
రిషీ కపూర్
బాలీవుడ్ యాక్టర్ రిషీ కపూర్ అనారోగ్య సమస్యలతో అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బాలీవుడ్‌లో వార్తలొచ్చినప్పటికీ కపూర్ ఫ్యామిలీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకున్నారు రిషీ. ‘‘ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. త్వరలోనే కోలుకుంటాను. చికిత్స పూర్తి కాగానే ఇండియా వచ్చేస్తాను. ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. చాలా ఓపిక కావాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏ సినిమాను అంగీకరించదలచుకోలేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment