Vinod Khanna
-
ఆ రొమాంటిక్ సీన్లంటే ఇప్పటికీ ఇష్టం: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా భాను నటించిన సూపర్ హిట్ చిత్రం హేరా ఫేరీ. ఈ చిత్రంలో అగ్రనటులైన వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ జంటగా నటించారు. ఈ మూవీ రిలీజై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రోజులను సైరా భాను గుర్తు చేసుకున్నారు. వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను తలుచుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టా సైరా రాస్తూ..' హేరా ఫేరి చేయడం చాలా సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా కూడా నటించారు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా మా ముగ్గురికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ సమయంలో మేము సినిమాలోని సన్నివేశాలను చాలా ఫన్నీగా మార్చేశాం. ముఖ్యంగా వినోద్ నిరంతరం అమితాబ్‌ను నాతో క్లోజ్‌గా ఉన్నందున.. వాటిని ఆపేందుకు అతను ప్రయత్నిస్తున్న సన్నివేశాలంటే నాకు ఇప్పటికీ ఇష్టం. వినోద్ నా పక్కన కూర్చోవడానికి.. అమితాబ్ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసే దృశ్యాలు ఇప్పటికీ ఆనందం కలిగిస్తాయి. మీరు కూడా చూసి ఆనందించండి' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మీ ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 1976లో విడుదలైన హేరా ఫేరి ఒక కామెడీ చిత్రం. దీనికి ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, సైరా బాను, ప్రాణ్ ఇందులో నటించారు. నగరంలో జీవనోపాధి కోసం కష్టపడుతున్న విజయ్ (అమితాబ్ బచ్చన్), అజయ్ (వినోద్ ఖన్నా) అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కాగా.. దివంగత నటుడు, సైరా భాను భర్త దిలీప్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ ఏడాది జూలై 7న సైరా బాను తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) -
టికెట్ ఇవ్వకున్నా.. ఆయనకే నా సపోర్టు!
న్యూఢిల్లీ : తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీకి తన మద్దతు ఉంటుందని దివంగత ఎంపీ, నటుడు వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లోని గురుదాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావించిన సంగతి తెలిసిందే. మొదట ఆమెకు టికెట్ కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. కానీ చివరి నిమిషంలో.. పార్టీలో చేరిన సీనియర్ నటుడు సన్నీ డియోల్‌ను బరిలో దించడంతో కవిత తీవ్ర నిరాశకు లోనయ్యారు. నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధిష్టానం ఇలా వ్యవహరించడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కవితా ఖన్నా.. ‘ ఈ విషయాన్ని వివాదంగా మార్చదలచుకోలేదు. పార్టీ కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకే నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నా విషయంలో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్న తర్వాత టికెట్‌ను వేరే వాళ్లకు కేటాయించారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. తిరస్కారభావంతో కుంగిపోయాను. ఆ సమయంలో తమ పార్టీలో చేరాల్సిందిగా ఎంతోమంది నన్ను సంప్రదించారు. కానీ నేనలా చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా నేను కచ్చితంగా గెలిచి తీరతాను. అయితే నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, పార్టీ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి... గురుదాస్‌పూర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ వినోద్ ఖన్నా లోక్‌సభ ఎంపీగా గురుదాస్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ టికెట్‌పై నాలుగు పర్యాయాలు(1998.99, 2004, 2014) గెలిచిన ఆయన ఏప్రిల్ 2017న మరణించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకార్ గెలుపొందారు. ఇక లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో భాగంగా మే19న పంజాబ్‌లో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
అక్షయ్ ఖన్నా తల్లి గీతాంజలి మృతి
ముంబై : వినోద్ ఖన్నా మాజీ భార్య, నటుడు అక్షయ్, రాహుల్ ఖన్నాల తల్లి గీతాంజలి ఖన్నా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంద్వాలోని తమ ఫామ్‌హౌస్‌లో కుమారుడు అక్షయ కుటుంబంతో ఉన్న సమయంలో గీతాంజలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అలిబగ్ సివిల్ ఆస్పత్రికి హుటాహుటిన కుటుంబ సభ్యులు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. శనివారం ఉదయం కుమారులు అక్షయ్, రాహుల్ ఖన్నాలతో కలిసి మాంద్వాలోని ఫామ్ హౌస్‌కు గీతాంజలి వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె చెప్పడంతో స్ధానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా కొన్ని మందులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌కు తిరిగి చేరుకోగానే విశ్రాంతి తీసుకోమని కుమారులు ఆమెకు సూచించారు. ఇక రాత్రి నిద్రిస్తున్న గీతాంజలిని పరామర్శించేందుకు అక్షయ్ వెళ్లగా ఆమె శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్టు గుర్తించారు. గీతాంజలిని వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆదివారం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. -
పాపులార్టీకి.. ప్రయోగానికి పట్టం
తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. 63వ జాతీయ అవార్డుల్లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’, ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. 65వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి–2’ మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’గా జాతీయ అవార్డు దక్కించింది. అంతేకాదు.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌కి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్‌కి కూడా జాతీయ అవార్డులు దక్కాయి. మరో తెలుగు సినిమా ‘ఘాజీ’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుకి ఎంపికైంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇక.. ఇతర భాషల విషయానికొస్తే అస్సామీ ఫిల్మ్ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు దక్కించుకుంది. దివంగత నటుడు వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఇతర అవార్డు విజేతల వివరాలు, అవార్డు దక్కించుకున్న పలువురి ప్రముఖుల స్పందన ఈ విధంగా... విలేజ్ రాక్‌స్టార్స్ 65వ జాతీయ అవార్డులు అస్సామ్వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే గడచిన 29 ఏళ్లల్లో అస్సామ్‌కి జాతీయ అవార్డు అందని ద్రాక్షే అయింది. ఈసారి ఏకంగా ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డుని దక్కించుకుంది ఓ అస్సామీ ఫిల్మ్. పేరు ‘విలేజ్ రాక్‌స్టార్స్’. కథ చాలా చిన్నది. ‘జెన్యూన్ మూవీ’. అందుకే అవార్డు దక్కించుకుంది. 29 ఏళ్ల నుంచి నేషనల్ అవార్డు లేని లోటుని తీర్చిన సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్. చివరిగా ఒక అస్సామీ సినిమా నేషనల్ అవార్డ్ అందుకున్నది 1987లో. జానూ బరువా తెరకెక్కించిన ‘హలోదియా చొరయా బావోధాన్ కాయ్’కు అప్పట్లో అవార్డు దక్కింది.అది కూడా ప్రాంతీయ చిత్రం విభాగంలో. 29 ఏళ్ల తర్వాత ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కడం విశేషం. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ దర్శకురాలు ‘రిమా దాస్’ సెల్ఫ్‌మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ చిత్రాన్ని గౌహతిలోని తన స్వగ్రామం చాయగన్లోనే కేవలం హ్యాండీ కెమెరాతో దాదాపు 150 రోజులు తెరకెక్కించడం విశేషం. సినిమా కథ చాలా సింపుల్ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్స్ బుక్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను నాశానం చేస్తాయి. అప్పుడు దునుకి తన ప్రియారిటీ ఏంటో చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా దును ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బనితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్‌స్టార్స్, మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలోనే కాకుండా ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం. 65వ జాతీయ అవార్డుల ఎంపికలో బెస్ట్ పాపులర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ విభాగంలో మా ‘బాహుబలి 2’ సెలెక్ట్ అయినందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మా టీమ్ వర్క్‌ని గుర్తించి ఇదే చిత్రానికి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు ప్రకటించినందుకు కమిటీకి ధన్యవాదాలు. బెస్ట్ రీజినల్ తెలుగు ఫిల్మ్‌గా సెలెక్ట్ అయిన ‘ఘాజీ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. – రాజమౌళి టీమ్ వర్క్‌ని గుర్తించి ‘బాహుబలి–2’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్‌కు కృతజ్ఞతలు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘ఘాజీ’ చిత్రబృందం రానా, సంకల్ప్‌రెడ్డి తదితరులకు శుభాకాంక్షలు. జాతీయ అవార్డులు గెలుచుకున్న అందరికీ... ముఖ్యంగా అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’కి శుభాకాంక్షలు. – ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ శ్రీదేవిగారు అందరికీ ఓ తీయని జ్ఞాపకం – రవి ఉడ్యవర్ ► ‘మామ్’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్‌గా శ్రీదేవికి అవార్డు రావాటం డైరెక్టర్‌గా మీకెలా అనిపిస్తోంది? మిక్స్ ఫీలింగ్స్. నా ఫస్ట్ సినిమాకే శ్రీదేవిగారికి నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ హ్యాపీనెస్‌ని సెలెబ్రేట్ చేసుకోవటానికి ఆమె మన మధ్య లేరని బాధగా ఉంది. ఆమె కూడా మనతో ఉండి ఈ అవార్డును సెలబ్రేట్ చేసుకుంటే బావుండు అనే చిన్న బాధ లోపల ఉంది. ఆమె ఫిజికల్‌గా మనతో లేకపోయినా మన మదిలో ఎప్పుడూ ఓ తీయని జ్ఞాపకంలా ఉంటారు. ► మామ్ మీకు ఫస్ట్ మూవీ, శ్రీదేవిగారికి 300వ సినిమా? ఆమె ఈ కథను అంగీకరిస్తారని అనుకున్నారా? ఈ కథ సిద్ధం చేసుకున్నాక బోనీగారు ఒకసారి శ్రీకి కలిసి చెప్పు అన్నారు. కొంచెం భయంగానే ఉన్నా శ్రీదేవి గారు వద్దూ అనకూడదు అనేలాగా స్క్రిప్ట్ తీసుకువెళ్లాను. న్యారేషన్ అయ్యాక శ్రీదేవిగారు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఇది ఛాలెంజింగ్ ఫిల్మ్, నేను చేస్తున్నాను అన్నారు. నా బెస్ట్ మూమెంట్స్‌లో అదొకటి. ► ఏదైనా సీన్లో శ్రీదేవిగారు కచ్చితంగా రెండు మూడు రీటేక్స్ తీసుకుంటారని మీరు అనుకొని ఆమె సింగిల్ టేక్‌లో చేసిన సీన్స్ ఉన్నాయా? సినిమాలో ఒక హాస్పిటల్ సన్నివేశం ఉంటుంది. చాలా ఎమోషనల్ సీన్ అది. ఆ సీన్‌కు రెండు మూడు టేక్స్ తీసుకుంటారనుకున్నాను. జస్ట్ సింగిల్ టేక్‌లో చేసేశారు శ్రీదేవి గారు. ► మీ ఫస్ట్ సినిమానే శ్రీదేవిగారి ఆఖరి సినిమా అవ్వడం పట్ల మీ ఫీలింగ్? నేను అలా ఆలోచించొద్దని డెసైడ్ అయ్యాను. ఈ సినిమా తర్వాత శ్రీదేవి గారు ఇంకా మంచి సినిమాలు చేస్తారనుకున్నాను. ఫ్రెష్ స్టార్ట్ నా సినిమా ద్వారా అవుతుందని ఆనంద పడ్డాను. ఎప్పటికీ ఆ ఆలోచనతోనే ఉంటాను. ► జాన్వీ, ఖుషీ వాళ్ల మామ్‌ను ‘మామ్’లో చూసుకున్నాక ఎలా ఫీల్ అయ్యారు? ఖుషీ సినిమా చూసినప్పుడు నేను పక్కన లేను, కానీ జాన్వీ చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ► ఇప్పుడు జాన్వీ కూడా డెబ్యూ చేస్తున్నారు. తన గురించి ఏమైనా ? షీ విల్ బీ అమేజింగ్. శ్రీదేవిగారిలాగే తను కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవిగారికి సాంబార్ అన్నం అంటే ఇష్టం – కోన వెంకట్ ► ‘మామ్’ ఒప్పుకున్నప్పుడు శ్రీదేవిగారు మీతో ఏమన్నారు? ‘ఇంగ్లిష్–వింగ్లిష్’ తర్వా త ఆమె ఎన్నో కథలు విన్నా ఏదీ ఒప్పుకోలేదు. ‘చేస్తే మంచి సినిమా చేయాలి, నా పిల్లలు గర్వపడేలా ఆ సినిమా ఉండాలనుకుంటున్నాను’ అని కథ చెప్పడానికి వెళ్లినప్పుడు అన్నారు. ‘మామ్’ కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని కథలు కొంతమంది ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళతాయి. అలా ‘మామ్’ శ్రీదేవిగారిని వెతుక్కుంటూ వెళ్లింది. ► అంటే..? నాలుగేళ్ల క్రితం నేను న్యూయార్క్ వెళ్లినప్పుడు శ్రీదేవిగారి ఫ్యామిలీ అక్కడ ఉంది. అక్కడ అనుకోకుండా ఆ ఫ్యామిలీని కలిశాను. వాళ్లు తాము ఉంటున్న అపార్ట్మెంట్కి ఆహ్వానిస్తే వెళ్లాను. అప్పుడే ఓ స్టోరీ లైన్ ఉందంటూ ‘మామ్’ లైన్ చెప్పాను. ఆవిడ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నిజజీవితంలో పరిపూర్ణమైన తల్లిగా తన పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు. ఆవిడే ‘మామ్’కి కరెక్ట్ అనుకున్నాను. శ్రీదేవిగారు ఈ సినిమాలో జీవించేశారు. ఏ లోకంలో ఉన్నా ఈ అవార్డుకి ఆమె ఆనందపడతారు. ► ఈ సందర్భంగా శ్రీదేవిగారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెబుతారా? నమ్మరేమో. ఆవిడ చాలా బిడియస్తురాలు. అపరిచితులు ఉంటే అస్సలు మాట్లాడరు. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడరు. ఇన్ని సినిమాలు చేసిన ఈవిడ ఇలా ఉన్నారేంటి? అనుకున్నాను. అదే సన్నిహితులతో అయితే చాలా బాగా మాట్లాడతారు. జోకులు వేస్తుంటారు. ‘ఫన్ లవింగ్ పర్సన్’. హైదరాబాద్ వస్తున్నారంటే చాలు.. నాకు ఫోన్ చేస్తారు. ‘‘మీకు ‘ఉలవచారు’ హోటల్ ఉందట కదా. సాంబార్ అన్నం, గోంగూర అన్నం’ తెప్పిస్తారా’ అనేవారు. ఆ హోటల్ మాది కాదండి, నా ఫ్రెండ్‌ది అని, తెప్పించాను. ఆవిడకు అవి బాగా నచ్చేశాయ్. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అవే తినేవారు. శ్రీదేవిగారు వెజిటేరియన్. ఫుడ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవారు. మనకున్న గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. చాలా త్వరగా వెళ్లిపోయారు. బట్... తాను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోతారు. నీకు చాలా త్వరగా జాతీయ అవార్డు వచ్చిందన్నారు ‘కాట్రు వెలియిడై’కి ఉత్తమ సంగీతదర్శకుడిగా, ‘మామ్’ బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ఏఆర్ రెహమాన్‌కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ – ‘‘కాట్రు వెలియిడై’కి జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా గురువు, అన్నయ్య, గైడ్ మణిరత్నం నాకు చాలా స్పెషల్. ఆయనొక ఆలోచనల గని. మణిరత్నంతో మనం ఏ ఐడియా చెప్పినా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు. అంత టాలెంట్ ఉంది. ‘రోజా’తో మా ప్రయాణం మొదలైంది. ఆ సినిమాకి నాకు జాతీయ అవార్డు వస్తే ‘నీకు చాలా త్వరగా వచ్చింది’ అని కొందరు అన్నారు. కానీ, నేనలా అనుకోలేదు. ప్రజలు, నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలు, హీరోలు, నా టీమ్.. అందరికీ ధన్యవాదాలు. ఇక ‘మామ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలని బోనీజీ, శ్రీదేవిజీ చెన్నై వచ్చినప్పుడు నన్ను అడిగారు. నేను ఆనందంగా అంగీకరించాను. ఇలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. పైగా ఇప్పుడున్న పరిస్థితులకు చాలా అవసరమైన సినిమా. నాకీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బోనీజీ, శ్రీదేవిజీలకు ధన్యవాదాలు. ఆమె అద్భుతమైన నటి. శ్రీదేవిగారి ఆత్మ మనతోనే ఉందని నమ్ముతున్నాను’’ అన్నారు. ఉత్తమ గాయనిగా ‘కాట్రు వెలియిడై’ సినిమాకు జాతీయ అవార్డు దక్కించుకున్న శాషా తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు రెహమాన్. ఈ క్షణాలు ప్రత్యేకమైనవి ‘మామ్’ సినిమాలో శ్రీదేవి నటనకు బెస్ట్ యాక్ట్రస్ అవార్డును జ్యూరీ కమిటీ కన్ఫార్మ్ చేసినప్పుడు మేం ఎంతగానో సంతోషించాం. ఈ క్షణాలు మాకు ఎంతో ప్రత్యేకమైనవి. శ్రీదేవి నటించిన 300 సినిమాల్లోనూ సేమ్ ఫర్‌ఫెక్షన్‌ను చూపించారు. ఆమె కేవలం సూపర్ యాక్టర్ మాత్రమే కాదు. సూపర్ మామ్ అండ్ సూపర్ వైఫ్ కూడా. ఆమె జీవితంలో సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకునే టైమ్ ఇది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోవచ్చు. కానీ ఆమె వారసత్వం, జ్ఞాపకాలు మా వెంట ఇంకా జీవించే ఉన్నాయి. ఈ అవార్డుతో శ్రీదేవిని గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి జ్యూరీ మెంబర్స్‌కు ధన్యవాదాలు. – బోనీ కపూర్ అన్నవరం టు వైజాగ్.. ఓ ‘ఘాజీ’ ఐడియా – సంకల్ప్ రెడ్డి ► దర్శకుడిగా మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ కొట్టేశారు.. హ్యాపీగా ఉండి ఉంటారు.. అఫ్కోర్స్. ఒక ఎక్స్‌పరీమెంటల్ మూవీని ముందు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. ఐ యామ్ హ్యాపీ. ► ఇండియాలో ఫస్ట్ సబ్‌మెరైన్ మూవీ ‘ఘాజీ’. వర్కౌట్ అవుతుందా? అని కొందరు.. కొత్త కుర్రాడు సరిగ్గా తీయగలుగుతాడా? అని కొందరు.. ఈ మాటలు మీ వరకూ వచ్చాయా? ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అయితే రానాగారు, పీవీపీగారు నమ్మారు. నా స్క్రిప్ట్‌ని నేను బలంగా నమ్మాను. డిఫరెంట్ మూవీ ఇస్తే ప్రేక్షకులు చూస్తారనుకున్నాను. అది నిజమైంది. ► ఈ సినిమాని పీవీపీగారు నిర్మించే ముందు మీరే నిర్మించాలని కొంచెం డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా? అవును. పాకిస్తాన్ సబ్‌మెరైన్ సెట్ కూడా వేయించాను. అయితే సినిమా కంప్లీట్ చేసేంత మనీ లేదు. అప్పటికే నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో రానా ఈ సినిమాని నమ్మడం, పీవీపీగారు ముందుకు రావడంతో ‘ఘాజీ’ స్క్రీన్ మీదకు వచ్చింది. ► అసలు ‘ఘాజీ’ థాట్ ఎలా వచ్చింది? 2012లో నా పెళ్లయింది. అప్పుడు నా వైఫ్ (కీర్తీ రెడ్డి) బలవంతం చేస్తే అన్నవరం వెళ్లాం. అక్కణ్ణుంచి హైదరాబాద్ ట్రైన్ మిస్సవడంతో వైజాగ్ వెళ్లాం. అక్కడ బీచ్ రోడ్డులో సబ్‌మెరైన్ చూసినప్పుడు ఈ సినిమా థాట్ వచ్చింది. ► పెళ్లయిన వెంటనే సొంత డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకోవడం, అది కూడా ప్రయోగం. మరి.. మీ మిసెస్ వద్దనలేదా? (నవ్వుతూ). తను కూడా కొంత అమౌంట్ ఇచ్చింది. అమ్మానాన్న కూడా ఎంకరేజ్ చేశారు. వీళ్లతో పాటు ‘ఘాజీ’కి వర్క్ చేసిన టీమ్ చాలా కష్టపడ్డారు. అందువల్లే ఇంత మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలిగా. నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నప్పుడు మనీ ఎరేంజ్ చేయడం నాకు పెద్ద సవాల్ అయింది. అంతకు మించి నాకేదీ సవాల్ అనిపించలేదు. ఒకవేళ అవార్డు రాకపోయినా మంచి థాట్ వస్తే కచ్చితంగా ఎక్స్‌పరీమెంటల్ మూవీ చేస్తాను. అయితే అవార్డ్ అనేది ఒక బూస్ట్ లాంటిది. అవార్డ్స్ లిస్ట్ దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్ – వినోద్ ఖన్నా బెస్ట్ డైరెక్టర్ : జయరాజ్ (‘భయానకం’ – మలయాళం) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ : లడఖ్ మరాఠి : కచ్చ లింబు తెలుగు : ఘాజీ మలయాం : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం హిందీ : న్యూటన్ బెంగాలీ : మయూరాక్షి అస్సామీ : ఇషూ తమిళ్ : టు లెట్ గుజరాతీ: డీ హెచ్ హెచ్ కన్నడ : హె బెట్టు రామక్క బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ : పీటర్ హెయిన్ (బాహుబలి –2) బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమకథా) బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ‘బాహుబలి 2’ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ : నగర్ కిర్టన్ చిత్రం బెస్ట్ లిరిక్స్ : ముత్తూ రత్న (కన్నడ– ‘మార్చి22’) బ్యాగ్రౌండ్ స్కోర్ : ఏఆర్ రెహమాన్ (మామ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వెలియిడై) బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ : రామ్ రజాక్ (నగర్ కిర్టన్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సంతోష్ రాజన్ (మలయాళం) బెస్ట్ ఎడిటింగ్ : రీమా దాస్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : భయానకం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : శాషా తిరుపతి బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ : ఏసుదాస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : దివ్య దత్తా (ఇరాదా) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఫాహద్ ఫాజిల్ బెస్ట్ యాక్ట్రెస్ : శ్రీదేవి (మామ్) బెస్ట్ యాక్టర్ : రిద్దీ సేన్ (నగర్ కిర్టన్) బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మూవీ: దప్పా (మరాఠీ) బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : ‘బాహుబలి 2’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘విలేజ్ రాక్‌స్టార్స్’ -
హ్యాండ్సమ్ విలన్... సూపర్ స్టార్... సెక్సీ సన్యాసి
వినోద్ ఖన్నా అంటే చాలామందికి అసూయ. జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాడని ఆయన గురించి అనుకుంటారు. దానికి కారణం కెరీర్ పీక్‌లో ఉండగా, బాలీవుడ్లో టాప్ హీరోగా ఉండగా దాన్నంతటనూ కాలదన్ని రజనీష్ ఆశ్రమంలో సేవ చేయడానికి ఆయన అమెరికా వెళ్లిపోయాడు. రజనీష్ ఆధ్యాత్మికంగా ఏమి చెప్పినా ఆయన పట్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత గౌరవం ఉన్నా సగటు మనిషికి మాత్రం రజనీష్ ఆశ్రమంలో భౌతికపరమైన కట్టుబాట్లు ఉండవనీ ఎవరు ఎలా అయినా ఆనందాన్ని పొందవచ్చని ఒక నమ్మకం స్థిరపడిపోయింది. దాని వల్ల వినోద్ ఖన్నా కూడా అలాంటి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి ఉంటాడని చాలామందికి జెలసీ. నిజానికి వినోద్ ఖన్నా చాలా అదృష్టవంతుడు. తండ్రిది కలిగిన కుటుంబం. దేశ విభజన సమయానికి పెషావర్ నుంచి ముంబై వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ ఖన్నా నాసిక్‌లో చదువుకున్నాడు. చాలా సిగ్గరి అయిన ఈ మనిషికి కాలేజీ రోజుల్లో వేసిన నాటకం ‘యాక్టింగ్ రుచి’ని చూపించింది. ఆ రోజుల్లో ఆయన చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఏ–ఆజమ్’ సినిమాలు కూడా సినిమాల వైపు పురిగొల్పాయి. ‘రెండేళ్లు టైమ్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటా. లేకుంటే వ్యాపారం చేస్తా’ అని సినిమా రంగంలోకి వచ్చాడు. సునీల్ దత్ అతడి రూపాన్ని మెచ్చి ‘మన్ కా మీత్’ (1968)లో తొలి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వినోద్ ఖన్నా ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘సచ్చా ఝూటా’, ‘మేరా గావ్ మేరా దేశ్’ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు. కాని దర్శకుడు, గేయ కర్త అయిన గుల్జార్ అతడి జీవితాన్ని మార్చాడు. గుల్జార్ తీసిన ‘మేరే అప్నే’, ‘అచానక్’ సినిమాలు వినోద్ ఖన్నాలోని నటుడిని బయటకు తెచ్చి అతని ఇమేజ్ను మార్చాయి. ఒక వైపు అమితాబ్, మరోవైపు వినోద్ ఖన్నా సమానంగా కెరీర్లో ముందుకు సాగారు. వీరిద్దరూ కలిసి ‘హేరా ఫేరీ’, ‘ఖూన్ పసీనా’, ‘పర్వరీష్’, ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ముకద్దర్ కా సికిందర్’ వంటి పెద్ద హిట్స్ ఇచ్చారు. అమితాబ్ ఏకఛత్రాధిపత్యాన్ని వినోద్‌ఖన్నా తన్నుకుపోబోతున్నాడు అనే స్థితికి ‘ఖుర్బానీ’ వంటి మెగాహిట్స్తో వినోద్ ఖన్నా చేరుకోవడం ఆ సమయంలో అమితాబ్ చాలా ఆందోళన చెందడం ఇండస్ట్రీకి తెలుసు. కాని హఠాత్తుగా వినోద్ ఖన్నా రజనీష్ శిష్యుడిగా మారిపోయి అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. అయిదేళ్లు (1982–86) అమెరికాలో వినోద్ ఖన్నా వంట సహాయకుడిగా, తోటమాలిగా ఆశ్రమంలో పని చేశాడు. కాని త్వరలోనే విసుగుపుట్టి తిరిగి ముంబై చేరుకున్నాడు. వదిలేసి వెళ్లినదాన్ని తిరిగి పొందడం దాదాపు అసంభవం. కాని వినోద్ ఖన్నా తిరిగి సెకండ్ హయ్యస్ట్ (మొదటి స్థానం అమితాబ్‌ది) పెయిడ్ హీరోగా సినిమాలు చేశాడు. ‘జుర్మ్’, ‘చాందిని’, ‘దయావన్’ వంటి సినిమాలు అతడికి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాయి. అయితే చాలా త్వరగానే వినోద్ ఖన్నా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత రాజకీయవేత్తగా తన మార్గాన్ని మార్చుకున్నాడు. నాలుగుసార్లు ఆయన ఎంపీగా గెలిచాడు. ఇలా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బాలీవుడ్ స్టార్లు లేరు. వినోద్ ఖన్నా మొదటి భార్య గీతాంజలి ద్వారా అతడికి అక్షయ్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రెండవ భార్య కవిత ద్వారా సాక్షి ఖన్నా, శ్రద్ధ కలిగారు. అక్షయ్ ఖన్నా బాలీవుడ్లో నటుడిగా రాణిస్తున్నాడు. వినోద్ ఖన్నా శ్రీమంతుడిగా పుట్టాడు.. శ్రీమంతుడిగానే చనిపోయాడు. అందగాడిగా, మగటిమి ఉన్న పురుషుడిగా వినోద్ ఖన్నా గుర్తుంటాడు. ఆయన చేసిన ‘సింథాల్’ యాడ్‌ను ఎవరు మర్చిపోగలరు? ఆయన జీవించి ఉండగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ ఇచ్చి ఉంటే బాగుండేది. 2017 ఏప్రిల్ 27న మరణిస్తే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత పురస్కారం ప్రకటించారు.వినోద్ ఖన్నా అంటే ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నువ్వు దారులు మార్చుకో, తోవ తప్పు, గెలువు, ఓడు.. కాని ఆగిపోకు.. నడుస్తూ ఉండు అని ఆయన తన ప్రయాణం ద్వారా చెప్పాడు. ఆయన పాట ద్వారానే ఆయనను గుర్తు చేసుకుందాం..‘రుక్ జాన నహీ కహి తూ హార్ కే... కాంటోంపే చల్ కే మిలేగే సాయే బహార్ కే... -
నాన్నకు ప్రేమతో.. బై డాడ్
ముంబై : అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా(70) మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. చిన్నతనంలో తండ్రితో కలిసి సరదాగా గడిపిన మధుర క్షణాలను వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా మరువలేకపోతున్నారు. 'ఓ జెంటిల్మెన్లా ఎలా బతకాలో మిమ్మల్ని చూసి తెలుసుకున్నా. మీ చివరి రోజు వరకు ఓ యోదిడిలా బతికి, మీ ప్రస్థానాన్ని ముగించారు' అంటూ రాహుల్ ఖన్నా ట్వీట్ చేశారు. ఎంతో భావోద్వేగంతో చివరి సారిగా బై డాడ్ అంటూ.. రాహుల్ ఖన్నా పుట్టిన తర్వాత తొలిసారి తండ్రి వినోద్ ఖన్నా ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. తండ్రితో కలిసి దిగిన తన చిన్ననాటి ఫోటోలను రాహుల్ ఖన్నా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ మధుర స్మృతులు నిన్ననే జరిగాయా అన్నట్టు ఉందటూ పేర్కొన్నారు. అమర్ అక్బర్ ఆంథోనీ, ఖుర్బానీ, ఇన్సాఫ్ వంటి హిట్లతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఖన్నా...అనారోగ్యంతో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. -
వినోద్ ఖన్నా ఇకలేరు
అలనాటి స్టార్ హీరో, బాలీవుడ్ అందగాడు అస్తమయం - రాష్ట్రపతి, ప్రధాని, బాలీవుడ్ ప్రముఖుల తీవ్ర సంతాపం ముంబై: అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు, లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా(70) గురువారం ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. అమర్ అక్బర్ ఆంథోనీ, ఖుర్బానీ, ఇన్సాఫ్ వంటి హిట్లతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఖన్నా... గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 11.20 నిమిషాలకు వినోద్ ఖన్నా కన్నుమూశారని, ఇది మా అందరికీ ఎంతో విషాదకరమని ఆయన సోదరుడు ప్రమోద్ ఖన్నా తెలిపారు. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఈ ఏడాది మార్చి 31న ఖన్నాను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయనకు బ్లాడర్(మూత్రాశయ) క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య గురువారం సాయంత్రం వర్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వినోద్ ఖన్నాకు భార్య కవితా ఖన్నా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య గీతాంజలి కుమారులైన రాహుల్, అక్షయ్‌లు ఇద్దరూ బాలీవుడ్ నటులే. అలనాటి బాలీవుడ్ అందగాళ్లలో ఒకరిగా పేరొందిన వినోద్ ఖన్నా.. 1968లో ‘మన్ కా మీత్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో కన్పించిన ఆయన 1971లో గుల్జార్ సినిమా ‘మేరే అప్నే’తో హీరోగా గుర్తింపు పొందారు. వరుస విజయాలతో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1982లో ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. ఐదేళ్లపాటు పుణేలోని ఓషో రజనీష్ ఆశ్రమంలో గడిపి తిరిగి సినిమాల్లోకి పునఃప్రవేశం చేశారు. అనంతరం ఇన్సాఫ్, సత్యమేవ జయతే చిత్రాలతో మళ్లీ పుంజుకున్నారు. చివరిసారిగా 2015లో షారూక్ ఖాన్ సినిమా దిల్‌వాలేలో నటించారు. మొదటినుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవరించిన ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం అక్కడి నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రముఖుల సంతాపం వినోద్ ఖన్నా మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఖన్నా మృతితో దేశ సినీపరిశ్రమ అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నటుడిగా, అంకితభావం కలిగిన నేతగా, మంచి మనిషిగా వినోద్ ఖన్నా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మృతి వార్త విని ఎంతో బాధపడ్డా.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆకట్టుకునే వ్యక్తిత్వంతో సామాన్య ప్రజల్ని వినోద్ ఖన్నా ఎంతో ప్రభావితం చేశారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. లోటు తీర్చలేనిది: రజనీకాంత్ ‘ఇది నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం. ఇద్దరం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను కలిసి ప్రయాణించాం’ అని ఆయన సమకాలీన నటుడు శత్రుఘ్న సిన్హా ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా ప్రియమిత్రుడు వినోద్ ఖన్నా లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సూపర్‌స్టార్ రజనీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సంజయ్ దత్, కరణ్ జోహర్, పరేష్ రావల్, అజయ్ దేవ్‌గణ్, అనుష్క శర్మ, సోనాక్షీ సిన్హా, తీవ్ర సంతాపం తెలిపారు. బాహుబలి ప్రీమియర్ షో రద్దు వినోద్ ఖన్నా మృతి నేపథ్యంలో బాలీవుడ్లో గురువారం సాయంత్రం ప్రదర్శించాల్సిన బాహుబలి సినిమా ప్రీమియర్ షోను రద్దు చేశారు. ఈ మేరకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత కరణ్ జోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఆ వినోదం అమరం
‘‘నువ్వు సినిమాల్లోకి వెళ్లావంటే చంపేస్తా’’. సరిగ్గా తలకు తుపాకీ గురి పెట్టి కొడుకు వినోద్ ఖన్నాను బెదిరించారు కిషన్‌చంద్ ఖన్నా. సినిమా ల్లోకి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్న వినోద్ ఖన్నాకి ఏం పాలుపోలేదు. వెళ్లే తీరతానంటే తండ్రి ఊరుకోడు. ‘‘రెండంటే రెండేళ్లు అవకాశం ఇవ్వండి. నిలదొక్కుకోలేకపోతే వెనక్కి వచ్చేస్తాడు’’ అంటూ కొడుకుని సపోర్ట్ చేస్తూ, భర్తను ఒప్పించారు వినోద్ ఖన్నా తల్లి కమల. ఆ రోజు ఆ సపోర్ట్ లేకపోయుంటే వినోద్ ఖన్నా అనే ఆరడుగుల అందగాడు వెండితెరకు వచ్చి ఉండేవాడు కాదు. ప్రతినాయకుడిగా మొదలై నాయకుడిగా ఎదిగి, సహాయ నటుడిగానూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారాయన. ‘మొఘల్–ఎ–అజం’ ప్రభావంతో... 1946 అక్టోబర్ 6న పెషావర్‌లో వినోద్ ఖన్నా జన్మించారు. అతను పుట్టిన కొన్ని నెలలకే దేశ విభజన జరగడంతో వినోద్ కుటుంబం ముంబై చేరింది. నాసిక్‌లో డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే వినోద్ ఖన్నాకు సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది. అప్పుడు చూసిన ‘సోల్వా సాల్’, ‘మొఘల్–ఎ–అజం’ చిత్రాలు సినిమాల్లోకి రావాలనే అభిప్రాయాన్ని కలిగించాయి. అనుకోకుండా ఓ పార్టీలో దర్శక–నిర్మాత సునీల్ దత్‌ని కలిశారు వినోద్ ఖన్నా. అప్పుడు తన సోదరుడు సోమ్ దత్ హీరోగా సునీల్ దత్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో విలన్‌గా వినోద్ ఖన్నాకు అవకాశం ఇచ్చారు. హీరోలా ఉన్నప్పటికీ నటన మీద మక్కువతో వినోద్ ఖన్నా ఒప్పేసుకున్నారు. అలా ‘మన్ కా మీత్’ (1968) సినిమా ద్వారా ఆయన తొలిసారి తెరపై కనిపించారు. ఆ సినిమాకి మన తెలుగు దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. వారంలో 15 సినిమాలు! మొదటి సినిమా రిలీజైన వారానికి ఏకంగా 15 సినిమాలకు సైన్ చేశారు వినోద్ ఖన్నా. పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్చా ఝూటా, మస్తానా, మేరో గోన్ మేరా దేశ్, ఎలానా వంటి చిత్రాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా చేశారు.రీల్ లైఫ్ బాగుంది. రియల్ లైఫ్‌లోనూ సెటిలవ్వాలను కున్నారు. కాలేజీలో ప్రేమించిన గీతాంజలిని పెళ్లాడాలనుకున్నారు. 50 మల్టీస్టారర్స్‌లో... 1971లో ఈ ప్రేమికులు భార్యాభర్తలయ్యారు. అదే ఏడాది వినోద్ ఖన్నాకు హీరోగానూ బ్రేక్ వచ్చింది. ‘హమ్ తుమ్ ఔర్ ఓ’ సినిమాతో ఆయన హీరోగా మారారు. ఫరేబీ, కాయిద్, జాలిమ్, ఇన్కార్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇద్దరు హీరోలున్న సినిమాలూ ఎక్కువే చేశారు. ఫిరోజ్ ఖాన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘కుర్బానీ’ (1980)లో వినోద్ ఖన్నా ఓ హీరో. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది. శశికపూర్, అమితాబ్ బచ్చన్, రణధీర్ కపూర్ వంటి హీరోలతో కలిసి దాదాపు 50 మల్టీస్టారర్ మూవీస్ చేశారు వినోద్ ఖన్నా. అమితాబ్‌తో ఆయనకు మంచి పోటీ ఉండేది. అప్పటికి అమితాబ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో. అయితే 1974 నుంచి 1982 వరకూ అమితాబ్, జితేంద్ర కాంబినేషన్లో చేసిన సినిమాల్లో వినోద్ ఖన్నాకే ఎక్కువ పారితోషికం ఇచ్చారు దర్శక–నిర్మాతలు. ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితం పేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్‌లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. ‘దిల్వాలే’ చివరి సినిమా విశేషం ఏంటంటే.. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా వినోద్ ఖన్నాకు అవకాశాలకు కొదవ లేకుండాపోయింది. ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. కొడుకు అక్షయ్ ఖన్నా కోసం ‘హిమాలయ్ పుత్ర్’ (1997) సినిమా నిర్మించి, నటించారు కూడా. 2015లో వచ్చిన షారుక్ ‘దిల్వాలే’ వినోద్ ఖన్నాకు చివరి చిత్రం. రాజకీయాల్లోనూ సక్సెస్ 1997లో వినోద్ ఖన్నా రాజకీయ రంగప్రవేశం చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లోనూ అదే నియోజక వర్గం నుంచి గెలుచుకున్నారు. 2002లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత పలు పదవులు చేపట్టారు. ప్రస్తుతం గురుదాస్‌పూర్‌కి ఎంపీగా ఉన్నారు. ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో... గత కొంతకాలంగా వినోద్ ఖన్నా ఆరోగ్యం బాగాలేదు. ఈ నెల మొదటి వారంలో వినోద్ ఖన్నా బక్క చిక్కిన శరీరంతో, చాలా బలహీనంగా కనిపించిన ఫొటో ఒకటి బయటికొచ్చింది. అది చూసి బాధపడనివాళ్లు లేరు. ఆయన బ్లాడర్ (మూత్రకోశం) కేన్సర్‌తో బాధపడుతున్నారనే వార్తలు రాగా, ‘అదేం లేదు. డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారు’ అని వినోద్ ఖన్నా తనయుడు రాహుల్ ఖన్నా ప్రకటించారు. వినోద్ ఖన్నా త్వరగా కోలుకోవాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులూ కోరుకున్నారు. కొన్ని రోజులుగా ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వినోద్ ఖన్నా (70) గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ, రాజకీయ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినోద్‌ఖన్నా ఎక్కువ సినిమాల్లో ‘అమర్’ పేరుతో తెరపై మెరిశారు. కేన్సర్‌తో కన్నుమూసిన ఆయన ఇప్పుడిక అమర లోకంలో వినోదం పంచుతారనే వ్యాఖ్యలతో అభిమానులు ఆయన నటవైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
రజనీష్ ఆశ్రమంలో వినోద్ ఖన్నా
ముంబై: అలనాటి బాలివుడ్ నటుడు వినోద్ ఖన్నా సినీ జీవితం గురించే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయన ఓషో రజనీష్ ఆశ్రమంలో ‘స్వామి వినోద్ భారతి’గా గడిపిన వివాదాస్పద జీవితం గురించి ఎవరికి ఎక్కువగా తెలియదు. అమితాబ్ బచ్చన్‌తో పోటాపోటీగా బాలివుడ్ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే ఆయన పుణెలోని రజనీష్ ఆశ్రయం పట్ల ఆకర్షితులయ్యారు. ప్రతి వారంతంలో అక్కడికెళ్లి అక్కడే రెండు రోజులు గడిపి వచ్చేవారు. అందుకు వీలుగా ఆయన తన షూటింగ్‌లన్నీ పుణె చుట్టుపక్కలనే ఉండేలానే చూసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే, 1975, డిసెంబర్ 31వ తేదీన సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని ఆయన బహిరంగంగా ప్రకటించినప్పుడు బాలివుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆయన కొత్త సినిమాలను కాల్షీట్లు ఇవ్వకుండా షూటింగ్ దశలోవున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ‘కామిగాని వాడు మోక్షగామి కాలేడు. ఇదే జీవితానికి ముక్తి మార్గం’ అంటూ ప్రచారం. చేయడం ద్వారా స్వామి రజనీష్ తన ఆశ్రయాన్ని స్త్రీ, పురుషుల శృంగార లీలలకు నిలయంగా మార్చారు. అప్పటికే విలాస జీవితాన్ని గడుపుతున్న వినోద్ ఖన్నా అటువైపు పూర్తిగా ఆకర్షితులయ్యారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా వినకుండా ఆయన 1982లో రజనీష్ ఆశ్రమానికి పూర్తిగా మకాం మార్చేశారు. అక్కడ ఆయన్ని సహచరులు ‘సెక్సీ స్వామీజీ’ అని పిలిచేవారట. ఆశ్రమాన్ని మూసేయాల్సిందిగా మహారాష్ట్ర పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో రజనీష్ తన ఆశ్రమాన్ని అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రానికి మార్చారు. ఆయనతోపాటు వినోద్ ఖన్నా కూడా అమెరికా వెళ్లారు. అక్కడ తాను తోటకు నీళ్లుపోసే వాడినని, తన గురువైన స్వామీజీ రజనీష్ బట్టలు ఉతికే వాడినని వినోద్ ఖన్నా ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో ఓ దీవిని కొనుగోలుచేసి అందులోనే రజనీష్ తన ఆశ్రమాన్ని నడిపారు. దానికి రజనీష్పురం అని కూడా పేరు పెట్టారు. ఆశ్రమంలో ఎయిడ్స్ కారణంగా ఆరేడుగురు మరణించడంతో కోపగించిన అమెరికా ప్రభుత్వం బలవంతంగా రజనీష్ ఆశ్రమాన్ని 1985లో మూసివేసి రజనీష్‌ను భారత్‌కు పంపించింది. అప్పుడే వినోద్ ఖన్నా కూడా భారత్‌కు వచ్చారు. మళ్లీ పుణెలో రజనీష్‌తోపాటు రెండేళ్లు ఆశ్రమంలోవున్న వినోద్‌కన్నా 1987లో తిరిగి సినీరంగంలో అడుగుపెట్టారు. రజనీష్ మాత్రం 1990లో చనిపోయే వరకు ఆశ్రమంలోనే గడిపారు. సమాజంలో కావల్సినంత డబ్బు, హోదా లభించడంతో ఇంకేం చేయాలో తోచకా, ఇంకా ఏదో చేయాలనే ఒకలాంటి తాత్విక చింతనతో రజనీష్ మాయలో పడిపోయానని వినోద్ ఖన్నా తన ఆశ్రమ జీవితం గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సరిగ్గా పీక్ టైమ్‌లో సినిమాలకు వినోద్ ఖన్నా దూరమవడంతో ఆయనకు రావాల్సిన అవకాశాలు కూడా అమితాబ్ బచ్చన్‌కే ఎక్కువ వచ్చాయి. అమితాబ్ నటించిన ఎక్కువ సినిమాల్లో ఆయన పాత్ర పేరు విజయ్కాగా, వినోద్ ఎక్కువగా అమర్ అనే పేరుగల పాత్రల్లో నటించారు. అప్పట్లో వారికి అదో సెంటిమెంట్. 1960లో విడుదలైన ‘మొగల్ ఏ ఆజం’ సినిమాను వినోద్ ఖన్నా తన 14వ ఏటా చూశారు. అప్పుడే తాను హీరో కావాలని నిర్ణయించుకున్నారట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వినోద్ ఖన్నాను హాలివుడ్ నటుడు కిర్గ్ డగ్లస్‌తో పోల్చేవారు. ఇద్దరి గదుమ కింద సన్నటి సొట్ట కనిపించడమే అందుకు కారణం. -
9 ఏళ్లక్రితం ఆయన...ఇపుడు వినోద్‌జీ
ముంబై: సుమారు 100పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, యాక్టివ్ పోలిటీషియన్ వినోద్ ఖన్నా (70) ఇక లేరన్న వార్త తో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. శ్వాసకోశ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్ ఖన్నా గురువారం ఉదయం 11.20గంగలకు అంతిమ శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్‌లో మొదటి వారంలో సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటలో చేరారు. తమ అభిమాన, సహచర నటుడు కన్నుమూతతో బాలీవుడ్ గుండె బరువెక్కింది. అశ్రునయనాలతో ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యంగా కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరాని వినోద్ ఖన్నా ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసినగౌరవం తనకు దక్కిందని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ మరో సీనియర్ నటుడు రిషీకపూర్ అమర్ అక్బర్, ఆంటోనీ సినిమాలో అమర్ పాత్ర పోషించిన వినోద్‌కు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే హీరోయిన్ రాధిక, రిచా చద్దా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. పంజాబ్ గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు బీజీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘మేరె అప్నే’ "ఇన్సాఫ్" "అమర్, అక్బర్ ఆంటోనీ, లాంటి సినిమాలతో ఆయన పాపులర్ అయ్యారు. వినోద్ ఖన్నా మరణంపై సినీ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ ఆదర్శ్ సంతాపం ప్రకటించారు. 2015లో షారూక్ సినిమా దిల్వాలే ఆయన నటించిన ఆఖరి సినిమా. ఖుర్బానీ, దయావన్ మూవీలలో వినోద్ ఖన్నాతో కలిసి నటించిన ఫిరోజ్‌ఖాన్ తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున( ఏప్రిల్ 27) మరణించారని, ఇపుడు వినోద్ ఖన్నా ఇదే రోజున కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా అక్టోబర్ 6, 1946లోజన్మించిన ఆయన 1968లో సినీ కరియర్ ను ప్రారంభించారు. అమర్ అక్బర్ ఆంటోనీ, ది బర్నింగ్ ట్రైన్ లాంటి చిత్రాలలో నటించారు. 1982లో ఓషో రజనీష్ ప్రభావంతో ఫిలిం ఇండస్ట్రీని వీడాలని నిర్ణయించుకున్నారు. అయితే అయిదేళ్ల తరువాత ఇన్సాఫ్, సత్యమేవ జయతే చిత్రాలో సినీరంగాని తిరిగి చేరువయ్యారు. వినోద్ ఖన్నాకు భార్య , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. Will miss you Amar. RIP. pic.twitter.com/WC0zt71R4J — Rishi Kapoor (@chintskap) April 27, 2017 Heard about the sad demise of Vinod Khannaji. Kind, considerate, a legend in his own right. Had the honour of producing a series with him. — Smriti Z Irani (@smritiirani) April 27, 2017 -
బతికున్న నటుడికి బీజేపీ మౌనం పాటించింది!
మేఘాలయా బీజేపీ నేతల వింత చర్య బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 31న ముంబై గిర్గామ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో స్పష్టం చేశారు కూడా. మరోవైపు వినోద్ ఖన్నాకు క్యాన్సర్ సోకిందంటూ ఆయన దీనంగా, బలహీనంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆయన చనిపోయారంటూ వదంతులు కూడా గుప్పుమన్నాయి. ఈ వదంతులను గుడ్డిగా నమ్మిన మేఘాలయా బీజేపీ నేతలు ఏకంగా వినోద్ ఖన్నా బతికుండగానే ఆయనకు సంతాపం ప్రకటించి..రెండు నిమిషాలు మౌనం పాటించారు. నటుడు వినోద్ ఖన్నా ప్రస్తుతం పంజాబ్ గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తమ పొరపాటును వెంటనే గుర్తించిన అక్కడి బీజేపీ నేతలు వివరణ ఇచ్చారు. వినోద్ ఖన్నా చనిపోయారంటూ వచ్చిన తప్పుడు వార్తల వల్లే తాము నివాళులర్పించామని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ చర్యకు క్షమాపణలు కోరారు. ఆ నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. మరోవైపు వినోద్ ఖన్నా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రూమర్స్ నేపథ్యంలో ఆయన కొడుకు స్పందిస్తూ తన తండ్రి ప్రస్తుతం చక్కగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభిమానులకు సూచించారు. #WATCH: Faux pas by Meghalaya BJP; they observed silence after rumours of Vinod Khanna's death surfaced. pic.twitter.com/VaZiemU4WU — ANI (@ANI_news) 8 April 2017 -
‘దయచేసి ఆయన ఫొటోలను పోస్ట్ చేయకండి’
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంపై మరో నటుడు టీవీ యాక్టర్ కిరణ్ కర్మాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయవద్దని, వాటి వల్ల ఆయన బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆన్లైన్లో ఆస్పత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యం క్షీణించి, సన్నబడిపోయిన దేహంతో ఆస్పత్రి దుస్తులతోనే కుమారుడు, భార్యతో ఆ ఫొటో దర్శనం ఇస్తోంది. ఈ ఫొటో చూసినవారికి ఆయనపై జాలి కలిగేలా ఉంది. దీంతో కిరణ్ కర్మాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘దయచేసి ఖన్నా ఫొటోలను పోస్టింగ్ చేయడం ఆపండి. ఆయనను అభిమానులు దయచేసి బాధపెట్టవద్దు. ఆయన మనందరికి ప్రియమైన హీరో. ఆయనను అలా ఉండనివ్వండి. వైద్య సేవలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన ఫొటోలను పెట్టకండి’ అంటూ తన ఫేస్బుక్ పేజీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ సీనియర్ నటుడికి క్యాన్సర్ సొకిందా?
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అమితాబ్ బచ్చన్‌కు గట్టి పోటీనిచ్చిన డ్యాషింగ్ స్టార్ వినోద్ ఖన్నా. ప్రస్తుతం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు క్యాన్సర్ సొకినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. డీహైడ్రేషన్ కారణంగా గత నెల 31న వినోద్ ఖన్నాను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు. అయితే, గురువారం వెలుగులోకి ఆయన ఫొటోలు అభిమానులను షాక్ గురిచేశాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలలో బలహీనంగా కనిపిస్తున్న వినోద్ ఖన్నాకు క్యాన్సర్ సోకిందేమోనంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీ కూడా అయిన వినోద్ ఖన్నా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలిపేందుకు సదరు ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వినోద్ ఖన్నా కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నామని వైద్యులు చెప్తున్నారు. #VinodKhanna Get well soon Vinod ji....we will pray for you...Definitely you will win against this war...Love u — Venky aDIGA (@Anchor_Venky) 6 April 2017 -
కోలుకున్న సీనియర్ నటుడు!
బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్‌కు గురైన ఆయనను గత నెల 31న కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే వినోద్ ఖన్నాను ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు. -
హే.. ఆ క్రికెటర్ మళ్లీ ఏసేసాడు!
మైదానంలోనే కాదు ట్విట్టర్లోనూ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రూటే సపరేటు.. మైదానంలో బౌండరీలో హోరెత్తించిన ఈ క్రికెట్ యోధుడు.. ట్విట్టర్లో తన కితకితలతో అభిమానుల్లో కేక పుట్టిస్తున్నాడు. తన ’సెన్స్ ఆఫ్ హ్యుమర్’ తో, కిరాక్ డైలాగులతో సెహ్వాగ్ నిత్యం వార్తల్లోకి వస్తున్నాడు. ఆయన పంచులకు అభిమానులే కాదు విమర్శకులు ఫిదా అయిపోతున్నారు. మొన్నటికి మొన్న ‘దేవుడు’గారు సచిన్ టెండుల్కర్‌పై పంచులు వేసి నవ్వించిన సెహ్వాగ్ తాజాగా అలనాటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘మళ్లీ ఏసెశాడు’.. వినోద్ ఖన్నా గురువారం 70వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ‘Today let’s drink Juice of Ganna. To wish Happy Birthday to Vinod Khanna’ (వినోద్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ రోజు అందరం కలిసి గన్నా (చెరుకు) రసం తాగుదాం) అంటూ ఛలోక్తి విసిరాడు. ప్రాసతో కూడిన ఈ పంచ్ ట్విట్టర్లో బాగా పేలింది. గంటలోపే ఈ ట్వీట్‌ను నెటిజన్లు మూడువేలకుపైగా రీట్వీట్ చేశారు. ఇదే కాదు.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన ‘మీర్జ్యా’ సినిమా ప్రివ్యూ చూసి కూడా సెహ్వాగ్ తనదైన ప్రాసతో పంచ్ వేశాడు. 'అద్భుతమైన ప్రేమకథ 'మీర్జ్యా'ను చూపించినందుకు ఓంప్రకాశ్ మెహ్రాకు కృతజ్ఞతలు. బౌలింగ్‌లో నెహ్రాకు.. ప్రేమకథల్లో మెహ్రాకు జవాబిచ్చేటోడే లేడు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో ఫిదా అయిన ఓంప్రకాశ్ మెహ్రా.. 'పాజీ.. ఈసారి బౌండరీ బయటకు బాదారు' అంటూ కితాబు ఇచ్చాడు. సచిన్-సెహ్వాగ్ సంవాదం! కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య భారత్.. న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని సాధించి.. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లోనూ నంబర్1 స్థానానికి దూసుకెళ్లింది. ఆ సందర్భంగా.. సచిన్-సెహ్వాగ్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికరమైన సంవాదం నడిచింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 'అద్భుతంగా ఆడారం'టూ భారత ఆటగాళ్లను సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో అభినందించారు. కాగా, స్టార్ క్రికెట్ లో ప్రసారం అవుతోన్న భారత్-న్యూజిలాండ్ సిరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తోన్నసెహ్వాగ్.. సచిన్ ట్వీట్ కు స్పందిస్తూ... 'క్రికెట్ దేవుడా, ప్రశంసలు ఎప్పుడూ ఆటగాళ్లకేనా.. మాకు(కామెంటేటర్లకు) కూడా ఇవ్వకూడదా'అని వ్యాఖ్యానించాడు. దీనికి ప్రతిగా సచిన్.. 'జియో మేరే లాల్.. తథాస్తు'అని దీవించాడు. అంతటితో ఊరుకోని సెహ్వాగ్.. 'సచిన్ జీ.. ఆశీర్వాదంలోనూ మీ ఐపీఎల్ ఫ్రాంచైంజ్(రిలయన్స్ ముంబై ఇండియన్స్) బ్రాండ్(జియో)ను ప్రచారం చేస్తున్నారు' అని మరో ట్విస్ట్ ఇచ్చాడు. అదేలేదంటూ చివరకు సచిన్ ఘాటైన వివరణ ఇచ్చాడు. -
అక్టోబర్ 6 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంజయ్ మిశ్రా (నటుడు), వినోద్ ఖన్నా (నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్స్టిట్యూషన్ల లో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. అయితే ఆపోజిట్ సెక్స్వారితో సంబంధాలు నెరిపే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
ది బర్నింగ్ ట్రైన్....
బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్‌గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది. -
'సునీల్ దత్, వినోద్ ఖన్నాలే నాకు స్పూర్తి'
ముంబై: నటులుగా, రాజకీయ నాయకులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ దత్, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హాల జీవితాలే తనకు ఆదర్శమని బీజేపీ నుంచి కొత్తగా లోక్ సభకు ఎన్నికైన మనోజ్ తివారీ స్పష్టం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించిన ఆ ముగ్గరు జీవితాల్నిసవాల్ తీసుకుని తాను కూడా ముందుకు వెళతానని తివారీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. వారి జీవితాలే తనకు ఆదర్శమన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు రాజకీయ రంగాల్లో రాణించలేరని అపవాదును వారు ముగ్గురు తొలగించారన్నారు. ఆ విమర్శలు సరైనవి కావనడానికి వారి రాజకీయ జీవితాన్ని పరికిస్తే అవగతమవుతుందన్నారు. 'నేను భోజ్ పూరి భాషా సంక్షేమానికి, హిందీ చిత్ర రంగ అభివృద్ధికి కృషి చేస్తానని' తివారీ తెలిపాడు. లోక్ సభలో ఈ అంశాలకు సంబంధించి తనగొంతును వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని తివారీ తెలిపారు. -
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌పై వినోద్ ఖన్నా పోటీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది అభ్యర్థులతో బీజేపీ ఈ మేరకు మంగళవారం రాత్రి జాబితా విడుదల చేసింది. 2009 ఎన్నికల్లో తనను స్వల్ప ఓట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వాపై వినోద్ ఖన్నా మరోసారి తలపడి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌పై మండి స్థానంలో రామ్ స్వరూప్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది. బీజేపీ అధికార ప్రతినిధిగా ఎంజే అక్బర్: మూడు రోజుల కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ జర్నలిస్టు ఎం.జే. అక్బర్‌ను ఆపార్టీ అధిష్టానం జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అదేవిధంగా ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా అరుణ్ సింగ్‌ను నియమించారు