అందజేసిన వైఎస్సార్‌సీపీ యూకే విభాగం
మా పాలిట దైవం సీఎం జగన్: బాలచందర్
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదానికి బలైన తెనాలికి చెందిన గొల్తి గీతాంజాలి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ యూకే విభాగం అండగా నిలిచింది. ఆమె ఇద్దరు పిల్లలు రిషిత(10), రుషిక(6) పేర్లతో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను బ్యాంక్‌లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. డిపాజిట్ పత్రాలను శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి భర్త గొల్తి బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికకు అందజేశారు.
పిల్లలను బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా వైఎస్సార్ సీపీని సంప్రదించాలని బాలచందర్‌కు సజ్జల సూచించారు. బాలచందర్ మాట్లాడుతూ గీతాంజలి చనిపోయిన కొన్ని గంటల్లోనే సీఎం వైఎస్ జగన్ స్పందించి బతుకుపై తమ కుటుంబానికి భరోసా కల్పించారని తెలిపారు. ‘వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ యూకే విభాగం కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యాన ఎ.సురేంద్రరెడ్డి, యూకేలోని వైఎస్సార్‌సీపీ విభాగం సభ్యులు అందరూ కలిసి మా పిల్లల పేరు మీద రూ.20 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పత్రాలు అందజేశారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లా మధు, ఎన్‌ఆర్‌ఐ కాశీపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment