అంజలికి నటన పుట్టుకతోనే వచ్చింది | birth with act's to anjali | Sakshi
Sakshi News home page

అంజలికి నటన పుట్టుకతోనే వచ్చింది

Published Sat, Jul 19 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

అంజలికి నటన పుట్టుకతోనే వచ్చింది

అంజలికి నటన పుట్టుకతోనే వచ్చింది

- బ్రహ్మానందం
 ‘‘నేను రచయితగా చేసిన ‘వెంకీ’ నుంచి ‘బలుపు’ వరకు బ్రహ్మానందంగారి కోసం ఎన్నో పాత్రలు సృష్టించాను. ఆ పాత్రలన్నిటికన్నా ఎంతో ఇష్టంగా ఆయన కోసం రాసిన పాత్ర ‘సైతాన్ రాజ్’. ఆ పాత్రను బ్రహ్మానందంగారు అద్భుతంగా పండించారు. ఓ మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని కోన వెంకట్ చెప్పారు. అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్ సమర్పణలో యంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి’. రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రచార గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ పాటను బ్రహ్మానందం, అంజలి, శ్రీనవాస్‌రెడ్డి తదితరులపై చిత్రీకరించారు. నటన అనేది అంజలికి పుట్టుకతోనే వచ్చిందని, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా మలిచాడని బ్రహ్మానందం చెప్పారు. ఈ చిత్రానికి కోన వెంకట్, రాజ్‌కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి మూడు స్తంభాలైతే, అంజలి మూలస్తంభం అనీ, తన చుట్టూనే కథ తిరుగుతుందని నిర్మాత తెలిపారు. హారర్, కామెడీ నేపథ్యంలో సినిమా సాగుతుందని దర్శకుడు తెలిపారు. బ్రహ్మానందం కాంబినేషన్‌లో నటించేటప్పుడు ముందు టెన్షన్ పడినా, తర్వాత ఫ్రీగా నటించగలిగానని అంజలి చెప్పారు. ఇంకా ఈ వేడుకలో శ్రీనివాస్‌రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement