
కోలుకున్న సీనియర్ నటుడు!
బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్‌కు గురైన ఆయనను గత నెల 31న కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే వినోద్ ఖన్నాను ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని వారు చెప్పారు.