అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా(70) మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది.
ముంబై :
అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా(70) మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. చిన్నతనంలో తండ్రితో కలిసి సరదాగా గడిపిన మధుర క్షణాలను వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా మరువలేకపోతున్నారు. 'ఓ జెంటిల్మెన్లా ఎలా బతకాలో మిమ్మల్ని చూసి తెలుసుకున్నా. మీ చివరి రోజు వరకు ఓ యోదిడిలా బతికి, మీ ప్రస్థానాన్ని ముగించారు' అంటూ రాహుల్ ఖన్నా ట్వీట్ చేశారు. ఎంతో భావోద్వేగంతో చివరి సారిగా బై డాడ్ అంటూ.. రాహుల్ ఖన్నా పుట్టిన తర్వాత తొలిసారి తండ్రి వినోద్ ఖన్నా ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.
తండ్రితో కలిసి దిగిన తన చిన్ననాటి ఫోటోలను రాహుల్ ఖన్నా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ మధుర స్మృతులు నిన్ననే జరిగాయా అన్నట్టు ఉందటూ పేర్కొన్నారు. అమర్ అక్బర్ ఆంథోనీ, ఖుర్బానీ, ఇన్సాఫ్ వంటి హిట్‌లతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఖన్నా...అనారోగ్యంతో ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.