ఆ సీనియర్ నటుడికి క్యాన్సర్ సొకిందా?
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అమితాబ్ బచ్చన్‌కు గట్టి పోటీనిచ్చిన డ్యాషింగ్ స్టార్ వినోద్ ఖన్నా. ప్రస్తుతం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు క్యాన్సర్ సొకినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
డీహైడ్రేషన్ కారణంగా గత నెల 31న వినోద్ ఖన్నాను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు. అయితే, గురువారం వెలుగులోకి ఆయన ఫొటోలు అభిమానులను షాక్ గురిచేశాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలలో బలహీనంగా కనిపిస్తున్న వినోద్ ఖన్నాకు క్యాన్సర్ సోకిందేమోనంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీ కూడా అయిన వినోద్ ఖన్నా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలిపేందుకు సదరు ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వినోద్ ఖన్నా కోలుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నామని వైద్యులు చెప్తున్నారు.
#VinodKhanna Get well soon Vinod ji....we will pray for you...Definitely you will win against this war...Love u
— Venky aDIGA (@Anchor_Venky) 6 April 2017