అమ్మాయితో అమ్మాయి!
ప్రశాంతి, గీతాంజలి ముఖ్యపాత్రల్లో శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఎఫైర్’. ఈ నెల 6న విడుదల కానుంది. ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘ఓ అమ్మాయిని ప్రేమించే మరో అమ్మాయిగా నటిస్తున్నానంటే చాలా మంది అభ్యంతరం చెప్పారు. కానీ సినిమా చూశాక అభినందిస్తున్నారు. రషెస్ చూశాక, రామ్‌గోపాల్‌వర్మగారు నాకు ఫోన్ చేయడం మర్చి పోలేను. ఇంగ్లీషు, హిందీల్లోనే సాహసోపేతమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఎందుకు రాకూడదనే పట్టుదలతో ఈ సినిమా చేశాం’’ అని చెప్పారు. ‘‘అమ్మాయితో రొమాన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎక్కడా అసభ్యత లేదు’’ అని గీతాంజలి చెప్పారు.