ్. అది అమ్మాయి ప్రేమ. అబ్బాయిలైనా చూపులతో ప్రేమించి సరిపెట్టేస్తారేమో. కానీ అమ్మాయిలు అలా కాదు. ఒక్కసారి ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోరు. మరొకరికి తమ జీవితంలో స్థానం ఇవ్వరు. తను తప్పకుండా వస్తుంది బాబాయ్. ఆరోజు నేను లేకపోతే, నాకు మరో అవకాశమే రాదు’’ టైమ్ రెండున్నర అవుతుంది. చేతిలో సోడా పట్టుకుని రెడీగా ఉన్నాను. దూరం నుంచి బస్సు హారన్ మోగింది. ఈ బస్సులో తాను ఉండొచ్చు. ఉండకపోవొచ్చు. కానీ నా ఎదురుచూపులు మాత్రం ఆగిపోవు. ‘తరాల నా కథ.. క్షణాలదే కదా గతించిపోవు గాధ నేననీ..’ – పాట సాగుతూనే ఉంది. నా కథలా. -
ఆమెను సీతగా నటింపజేసిన ఘనత ఆయనదే..
సినిమా: గీతాంజలి. ఈ పేరు భారతీయ సినిమాకు చాలా ప్రియమైనది, గౌరవమైనది. గీతాంజలి సినిమా అనే కళామతల్లికి ముద్దుబిడ్డ. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోనైనా, పెరిగింది, నటిగా ఎదిగింది చెన్నై మహానగరంలోనే. పువ్వు పూయగానే వికసిస్తుందంటారు. అలా నటి గీతాంజలి బాల్యంలోనే నటిగా అడుగులు వేశారు. తన మూడో ఏట నుంచే నాట్యంలో శిక్షణ పొందిన గీతాంజలి అసలు పేరు మణి. పారస్మణి అనే హిందీ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్–ప్యారేలాల్ తమ సినిమా టైటిల్లో మణి ఉండడంతో హీరోయిన్ పేరును గీతాంజలిగా మార్చారు. ఆ వేళావిశేషం బాగున్నట్లుంది. అప్పటి నుంచి మణి గీతాంజలిగా పేరు మోశారు. తెలుగులో సీతగా నటించిన మొదటి నటి గీతాంజలి. మరో విశేషం ఏమిటంటే ఈమె కథానాయకిగా నటించిన తొలి చిత్రంలోనే సీతాదేవిగా నటించారు. సీతారామకల్యాణం చిత్రంలో ఆమెను సీతగా నటింపజేసిన ఘనత ఎన్టీ.రామారావుదే. ఆ తరువాత ఏఎన్ఆర్, కాంతారావు వంటి ప్రముఖ కథానాయకులందరితోనూ సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో నటించారు. అన్ని తరహా పాత్రల్లోనూ జీవించిన గీతాంజలి 500కు పైగా చిత్రాల్లో నటించారు. అందులో తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలకు చెందిన చిత్రాలు ఉన్నాయి. గీతాంజలికి చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈమె నటిగా పుట్టి పెరిగింది చెన్నైలోనే. స్థానిక హబిబుల్లా రోడ్డులో నివసించేవారు. సహ నటుడు రామకృష్ణను వివాహమాడి ఓ ఇంటివారయ్యింది చెన్నైలోనే. తమిళంలో పలు మరపురాని చిత్రాల్లో గీతాంజలి నటించారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎస్ఎస్.రాజేంద్రన్, రవిచంద్రన్, జెమినీగణేశన్ వంటి అగ్ర నటులతో నటించి పేరు గడించారు. తమిళ రంగ ప్రవేశం.. గీతాంజలి తమిళంలో నటించిన తొలి చిత్రం శారద. ఆ తరువాత దైవత్తిన్ దైవం, తాయిన్ మడియిల్, పణం పడైత్తవన్, వాళ్లై్క పడగు, ఆళై ముగం, అదేకన్గళ్, ఎన్అన్నన్ వంటి పలు చిత్రాల్లో నటించి ఖ్యాతి గాంచారు. ముఖ్యంగా పణం పడైత్తవన్, అన్నైమిట్ట కై, దైవత్తిన్ దైవం, అదేకన్గళ్, అన్భళిప్పు తదితర చిత్రాలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. మరో విషయం ఏమిటంటే గీతాంజలి మరణం అంచుల వరకూ కళామతల్లికి సేవలందించారు. బాల నటిగా పరిచయం అయ్యి కథానాయకిగా ఎదిగి, చివరి దశలో బామ్మ పాత్రల్లో కూడా నటించిన గీతాంజలి భౌతకంగా లేకపోయినా నటిగా మాత్రం సజీవంగానే ఉంటారు. -
ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత
ప్రముఖ నటి గీతాంజలి (72) ఇక లేరు. బుధవారం హఠాత్తుగా కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాత్రి 11.45 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారు జామున ఆమె తుది శ్వాస విడిచారు. 1947లో కాకినాడలో జన్మించారు గీతాంజలి. ఆమె అసలు పేరు మణి. ఆమె తల్లిదండ్రులకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి అయితే మణి రెండో కుమార్తె. మూడేళ్ల వయసు నుంచే అక్క స్వర్ణతో కలిసి కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. భర్త రామకృష్ణతో... పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచయమైంది మణి. ఆ సినిమాలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ...’ పాట నేటికీ శ్రీరామ నవమి పందిళ్లలో, పెళ్లి పందిళ్లలో వినిపిస్తుంటుంది.‘సీతారామ కల్యాణం’లో సీత పాత్ర ఒప్పుకున్నప్పుడు గీతాంజలి వయసు 14. ఎన్టీఆర్ రావణాసురుడు, రాముడేమో హరనాథ్. అంతకుముందు ‘రాణీ రత్నప్రభ’ అనే సినిమాలో గీతాంజలి చేసిన ఓ డ్యాన్స్ బిట్ చూసి, ‘సీతారామ కల్యాణం’లో సీత పాత్రకు తీసుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. ‘నవరాత్రి’లో ఓ దృశ్యం ఆ చిత్రానికి ఆయనే దర్శకుడు. ‘‘ఏం భయపడొద్దు. మీరే సీత అనుకోండి.. చేయండి’’ అని భయపడుతున్న గీతాంజలితో అన్నారు. ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్లు చేశారామె. సినిమా రిలీజైంది. ఘనవిజయం సాధించింది. అప్పుడు గీతాంజలి ఎక్కడ కనిపించినా ‘అదిగో సీత’ అనేవారు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు గీతాంజలి. ఎన్టీఆర్ తిలకం దిద్దేవారని, ‘సీతారామ కల్యాణం’ వంద రోజుల వేడుక శ్రీరామ నవమి వేడుకలా జరగడం మరచిపోలేనని ఓ సందర్భంలో పేర్కొన్నారామె. ‘మణి’ పేరుతో పరిచయమైన ఆమె గీతాంజలిగా ఎలా మారారంటే? హిందీ చిత్రంతో పేరు మార్పు ఆ మార్పుకి కారణం హిందీ సినిమా ‘పారస్ మణి’ (1963). అందులో గీతాంజలిది రాజకుమారి పాత్ర. సినిమా పేరు ‘పారస్ మణి’, కథానాయిక నిజమైన పేరు ‘మణి’ అంటే కన్ఫ్యూజ్ అవుతారని చిత్రదర్శకుడు బాబూ భాయ్ మిస్త్రీ ‘గీతాంజలి’గా మార్చారు. అప్పటివరకూ దక్షిణాది తెరపై ‘మణి’ పేరుతో పాపులర్ అయిన గీతాంజలి ఆ తర్వాతి నుంచి మార్చిన పేరుతో కొనసాగడం విశేషం. మణి సార్థక నామధేయురాలు అనాలి. పేరుకి తగ్గట్టుగానే నటనలో ‘మణి’ అనిపించుకుని, మంచి ‘నటనామణి’గా తెలుగు చలన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు గీతాంజలి. మలయాళ సినిమా ‘స్వప్నంగళ్’లో ఆమె అంధురాలి పాత్ర చేశారు. అప్పుడు గీతాంజలికి 18 ఏళ్లు. ఆ సినిమాలో గీతాంజలి చిన్ననాటి పాత్రను శ్రీదేవి చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవికి తొమ్మిదేళ్లు. తమిళంలో శారద, దైవత్తిన్ తాయ్, పనమ్ పడైత్తవన్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. హీరోయిన్ టు హాస్యం ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలూ చేసేవారు. ‘డా. చక్రవర్తి’లో చేసిన ఏయన్నార్ చెల్లెలి పాత్ర, ‘లేత మనసులు’లో చేసిన డ్యాన్స్ టీచర్ తదితర పాత్రలు గీతాంజలికి మంచి పేరు తెచ్చాయి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కథానాయికగా చేసిన ‘ఇల్లాలు’ సినిమా కూడా గీతాంజలి కెరీర్‌కి ప్లస్ అయింది. అందులో ఆమె కథానాయికగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే కథానాయికగా కొనసాగుతున్న సమయంలో ‘దేవత’ సినిమాలో హాస్యపాత్ర ఒప్పుకోవడం తాను చేసిన తప్పు అని, పద్మనాభం వల్లే తన కెరీర్ హాస్యం వైపు మళ్లిందని ఓ సందర్భంలో గీతాంజలి చెప్పారు. సినిమా పరిశ్రమలో ఏదైనా పాత్ర బాగా క్లిక్ అయితే ఆ తర్వాత ఆ ఆర్టిస్ట్‌ని ఆ తరహా పాత్రలకు పరిమితం చేయడం ఓ ఆనవాయితీ. అలా ‘దేవత’ చిత్రంలో గీతాంజలి చేసిన హాస్య పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో దర్శకులు ఆమెని చూసే దృష్టి కోణం మారిపోయింది. అప్పటినుంచి ఆమెకు కామెడీ పాత్రలకే అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే ‘వ్యాంప్ క్యారెక్టర్స్’, ‘డ్యాన్స్ నంబర్స్’ కూడా చేశారామె. హీరోయిన్గా దాదాపు 50 చిత్రాలు చేసిన గీతాంజలి కెరీర్ కామెడీ ఆర్టిస్ట్‌కి మారింది. అయితే కామెడీ జంటల్లో పద్మనాభం, గీతాంజలిలది హిట్ పెయిర్. ‘మర్యాద రామన్న’, ‘పొట్టి ప్లీడరు’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు. అది గీతాంజలి నిజాయతీకి నిదర్శనం మామూలుగా రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ‘నా స్టయిల్లో చేశాను. కాపీ కొట్టలేదు’ అని చెబుతుంటారు. కానీ గీతాంజలి మాత్రం ‘కాపీ కొట్టాను’ అని ఒప్పుకోవడం ఆమె నిజాయతీకి నిదర్శనం. తమిళంలో కె. బాలచందర్ తెరకెక్కించిన ‘ఎదిర్ నీచ్చల్’ సినిమాని ‘సంబరాల రాంబాబు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అందులో షావుకారు జానకి చేసిన పాత్రను తెలుగులో గీతాంజలి చేశారు. ‘‘తమిళ సినిమాలో షావుకారు జానకి పాత్ర చూశాను. ఆమెను కాపీ కొట్టాను’’ అని ఓ సందర్భంలో గీతాంజలి అన్నారు. బామ్మగా రీ–ఎంట్రీ కెరీర్ సజావుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు రామకృష్ణతో గీతాంజలి వివాహం జరిగింది. వాస్తవానికి వారిది ప్రేమ వివాహం అనుకుంటారు కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లే అని గీతాంజలి స్వయంగా పేర్కొన్నారు. పెళ్లి తర్వాత భర్త విశ్రాంతి తీసుకోమనడంతో గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. నటిగా రీ–ఎంట్రీలో ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంలో చేసిన బామ్మ పాత్ర క్లిక్ అయింది. ఆ తర్వాత ఆమె ఈ తరహా పాత్రలు చేయడం మొదలుపెట్టారు. తనయుడిని నటుడిని చేయాలనుకున్నారు గీతాంజలి–రామకృష్ణ దంపతులకు ఓ కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌ని నటుడిని చేయాలనే ఆకాంక్ష ఇద్దరికీ ఉండేది. 2001లో రామకృష్ణ చనిపోయారు. అప్పటివరకూ చెన్నైలోనే ఉంటున్న గీతాంజలి భర్త దూరమయ్యాక హైదరాబాద్‌కి మకాం మార్చారు. శ్రీనివాస్ ఓ మూడు సినిమాలు కమిట్ అయినా, అవి విడుదల వరకూ రాలేదు. చిత్రప్రముఖుల నివాళి గీతాంజలి హఠాన్మరణం చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి ఆమె భౌతిక కాయాన్ని నందీ నగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ ఆవరణలో ఉంచారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణంరాజు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జీవితా రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, వీకే నరేష్.. ఇలా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గీతాంజలి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సీతారామ కల్యాణం’తో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన గుర్తుండిపోతుందన్నారు. చెమర్చిన కళ్లతో శ్రీనివాస్ -
ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : నరేష్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ నటి గీతాంజలి మృతికి ‘మా’ సంతాపం తెలిపింది. ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ మాట్లాడుతూ..‘ ఈరోజు ఇండస్ట్రీ గీతాంజలిగారిలాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. అమ్మ... విజయనిర్మలతోనూ ఆవిడకు మంచి అనుబంధం ఉంది. ఇక నటిగా ఆవిడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది భాషల్లోనే కాదు.... హిందీలోనూ నటించారు. నటిగానే కాకుండా, వ్యక్తిగతంగానూ గీతాంజలిగారు ఎప్పుడూ సంతోషంగా, అందరితో కలివిడిగా ఉండేవారు. అలాంటావిడ ఉన్నట్లుండి ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని అనుకోలేదు. ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అందరికీ ఆమె ఎంతో చేరువగా ఉండేవారు. మంచి, చెడుల్లో భాగమైయ్యేవారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టిపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని అన్నారు. మరోవైపు నందినగర్‌లోని గీతాంజలి నివాసానికి టాలీవుడ్ నటులు క్యూ కట్టారు. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ... గీతాంజలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గీతాంజలికి ‘మా’ ఘన నివాళి ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తీరని లోటు అని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చదవండి: సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత -
టాలీవుడ్ సీనియర్ నటి కన్నుమూత
-
సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాత్రి 11.45 గంటలకు మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి హిట్ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు. తరువాతి కాలంలో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, భాయ్, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. కాగా, గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మిలో నటించారు. గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు. ప్రముఖ నటి గీతాంజలి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాల్లో గీతాంజలి చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన గీతాంజలి అక్కడ కూడా తన ప్రతిభ చూపారని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు గీతాంజలి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. -
‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా
‘‘నా 55ఏళ్ల సినిమా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. అయినా, ఏ రోజూ నిరుత్సాహపడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు’’ అని సీనియర్ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి అన్నారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కార్యవర్గ సభ్యులను హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు. ‘టి మా’ అధ్యక్షునిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్ రాథోడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ– ‘‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో నాకొక మంచి గుర్తింపునిచ్చారు. ఆ పాత్ర దొరకడం నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావడంలేదు. అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలకు ఒకటి, రెండు రోజుల కాల్ షీట్స్ అడుగుతున్నారు. ‘టి మా’ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్ పూర్తి చేశాం. ఎన్నో సినిమాల టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించాం. సభ్యులకు హెల్త్‌కార్డ్స్ అందిస్తున్నాం. తెలంగాణ ఫిలిం చాంబర్ కేవలం తెలంగాణ వారికి చెందినది మాత్రమే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చాంబర్లో ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ‘తెలంగాణ స్టేట్ ఫిలించాంబర్’ ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అది నలభై ఏళ్లుగా ఉంది కానీ అందులో పంపిణీదారులే ప్రముఖంగా ఉంటారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉపాధ్యక్షుడు గురురాజ్, సెక్రటరీ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ‘టి మా’ జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్ సెక్రటరీలుగా కిరణ్, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గుండు రవితేజ, ప్రేమ్, శ్రీశైలం, గీతాసింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి న్యూస్ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు. -
సంప్రదాయ సిరి
బాలనటిగా వెండితెరపై మెరిసి, సీరియల్ నటిగా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంటుంది బ్యూటిఫుల్ గీతాంజలి. జీ తెలుగులో వస్తున్న ‘సూర్యవంశం’ సీరియల్లో ‘సిరి’గా టీవీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కూచిపూడి నృత్యం అన్నా, చక్కని కథలన్నా, సంప్రదాయ దుస్తులన్నా ప్రాణం అంటూ గీతాంజలి పంచుకున్న కబుర్లు ఇవి. ‘చిన్నప్పుడు సినిమా చూసిన ప్రతీసారి నేనూ సినిమాలో కనిపిస్తా’ అని అమ్మనాన్నలతో చెప్పేదాన్ని. నా ఆసక్తి గమనించిన అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అమ్మనాన్నల సపోర్ట్‌తో ‘మహాత్మ, మొగుడు, ఉయ్యాలా జంపాలా..’ వంటి సినిమాల్లో బాలనటిగా చేశాను. అలాగే టీవీ సీరియల్స్‌లోనూ బాలనటిగా చేశాను. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయం అయ్యాను. సింగిల్ రోల్ మొదట ‘అగ్నిపూలు’ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘సూర్యవంశం’లో సిరి పాత్రలో నటిస్తున్నాను. లంగా ఓణీ పాత్రల్లో పల్లెటూరి అమ్మాయిలా ఉండటం అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వస్తే మాత్రం వదులుకోలేను. సంప్రదాయ బద్ధంగా ఉండే ఆ కాస్ట్యూమ్స్‌ని బాగా ఇష్టపడతా. అలాగే, అల్లరిగా గడుసుగా ఉండే అమ్మాయిలా నటించాలని ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లోనూ ఇద్దరు–మగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు. సింగిల్ హీరోయిన్ కథ వస్తే చేయాలనుంది. అలాగే అవకాశాలు వస్తే సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటాను. చదువును వదల్లేదు ‘డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కూచిపూడి నేర్చుకున్నాను. బాలనటిగా చేస్తూనే స్కూల్ చదువు పూర్తి చేశాను. ఆ తర్వాత వరుస షూటింగ్స్‌తో చదువు కుదరలేదు. అయినా, నేను చదువుకు దూరం కాలేదు. దూరవిద్య ద్వారా డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న లోకేశ్వర్ బ్యాంక్ ఉద్యోగి. నాన్నది వైజాగ్ కానీ, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అమ్మ అరుణ గృహిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. నేనీ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే మా అమ్మనాన్నల సపోర్టే కారణం. సీరియల్స్ అంటే మొదట్లో అమ్మనాన్న అంతగా చూసేవారు కాదు. ఇప్పుడు నా ప్రతీ ఎపిసోడ్‌ని మిస్ కాకుండా చూస్తూ ఎంకరేజ్ ఏస్తారు. మార్పులు ఉంటే చెప్పేస్తారు. చిన్నమ్మాయి అన్నారు చైల్డ్ ఆరిస్ట్‌గా ఈ పరిశ్రమలోకి వచ్చాను కాబట్టి బయట యాక్టింగ్‌కి ఎలాంటి క్లాసులు తీసుకోలేదు. బాలనటిగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగని నా సొంత నటనే మీదనే పూర్తి నమ్మకం పెట్టుకోను. సీనియర్ ఆర్టిస్టుల నటన గమనిస్తూ ఉంటాను. వారిని చూసి నా నటనలో మార్పులు చేసుకుంటూ ఉంటాను. ‘సూర్యవంశం’ సీరియల్‌కి తీసుకున్నప్పుడు చిన్నమ్మాయిలా ఉన్నానని అన్నారు. కానీ, ఇప్పుడు నా నటన చూసి బెస్ట్ అంటున్నారు. ఈ సీరియల్స్‌లో ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ ముగ్గురిలో అక్క మీన కి నేను చెల్లెల్లిని. పేరు సిరి. చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి కలెక్టర్‌ని అవ్వాలని సిరి కోరిక. అందుకు అక్క బాగా సాయం చేస్తుంటుంది. కానీ, అనుకోని పరిస్థితుల్లో సిరికి ఓ వ్యక్తితో పెళ్లవుతుంది. దీంతో సిరి అక్క, చెల్లితో విడిపోతుంది. అక్కకు దగ్గరవడం కోసం సిరి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. సెట్స్‌లోనే కాదు బయట కూడా మేం ముగ్గురం కలిశామంటే ఫ్యామిలీ మెంబర్స్‌లా హడావిడి చేస్తాం. బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అక్కచెల్లెళ్లు లేని లోటు ఈ సీరియల్ ద్వారా తీరింది. – నిర్మలారెడ్డి -
మార్చి 21న ‘విశ్వామిత్ర’
ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. ఈ మూవీలో నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజీలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. సృష్టిలో ఏది జరుగుతుందో... ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు’ అన్నారు. -
అక్షయ్ ఖన్నా తల్లి గీతాంజలి మృతి
ముంబై : వినోద్ ఖన్నా మాజీ భార్య, నటుడు అక్షయ్, రాహుల్ ఖన్నాల తల్లి గీతాంజలి ఖన్నా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంద్వాలోని తమ ఫామ్‌హౌస్‌లో కుమారుడు అక్షయ కుటుంబంతో ఉన్న సమయంలో గీతాంజలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అలిబగ్ సివిల్ ఆస్పత్రికి హుటాహుటిన కుటుంబ సభ్యులు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. శనివారం ఉదయం కుమారులు అక్షయ్, రాహుల్ ఖన్నాలతో కలిసి మాంద్వాలోని ఫామ్ హౌస్‌కు గీతాంజలి వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె చెప్పడంతో స్ధానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా కొన్ని మందులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌కు తిరిగి చేరుకోగానే విశ్రాంతి తీసుకోమని కుమారులు ఆమెకు సూచించారు. ఇక రాత్రి నిద్రిస్తున్న గీతాంజలిని పరామర్శించేందుకు అక్షయ్ వెళ్లగా ఆమె శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్టు గుర్తించారు. గీతాంజలిని వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆదివారం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. -
ఒక్కరు కాదు ముగ్గురు
‘హృదయ కాలేయం’ ఫేమ్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఇషికా సింగ్, గీతాంజలి కథానాయికలు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతోంది. ఈ చిత్రం సాంగ్ టీజర్‌ను ‘బిగ్ బాస్ 1’ కంటెస్టెంట్ల మధ్య హైదరాబాద్‌లో విడుదల చేశారు. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సంపూర్ణేష్ని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్లుంటారు’’ అన్నారు. ‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ రోజున సంపూర్ణేష్‌బాబు, సాయిరాజేశ్‌తో ‘సంపూ ఇన్ అమెరికా’ అని ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణారావు.‘‘హృదయ కాలేయం’ సినిమా టైమ్‌లో మేం ఎదగాలని అందరూ సపోర్ట్ చేశారు. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి మూడేళ్ల పాటు చాలా సమస్యలు ఎదుర్కొని అధిగమించాం’’ అన్నారు నిర్మాత సాయి రాజేష్. ‘‘మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి రాజేష్ అన్న ‘హృదయ కాలేయం’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ సినిమాకి కూడా తనే నిర్మాత. ఆయన వెనక నిలబడి ఎన్ని రోజులైనా సపోర్ట్ అందిస్తాను’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. భరత్, అజయ్, కత్తి కార్తీక, సమీర్, ముమైత్ ఖాన్, మధుప్రియ, రైటర్ కిట్టు, అనురాగ్, సౌమ్య వేణుగోపాల్, శ్రవణ్, సాయిబాలాజీ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నీవు పెంచిన హృదయమే...
అన్నపూర్ణ వారి డా. చక్రవర్తి చిత్రంలో నేను నటించిన సుధ పాత్ర నా జీవితంలో మరచిపోలేను. ఆ పాత్ర మీదే చిత్రమంతా నడుస్తుంది. నా పాత్ర ముగిసిన తరవాత ఆ పాత్రకు కొనసాగింపుగా సావిత్రి పాత్ర వస్తుంది. అప్పటికే సావిత్రి పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎల్. వి. ప్రసాద్ గారి ‘ఇల్లాలు’ సినిమా తరవాత నేను చేసిన చిత్రం డా. చక్రవర్తి. అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని అపురూపంగా చూపారు ఈ చిత్రంలో. ఎన్టిఆర్, సావిత్రి నటించిన ‘రక్త సంబంధం’ చిత్రం తరవాత అన్నచెల్లెళ్ల అనుబంధానికి ఈ చిత్రాన్నే ప్రముఖంగా చెప్పుకుంటారు. ‘గీతాంజలీ! నువ్వు అమాయకంగా ఉంటావు, పాత్రలో నటించకు, ఆ అమాయకత్వం కనిపించేలా జీవించు’ అన్నారు అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుగారు. చదువు పూర్తి చేసుకుని, ఊరి నుంచి వచ్చిన అన్నయ్య (ఏఎన్ఆర్) తన చెల్లెలిని ఒక పాట పాడమని కోరతాడు. అప్పుడు వీణ మీటుతూ ‘పాడమని నన్నడగవలెనా/ పరవశించి పాడనా/ నేనే పరవశించి పాడనా/ నీవు పెంచిన హృదయమే/ ఇది నీవు నేర్పిన గానమే/ నీకు గాక ఎవరి కొరకు/ నీవు వింటే చాలు నాకు’ అంటూ అన్నయ్య వింటే చాలు అని పాడుతుంది సుధ పాత్ర. ఆ మాటలకే అన్నయ్య మురిసిపోతాడు. ఈ పాట అంతా వీణ వాయిస్తూ పాడాలి. నాకు వీణ వాయించడం రాదు. పాటకు అనుగుణంగా వీణ మీటకపోతే, వీణ తెలిసిన వారు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని పాటలోని ఏ వాక్యాలకు ఎక్కడ ఎలా మీటాలో, స్వరస్థానాలు ఎక్కడెక్కడ వస్తాయో అంతా ముందుగానే నేర్పారు. వారు చెప్పినది చెప్పినట్లుగా చేశాను. అందువల్ల అచ్చంగా నేను వాయించినట్లుగా ఉంటుంది సినిమాలో. ఆదుర్తి, షావుకారు జానకి, దుక్కిపాటి, అక్కినేని వంటి హేమాహేమీల సమక్షంలో నటించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘‘చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై/ ఆ పూవులన్నీ మాటలై వినిపించు నీకు పాటలై’ అంటూ అన్నయ్య మీద అనురాగం ప్రతిబింబించేలా రచించారు ఆత్రేయ. ఏఎన్ఆర్ చెల్లెలిగా నటిస్తానని ఎన్నడూ అనుకోలేదు. పాట చివరలో వీణ వాయిస్తూ పడిపోయి, మళ్లీ లేచి ‘‘ఈ వీణ మోగక ఆగినా/ నే పాడజాలకపోయినా/ నీ మనసులో ఈనాడు నిండిన/ రాగమటులే ఉండనీ, అనురాగమటులే ఉండనీ’ అంటూ పాడిన ఆ సందర్భం నేటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ పాటను మూడు రోజుల పాటు సారథి స్టూడియోలో తీశారు. పాట పూర్తయ్యాక, దుక్కిపాటి చాలా ఆనందించారు. ఆయనకు పెద్దగా నవ్వే అలవాటు లేదు. కాని నన్ను చూసినప్పుడల్లా చిన్నగా, ఆప్యాయంగా పలకరింపుగా నవ్వేవారు. అన్నపూర్ణ సంస్థ మీద నాకు అపారమైన గౌరవం. ఈ చిత్రంలో భర్తగా నటించిన వ్యక్తి (పేరు గుర్తు లేదు) సారథి స్టూడియోలో ఉండేవారు. అక్కడ షూటింగ్ జరిగే సినిమాలలో ప్రత్యేక పాత్రలు మాత్రమే వేసేవారు. డా.చక్రవర్తి సినిమాలో ఆయన నా భర్తగా నటించారు. ఈ చిత్రంలో డైలాగులు కె. విశ్వనాథ్‌గారు నేర్పడం వల్ల, చాలా బాగా చెప్పగలిగాను. సుధ పాత్రకు నేను చూపిన నటన చూసి సావిత్రిగారు నన్ను మెచ్చుకున్నారు. సుధ పాత్రకు నేను న్యాయం చేయకపోతే, ఆ పాత్రకు కొనసాగింపుగా వచ్చే సావిత్రిగారి మాధవి పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. అందరి ఆశీర్వాదంతో ఈ పాట చిరస్థాయిగా నిలబడింది. ఈ ప్రభావంతో ఏఎన్ఆర్కి చెల్లెలిగా పదిహేను సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తాను. -గీతాంజలి ,సినీ నటి -
మళ్లీ గీతాంజలి
దాదాపు నాలుగేళ్ల క్రితం అంజలి ముఖ్య తారగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి బ్యానర్‌పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ ప్రేక్షకులను మెప్పించింది. కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన ఫిలిమ్ కార్పొరేషన్ పతాకం (కేఎఫ్‌సీ)పై వచ్చిన ‘అభినేత్రి, నిన్నుకోరి’ చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా కేఎఫ్‌సీ సంస్థ ముందుకు వెళ్తోంది. ఎం.వి.వి, కేఎఫ్‌సీ సంస్థల కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘నీవెవరో’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మళ్లీ ఈ రెండు నిర్మాణ సంస్థల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ‘గీతాంజలి 2’. కథానాయిక అంజలి ముఖ్య తారగా నటించనున్నారు. నటుడు ప్రభుదేవా ఈ సినిమా టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో మొదలుకానున్న ఈ సినిమాకు భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘థ్రిల్లర్ కామెడీ జానర్లో ఈ సినిమా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు కోన వెంకట్. -
గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆభరణాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం ఇచ్చిన రుణాలపై తాజాగా సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం.. గీతాంజలి గ్రూప్‌నకు రూ. 5,280 కోట్ల మేర రుణాలిచ్చాయి. దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మలను మార్చి 6న ఎస్ఎఫ్ఐవో ప్రశ్నించింది. సీబీఐ ప్రస్తుతం పీఎన్బీని వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును దర్యాప్తు చేస్తోంది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎల్వోయూ)ల ద్వారా మోదీ తదితరులు ఈ కుంభకోణానికి తెరతీశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బహ్రెయిన్‌లోని కెనరా బ్యాంక్ అధికారులు ఇద్దరిని, యాంట్వెర్ప్ (బెల్జియం)లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరినికి సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. -
‘గీతాంజలి’ భూములు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రుణ ఎగవేతదారు నీరవ్ మోదీకి చెందిన సంస్థ గీతాంజలి జెమ్స్‌కు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తంగా గీతాంజలి జెమ్స్‌కు 190 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో కట్టబెట్టారని, అందులో 95 ఎకరాలకు సేల్ డీడ్ అయిందని, మరో 95 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి 1,035 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఎంఎస్ ప్రభాకర్, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో 16 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఇప్పటికే 8 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని చెప్పారు. 2005–06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కు లు రాలేదని గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద జౌళి పార్కును సీఎం కేసీఆర్ చేతుల మీ దుగా ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, డ్రైపోర్టును ఎక్క డ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. చందన్వెల్లిలో టెక్స్టైల్స్ కంపె నీలు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రం నలువైపులా ఐటీని విస్తరించాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. రహేజా మైండ్ స్పేస్‌లోనే 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని పేర్కొ న్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. -
మృత్యువును పరహసించే చిర్నవ్వు గీతాంజలి
నాటి సినిమా ఆ అమ్మాయి చచ్చిపోబోతోంది.‘నువ్వు చచ్చిపోతావా’ ఆ యువకుడు అడిగాడు.‘చూడూ... నువ్వు చచ్చిపోతావ్. ఈ చిత్రా చచ్చిపోతుంది. ఆ శారదుందే అదీ చచ్చిపోతుంది. పళ్లికలిస్తుందే ఈ చంటిది.. ఇదీ చచ్చిపోతుంది. ఈ చెట్లు చచ్చి పోతాయ్. ఆ తీగా చచ్చిపోతుంది. నేనూ చచ్చిపోతాను. కాకపోతే నేను రెండురోజుల ముందు చచ్చిపోతాను. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం’... ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. అప్పటి వరకూ ఆ యువకుడు నైరాశ్యంతో కొట్టు మిట్టాడుతున్నాడు. కేన్సర్ వల్ల త్వరలో చావబోతున్నానని అనుక్షణం కృశించిపోతున్నాడు. ఈ అమ్మాయి కూడా వైద్యానికి వీలు లేని గుండె జబ్బుతో చావబోతోంది. కాని తనకూ ఈ అమ్మాయికీ ఎంత తేడా. తను ఘనీభవించి ఉంటే ఈ అమ్మాయి ప్రవహిస్తూ ఉంది. తను కన్నీరు కారుస్తుంటే ఈ అమ్మాయి చిన్నచిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందబాష్పాలు రాలుస్తోంది. ఈ అమ్మాయికి ప్రకృతిలో ప్రతిక్షణం ఒక జన్మ. అందమైన జన్మ.ఆ యువకుడికి ధైర్యం వచ్చింది. జీవితం పట్లఅవగాహన ఏర్పడింది. రేపటి చింత ఇవాళ ఎందుకు? ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుదాం అని ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయీ అతడితో మనస్ఫూర్తిగా ప్రేమలో పడింది. గీతాంజలి సినిమాలో గీతాంజలిగా చేసిన గిరిజ ఒట్టి అల్లరి పిల్ల. చనిపోతానని తెలిసినా మృత్యువు ఎదురైతే దానినీ అల్లరి పెడదామని చూసే పిల్ల. ప్రకాష్ పాత్ర పోషించిన నాగార్జున కూడా కొంటె పిల్లాడేకాని హటాత్తుగా మృత్యువు తనని కావలించుకోవడానికి వస్తుందని తెలిసే సరికి కొంచెం డిస్టర్బ్ అవుతాడు. ఆడుతూ పాడుతూ ‘జగడ జగడ జగడం... చేసేస్తాం రగడ రగడ రగడం’... అని చిందులేసే వయసులో నోరు తిరగని కేన్సర్ తన దేహంలో అడ్వాన్డ్స్ స్టేజ్‌లో తిష్టవేసిందని తెలిసి కుదిపినట్టు అవుతాడు. ఇంట్లో ఏడుపులుపెడబొబ్బలు. బయట సానుభూతి చూపులు. వీటి నుంచి పారిపోవాలనిపిస్తుంది. అందుకే దూరంగా ఊటీకి వచ్చేస్తాడు. ఊటీ అంతా కొండలు. మబ్బులు. ముఖాన్ని తడుముతూ వెళ్లే మేఘాలు. చొక్కా లోపలికి దూరి గిలిగింతలు పెట్టే చలిగాలులు. చెంపలను మెల్లగా చరిచి నవ్వుకుంటూ వెళ్లే మంచు తెరలు... వాటి మధ్య ఈ అల్లరి అమ్మాయి గిరిజ కూడా పరిచయం అవుతుంది. ఆమెకు ఆరోగ్యం బాగ లేదని ప్రకాష్‌కు ముందే తెలుసు. కాని ప్రకాష్‌కు ఆరోగ్యం బాగలేదని ఆ అమ్మాయికి తెలియదు. ఇన్నాళ్లు నిస్పృహగా సాగుతున్న జీవితంలో ప్రకాష్ ఒక ప్రాణవాయువులా రావడం ఆమెకు ఓదార్పుగా అనిపిస్తుంది. ప్రకాష్ ఒడిలో కూచుని, ప్రకాష్ గుండెలలో తల దాచుకుని ఒక నిశ్చింతను పొందుతుంది. అంతవరకూ ఆమె జీవితం ఒక ఆటా పాటా. హటాత్తుగా ఇప్పుడు ఆమెకు దాని మీద తీపి ఏర్పడింది. డాక్టరైన తన తండ్రి దగ్గరకు ఆ రాత్రి వెళ్లి–‘నాకు బతకాలని ఉంది నాన్నా’ అంటుంది.‘నేనేం తప్పు చేశాను. నేనెందుకు చచ్చిపోవాలి. నాకు ఇంకొన్నాళ్లు బతకాలని ఉంది.. నన్ను బతికించు’ అని ప్రాధేయ పడుతుంది.ఆ తండ్రి నిస్సహాయుడు. సైన్స్ మొత్తం ఆ జబ్బు ముందు నిస్సహాయురాలే. నాగార్జునతో కూడా ఇదే మాట అంటుంది. ‘నేను బతకాలి... మరి కొంతకాలం సంతోషంగా బతకాలి’...కాని నాగార్జున కూడా అర్ధాయుష్కుడు అని తెలిసిన క్షణాన ఆమె దిగ్భ్రమ చెందుతుంది. షాక్ అవుతుంది. ‘ఇక మీదట నువ్వు నాకు కనిపించకు’ అంటుంది.‘ఏం’ అని అడుగుతాడు నాగార్జున.‘నా కంటే ఎక్కువగా నువ్వు నాకు ముఖ్యం. నీకెలా ఉంటుందో రేపు నువ్వు ఏమవుపోతావో అనే ఆందోళనతో నేను బతకలేను’ అని అంటుంది. ఆమెకు అతడి మీద ఉన్న ప్రేమ అది. తానేమైనా పర్వాలేదు... అతడు క్షేమంగా ఉండాలనీ అలా ఉండే పరిస్థితి లేదు కనుక కనీసం అతనికి దూరంగానైనా ఉండి ఆ పరిస్థితికి స్కిప్ చేద్దామని ఆమె ఆరాటం. కాని ఉండగలదా అలా? తన జీవితంలో ఒయాసిస్సులా ప్రవేశించిన ఆ జీవధారను దోసిలిలో తీసుకోకుండా ఉండగలదా? అందుకనే పెద్ద సర్జరీ ఒకటి జరిగి మృత్యువు దాకా వెళ్లి తిరిగి వచ్చాక అతడి కోసం వెతుకుతుంది. ఆమె నుంచి దూరంగా పోదామనుకున్న అతడు కూడా ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె చేయి పట్టుకుంటాడు.‘ఎంతకాలం బతుకుతారో తెలియదు. కాని బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు’ అని స్క్రీన్ మీద పడటంతో సినిమా ముగుస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో 1989లో రిలీజైన ‘గీతాంజలి’ తెలుగులో ఒక క్లాసిక్‌గా నిలిచింది. నాగార్జున,గిరిజల నటన, ఇళయరాజా సంగీతం, పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం, వేటూరి పాటలు ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. అంతవరకూ కవిత్వాన్ని చదవడమే జనానికి తెలుసు. కాని వెండి తెర మీద కవిత్వాన్ని చూడవచ్చని కవిత్వంలా ఒక సినిమాని మలచవచ్చని మణిరత్నం, పి.సి.శ్రీరామ్ నిరూపించారు ‘గీతాంజలి’తో. అంతవరకూ వచ్చిన సినిమాల్లో హీరోకో హీరోయిన్‌కో ఒక ప్రాణాంతకమైన జబ్బు వస్తే గ్లిజరిన్‌కు చాలా గిరాకీ ఉండేది. విషాద షెహనాయీ మోగిపోయేది. కాని ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇరువురూ మృత్యువును హుందాగా ఎదుర్కొనడానికి సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులు కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న వారిలా సంయమనం పాటిస్తుంటారు. ఎప్పుడో వచ్చే చావు కోసం ఇప్పుడు కొంపలు మునిగిపోయేలా కూచోవడం ఎందుకు అన్నట్టుగా వ్యవహరిస్తారు. నాగార్జున ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ చేశారు. అలా చేయడం ఆ రోజుల్లో ఒక సాహసం అని చెప్పాలి. పైకి రావలసిన ఒక హీరో పేషెంట్లా కనిపించడం మాటలు కాదు. ఇక హీరోయిన్ కోసం సాగిన అన్వేషణలో గిరిజ ఈ సినిమా కోసమే పుట్టిందనట్టుగా సరిపోయింది. ఆ తర్వాత ఆమె పెద్దగా నటించకపోయినా గిరిజకు తెలుగునాట ఇప్పటికీ క్రేజ్ ఉందంటే దానికి గీతాంజలే కారణం. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునను గీతాంజలి, ఆ వెంటనే వచ్చిన శివ టాప్ రేంజ్‌కు తీసుకువెళ్లాయి. ఆయన కెరీర్ ఆ దెబ్బతో స్థిరపడిపోయిందని చెప్పొచ్చు. ఊటీలో అరవై రోజుల పాటు తీసిన ఈ సినిమాలో సినిమా అంతా ఒక అందమైన పొగమంచును వ్యాపించేలా చేయడం అందంగా ఉంటుంది. ‘ఒళ్లంత తుళ్లింత కావాలిలే’, ‘ఆమనీ పాడవే హాయిగా’, ‘ఓ పాపా లాలి’ పాటలు ఊటీ అందాలను చూపుతాయి. ‘ఓ ప్రియా ప్రియా’... పాటను జైపూర్‌లో తీయగా ఆ తర్వాత ఆ ట్రెండ్‌ను చాలా సినిమాలు ఫాలో అయ్యాయి. గిరిజ కాస్ట్యూమ్స్ హిట్ అయ్యి మార్కెట్లో గీతాంజలి డ్రస్సులు ముంచెత్తాయి. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే సినిమా రిలీజయ్యాక మొదటి వారం రోజులు ఫ్లాప్ టాక్ వచ్చింది. జనానికి సినిమా ధోరణి అర్థం కాలేదు. కాని మెల్లగా టేకింగ్‌ను అర్థం చేసుకుని మాకూ టేస్ట్ ఉంది అని తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్ చేశారు.ఆర్థిక కష్టమో, ఆరోగ్య కష్టమో, జీవిత కష్టమో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక్క చిర్నవ్వుతో దానిని ఎదుర్కొనడానికి సిద్ధపడితే జీవితం సులవవుతుంది అని చెప్పే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులకు ఒక రీవైటల్... నైరాశ్యంలో ఉన్నవారి సోల్ బూస్టర్. గీతాంజలి ఒక రియల్ కేరెక్టర్ మణిరత్నం ఈ సినిమా తీయడానికి ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల గీతాంజలి అనే అమ్మాయి కారణం. కేన్సర్‌తో బాధపడుతున్న ఆ అమ్మాయి తన భావాలన్నీ డైరీలా రాసి పుస్తకంగా వెలువరించింది. దానిని చదివిన మణిరత్నం ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారని అంటారు. ఈ సినిమా షూటింగ్ నాటికి మణిరత్నం–సుహాసిని కొత్తపెళ్లి జంట. ఊటీ షూటింగ్లో సుహాసిని కూడా భర్తకు కొన్నాళ్లు తోడుగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గిరిజకు నటి రోహిణి డబ్బింగ్ చెప్పింది. ఆ గొంతు బాగా నప్పి గిరిజ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యాయత్నాలకు దిగే నేటి యువత... వాకిట ముందు మృత్యువు నిలుచుని ఉన్నా చిర్నవ్వుతో యుగళగీతం పాడిన ఈ జంటను చూసి స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉంది. హాలీవుడ్లో ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ‘గీతాంజలి’ తీసిన చాలా ఏళ్లకు అంటే ?2014లో అటువంటి కథనే పోలిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్ లంగ్ కేన్సర్‌తో బాధ పడుతుంటుంది. ఆమె ఒంటరితనం నుంచి బయట పడటానికి తనలాంటి కేన్సర్ పేషంట్ల గ్రూప్‌ను కలుస్తుంది. బోన్ కేన్సర్ వల్ల కాలు పోగొట్టుకున్న హీరో పరిచయమవుతాడు. వాళ్లిద్దరూ ఎలా ఆకర్షణకు లోనయ్యారనేది కథ. హాలీవుడ్ వాళ్లే కాదు వారి కంటే ముందే మనం కూడా మంచి కథలు రాయగలం అనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. – కె -
నటి అంజలి ఇంట్లో దెయ్యం
టీనగర్: నటి అంజలి దెయ్యం భయంతో తానుంటున్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి చేరడం సంచలనం కలిగించింది. తమిళ, తెలుగు చిత్రాల్లో అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివశిస్తూ వచ్చారు. నాగార్జున కుమారుడు నటుడు నాగచైతన్య ఇంటి సమీపంలో ఈమె ఇల్లు కూడా ఉండేది. ఇటీవలి కాలంగా అంజలి ఇంటి సమీపంలో పిల్లులు అధిక సంఖ్యలో సంచరించినట్లు, రాత్రి సమయాల్లో వింతవింత శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. దీంతో అంజలి భయాందోళనలకు గురైంది. తెలుగులో గీతాంజలి అనే దెయ్యం చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రంలోని సంఘటనలాగే ఇది ఉన్నట్లు భావించారు. తన ఇంట్లో ఒకవేళ దెయ్యం సంచరిస్తుందేమో అని భావించిన ఆమె హఠాత్తుగా ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరారు. త్వరలో సొంతగా హైదరాబాద్‌లో ఒక బంగళా, లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు అంజలి నిర్ణయించారు. ప్రస్తుతం జైకు జంటగా బెలూన్ చిత్రంలో నటించారు. అంజలి, జై ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. -
బాబోయ్ దెయ్యం..
టీనగర్: నటి అంజలి దెయ్యం భయంతో తానుంటున్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి చేరడం సంచలనం కలిగించింది. తమిళ, తెలుగు చిత్రాల్లో అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివశిస్తూ వచ్చారు. నాగార్జున కుమారుడు నటుడు నాగచైతన్య ఇంటి సమీపంలో ఈమె ఇల్లు కూడా ఉండేది. ఇటీవలి కాలంగా అంజలి ఇంటి సమీపంలో పిల్లులు అధిక సంఖ్యలో సంచరించినట్లు, రాత్రి సమయాల్లో వింతవింత శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. దీంతో అంజలి భయాందోళనలకు గురైంది. తెలుగులో గీతాంజలి అనే దెయ్యం చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రంలోని సంఘటనలాగే ఇది ఉన్నట్లు భావించారు. తన ఇంట్లో ఒకవేళ దెయ్యం సంచరిస్తుందేమో అని భావించిన ఆమె హఠాత్తుగా ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరారు. త్వరలో సొంతగా హైదరాబాద్‌లో ఒక బంగళా, లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు అంజలి నిర్ణయించారు. ప్రస్తుతం జైకు జంటగా బెలూన్ చిత్రంలో నటించారు. అంజలి, జై ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. -
భాష తెలిస్తే నటన సులభం
‘‘భానుచందర్‌కు చాలా పాటలు పాడాను. ఇప్పుడు వాళ్లబ్బాయి జయంత్‌కి పాటలు పాడటం హ్యాపీగా ఉంది. ఎవరికైనా భాష మీద పట్టుండాలి. భాష బాగా తేలిస్తే నటించడం ఈజీ. యువతను ఆకట్టుకునేలా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ స్వరాలు సమకూర్చారు’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. జయంత్, శ్వేతా బసుప్రసాద్, గీతాంజలి ముఖ్యతారలుగా సతీశ్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. మాగంటి మురళీమోహన్ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఎస్పీబీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సినిమాలన్నీ ఒకటే. చిన్నా పెద్ద తేడా లేదు. హీరో జయంత్ కొత్తవాడైనా బాగా నటించాడు’’ అని శ్వేతా బసు ప్రసాద్ అన్నారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, సాగర్, చిట్టిబాబు, డాక్టర్ విజయలక్ష్మీ, జాన్‌బాబు, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్జి కట్నదాహం.. కోట్లిచ్చినా భార్యకు హింసలు!
పెళ్లి సమయంలో 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలాసవంతమైన గృహోపకరణాలు, రెండు ఖరీదైన కార్లు కట్నంగా తీసుక్నునాడు. అయినా అతని కట్నం దాహం తీరలేదు. మరింత కట్నం కోసం భార్యను వేధించాడు. ఇది సంచలనం సృష్టించిన గీతాంజలి ‘కట్నం హత్య’ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇది. 2013లో హర్యానా పంచకులకు చెందిన గీతాంజలి అనుమానాస్పదంగా మృతి చెందింది. జడ్జిగా పనిచేస్తున్న భర్త రణ్వీత్ గార్గ్ క్రూరంగా కట్నం కోసం హింసించడంతోనే గీతాంజలి చనిపోయినట్టు సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో గార్గ్‌తోపాటు అతని తండ్రి, మాజీ సెషన్స్ జడ్జి కేకే గార్గ్, అతని తల్లి రచన గార్గ్ లపై డౌరీ డేత్ (కట్నం మృతి), క్రూరంగా ప్రవర్తించడం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. జడ్జి పోస్టు నుంచి సస్పెండైన రణ్వీత్ గార్గ్ ప్రస్తుతం అరెస్టవ్వగా.. అతని తల్లిదండ్రులు ముందస్తు బెయిల్‌పై బయట ఉన్నారు. సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం 2007లో గీతాంజలి-గార్గ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో గార్గ్‌కు కట్నం కింద 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలావసంతమైన గృహోపకరాణలు, స్కోడా కారు ఇచ్చారు. 2008లో రూ. 21.6 లక్షలు విలువచేసే మరో స్కోడా సూపర్బ్ కారును కానుకగా ఇచ్చారు. 2011లో గార్గ్ తల్లిదండ్రుల ఒత్తిడితో గీతాంజలి తల్లిదండ్రులు మరో 16.3 లక్షల ప్లాట్‌ను సోనెపట్‌లో కొనిచ్చారు. అయినా, గార్గ్ కట్నం దాహం చల్లారలేదని, పంచకుల సెక్టర్ 25లో రూ. 50 లక్షలు ఇల్లు కొనివ్వాలని నిత్యం గీతాంజలిని వేధించాడని, చివరకు 2013 మేలో తనకు గుర్గావ్లో పోస్టింగ్ రావడంతో పిల్లల స్కూల్ ఆడ్మిషన్ కోసం రూ. 2.2 లక్షలు తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని గీతాంజలిపై గార్గ్ ఒత్తిడి చేశాడని, దీంతో తన మృతికి ముందు గీతాంజలి ఎంతో మానసిక క్షోభ అనుభవించిందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. -
దేశవాళీ వినోదం
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి’ చిత్రంతో హీరోగా మారారు. మళ్లీ ఆయన కథానాయకునిగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ ఫిలింస్ పతాకంపై శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పూర్ణ కథానాయిక. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే చిత్రాలను ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. మా చిత్రం చూస్తే సమైక్యంగా నవ్వుకుందాం అంటారు. ఈ సినిమాలోని కామెడీకి ‘దేశవాళీ వినోదం’ అని నామకరణం చేశా. రీ రికార్డింగ్ కాకపోయినా రష్ చూసి, సుకుమార్‌గారు నా దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తానని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు. ‘‘పూర్తి స్థాయి నవ్వులు పంచే చిత్రమిది. నా కెరీర్‌కు గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చిత్ర సమర్పకులు ఏవీఎస్ రాజు, కెమెరామెన్ నగేష్ బానెల్, ఎడిటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్, లైన్ ప్రొడ్యూసర్: రామ్మంతెన (మధు), సహ నిర్మాత: సతీష్ కనుమూరి. -
అరుంధతితో పోల్చడం ఆనందం!
దేవుడికి జంతు బలినిస్తే మంచి జరుగుతుందనే ఆచారం నేపథ్యంలో రూపొందుతున్న హారర్ సినిమా ‘అవంతిక’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పూర్ణ, గీతాంజలి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ప్రస్తుత సమాజంలో బర్నింగ్ ఇష్యూని సినిమాలో ప్రస్తావిస్తున్నాం’’ అని శ్రీరాజ్ బళ్ళా అన్నారు. ‘‘34 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుష్క ‘అరుంధతి’తో ఈ సినిమాని పోల్చడం నా అదృష్టం’’ అన్నారు పూర్ణ. చిత్ర సమర్పకులు కేఆర్ ఫణిరాజ్ పాల్గొన్నారు. -
కరీంనగర్ టు కాకినాడ
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా తర్వాత మరోసారి ఆయన కథానాయకునిగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర సమర్పకులు ఏవీయస్ రాజు మాట్లాడుతూ - ‘‘కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సరదాగా సాగే కథ ఇది. పూర్తి స్థాయి వినోదభరితంగా ఉంటుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైజాగ్, భీమిలీ, కాకినాడ, పోచంపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ సహకరించడంతో అనుకున్న టైమ్‌లో చిత్రీకరణ పూర్తయింది. అన్నివర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి. -
న్యూయార్క్... టు...కోనసీమ
ఎన్నారై కుర్రాడైన రామ్ ఇండియాలోని తన తాతను కలిసేందుకు న్యూయార్క్ నుంచి కోనసీమకొస్తాడు. ఆ ఊళ్లో తన తండ్రికి మంచి పేరుప్రఖ్యాతులుంటాయి. అందుకు కారణమైన వ్యక్తి గురించి తెలుసుకుని, తండ్రిని ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి రామ్ తన తల్లితండ్రులను ఇండియా రప్పించగలిగాడా? అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా? అవన్నీ తెలియాలంటే తమ చిత్రం చూడాల్సిందేనని నిర్మాత మువ్వా సత్యనారాయణ అంటున్నారు. అలీ రేజా, సీతా నారాయణన్ జంటగా విజయ్‌చందర్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో ఎన్ లక్ష్మీ నందా దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రామ్ ఎన్నారై’. ‘పవర్ ఆఫ్ రిలేషన్షిప్స్’ అనేది ఉపశీర్షిక. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే పాటలనూ, ఆ వెంటనే సినిమానూ విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: శ్రవణ్, కెమేరా: నాగబాబు. -
పోతన.. టైటానిక్.. చలికాలం
నెగళ్ల కాలం ఇది. పగళ్లు చాలా చిన్నవైన కాలం. మనుషులు దగ్గరకు కూడే కాలం ఇది. అవయవాలను ఒకదానికి ఒకటి దగ్గరకు చేర్చుకునే కాలం. తేనీటి కాలం ఇది. ప్రాతఃవేళ పొగలు గక్కే వేడినీటిని కోరే కాలం. నిదుర కాలం ఇది. పొడవు రాత్రుళ్లలో మనసు తీరా ముసుగు తన్నే కాలం. చలికాలం. గిలిగిలకాలం. పంటిని పన్ను తాకుతూ కటకటమని తాళం చరిచే కాలం. గీతాంజలి అంటే మొన్నటి దెయ్యం గీతాంజలి కాదు. ఊటీ గీతాంజలి. గిరిజ గీతాంజలి. లేచిపోదాం అన్న మొనగాడా ఎక్కడున్నావ్ అని కాలిని నేలకు తాటించే గీతాంజలి. మణిరత్నం గీతాంజలి. చలిని చూస్తే ఆ సినిమాలో చూడాలి. పచ్చగా ఫ్రెష్‌గా కనిపిస్తున్న కూరగాయల మార్కెట్లో అమ్మాయిని అబ్బాయి పలకరించడం అబ్బాయిని అమ్మాయి గిలిగింతలు పెట్టడం... నాన్ ఏసి థియేటర్లో కూడా స్వెటర్ వేసుకోబుద్ధయ్యే సినిమా. స్వెటర్ చలి నుంచి కాపాడే ఒక వస్త్రం. కాని తెలుగు సినిమా హీరోకు మాత్రం అదో ఫ్యాషన్ స్టేట్మెంట్. తెల్లప్యాంటు పైన రంగురంగుల స్వెటర్ తోడు మఫ్లర్... ఛళ్లున మండే ఎండలో కూడా అవి వేసుకొని మైదానాలలో పాడితేనే అతడికి అందం. ప్రేక్షకులకు చందం. కాశ్మీర్ శాలువాకు ఏం అదృష్టం పట్టిందో మనకు తెలుసు. శరీరానికి వెచ్చదనాన్ని హుందాదనాన్ని ఇవ్వాల్సిన ఆ శాలువ తెలుగు సినిమా బారిన ఒక కేన్సర్ సింబల్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్‌కు లోగో అయ్యింది. నల్లబట్టలు కట్టుకొని గడ్డం పెంచుకొని తెల్ల చెప్పుల్లోకి మారి పైన శాలువా కప్పారా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టే లెక్క. ఏదో సినిమాలో ‘ఏప్రిల్ మేలలో పాపల్లేరుగా కాంతి లేదుగా’ అనే పాట ఉంది. ఏప్రిల్ మేలలో కాలేజీలకు సెలవులట. అమ్మాయిలు రారట. కనుక కాంతి లేదుట. ఆమాటకొస్తే డిసెంబర్ జనవరిలో మాత్రం ఏ ఆనందం ఉంది. వంటి నిండా దుస్తులతో ఒకటికి రెండు పై వస్త్రాలతో ఒబేస్ అయినట్టుగా కనిపించే అమ్మాయిలే కదా ఎటు చూసినా. కాని ఒకందుకు ఇదీ మంచిదే. కుదురైన కనుముక్కు తీరేదో కనిపెట్టడానికి ఇదే అదను. కాని చరిత్రలో ఒక చలి ప్రమాదం చాలా విషాదభరితమైనది. మృత్యుశీతలం లేదా శీతల మృత్యువు... అలాంటిదే ‘టైటానిక్’ ఓడ ప్రమాదంలో సంభవించింది. 1912 ఏప్రిల్ పద్నాలుగున అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నట్టు ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. అంతకు ముందు రోజు నుంచే ఆ వైపు వెళ్లిన ఓడలు మంచు కొండలు కనపడుతున్నాయి జాగ్రత్త అని టైటానిక్‌కు సందేశాలు పంపుతున్నాయి. కాని టైటానిక్ ఫుల్ స్పీడ్‌తోనే ప్రయాణించింది. రాత్రి 11.40 గంటలకు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది. నౌక చెల్లాచెదురయ్యింది. 20 లైఫ్ బోట్లు ఉన్నాయి. కాని 700 మందే వాటి వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగారు. వాటి సామర్థ్యం 1,178. మిగిలిన వాళ్లంతా నీటి పాలయ్యారు. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఈదే శక్తి ఉంది. కాని నీళ్లు శీతలం. గాలి శీతలం. రాత్రి శీతలం. మృత్యువు శీతలం. ఒక గొప్ప ప్రయాణాన్ని మొదలెట్టిన ప్రయాణికులు 1500 మంది ఆ కాళరాత్రి చలికి వణుకుతూ వణుకుతూ మృత్యువు ముందు చేతులు ముకుళించారు. సాహిత్యం కూడా చలిని చాలా తీవ్రంగా చూసింది. చలికి భయపడింది. చలితో తలపడింది. ప్రఖ్యాత రష్యన్ రచయిత గొగోల్ రాసిన ‘ది ఓవర్ కోట్’ ప్రఖ్యాతం. ఒక చిన్న ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేసే చిల్లర జీతగాడు జీవితాంతం ఒకే కలను కంటాడు. అదేమిటంటే కొత్త ఓవర్ కోట్‌ను కొనుక్కోవడం. దారుణమైన మంచుకురిసే ప్రాంతంలో ఉన్నవారికి అంతకు మించిన ధైర్యం ఉండదు. కాని అతని దగ్గర డబ్బులు ఉండవు. నెలల తరబడి పోగేసి పోగేసి అతి కష్టం మీద ఒక ఓవర్‌కోట్ కొనుక్కుంటాడు. ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంలో కన్నీరు కారుస్తాడు. ఏం లాభం? అతని కంటే దైన్య స్థితిలో ఉన్న కొందరు జులాయిలు అతణ్ణి కొట్టి ఆ ఓవర్‌కోట్‌ను లాక్కుని వెళతారు. మానవత్వం మానవత్వం అని మాటలు చెప్పడం కాదు. భయంకరమైన చలి ఇద్దరు మనుషులు ఒక రగ్గు ఉన్నప్పుడే ఒక మనిషిలోని మానవత్వం బయటపడుతుంది. తెలుగులో ఒక లలితమైన కథ ఉంది. మధురాంతకం రాజారాం రాశారు. దాని పేరు ‘కమ్మతెమ్మెర’. ఒక జంటకు కొత్తగా పెళ్లవుతుంది. కాని సుముహూర్తం లేని కారణాన మొదటిరాత్రికి ఎడం ఉంటుంది. ఈలోపు పెళ్లికొడుకు ఊరెళ్లి కొన్నాళ్లు పనులు చూసుకొని అత్తగారి ఇంటికి వస్తాడు. పెళ్లికూతురిని చూడాలని ఒకటే తహతహ. ఆమె మాత్రం సిగ్గుతో అతడికి కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. చేతులు గాజులు పాదాల నడక ఇవే కనిపిస్తూ ఉంటాయి. పెళ్లికొడుకు నిరాశపడతాడు. రాత్రికి అలసిపోయి అరుగు మీద ఏర్పాటు చేసిన పక్కలో నిదుర పోతాడు. మంచి చలి కాలం. అర్ధరాత్రి చలి వేస్తూ ఉంటుంది. నిద్రలోనే ఒణుకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మృదువైన అందెల రవళితో సున్నితమైన గాజుల సవ్వడితో ఎవరో వచ్చి ఆ పెళ్లి కొడుక్కి వెచ్చటి దుప్పటి కప్పి తుర్రుమంటారు. నిండా కప్పుకున్నా సరే ఒక కమ్మతెమ్మెర తాకినట్టయ్యి పెళ్లికొడుకు పులకింతలు పోతాడు. ఆ జ్ఞాపకం ఇక నూరేళ్లు శాశ్వతం. ‘అహములు సన్నములయ్యె దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్; బహు శీతోపేతంబై ‘యుహు... హుహు’యని వడకె లోకముర్వీనాథా!’ అని పోతన చలి మీద పద్యం చెప్పాడు. హిందీ సినీ కవి ఒకడు ఇలాంటివి లెక్క చేయకుండా మంచి చలికాలంలో ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’ అని పాటందుకున్నాడు. ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని మన తెలుగు కవి వంత కలిశాడు. ఏం పాడుకున్నా ఇవ్వడంలో ఆనందం తెలిపే కాలం ఇది. ఉన్ని వస్త్రాలే ఎందుకు? స్నేహమయమైన వెచ్చని కౌగిలి కూడా ఈ చలికి ఒక ధన్యతను ఇస్తుంది. - సాక్షి ఫ్యామిలీ ఆ నీళ్లు మృత్యు శీతలంగా ఉన్నాయి. కెరటాలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడుతూ ఓడతో తలపడుతూ ఉన్నాయి. సాయంత్రానికి సముద్రం సద్దుమణిగింది. అతి శీతల గాలులు వీయడం మొదలుపెట్టాయి. -
ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?
రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్‌కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్‌లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్‌తో సినిమాలను నిర్మిస్తున్నాడు. తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్‌లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్‌తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్‌ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్‌తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే. -
అమ్మాయితో అమ్మాయి!
ప్రశాంతి, గీతాంజలి ముఖ్యపాత్రల్లో శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఎఫైర్’. ఈ నెల 6న విడుదల కానుంది. ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘ఓ అమ్మాయిని ప్రేమించే మరో అమ్మాయిగా నటిస్తున్నానంటే చాలా మంది అభ్యంతరం చెప్పారు. కానీ సినిమా చూశాక అభినందిస్తున్నారు. రషెస్ చూశాక, రామ్‌గోపాల్‌వర్మగారు నాకు ఫోన్ చేయడం మర్చి పోలేను. ఇంగ్లీషు, హిందీల్లోనే సాహసోపేతమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఎందుకు రాకూడదనే పట్టుదలతో ఈ సినిమా చేశాం’’ అని చెప్పారు. ‘‘అమ్మాయితో రొమాన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎక్కడా అసభ్యత లేదు’’ అని గీతాంజలి చెప్పారు. -
ఎవరి మధ్య ఎఫైర్?
ఇద్దరమ్మాయిల మధ్య జరిగే ఓ విభిన్నమైన కథగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫైర్’. శ్రీరాజన్, గీతాంజలి, ప్రశాంతి ముఖ్య తారలుగా శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను రామ్‌గోపాల్‌వర్మ హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. శ్రీరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం యువతరానికి కచ్చితంగా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, మాటలు: అనిల్ సిరిమల్ల, సంగీతం: శేషు కె,యం. ఆర్. -
విద్యార్థుల జీవన ప్రయాణం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం - ‘టెన్త్‌లో లక్.. ఇంటర్లో కిక్.. బి.టెక్‌లో...’. మంచి వెంకట్ దర్శకుడు. సురేందర్ యాదవ్ సమర్పకుడు. జె.ఎస్. రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. టెన్త్ నుంచి బీటెక్ వరకూ విద్యార్థుల పయనం ఎలా ఉంటోంది? వారి నిర్ణయాలు భవిష్యత్తుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అనీ, సందేశం, వినోదం మిళితమైన సినిమా ఇదనీ దర్శకుడు చెప్పారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - గీతాంజలి
-
టాగోర్ గీతాంజలి: ప్రార్థనకు అల్లిన గీతమాలలు
కొత్త పుస్తకం గీతాంజలి- అనువాదం: డా.భార్గవి; వెల: రూ.300 ప్రతులకు: 08674-253210, 253366 రవీంద్రనాథ్ టాగోర్ రాసిన గీతాంజలి గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. దీని మూలాలు భారతీయ తాత్త్విక చింతనలో ఉన్నాయని దేశీయ విమర్శకులు భావిస్తే పాశ్చాత్యులు బైబిల్ ‘సాంగ్ ఆఫ్ సాంగ్స్’తో సామ్యాన్ని తరచి చూశారు. దైవాన్ని ప్రభువుగా సఖుడుగా మనుష్యుడిగా భావించుకుని మాటలతో పాటలతో ఆత్మను అర్పించుకునే ప్రయత్నం అందరూ చేశారు. జయదేవుని గీత గోవిందం 12వ శతాబ్దంలో ఈ పరంపరను బలమైన సాహిత్య ధోరణిగా స్థిరపరిచింది. బెంగాల్ ఆధ్యాత్మిక సాంస్కృతిక పరంపరను శతాబ్దాలుగా ప్రభావితం చేసిన వైష్ణవ భక్తి అక్కడే జన్మించిన రవీంద్రుని చేత ‘గీతాంజలి’ రాయించడంలో ఒక అదృశ్య రంగభూమిని సిద్ధం చేసి ఉండవచ్చని భావించేవారు ఉన్నారు. అయితే రవీంద్రుని జీవితంలో ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో చూసిన విషాదం, చోటు చేసుకున్న ఆప్తుల మరణాలు దైవంతో లేదా ప్రకృతితో లేదా తనలోని ఒక ఔన్నత్యమైన ఆత్మతో లేదా సృష్టిలో అణువణువూ నిండి ఉన్న తేజోశక్తితో లేదా ఒక ఊహామాత్రపు సఖుడితో లేదా ప్రియురాలితో సంభాషణకు పురిగొలిపి ఉండవచ్చు. నివేదించుకునే క్షణాలు, కనుకొలకుల్లోంచి అశ్రువులను దిగవిడిచే క్షణాలు, వేదన లేని ఉఛ్వాశ నిశ్వాసలను ఆశించే క్షణాలు, స్వచ్ఛమైన సుమం వలే తటస్థ కొలనులోని లేశమాత్రపు అల వలే మారి స్థిమిత పడే క్షణాలు, ప్రభూ... కురవని జల్లుల భారంతో వొంగిన మేఘంలాగా నా మనసు నీ ద్వారం వద్ద నమ్రతతో ప్రమాణం చేయనీ అని మొరపెట్టుకునే క్షణాలు, మృత్యువు కొరకు పరమాద్భుత రుచి కలిగిన తేనెతో ఎదురు చూసే క్షణాలు... ఇవన్నీ కవిత్వంగానే మారి తీరుతాయి. టాగోర్ అల్లిన ఆ గీతమాలలు అందుచేతనే ప్రపంచంలోని ప్రతి మేలిమి పాఠకుడి కంఠాన్నీ అలంకరించాయి. అంతేకాదు అనువాదమై పరివ్యాప్తమయ్యాయి. టాగోర్‌ను తెలుగులో అనువదించడానికి ఉత్సాహపడిన వారు ఎందరో ఉన్నారు. మెచ్చుకోలు పొందినవారు కొందరే ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్న అనువాదం కొంచెం చిత్రమైన కథ కలిగినది. డాక్టర్ భార్గవి తన 20 ఏళ్ల వయసులో టాగోర్ కవిత్వానికి సమ్మోహితులైన కేవలం ఏడెనిమిది రోజుల్లో గీతాంజలిని అనువాదం చేసి ఆ కావ్యానికి తన వంతు పూమాలను అర్పించేశాను అని తృప్తిపడి ఆ అనువాదాన్ని దాచేశారు. కాని ఇన్నేళ్ల తర్వాత అంటే ఒక ముప్పై ఏళ్ల తర్వాత వారూ వీరూ చూసి బావుందని మెచ్చుకొని పుస్తకం తెమ్మని బలవంతం చేస్తే తీసుకువచ్చారు. ఇరవై ఏళ్ల ఒక ఔత్సాహికురాలి అనువాదంలో ఇంత గాఢత ఉంటుందా? సరళత ఉంటుందా? బరువు ఉండాల్సిన చోట త్రాసు ఒంగి తేలిక పడాల్సిన చోట ఉల్లిపొర కాగితంలా తెమ్మరకు ఎగిరి... టాగోర్ హృదయంతో తన హృదయాన్ని తాడనం చేయాలని పెనుగులాడినప్పుడే ఇటువంటి అనువాదం సాధ్యం. మొత్తం 103 టాగోర్ గీతాలకు భార్గవి చేసిన అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. తోడుగా గిరిధర్ గౌడ్ వేసిన చిత్రాలు వర్ణతాండవం చేస్తాయి. ఆమె కవితను ఈయన బొమ్మను కలిపి గొప్పగా ముద్రించిన నరేంద్ర, శశికళలకు అభినందనలు. -
చిక్కోల్లో ‘గీతాంజలి’ సందడి
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని సూర్యామహల్‌లో ‘గీతాంజలి’ సినిమా యూనిట్ సోమవారం సందడి చేసింది. కోనవెంకట్ సమర్పణలో, ఎంవీవీ పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా వచ్చిన యూనిట్ సభ్యులకు పూల బొకేలు, బాణ సంచాతో థియేటర్ యజమానులు స్వాగతం పలికారు. అనంతరం సినిమా మధ్యలో యూనిట్ సభ్యులు ప్రేక్షకుల స్పందన అడిగి తెలుసుకున్నారు. సినీనటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హరర్లో కామెడీని కలిపి అందించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. డైలాగ్ రైటర్, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ మీ చిక్కోలు చిన్నోడు షకలక శంకర్‌ను ఆదరించినందుకు ఆనందంగా ఉందన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ మన శ్రీకాకుళంలో నేను నటించిన సినిమాను ఇంతగా ఆదరించడం సంతోషదాయకమన్నారు. వీరితో పాటుగా దర్శకుడు రాజ్‌కిరణ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజులు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని ధనంబాబు, మేనేజర్ రమేష్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో ‘గీతాంజలి’ జైత్రయాత్ర
-
విజయవాడలో ‘గీతాంజలి’ జైత్రయాత్ర
సినిమాల్లో సందేశం కంటే.. వినోదానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని గీతాంజని సినిమా నిర్మాత కోన వెంకట్ అన్నారు. సినిమాల్లో హిట్-ఫ్లాప్ అనే రెండు రకాలే ఉంటాయని, ప్రేక్షకులు ఆదరించడానికి పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదన్నారు. అందుకు గీతాంజలి సినిమా విజయమే నిదర్శనమని చెప్పారు. ‘గీతాంజలి’ జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా హోటల్ గేట్‌వేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ గీతాంజలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ముందే ఊహించామన్నారు. నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గీతాంజలికి ఇంతటి విజయూన్ని అందించిన ప్రేక్షకులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ జైత్రయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. శనివారం తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామని, విజయవాడ నుంచి యాత్రను ప్రారంభించామని, విశాఖ వరకు కొనసాగుతుందని చెప్పారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ గీతాంజలి సినిమా థియేటర్ల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.డెరైక్టర్ రాజ్‌కిరణ్ మాట్లాడుతూ సినిమా స్టోరీ విన్న తర్వాత శ్రీనివాసరెడ్డితోనే తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. కథ నచ్చి కోన వెంకట్ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు హరి, తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ -
సినిమా రివ్యూ: గీతాంజలి
హారర్ కామెడీ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉంటారని ‘కాంచన’, ‘ప్రేమకథా చిత్రం‘ ఇతర చిత్రాలు నిరూపించాయి. అదే హారర్, కామెడీ కథాంశంతో పేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ఫీల్‌గుడ్ టైటిల్‌తో తాజాగా ‘గీతాంజలి’ అనే చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అంజలి, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డిలతో కథా రచయిత కోన వెంకట్,దర్శకుడు రాజ్కిరణ్లు సంధించిన సరికొత్త అస్త్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం. కథ: దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారి ఓ నంది అవార్డును సంపాదించాలనే లక్ష్యంతో నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ స్మశానంకు సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది. దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’. సమీక్ష దెయ్యాలున్నాయా అనే ప్రశ్నకు సమాధానం పక్కనపెడితే.. దెయ్యాల కథతో వెండితెరపై వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కొత్త ఒరవడిని సొంతం చేసుకున్నాయి. దెయ్యాల కథ ఎప్పటికి ఓ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్. సరిగ్గా అలాంటి కథను ఎంచుకుని రెగ్యులర్ పాయింట్‌తో కోన వెంకట్ చేసిన సరికొత్త ప్రయోగం చేశాడు. కోన వెంకట్ పాయింట్‌ను దర్శకుడు రాజ్‌కిరణ్ తెరకెక్కించిన విధానం.. అనుసరించిన కథనం ఖచ్చితంగా సినీ అభిమానులను కొత్త అనుభూతికి గురిచేస్తుంది. హారర్ సినిమాకు కావాల్సిన సీన్లను పక్కాగా సిద్ధం చేసి.. కామెడీ రంగు అద్ది తెరపైన అందంగా గీతాంజలిని తీర్చిదిద్దడంలో కోన వెంకట్ టీమ్ ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. కథకు అసవరమైన నటీనటులు అంజలి, బ్రహ్మనందం, శ్రీనివాస్‌రెడ్డి, రావు రమేశ్, శంకర్, సత్యం రాజేశ్, మధుల ఎంపిక చక్కగా కుదిరింది. కథ డిమాండ్ మేరకు శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్ ఇతర పాత్రల క్యారెక్టరైజేషన్‌ను పకడ్బందీగా డిజైన్ చేశారు. దాంతో శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్‌లు వ్యక్తిగతంగా ఎక్కడ కనిపించరు.. కేవలం పాత్రలే తెరమీద కనిపిస్తాయి. ఇప్పటి వరకు గ్లామర్ తారగానే ప్రేక్షకులకు సుపరిచితులైన అంజలిని ఓ కొత్త కోణంలో కనిపించిడమే కాకుండా గ్లామర్‌తోనూ మెరిసింది. తన కెరీర్లో అంజలికి ఈ చిత్రం దిబెస్ట్‌గా మిగిలడం ఖాయం. కామెడీ పాత్రలకే పరిమితమైన శ్రీనివాస్‌రెడ్డిని ఓ నటుడిగా ఆవిష్కరించిన చిత్రంగా మారనుంది. కమెడియన్ శంకర్, రాజేశ్‌లు మరోసారి తన సత్తాను చాటారు. ఇక సైతాన్ రాజ్‌గా బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా తెరమీద చూడటమే సమంజసం. నిర్మాత దిల్‌రాజు తొలిసారి తెలుగు సినీ తెరపై కనిపించడం విశేషం. టెక్నికల్: సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫిని, ఎడిటర్ ఉపేంద్ర నుంచి మెరుగైన పనిని రాబట్టుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హారర్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి కథకు ప్రాణం పోసింది. లక్కరాజు ప్రవీణ్ అందించిన ట్యూన్లకు సాయి శ్రీరామ్ తెరమీద అందమైన దృశ్యాలుగా మలిచారు. కాఫీ సాంగ్, ఎండింగ్ టైటిల్స్‌లో బ్రహ్మనందంపై వచ్చే థీమ్ సాంగ్‌లను ఈ చిత్రనికి అదనపు ఆకర్షణ. ప్రేక్షకుల్లో ఓ భయాన్ని కలిగించే విధంగా దృశ్యాలను మలచడంలో సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి, ప్రవీణ్ నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా మారింది. ముగింపు: చిత్ర తొలిభాగంలో వినోదానికి పెద్ద పీట వేసి.. రెండవ భాగంలో కథలోకి వెళ్లడం వల్ల కొంత వేగం త గ్గినట్టు అనిపిస్తుంది. అయితే సానుకూల అంశాలు ఎక్కువ మోతాదులో ఉన్న కారణంగా కొన్ని లోపాలు అంతగా బయటకు కనిపించవు. హారర్, కామెడి చిత్రాలను ఆదరించేవారికి, కొత్తదనం, వెరైటీ చిత్రాలను ఆశించే వారికి ’గీతాంజలి’ ఓ చక్కటి చిత్రం. ఈమధ్యకాలంలో విడుదలైన హిట్ చిత్రాల్లో ‘గీతాంజలి’ చోటు సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. -రాజబాబు అనుముల -
గీతాంజలి - 2014
హృదయం : ఇద్దరి ప్రేమకథ... క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు మనుషులైన యువతీయవకులకు నిర్వహించిన ఓ సదస్సులో లూసీ, ఆడమ్‌లకు పరిచయమైంది. రెండు గంటల ఆ సదస్సు చివర్లో ఆడమ్ ఫోన్ నెంబరు తీసుకుంది లూసీ. తర్వాత ఆమె అతనికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ నిడివి 5 గంటల 22 నిమిషాలు! ఆ కాల్ తర్వాత ఇక వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చేశారిద్దరూ. కొన్ని రోజుల్లోనే ఒక్కటైపోయారు. 22 ఏళ్ల ఆడమ్ ప్రస్తుతం తన చదువు కొనసాగిస్తుండగా.. 23 ఏళ్ల లూసీ హెమటాలజీలో క్లినికల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు ఇద్దరి జీవితాల్లో కల్లోలం రేపిన క్యాన్సర్‌కు ఇద్దరూ ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు... ఎందుకంటే వాళ్లిద్దరినీ కలిపింది అదే! హీరోకు క్యాన్సర్... హీరోయిన్‌కు గుండె జబ్బు.. ఇద్దరూ ప్రేమించుకుంటారు.. చివరికి ఎంతకాలం బతుకుతారో తెలియని స్థితిలో ఒక్కటవుతారు. ఇదీ 1989 నాటి గీతాంజలి-ప్రకాష్‌ల ‘సినిమా’ ప్రేమకథ! ఆమెకు లుకేమియా.. అతనికి టెస్టికులర్ క్యాన్సర్.. మృత్యువుతో పోరాటం సాగించిన ఆ ఇద్దరూ ఓ క్యాన్సర్ సదస్సులో కలిశారు.. ఆ తర్వాత ప్రేమికులయ్యారు.. ఇపుడు కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇదీ 2014 నాటి లూసీ-ఆడమ్ల ‘నిజ జీవిత’ ప్రేమకథ. అమ్మాయి కథ హాయ్ నా పేరు లూసీ అండర్సన్ ఎడ్వర్డ్స్. మాది ఇంగ్లండ్‌లోని టెల్ఫోర్డ్. నా ప్రేమకథ గురించి చెప్పేముందు తొమ్మిదేళ్లు వెనక్కు వెళ్లాలి. అది 2005వ సంవత్సరం ఆగస్టు 22. ఆ తేదీని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవిత గమనాన్నే మార్చేసిన రోజు అది. అందరు పిల్లల్లాగే చక్కగా స్కూలుకెళ్తూ ఆటపాటలతో సాగిపోతున్న నాకు ఆ రోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఫ్లూ జ్వరం కూడా వచ్చింది. నన్ను ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ అక్కడ ఒక్క రోజే ఉన్నా. మరుసటి రోజే నన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మార్చారు. రెండు రోజుల తర్వాత నాకు లుకేమియా అని చెప్పారు. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోయింది. ఏడుపాగలేదు. అమ్మ ఓవైపు భోరున ఏడుస్తూనే నాకు ధైర్యం చెబుతోంది. నిబ్బరం తెచ్చుకున్నా. లుకేమియాతో పోరాడాలనుకున్నా. ఏడాదిపాటు హాస్పిటల్లోనే ఉన్నాను. చాలాసార్లు కీమో థెరపీ చేశారు. ఆ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది. అయినా ఓర్చుకున్నాను. మళ్లీ పుస్తకం పట్టి చదువు కొనసాగించే స్థితికి చేరుకున్నా. 2008 మార్చిలో నన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఐతే నేను తరచూ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడం, క్యాన్సర్ అవగాహన సదస్సుకు హాజరు కావడం ఆపలేదు. అలా ఓ సదస్సులో పరిచయం అయ్యాడు ఆడమ్. అక్కడి నుంచి నా కొత్త జీవితం మొదలైంది. అబ్బాయి కథ... హలో.. నా పేరు ఆడమ్. నాది లూసీ అంతపెద్ద స్టోరీ కాదు. వయసులో ఆమె కంటే ఒక ఏడాదే చిన్నవాణ్ణి. లాంకాస్టర్ యూనివర్సిటీలో చక్కగా డిగ్రీ చదువుకుంటున్న నేను 2012 అక్టోబరులో ఓ భయానక రాత్రిని చూశాను. నా వృషణాలు విపరీతంగా నొప్పి పెట్టడంతో విలవిలలాడిపోయాను. మరుసటి రోజు నా ఫ్రెండుతో కలిసి ఆస్పత్రికి వెళ్లా. డాక్టర్ పరీక్షలన్నీ చేశాక... నీకు టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటూ నన్ను హతాశుడిని చేశాడు. కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియలేదు. తర్వాత విపరీతంగా ఏడ్చాను. కానీ ఇలా ఏడ్చి ఏం లాభం లేదని, నవ్వుతూనే చికిత్స తీసుకోవాలని అనుకున్నా. నా పరిస్థితి తెలిసి సాకర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ వచ్చి హాస్పిటల్లో కలిశాడు. ధైర్యం నూరిపోశాడు. వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. తొమ్మిది వారాల పాటు కీమోచేశారు. ఇంకో సర్జరీ కూడా చేశారు. మొత్తానికి నా శరీరంలో నుంచి క్యాన్సర్ కణాలన్నీ వెళ్లగొట్టి.. ఆరు నెలల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. త తర్వాత 2013 జులైలో జరిగిన ఓ క్యాన్సర్ సదస్సులో లూసీ పరిచయం అయ్యింది. అది నా జీవితానికి మలుపు. -
గీతాంజలి మూవీ స్టిల్స్
-
అంజలీకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిందెవరు?
కోనసీమ అందాల భామ అంజలి కోలీవుడ్, టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇతర భాషాల నుంచి దిగుమతైన తారలకు గట్టి పోటీ ఇచ్చిన అంజలి తాజాగా గీతాంజలీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. గీతాంజలీ చిత్ర ఆడియో కార్యక్రమంలో అందర్నీ ఆకర్షించిన అంజలీ.. తాజాగా మీడియాలో హైలెట్ గా నిలిచింది. లేటెస్ట్ గా అంజలీ ఓ బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారును తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నారని ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. కోన వెంకట్ పోస్ట్ చేసిన అంజలీ ఫోటో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే తనకు తాను గిఫ్ట్ గా ఇచ్చుకున్నారనే అంశం చర్చనీయాంశమైంది. -
అంజలికి నటన పుట్టుకతోనే వచ్చింది
- బ్రహ్మానందం ‘‘నేను రచయితగా చేసిన ‘వెంకీ’ నుంచి ‘బలుపు’ వరకు బ్రహ్మానందంగారి కోసం ఎన్నో పాత్రలు సృష్టించాను. ఆ పాత్రలన్నిటికన్నా ఎంతో ఇష్టంగా ఆయన కోసం రాసిన పాత్ర ‘సైతాన్ రాజ్’. ఆ పాత్రను బ్రహ్మానందంగారు అద్భుతంగా పండించారు. ఓ మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని కోన వెంకట్ చెప్పారు. అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సమర్పణలో యంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి’. రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ పాటను బ్రహ్మానందం, అంజలి, శ్రీనవాస్‌రెడ్డి తదితరులపై చిత్రీకరించారు. నటన అనేది అంజలికి పుట్టుకతోనే వచ్చిందని, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా మలిచాడని బ్రహ్మానందం చెప్పారు. ఈ చిత్రానికి కోన వెంకట్, రాజ్‌కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి మూడు స్తంభాలైతే, అంజలి మూలస్తంభం అనీ, తన చుట్టూనే కథ తిరుగుతుందని నిర్మాత తెలిపారు. హారర్, కామెడీ నేపథ్యంలో సినిమా సాగుతుందని దర్శకుడు తెలిపారు. బ్రహ్మానందం కాంబినేషన్లో నటించేటప్పుడు ముందు టెన్షన్ పడినా, తర్వాత ఫ్రీగా నటించగలిగానని అంజలి చెప్పారు. ఇంకా ఈ వేడుకలో శ్రీనివాస్‌రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
గీతాంజలి మూవీ వర్కింగ్ స్టిల్స్
-
మణి
అందరికీ అవే విశేషణాలు వాడి, మణిరత్నానికీ అవే ప్రయోగించాలంటే- దగ్గరి బంధువు కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏమీ వండలేకపోతినే అని చింతించే ఇల్లాలు గుర్తొస్తోంది. నిశ్శబ్దంగా మంచుతెరను దాటుతూ, ఎక్కడో పసుపు వర్ణపు పూవును సుతారంగా తాకుతూ, దూరంగా వినిపిస్తున్న రైలుకూతతో మేఘాల్లోకి మేల్కొంటూ... మణిరత్నం దృశ్యం అందంగా ఉంటుందన్నది మామూలు విషయమే. కానీ అందగత్తె మరింత వన్నెలద్దుకున్నట్టుగా ఉంటుంది(ఒక్కోసారి, ఆభరణాలే అతివను కప్పేయొచ్చు కూడా!). భారతదేశానికి వెలుపల- అడ్రియన్ లైన్, కీస్లోవ్స్కీ, మాజిది మాత్రమే ఇలాంటి మ్యాజిక్ చేశారనిపిస్తుంది. ‘కొన్ని పాత్రలేవో లీలగా మనసులో కదలాడుతాయి. ఇక అవి నన్ను సాధిస్తాయి, ఉత్సాహపరుస్తాయి, కష్టపెడతాయి, మోహపడేలా చేస్తాయి... అది సినిమా అవుతుందో అవదో! అయినా ఆ నోట్సంతా రాస్తూవుంటాను. ఎప్పుడో ఒకసారి ఇక ఇదంతా జరుగుతుందనిపిస్తుంది. సంభాషణలు రాయడానికి కూర్చున్నప్పుడు మరింత స్పష్టత వస్తూవుంటుంది. కానీ దానికి తుదిరూపం మాత్రం దానికివ్వాల్సినంత పరిధిని ఇచ్చే నటులవల్లే వస్తుంది. అందుకే నటుడు, నటి తమకే సొంతమైనదేదో ఆ పాత్రకు కలపాలనుకుంటాను,’ అని చెబుతాడాయన సినిమాకు సిద్ధపడే తీరు గురించి. ‘రోజా’ తెరమీదకు రావడానికి ఏడేళ్లకు ముందునుంచీ తన లోలోపల ఆలోచన సాగుతూనేవుందట! నటులంతా అప్పుడే కొత్తగా జన్మెత్తినట్టు కనిపిస్తారు ఆయన సినిమాల్లో. పిల్లల్నుంచి నటన రాబట్టుకోవడంలో ఏ తాయిలాలు ఇవ్వజూపుతాడో అంతుపట్టదు. అంజలి, అమృత, గీతాంజలి , బొంబాయిలో పిల్లలు మాత్రం!ఎప్పుడూ ఇంపుగా ధ్వనించని శేఖర్ అనే మామూలు పేరుకూడా కేవలం మణిరత్నం పెట్టాడు కాబట్టి ప్రియమైపోతుంది. అర్జున్ తండ్రి శేఖర్... కబీర్ నారాయణ తండ్రీ శేఖరే! పోలికతో ఉన్న సమస్యేమిటంటే, అది అసలైన మనిషిని మరుగుపరుస్తుంది. కానీ ఒకమేరకు అంచనా వేయడానికి పనికిరావొచ్చు. సావిత్రి-సత్యవంతుడు, దుర్యోధనుడు-కర్ణుడు, రావణుడు-సీత... ఒక్కోసారి, ప్రాచ్య ఇతివృత్తాలకు పాశ్చాత్య ఆధునికత అద్దిన రవివర్మలా తోస్తారు మణిరత్నం. తమిళ రాజకీయాలు, క్యాన్సర్ మరణాలు, కశ్మీర్, బొంబాయి, శ్రీలంక, ఈశాన్యం, వరదరాజ మొదలియార్, ధీరూభాయ్ అంబానీ... లోగొంతుకల అబ్బాయిలూ, కీచుమనే అమ్మాయిలూ, భాష తెలిసిన సంగీతమూ, వెలుగు నీడలూ, మౌనరాగాలూ వీటన్నింటికీ సాహిత్యమో, జీవితమో దన్నుగా ఉంది కాబట్టే అవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కట్టిన మేడల్లా కాకుండా ఇప్పటికీ నిలబడగలిగాయి. జాలర్ల నేపథ్యం తీసుకుంటే... వాళ్ల ఇండ్లు ఎలా ఉంటాయి? వానలు పడినప్పుడు ఏం చేస్తారు? పడవలు ఎక్కడ ఉంచుతారు? వలలు ఎక్కడ తగిలిస్తారు? ‘పాత్రికేయుడు, న్యాయవాదిలాంటివాడే దర్శకుడు కూడా’! సినిమా దానికదే జరిగే అద్భుతం అనుకునే బాల్యపు భ్రమ నుంచి బయటపడి, ‘సినిమాను కూడా ఎవరో ఒక మనిషి నిర్దేశిస్తాడు’ అన్న జ్ఞానోదయం కలిగాక, సహజ పండితుడిలాగా ‘పల్లవి-అనుపల్లవి’(1983)తో తన ప్రస్థానం ప్రారంభించాడు మణిరత్నం. మితంగా, హితంగా, సున్నితంగా... ప్రేక్షకులకు కొత్తగా చూడటం నేర్పాడు. ‘సఖి’లో ఇద్దరు తండ్రులు మాట్లాడుకున్నప్పుడు, అసలు ఇందులో ఘర్షణ ఎక్కడుందీ అనిపిస్తుంది! చాలదా, ఒక్క పెళుసుమాట! అయితే, ఇదంతా శ్రీధర్, మహేంద్రన్, బాలచందర్, భారతీరాజా లాంటివాళ్లు పరిచిన బాటని ఆయనకు తెలుసు. ఇదేకాదు, ఒక భాష సినిమాను మరో భాషలోకి డబ్ చేయడంలో కోల్పోయే ‘ఎలాస్టిసిటీ’ ఆయనకు తెలుసు; చాలా ఆత్మవిశ్వాసంతో మొదలయ్యే ప్రాజెక్టు కూడా విడుదలకుముందు అభద్రతకు గురిచేస్తుందని తెలుసు; స్క్రిప్టు దశనుంచి చివరిదాకా ఉండాల్సినంత సత్యంగా ఉన్నామా అని మథనపడాల్సివచ్చే అనివార్యపు రాజీలు కూడా తెలుసు! ‘కాటుక కళ్లతో కాటు’ వేసే ప్రధానస్రవంతి మాయలో చిక్కుకుని, మరో సత్యజిత్ రే కాగలిగీ మణిరత్నంగా మిగిలిపోయాడే అని దిగులు వేస్తూంటుంది ఒక్కో సారి. కానీ ఆయనంటాడూ: ‘కమర్షియల్ సక్సెస్ అనేది దానికదే చెడ్డది కాదు. ప్రధానస్రవంతిలో ఉండటమంటే మూర్ఖంగా ఉండటం కాదు. తార్కికంగా, కళాత్మకంగావుంటూ కూడా ప్రధాన స్రవంతిలో పనిచేయొచ్చు’. దీన్నీ ఒప్పుకోవాలేమో! మరి, ‘టైమ్ 100 ప్రపంచ గొప్ప చిత్రాల జాబితా’ను గనక ఒక ప్రమాణంగా అంగీకరిస్తే... అందులో, భారతీయ సినిమాకు ప్రాతినిధ్యంగా, పథేర్ పాంచాలి(సత్యజిత్ రే), ప్యాసా(గురుదత్)తోపాటు ఉన్నది మణిరత్నం ‘నాయకు’డే! - పూడూరి రాజిరెడ్డి -
ఊహకు అందని రీతిలో...
అందమైన అమ్మాయితో స్నేహం ఏ కుర్రాడికైనా ఆనందమే. అదే ఆ కుర్రాడు సినీ దర్శకుడైతే... కొత్త కొత్త కథలు పుడుతుంటాయి. సినిమా దర్శకునిగా ఎదగాలనుకుంటున్న ఓ కుర్రాడి రూమ్‌కి ఓ అమ్మాయి వచ్చి పోతుంటుంది. ఆ అమ్మాయి రాక, అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ ‘గీతాంజలి’. అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు రాజకిరణ్ చెబుతూ -‘‘ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ప్రయత్నమిది. అంజలి పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుంది. వినోదంతో పాటు ఉత్కంఠకు లోనుచేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో బ్రహ్మానందంపై చిత్రీకరించే సన్నివేశాలతో టాకీ పూర్తవుతుంది. అదే నెల 9 నుంచి మూడు రోజుల పాటు అంజలి, హర్షవర్దన్ రాణేలపై చిత్రీకరించే మాంటేజస్ సాంగ్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. అదే నెలలో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావురమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్. -
సత్వం: మన చలం
మెడలో మల్లెపూల దండ వేసుకుని, వాటి పరిమళం పక్కవాళ్లకూ పంచుతూ, తెనాలి వీధుల్లో తిరిగిన చలం సాయంత్రాల్ని ఒకసారి ఊహలోకి తెచ్చుకుంటే...! సాక్షాత్తూ ఆనందరూపుడిగా కనబడతారు చలం. ఆయనకన్నీ, అంతటా ఆనందమే! ఊయల్లో ఉత్తినే కాళ్లూపుకుంటూ గడిపే పసిపిల్లల్ని చూసినా, పంది వెంబడి పడి రాయితో బెదిరిస్తున్న తుంటరి బాలుడిని కాంచినా, పరికిణీ రెపరెపల్తో, మువ్వల సవ్వడుల్తో వయ్యారాలుపోయే కన్నెపిల్ల ఎదురైనా, ఇంకా ఉడతలూ గోరింకలూ భీమిలి సముద్రమూ నక్షత్రాల వెలుగూ... దేనికైనా బాధపడటానికి ఏముందని? ‘అసలు బాధలో అంత బాధ లేదు’. విశ్వనాథ అన్నట్టు, ఏనాడూ ‘ఎంగిలి మాటలు’ వాడని చలం, అనవసర పదం ఒక్కటి అదనంగా రాసినా నేరమేనన్న చలం, తానే సాహిత్యంగా బతికిన చలం- మైదానం, పురూరవ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, శశిరేఖ, అమీనా, అరుణ... కథలు, నవలలు, వ్యాసాలు, సంభాషణలు, ప్రేమలేఖలు, ఉత్తరాలు, కవితలు, మ్యూజింగ్స్... ఏ రూపంలోనైనా ఆనందం చుట్టూ తాను తిరుగుతూ, అక్షరాల చుట్టూ పాఠకుల్ని తిప్పాడు, దోసిళ్లకొద్దీ జీవనరసం తాగిస్తో. ఒక్కోసారి ‘గీతాంజలి’ని చలమే రాసి తమాషాకి టాగూర్ పేరు పెట్టాడేమోనని అనిపించదూ! జీవితాన్ని ఏలుకునే తెలివిడిలేనివాళ్లకు మళ్లీ గుడిపాటి వెంకటాచలమే వచ్చి అన్నీ చెప్పాలని ఉడుక్కున్నాడు. ‘ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏదీ చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’ అని మనుషుల సౌందర్యలేమినీ, వేగపుయావనీ నిరసించాడు. ఆయన్ని ఎవరు ఎలా ఆరాధించినా, ప్రత్యేకించి స్త్రీవాదీ, పురుషవాదీకాని స్వేచ్ఛావాది... చలం. ఆయన ఎంపిక స్వేచ్ఛను కోరుకున్నాడు. స్త్రీ పురుషులు సమానంగా, హిపోక్రసీ లేకుండా, చిరునవ్వుల్తో పరస్పరం హృదయాల్ని వెలిగించుకుంటూ, ఒకరి ప్రపంచం మరొకరయ్యేంత గాఢంగా జీవించే కలగన్నాడు; ఒక్కోసారి అది తాత్కాలిక నీతిచట్రంతో భేదించేదే కావొచ్చుగాక! ఇప్పటి ‘నైతిక ముద్ర’ అప్పటి ఆయన గాయాలకు లేపనం ఎటూకాలేదుగానీ... ఆయన పొందినట్టుగా కనబడిందంతా ఆయన పొందాలనుకున్న కల్పనేనేమో! స్త్రీ లాంటి ఒక బలమైన ఇచ్ఛేదో లేకుండా రోజువారీ బతుకులోని నిస్సారత ఆయనకు తెలుసు. అందుకే అంటాడు: ‘నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను’. ఆయన స్వేచ్ఛ జీవితానికీ, కళకూ కూడా సంబంధించినది: ‘ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకరతిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం, క్రమంగా అతని ఆత్మలోకి పాకి, అతని జీనియస్‌ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది’. ప్రేమికుడినుంచి అన్వేషిగా, అన్వేషకుడినుంచి ఆధ్యాత్మికుడిగా రూపాంతరం చెందుతూ... అసలు తొలినుంచీ అన్నీ ఆయనలో కలగలిసే ఉన్నాయి, ఆయన వచనంలోనే కవిత్వం మిళితమైనట్టుగా! అందుకే, తనలో ఉన్న చీకటినే కాగితం మీద పెట్టానేతప్ప ఏ బోధలూ చేయడం కోసం కాదన్నాడు. చీకాకు పరిచే ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి ఎప్పటికి కుదురుతుందోనని వాపోయాడు. సత్యం లోపల్నుంచే దొరకాలి తప్ప, బయటెక్కడో కాదన్నాడు. చలం అనేవాణ్ని మరిచిపోయేంతగా నిత్యనూతన జీవితాన్ని, పాత మకిలి లేని జీవితాన్ని అభిలషించాడు. తనలో ఉన్న ప్రశ్నలకు ఒక మేరకైనా సమాధానపడాల్సిన పక్వస్థితికి వచ్చాక ‘అరుణాచలం’లో స్థిమితపడ్డాడు. ‘మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్లీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?’ తనలోని చివరి ప్రశ్నలు, వాటికి దొరికీ దొరకని సమాధానాలతోనే కన్నుమూసిన చలం- ఎక్కడైనా నిజంగానే మేలుకున్నాడేమో! ఈ జీవితపు కొనని అక్కడ అందుకుని ఇదంతా కలని చెప్పేందుకు కాచుకుని కూర్చున్నాడేమో! - పూడూరి రాజిరెడ్డి -
అంజలికి స్పెషల్
అంజలి భయపెట్టబోతోంది. అలాగే నవ్వించబోతోంది. తను ఒకేసారి భయాన్నీ, వినోదాన్నీ ఎలా కలిగిస్తుందంటే... ‘గీతాంజలి’ చూడాల్సిందే అంటున్నారు రచయిత కోన వెంకట్. ఆయన సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’. అంజలికి ఇది తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. రాజకిరణ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కోనవెంకట్ మాట్లాడుతూ -‘‘అనుష్కకు ‘అరుంధతి’లా, జ్యోతికకు ‘చంద్రముఖి’లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచే సినిమా ఇది. ఎవ్వరూ ఊహించని విధంగా కథాకథనాలు ఉంటాయి. నాదైన శైలిలో వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. బ్రహ్మానందంగారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘ఇప్పటికి 80శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. జూన్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే అతిథి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం, రావు రమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, యాక్షన్: విజయ్, ఆర్ట్: రఘుకులకర్ణి, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్. -
పవన్ కల్యాణ్ చేతుల మీదుగా గీతాంజలి మూవీ పోస్టర్స్ లాంచ్
-
ఒక రోజు (ఏం జరిగింది) ఆడియో ఆవిష్కరణ