మార్చి 21న ‘విశ్వామిత్ర’ | Geetanjali Fame Raajkiran Viswamitra Movie Release Date | Sakshi
Sakshi News home page

మార్చి 21న ‘విశ్వామిత్ర’

Published Fri, Feb 15 2019 3:22 PM | Last Updated on Fri, Feb 15 2019 3:22 PM

Geetanjali Fame Raajkiran Viswamitra Movie Release Date - Sakshi

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. ఈ మూవీలో నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్  చిత్రమిది. న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. సృష్టిలో ఏది జరుగుతుందో... ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement