పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌పై వినోద్ ఖన్నా పోటీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది అభ్యర్థులతో బీజేపీ ఈ మేరకు మంగళవారం రాత్రి జాబితా విడుదల చేసింది. 2009 ఎన్నికల్లో తనను స్వల్ప ఓట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వాపై వినోద్ ఖన్నా మరోసారి తలపడి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌పై మండి స్థానంలో రామ్ స్వరూప్ శర్మను బీజేపీ బరిలోకి దింపింది.
బీజేపీ అధికార ప్రతినిధిగా ఎంజే అక్బర్: మూడు రోజుల కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ జర్నలిస్టు ఎం.జే. అక్బర్‌ను ఆపార్టీ అధిష్టానం జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అదేవిధంగా ఒడిశా బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా అరుణ్ సింగ్‌ను నియమించారు