హారర్‌... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి  | Geethanjali Malli Vachindhi Release on April 11th | Sakshi
Sakshi News home page

హారర్‌... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి 

Published Tue, Apr 9 2024 12:12 AM | Last Updated on Tue, Apr 9 2024 12:12 AM

Geethanjali Malli Vachindhi Release on April 11th - Sakshi

‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్‌ను కోన వెంకట్‌గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్‌ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్‌ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.

శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్‌తో కలిసి కోన వెంకట్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్‌ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్‌ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్‌గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement