
ముంబై : వినోద్ ఖన్నా మాజీ భార్య, నటుడు అక్షయ్, రాహుల్ ఖన్నాల తల్లి గీతాంజలి ఖన్నా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంద్వాలోని తమ ఫామ్‌హౌస్‌లో కుమారుడు అక్షయ కుటుంబంతో ఉన్న సమయంలో గీతాంజలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అలిబగ్ సివిల్ ఆస్పత్రికి హుటాహుటిన కుటుంబ సభ్యులు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. శనివారం ఉదయం కుమారులు అక్షయ్, రాహుల్ ఖన్నాలతో కలిసి మాంద్వాలోని ఫామ్ హౌస్‌కు గీతాంజలి వెళ్లారు.
అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె చెప్పడంతో స్ధానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా కొన్ని మందులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌కు తిరిగి చేరుకోగానే విశ్రాంతి తీసుకోమని కుమారులు ఆమెకు సూచించారు. ఇక రాత్రి నిద్రిస్తున్న గీతాంజలిని పరామర్శించేందుకు అక్షయ్ వెళ్లగా ఆమె శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్టు గుర్తించారు. గీతాంజలిని వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆదివారం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment