ramgopalvarma
-
ఇంకొకరి లైఫ్ గురించి మాట్లాడను
శివ.. గ్రీకువీరుడు.. మన్మథుడు.. అన్నమయ్య.. శ్రీరామదాసు... క్లాస్, మాస్, ప్రేమ, భక్తి... ఏదైనా ఓకే అంటారు నాగార్జున. వంద సినిమాలకు చేరువ అవుతున్న నాగ్ నటించిన ‘ఆఫీసర్’ జూన్ 1న విడుదల కానుంది. ‘శివ’లాంటి ట్రెండ్సెట్టర్ని క్రియేట్ చేసిన నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం మరో ట్రెండ్‌సెట్టర్ అవుతుందా? వేచి చూడాలి. ఈలోపు నాగార్జున చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► ‘ఆఫీసర్’ మూవీకి మిమ్మల్ని ఒప్పించటానికి రామ్‌గోపాల్ వర్మ లెటర్ రాశారట? అందులో ఏముంది? యాక్చువల్లీ సినిమా ఒప్పుకున్న తర్వాతే లెటర్ రాశాడు. ‘‘మీరు వంద శాతం సంతృప్తి చెందేలా సినిమా తీయకపోయినా, నేను పని చేయకపోయినా నన్ను తన్నండి...’’ అంటూ చాలా పెద్ద లెటర్ రాశాడు. అన్నట్టుగానే చాలా బాగా తీశాడు. ► అలా ఎందుకు రాశారు? ‘ఒక రియల్ లైఫ్ ఆఫీసర్ స్టోరీ రెడీ అయింది. మీతో చేయాలనుంది’ అని నా దగ్గరకి వచ్చాడు. అతనితో ‘హీరోయిజమ్ ఉన్న సినిమాలే నీ బెస్ట్ జానర్. అవి కాకుండా పిచ్చిపిచ్చివి ఏవేవో చేస్తుంటావు. హండ్రెడ్ పర్సంట్ కాన్సన్ట్రేట్ చేస్తే చేస్తాను’ అన్నాను. అందుకే అలా రాశాడు. ► వర్మ తనకు ఎమోషన్స్ లేవు అంటుంటారు? అలా అన్నాడంటే తన ఎమోషన్స్‌ని గుర్తిస్తున్నట్టేగా? ఎమోషన్స్ తెలిస్తేనే అలా అనగలుగుతాడు. ► అంటే.. ఈ సినిమా మొదలయ్యే ముందు వర్మకు కండీషన్స్ ఏమైనా పెట్టారా? కండీషన్స్ ఏమీ లేవు. నాకు నీ పూర్తి కాన్సన్ట్రేషన్ కావాలి అని అడిగాను. రామూ సినిమాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. కేవలం ఫైట్స్ కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా రియల్‌గా ఉంటాయి. సౌండ్, ఎడిటింగ్‌లో వర్మ ఎక్స్పర్ట్. వర్మ ఎర్లీ మూవీస్ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ అవుట్‌స్టాండింగ్‌గా ఉంటాయి. అదే చెప్పి, ‘అవి నీ అడ్వాంటేజస్ .. వాడుకో’ అన్నాను. కండీషన్‌గా కాదు రిక్వెస్ట్ చేశా.. ఫ్రెండ్లీగా. ► ట్వీటర్లో వర్మ కాంట్రవర్సీ సెలబ్రిటీ. ఈ టైమ్‌లో ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా? అలా అనుకుంటే ప్రతి సినిమా రిస్కే. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ టీమ్ ఉన్న సినిమాలు కూడా రెండో రోజు లేకుండా పోయాయి. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి హిట్ తర్వాత నేను, కృష్ణవంశీ ‘చంద్రలేఖ’ సినిమా చేశాం. మలయాళ హిట్ సినిమా రీమేక్ అది. కానీ, తెలుగులో మూడో రోజుకే సినిమా థియేటర్లో లేదు. హిట్‌కి ఫార్ములా అనేది లేదు. ► వర్మ బెస్ట్ టెక్నీషియన్. కానీ ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు.. పూర్తి శ్రద్ధతో చేస్తే వర్మ ఈజ్ గుడ్ ఫిల్మ్ మేకర్. తలుచుకుంటే ఇంకా మంచి సినిమాలు తీయగల సామర్థ్యం ఉన్నవాడు. ఎక్కడో తను దారి తప్పాడు. ‘ఒకవేళ ‘ఆఫీసర్’ సినిమా కూడా అలాంటిదే అయితే వద్దు. మనం రెండు నెల్లకోసారి కలుద్దాం. పార్టీ చేసుకుందాం. మనమిద్దరం సినిమా చేయాలని ఇప్పుడు ఎవ్వరూ అడగట్లేదు. నువ్వు వంద శాతం ఈ సినిమాకి ఇస్తా అంటే చేద్దాం’ అన్నాను. ‘ఆఫీసర్’ కథ 2016లోనే చెప్పాడు. అప్పుడే తీయకుండా అతను కాన్సన్ట్రేషన్తో ఉంటాడా? లేదా అని ఆగాను. ► ట్రెండ్ సెట్టర్ ‘శివ’ ఇచ్చారని వర్మకు డేట్స్ ఇచ్చారా? అలా ఎప్పుడూ ఆలోచించను. అలాంటివి అసలు పట్టించుకోను. ఏం ఆలోచించి కల్యాణ్ కృష్ణకి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చాన్స్ ఇచ్చాను. నాకు అనిపిస్తే చేసేస్తుంటా. నా కెరీర్ అంతా అలానే సాగింది. ► వర్మ రీసెంట్ కాంట్రవర్సీ వల్ల ఈ సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని వర్రీ అయ్యారా? వర్రీ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది. 95 సినిమాలు చేసేశాను. ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది (నవ్వుతూ). ఈ ఫేజ్‌లో సినిమాలను ఎంజాయ్ చేయాలి. రోజూ హ్యాపీగా వెళ్లి నవ్వుతూ పని చేయాలి. లాజికల్‌గా మాట్లాడాలంటే 65 పర్సెంట్ మూవీ లైఫ్ అయిపోయింది. మిగతా 35ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి.. అంతే. ► వివాదాల జోలికి వెళ్లొద్దని వర్మకు సజెస్ట్ చేశారా? ఎవరి జర్నీ వాళ్లకుంటుంది. అది వాళ్ల ఇష్టం. ఇంకొకరి లైఫ్ గురించి మాట్లాడను. ఒక మనిషిని ఎందుకు చేంజ్ చేయాలి మనం. సజెషన్స్ సినిమాల గురించే ఇస్తాను. పర్సనల్ లైఫ్ తన ఇష్టం. నా పిల్లలకే ఇలా ఉండాలని చెప్పను. గైడ్ చేస్తాను అంతే. సొసైటీకి ఎటువంటి ఇబ్బంది కలిగించనప్పుడు వాళ్ల ఇష్టం. ఒకర్ని జడ్జ్ చేసి మీరు ఇటువంటి వారని చెప్పడం నాకిష్టం ఉండదు. మై జర్నీ ఈజ్ క్లీన్ అండ్ క్లియర్. ‘ఆఫీసర్’ సినిమాలో నమ్ముకున్న నిజం కోసం హీరో ఏదైనా చేస్తాడు. నేను నమ్ముకున్న సినిమా కోసం ఏదైనా చేస్తాను. తన పర్సనల్ కాంట్రవర్సీల మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ► ‘ఆఫీసర్ స్క్రిప్ట్ నాది’ అని ఒకతను స్క్రిప్ట్ లీక్ చేసేశారు కదా? ఇది వరకు రెండు సినిమాలకు కూడా అతను ఇలానే చేశాడు కదా. ఈ స్క్రిప్ట్ అంతా మేమే టీజర్లో చెప్పాం. కొత్తగా చెప్పటానికి ఏం లేదు. సినిమా చాలా రియలిస్టిక్‌గా జరుగుతుంది. ఈ కథ పోలీస్‌కి, పోలీస్లకి మధ్య జరిగేది. రామూకి క్రిమినల్స్, మాఫియా మీద చాలా నాలెడ్జ్ ఉంది. తన సినిమాలన్నీ అలానే ఉంటాయి కదా. ► అఖిల్‌తో సినిమా ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు? నేను ట్వీట్ చేయలేదు కదా. వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. చూద్దాం. ► మీ అబ్బాయిల కన్నా మీరే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. చైతన్య కూడా అదే అంటాడు. ‘మీకేంటి నాన్నా.. చాలా సినిమాలు చేసేశారు. మీ సినిమా హిట్టయినా, ఫెయిలైనా పట్టించుకోరు. మాకు అలా కాదు. చాలా జాగ్రత్తగా చేయాలి’ అంటాడు. ► ‘మహానటి’లో మీ నాన్నగారి పాత్రలో చైతన్యని చూశాక ఏమనిపించింది? హ్యాపీగా అనిపించింది. నాన్నా, చైతన్య ఒకేలా ఉంటారని కాదు. కానీ నాన్న పాత్రలో తనని చూసినప్పుడు చెప్పలేని ఫీలింగ్ కలిగింది. ‘దేవదాస్’ పాత్రలో చైతన్యని చూస్తుంటే హ్యాపీ అనిపించింది. ► ‘సవ్యసాచి’లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్‌లో మీ అంత బాగా చైతూ చేస్తారనే నమ్మకం ఉందా? నాకంటే చైతన్య చాలా బాగా చేస్తాడు అనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఇప్పుడు యంగ్‌స్టర్స్ అందరూ బాగా చేస్తున్నారు. ► మీ 100వ సినిమాను ప్లాన్ చేసుకున్నారా? 100వ సినిమాను చాలా కన్వీనియంట్‌గా పెట్టుకున్నాను. నాకు ఇష్టమైనప్పుడు గెస్ట్ రోల్స్ యాడ్ చేసుకుంటా. లేదంటే వాటిని కలపకుండా ఇది నా 100వ సినిమా అని చెబుతా. లేదా సినిమా హిట్ అయినప్పుడు ఇదే 100వ సినిమా అని చెబుతా. ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఇది మాత్రం పెట్టుకున్నాను. 100 ఈజ్ జస్ట్ ఎ నంబర్. ► మళ్లీ టీవీ షోలు చేస్తారా? ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రన్ అయిపోయింది. ఏదైనా ఇంట్రస్టింగ్ షో వస్తే తప్పకుండా చేస్తాను. ► నెక్ట్స్ సినిమాలు? నానీతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఒక డాన్‌కి డాక్టర్ మధ్య జరిగే కథ ఇది. మలయాళంలో దర్శకుడు ప్రియదర్శన్ ‘కెప్టెన్ మరార్కర్’ లైఫ్‌పై ఓ సినిమా తీస్తున్నారు. ‘అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చేయాలి’ అని అడిగారు ప్రియదర్శన్. æహీరో ధనుష్ తన డైరెక్షన్లో మామ రజనీకాంత్ కోసం ఒక కథ తయారు చేశారు. రజనీగారు పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో ఆ కథకు నన్ను అడిగారు. చూడాలి.. ఏది ఫైనల్ అవుతుందో. ► యంగ్‌స్టర్స్ చాలా మంది వస్తున్నారు. మీ పిల్లలకు మీరేం చెబుతారు? యంగ్ టాలెంట్‌ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఫస్ట్ సినిమాలోనే అద్భుతంగా నటిస్తున్నారు. అసలది ఫస్ట్ ఫిల్మ్‌లా అనిపించదు. అంత బాగా చేస్తున్నారు. స్టార్ కిడ్స్ అని కాదు. స్టార్కే గతి లేనప్పుడు స్టార్ కిడ్స్‌కి ఏముంటుంది? టాలెంట్‌కే ఇక్కడ చోటు ఉంటుంది. బ్యూటిఫుల్ టాలెంట్ ఈజ్ కమింగ్. 23తో ఏదో ఉంది! మే 23 నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’ రిలీజైంది. నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రిలీజైంది కూడా అదే తేదీనే. కానీ అందరికీ తెలియనిదేంటంటే ఆర్టిస్ట్‌గా ఫస్ట్ సినిమా చేయడానికి నాన్నగారు చెన్నై వెళ్లింది కూడా మే 23నే. 22 రాత్రి విజయవాడలో ట్రైన్ ఎక్కి, చెన్నై వెళ్లి మర్నాడు షూటింగ్లో పాల్గొన్నారు. సో.. 23తో మా ఫ్యామిలీకి ఏదో ఉంది. ‘విక్రమ్’లో నాగార్జున నాన్నగారిది హ్యాపీ లైఫ్ నాన్నగారి లైఫ్ సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేశారాయన. అలాంటి స్ట్రయిట్ లైఫ్‌తో బయోపిక్ అంటే ఆడియన్స్‌కు నచ్చుతుందా? ఆయన కెరీర్లో డౌన్ ఫాల్ లేదు. పోనీ ఎవరి దగ్గరైనా మోసపోయి ఉండాలి. అదీ లేదు. పిల్లలందరితో హ్యాపీగా ఉన్నారు. కలసి యాక్ట్ చేశారు కూడా. అందుకే బయోపిక్ కంటే కూడా పుస్తక రూపంలో వస్తే బావుంటుంది. ఏఎన్నార్7 -
మూడున్నర గంటలు.. 30 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ తీసిన దర్శకుడు రాం గోపాల్ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం విచారించారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌పై ఓ టీవీ చానల్లో చర్చ సందర్భంగా తనను వర్మ దూషించారం టూ సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వర్మను పిలిచి విచారించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు సుమారు మూడున్నర గంటల పాటు వర్మకు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ‘జీఎస్టీని ఎందుకు తీశారు? ఐటీ చట్టం ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపెట్టడం తప్పు. మీ ఫేస్బుక్, ట్వీటర్లో పోస్టు చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి? దేవితో పోర్న్ సినిమా తీస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? భారత చట్టాలు ఈ సినిమాకు వర్తించవని చెప్తున్నారు.. దానికి ఆధారాలేవి..? అమెరికాలో తీశా అక్కడి నుంచే అప్లోడ్ చేశా అంటున్నారు.. ఎలా తీశారు?’అని పలు ప్రశ్నలను సంధించారు. అయితే జీఎస్టీకి కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చానని, సినిమా తాను విడుదల చేయలేదని, నేరుగా దర్శకత్వం వహించలేదని వర్మ సమాధానమిచ్చారు. పోలండ్, ఐరోపాలో జరిగిన షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణకు స్కైప్ ద్వారా దర్శకత్వం అందించానన్నారు. సామాజిక కార్యకర్త దేవిని ఉద్రేకంలోనే తిట్టానని వర్మ పోలీసులకు చెప్పారు. పోలండ్, ఐరోపాలో సినిమా తీసినా అందులోని అశ్లీల దృశ్యాలకు భారత చట్టాలే వర్తిస్తాయని, స్కైప్ ద్వారా దర్శకత్వం చేశానని, నేరుగా డైరెక్ట్ చేయలేదని అంటున్నారని, ఫిల్మ్ బై రాంగోపాల్‌వర్మ అని ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణ జరిగిన సమయంలో వర్మ విదేశాలకు ఏమైనా వెళ్లాడా అని తెలుసుకునేందుకు పాస్‌పోర్టులను పరిశీలిస్తామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీరా తెలిపారు. వర్మ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు శుక్రవారం మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
కొత్త లుక్
లేటెస్ట్ సినిమా కోసం హీరో నాగార్జున లాఠీ పట్టారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదేనండి.. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా గురించి చెబుతున్నాం. ఈ చిత్రంలో నాగార్జున లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే అసక్తి అభిమానుల్లో ఉంది. కచ్చితంగా నాగ్ ఓ కొత్త మేకోవర్‌తో కనిపిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారని టాక్. అందుకు తగ్గట్టుగానే నాగ్ ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫొటో మార్ఫింగా? అనే సందేహం పలువురికి కలిగింది. అయితే అది ఒరిజనల్ ఫొటోనే అని.. సోమవారం హీరో నాగార్జున సోషల్ మీడియాలో గతేడాది అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు సంబంధించిన పోస్ట్ స్పష్టం చేసింది. నాగ్ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఇక్కడ మీరు చూస్తున్న నాగ్ షర్ట్‌లెస్ ఫొటో కూడా ఉంది. సో.. స్టిల్ ఒరిజినల్ అని ఫిక్స్ అయిపోవచ్చా? -
ఎంక్వైరీ మొదలైంది!
కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఎక్కడో తెలుసా? పోలీస్ కమీషనర్ ఆఫీసులో. అంతే.. నాగార్జున ఎంక్వైరీ మొదలు పెట్టారు. నాగార్జున ఏంటి? ఎంక్వైరీ ఏంటి అనుకుంటున్నారా? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ హీరోగా ఇటీవల ఓ చిత్రం మొదలైన విషయం తెలిసిందే. ఇందులో నాగ్ పోలీసాఫీసర్. ఈ పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఓ కేసుని డీల్ చేసే సీన్స్ తీస్తున్నారు. అసలు విషయం అది. పోలీస్ స్టేషన్ సెట్ వేసి, చిత్రీకరించారు. ‘శివ’వంటి ట్రెండ్‌సెట్టర్ మూవీతో నాగ్–వర్మ కాంబినేషన్ మొదలైంది. ఇప్పుడు కూడా సెన్సేషనల్ హిట్ మూవీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. -
‘క్షణక్షణం’
క్రైమ్‌తో కామెడీలు వద్దని చెప్పే ‘క్షణక్షణం’ నాటి సినిమా ‘శివ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు రెచ్చిపోయారు. చిన్న చిన్న ఊళ్లలో ఆవారాగా తిరిగే కుర్రాళ్లు ఒక చేత్తో సైకిల్ చైన్ మరో చేత్తో హాకీ స్టిక్ పట్టుకుని నలుగురైదుగురు గుమిగూడి ‘శివ స్టిల్’ ఫొటోలు దిగడం మొదలెట్టారు. సైకిల్చైన్తో ఎదుటివారిని కొట్టడం చాలా కష్టమని తెలియని చాలామంది కొట్లాటల్లో సైకిల్ చైన్ వాడవచ్చని నమ్మారు. డైరెక్టర్ పేరు దాదాపుగా హవా కోల్పోతున్న సమయంలో రామ్‌గోపాల్‌వర్మ అనే పేరు ఒక సినీ వెర్రికి పర్యాయపదమైంది. మరి అతడు తీయబోయే రెండో సినిమా అంటే– దాని పేరు ‘క్షణక్షణం’ అయితే– అందులో శ్రీదేవి నటిస్తూ ఉంటే– పైగా వెంకటేశ్ ఆమె పక్కన ఫస్ట్‌టైమ్ యాక్ట్ చేస్తుంటే– ఆ క్రేజ్ ఎలా ఉండాలి. కాని తీరా సినిమా రిలీజయ్యాక అలా లేదు. ఎలాగో ఉంటుందనుకుంటే ఇంకెలాగో ఉంది. ఆ ఇంకెలాగో ఉండటం దాని స్టయిల్ అనీ, అది క్లాసిక్ అనీ తెలియడానికి ఫస్ట్ రన్ వెళ్లి సెకండ్ రన్ రావాల్సి వచ్చింది. ‘క్షణక్షణం’ క్లాసిక్. మెల్లగా అది తెలుగు ప్రేక్షకులకు ఎక్కి ఇప్పుడు తమ ప్రియమైన సినిమాగా సెటిల్ అయ్యింది. నిజానికి దాని పేరే దానికి మైనస్ అని చెప్పాలి. ‘క్షణక్షణం’ అని పెట్టేసరికి క్షణం క్షణం టెన్షన్ ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు. అదే ‘అనుకోకుండా ఒకరోజు’ అని టైటిల్‌పెట్టి ఉంటే ఫస్ట్ రన్‌లోనే సూపర్ హిట్ అయి ఉండేదేమో!తెలుగువారు స్థిమితమైన కామెడీతో సినిమా తీయలేరు అని ఎవరైనా అంటే వారికి ‘క్షణక్షణం’ చూపించాలి. దినదినప్రవర్థమానమైన తెలుగువారి ప్రతిభను చాటి చెప్పాలి. ఇందులో ‘సత్య’ అనే పేరున్న అమ్మాయిగా వేసిన శ్రీదేవి సత్యభామలాగే గడుగ్గాయి. అంతే అమాయకురాలు. జీవితం పట్లగాని పని పట్లగాని పెద్దగా సీరియస్‌నెస్ లేదు. తెల్లనివన్నీ ప్యాకెట్ పాలనీ నల్లనివన్నీ నల్లానీళ్లని నమ్మేసే బాపతు. పొద్దెక్కేదాకా నిద్రపోవడం ఆఫీసుకు లేటుగా వెళ్లి బాస్ చేత అక్షింతలు తినడం ఆమె పని. బాస్ తిట్లు శ్రుతి మించేసరికి ‘ఆ.. బోడి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి’ అని ఇంకో ఉద్యోగానికి అప్లై చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో కోసం స్టుడియోకు వెళుతుంది. అక్కడే ఆమె జీవితంలో క్రైమ్ ఎంటర్ అవుతుంది. ఆ స్టూడియో యజమానికి అంతకు ముందే ఒక పెద్ద బ్యాంకు దొంగతనంతో సంబంధం ఉంటుంది. అతడు తన బాస్– పరేశ్ రావెల్‌కు ఇవ్వాల్సిన డబ్బు తానే కొట్టేసి దానిని ఒక రైల్వే క్లోక్‌రూమ్‌లో దాచి ఆ రసీదును ఫొటో స్టుడియోలో పెట్టుకుని ఉంటాడు. అతన్ని వెతుక్కుంటూ బాస్ వచ్చేసరికి భయపడిపోయి అప్పుడే ఫొటోల కోసం వెళ్లిన శ్రీదేవికి ఇవ్వాల్సిన ఫొటోల కవర్లో క్లోక్‌రూమ్ రెసిప్ట్ను పెట్టి దానిని స్టుడియో దాటించేస్తాడు. కాని పరేశ్‌రావెల్ నాలుగు తగిలించి, ఒక చిటికెన వేలు తీసేసేసరికి ‘ఇప్పుడే ఫొటోల కోసం వచ్చిన అమ్మాయి ఆ రెసిప్ట్ తీసుకెళ్లింది’ అని కక్కేస్తాడు. అక్కడి నుంచి పరేశ్‌రావెల్ బృందం శ్రీదేవి వెంటపడుతుంది. వీళ్లంతా తన వెంట ఎందుకు పడుతున్నారో తెలియని శ్రీదేవి తన ఫ్లాట్‌లో అడుగుపెట్టిన పరేశ్ రావెల్ మనిషిని దాదాపు చంపినంత పని చేస్తుంది. అంతా చేసి ఒక పూట వ్యవధిలోనే ఆమె జీవితం కకావికలం అయిపోతుంది. ఇప్పుడు ఆమెను కాపాడే మనిషి కావాలి. ఆ కాపాడేవాడే ‘చందు’ అనే పేరు కలిగిన వెంకటేశ్. ఇతనో పెద్ద చిల్లర దొంగ. అయితే ఇతడి నేరాలన్నీ చిల్లర వరకే. ఒక ఇరానీ కేఫ్‌లో శ్రీదేవిని చూసిన ఇతడు ఆమె వెనుక పెద్ద ముఠా పడుతోందని, దీని వెనుక ఒక కోటి రూపాయల బ్యాంకు దొంగతనం ఉందని తెలుసుకొని ఆ డబ్బు కోసం తానూ రంగంలో దిగుతాడు. కాని కత్తి పట్టుకున్నవాడికి కత్తే ఎదురవుతుంది. దొంగడబ్బు కోసం ప్రయత్నిస్తే ఖూనీకోర్లే ఎదురవుతారు. ఈ ఇద్దరూ ఒక నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఎన్నో అటాక్స్‌ను ఇటు పోలీసుల నుంచి అటు పరేశ్‌రావెల్ బ్యాచ్ నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. చివరకు శ్రీదేవి దొంగ డబ్బు మనకు వద్దని అది పోలీసులకు అప్పజెబుదామని పట్టుపడుతుంది. వెంకటేశ్‌కు ఇది నిజంగా పెద్ద కష్టమే. కాని అప్పటికే అతడు ఆమెతో రహస్యంగా ప్రేమలో పడి ఉంటాడు. చివరకు ప్రేమే గెలుస్తుంది. దొంగ సొమ్ము కోసం ప్రేమను కోల్పోయి, ప్రశాంతమైన జీవితం కోల్పోవడం కంటే అది ప్రభుత్వం వారి ముఖాన పడేయడమే బెటర్ అని భావిస్తాడు. చివరకు కలవని రైలు పట్టాల సాక్షిగా వారి ప్రేమ కలుస్తుంది. కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమాకు హీరోలు ముగ్గురు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. శ్రీదేవి, వెంకటేశ్‌లు కథకు తగినట్టుగా తన ప్రమేయాన్ని ఉంచారని చెప్పాలి. నిజానికి హీరో హీరోయిన్లు కథలో ఒక అంతర్గతభాగమై కనిపించడాన్ని తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి టైమ్ పట్టింది. ఓవర్ డ్రమాటిక్‌గా లేకుండా చాలా సహజంగా కనిపించడం కూడా కొత్తే. ‘దేవుడా దేవుడా దేవుడా’... అని భయపడే హీరోయిన్, ‘మా అమ్మ అప్పుడే చెప్పింది’.. అని అమాయకంగా కన్నీళ్లు పెట్టే హీరోయిన్ నిజంగా బాగుంటుందని వాళ్లు మెల్లగా అంగీకరించారు. వెంకటేశ్ కూడా చాలా క్యాజువల్‌గా ఉంటాడు. చాలా సినిమాల్లో హీరో తాను ఎందుకు దొంగగా మారాడో చెప్పే ‘డ్రామా’ను వెంకటేశ్ శ్రీదేవికి చాలా క్యాజువల్‌గా చెప్పినా, అదంతా అబద్ధం అని మనకు తెలుస్తూ ఉండేలా చెబుతాడు. శ్రీదేవి అంతా విని వెంకటేశ్ చెప్పింది నమ్ముతూనే ‘ఆ సినిమా నేను చూశా’ అనడం ఎంతో హాస్యంగా ఉంటుంది. దాని కన్నా హైలైట్ ఏమిటంటే క్లయిమాక్స్‌లో డబ్బుతో వెంకటేశ్ ఉడాయించేస్తే పరేశ్ రావెల్‌ను కూచోబెట్టి ‘ఆయన అలాంటి వారు కాదు. చిన్నప్పుడు వాళ్లమ్మకు బాగలేక మందుల కోసం ఏదో దొంగగా మారారు కానీ’... అని నమ్మకంగా చెబుతూ ఉంటే జనం కడుపుబ్బా నవ్వుతారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్సు, అపార్థాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఈ సినిమాలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సున్నితమైన హాస్య సన్నివేశాలను అర్థం చేసుకొని నవ్వడానికి కొంచెం ఎదిగారు. ఇక డెన్లు గట్రా లేకుండా చిన్న మఫ్లర్ కట్టుకొని కనిపించే విలన్– పరేశ్ రావెల్ ఎంత రక్తమాంసాలతో ఉన్న మనిషో అనిపిస్తాడు. అతడి జిప్సీ తీసుకొని అడవిలోకి పారిపోయిన వెంకటేశ్, శ్రీదేవిలను అతడు వెతికి పట్టుకుని అడిగే మొదటి ప్రశ్న ‘జిప్సీలో ప్రయాణం బాగా సాగిందా?’ అని. అడవిలో వాన పడుతుంటే తన డబ్బు అడుగుతూనే ‘వర్షం... వర్షం... ఇలా జరుగు’ అని శ్రీదేవికి జాగ్రత్తలు చెబుతాడు. ‘నేను వంద రూపాయలకు మర్డర్ చేసిన రోజులున్నాయి’ అని అతడు చెప్పడం రియలిస్టిక్‌గా ఉండి ఒకవైపు కామెడీ చేస్తున్నా మరోవైపు నాతో జాగ్రత్త సుమా అని క్యారీ చేసేలా ఉంటుంది. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ‘అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు’ అని పరేశ్ రావెల్ అడిగితే ‘తెలియదు సార్’ అని నర్సింగ్ యాదవ్ జవాబు చెబుతాడు. ‘పాములు పగపడతాయంటావా?’ అని అడిగితే మళ్లీ నర్సింగ్ యాదవ్ ‘తెలియదు సార్’ అంటాడు. ఇలాంటి నార్మల్ డౌట్లు ఉన్న విలన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఈ సినిమాలో చాలా సూక్ష్మమైన సన్నివేశాలు రెప్పపాటులో ముగుస్తాయి. ఉదాహరణకు రైల్లో శ్రీదేవి, వెంకటేశ్ తమ దగ్గర ఉన్న బ్యాగ్‌లో ఎంత డబ్బు ఉందో చెక్ చేయడానికి టాయిలెట్లో దూరుతారు. ఆ తర్వాత తలుపు తెరుచుకుని వాళ్ల హడావిడిలో వాళ్లు వెళుతుంటే ఒకే టాయిలెట్లో నుంచి అలా అబ్బాయి అమ్మాయి రావడం చూసి ఒక పెద్దమనిషి హతాశుడవతాడు. ఇలాంటివే ఎన్నో. ‘క్షణక్షణం’ సినిమా కేవలం సబ్జెక్ట్‌కు మాత్రమే కట్టుబడి ఆనెస్ట్‌గా తీసిన సినిమా.దీని వెనుక ‘రొమాన్సింగ్ ది స్టోన్’ వంటి సినిమాల ప్రభావం ఉన్నా రామ్‌గోపాల్ వర్మ ఎంతో కచ్చితమైన కథాసంవిధానంతో దీనిని తెరకెక్కించాడు. హీరో హీరోయిన్లు ఒకే డ్రస్సులో సినిమా అంతా కనిపించడం, రెండు రోజుల కాలవ్యవధిలో ఒక సినిమా ముగిసేలా చూపించడం ఆనాటికి ఉన్న ఫార్ములాకు ఏమాత్రం పొసగని వ్యవహారం. అయినప్పటికీ జనం, నెమ్మదిగానైనా సరే మెచ్చేలా వర్మ తీయగలిగాడు.ఇందులో ఉన్న వినోదానికి తోడు ఒక్కో సీన్లో కనిపించినా ఆటో డ్రైవర్ మాణిక్, బట్టల షాప్ ఓనర్ బ్రహ్మానందం గుర్తుండిపోతారు.కీరవాణి చేసిన పాటలు హిట్. ‘జాము రాతిరి జాబిలమ్మా’, ‘చలి చంపుతున్న చమక్కులో, ‘ముద్దిమ్మంది బుగ్గా’... కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి మించి కీరవాణి చేసిన రీరికార్డింగ్ కూడా బాగుంటుంది. మన రోజువారీ ప్రపంచం వేరు. క్రైమ్ ప్రపంచం వేరు. మన రోజువారీ ప్రపంచంలో క్రైమ్ దూరితే నేరుగా పోలీసులను ఆశ్రయించడమే బెటర్. కాదూ కూడదని సొంత ప్రయోగాలు చేస్తే జీవితం ప్రమాదంలో పడుతుందని ఈ సినిమా అన్యాపదేశంగా చెబుతుంది. కాకపోతే ఆ ముక్కను సీరియస్‌గా కాకుండా హాస్యపు పూతతో చెప్పడం వల్లే ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఎస్. క్షణక్షణం తెలుగువారి చెప్పుకోదగ్గ క్లాసిక్. శ్రీదేవి పాట... 1991లో ‘క్షణక్షణం’ రిలీజయ్యే నాటికి శ్రీదేవి కెరీర్ పతాకస్థాయిలో ఉంది. ఆమె కనిపించడమే సినిమాకు పెద్ద వరంగా ఉండేది. నిర్మాతలు కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్‌రెడ్డిలకు శ్రీదేవి డేట్స్ ఇచ్చాకే ఈ సినిమా ఆమెను దృష్టిలో పెట్టుకొని తయారయ్యింది. వర్మ... శ్రీదేవి వీరాభిమాని. అందువల్ల ఎంతో మంది నిర్మాతలు వెంటపడుతున్నా ఆమె కోసం ‘క్షణక్షణం’ తీశారు. ఇందులో శ్రీదేవితో ఆయన పాట కూడా పాడించారు. ‘కింగులా కనిపిస్తున్నాడు’... పాటను కీరవాణి దగ్గర తర్ఫీదు తీసుకుని పాడారామె. సిరివెన్నెల రాసిన ఆ పాట గమ్మత్తుగా ఉంటుంది. – కె. -
ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ
-
ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ
ఇంటర్నెట్ స్పెషల్: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలపై ట్వీట్ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్ ఫోటోను పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. Andhra Pradesh is a gun and the only shooter who can fire and kill its problems is Y S Jagan pic.twitter.com/WEZsTJbS4H — Ram Gopal Varma (@RGVzoomin) 1 February 2017 -
నార్పలలో ‘వంగవీటి’ షూటింగ్ సందడి
నార్పల : నార్పలలో వంగవీటి సినిమా షూ టింగ్‌తో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం శ్రీనివాస థియేటర్ ఎదుట, శ్రీని వాస రైస్ మిల్లోనూ ఘర్షణలకు సంబంధించి చిత్రీకరించారు. రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో షూటింగ్ సా గిం ది. జిల్లా కేంద్రంలో కొన్ని సీన్స్‌లను చిత్రీకరించి, అనంతరం నార్పల సమీపంలోని మడుగుపల్లి కనుమ వద్ద, గాలిమరల కొం డల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. -
అత్తారిల్లా... బాబోయ్!
అత్తారింట్లో అల్లుళ్లకి రాచమర్యాదలు జరగడం కామన్. కానీ, ఆ అత్తారింట్లో అలాంటివేవీ జరగవ్. ఆ ఇల్లంటే అల్లుడికి హడల్. అసలా ఇంట్లో ఏముంది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో అంజన్ కె. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అంజన్ మాట్లాడుతూ- ‘‘రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. ‘అరుంధతి’ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నాను. ఒక మంచి సినిమా తీయాలనే నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ‘అత్తారిల్లు’ చేశాను. కడుపుబ్బా నవ్వించే హారర్ చిత్రమిది. మణిశర్మగారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డెన్నిస్ నార్టన్ స్వరపరచిన రెండు పాటలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. సాయి రవికుమార్, అతిథీ దాస్, అన్తేశియ చప్రసోవ, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివశంకర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.హెచ్. రెడ్డి, సమర్పణ: అక్షయ్- అశ్విన్, సహ నిర్మాతలు: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి కె.కల్యాణ్. -
రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నాడా?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడా? అవుననే అంటున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన చిత్రాల మాదిరిగానే ఆయన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. రామ్‌గోపాల్‌వర్మలో ధైర్యం ఎక్కువనే చెప్పాలి. వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కాగా ఆయన ఇటీవల గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఇతివృత్తంతో కిల్లింగ్ వీరప్పన్ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. దీన్ని సంతోష్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌గోపాల్‌వర్మ చాలా పరిశోధించారు. వీరప్పన్‌ను స్వయంగా ఇంటర్య్వూ చేసిన వారు, పోలీసు అధికారుల నుంచి పలు వాస్తవాలను సేకరించి కథను తయారు చేశారు. వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటన అటు కన్నడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి పెను సవాల్‌గానే మారింది. అదే భాణీలో మన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారట. దీని గురించి రామ్‌గోపాల్‌వర్మ తెలుపుతూ కొత్తగా సంచలనానికి తెర లేపారు. వీరప్పన్ జీవితం ఎంత మర్మమాయమో ఆయన ఎన్కౌంటర్ విషయంలోనూ అంతగా నమ్మశక్యం కాని విషయం దాగి ఉందని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నట్టు మీడియాలో ప్రచారం అవుతోంది. -
సమ్‌థింగ్ స్పెషల్ ఇయర్!
మరి మూడు రోజుల్లో 2015కు సెలవు చెప్పేస్తున్నాం. ఈ ఏడాది కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేసి చూసుకుంటే, తెలుగు తెరపై కొన్ని తీపి గుర్తులు, మరికొన్ని చేదు మరకలు ఉన్నాయి. ఎన్ని సినిమాలొచ్చాయి, ఎవరెన్ని సినిమాల్లో చేశారు లాంటి కథ కాసేపు పక్కనపెడితే, చరిత్రలో నిలిచిపోయే కొన్ని విశేషాలు, విషాదాలు, ఫస్ట్‌టైమ్ రికార్డులకు ఈ 2015 సాక్షి. అలాంటి కబుర్లు కొన్నింటి ఫ్లాష్‌బ్యాక్... ♦ 2015 బాక్సాఫీస్ గలగలలకు ఓ అనువాద చిత్రం శుభారంభం పలికింది. ధనుష్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా ‘రఘువరన్ బీటెక్ ’ ఘనవిజయం సాధించింది. కమలహాసన్ ‘నాయకుడు’ తర్వాత నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ డబ్ చేసిన సినిమా ఇదే. ♦ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాలో గెస్ట్‌గా కనిపించారు. చిత్రం పేరు ‘మన కుర్రాళ్లే’. వీరశంకర్ దర్శకత్వం వహించారు. ♦ {పముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల ఆధారంగా ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు రూపొందడం విశేషం. ‘శ్యాంగోపాల్ వర్మ’ చిత్రానికి ‘మిస్టర్ నో’ నవల ఆధారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ జ్యోతిలక్ష్మి ’కి ‘మిసెస్ పరాంకుశం’ నవల బేస్. వంశీ 25వ సినిమా ‘వెన్నెల్లో హాయ్ హాయ్’కి మల్లాది నవల ‘మేఘమాల’ ఆధారం. ఆ సినిమా కూడా నిజానికి ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆలస్యమైంది. ♦ మీడియాకు చాలా దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఈ ఏడాది జనవరి 1న ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే 91 వేల పైచిలుకు మంది ఈ ఖాతాను అనుసరించడం విశేషం. ♦ ఈ 2015 - తెలుగు సినిమాకు చాలా ద్రోహమే చేసింది. హేమాహేమీలను తనలో కలిపేసుకుంది. ముఖ్యంగా టాప్ కమెడియన్లను తన వెంట తీసుకుపోయి ప్రేక్షకులకు బోలెడంత విషాదాన్ని మిగిల్చింది. నటులు ‘ఆహుతి’ ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, మాడా, కొండవలస, రంగనాథ్, ‘కళ్లు’ చిదంబరం, మనోరమ, నిర్మాతలు డి. రామానాయుడు, వీబీ రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు, అట్లూరి రామారావు, సాంకేతిక నిపుణులు విన్సెంట్, శ్రీ, డీటీఎస్ మధుసూదన్ రెడ్డి, ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు వి. రామకృష్ణ, రచయితలు గణేశ్‌పాత్రో, సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, కాశీ విశ్వనాథ్ తదితరులు దివంగతులయ్యారు. ♦ తలుచుకుంటే తెలుగులోనూ మల్టీస్టారర్లు మళ్ళీ సాధ్యమేనని ‘గోపాల గోపాల’ నిరూపించింది. హిందీ ‘ఓ మై గాడ్’కు రీమేక్‌గా వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో ఇది రూపొందింది. హిందీ నటుడు మిథున్ చక్రవర్తి కనిపించిన తొలి తెలుగు సినిమా ఇదే. ♦ ‘ఈ’ టీవీ, జెమినీ టీవీ కలసి సంయుక్తంగా ‘ బీరువా’ అనే సినిమా నిర్మించాయి. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేశారు. ♦ ఈ ఏడాది రీమిక్స్ సాంగ్స్ బాగానే వచ్చాయి. బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ లోని ‘అరె ఓ సాంబా...’ పాటను కల్యాణ్‌రామ్ ‘పటాస్’ కోసం రీమిక్స్ చేశారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 786’లోని ‘ గువ్వా గోరింకతో ’ పాటను ‘ సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో రీమిక్స్ చేశారు. ♦ నటుడు కోట శ్రీనివాసరావు ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు. ♦ తమిళ ‘సూదు కవ్వమ్’కు రీమేక్‌గా రూపొందిన రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’లో సంగీత దర్శకుడు అచ్చు మెయిన్ రోల్ చేశారు. ♦ ఎప్పుడూ సొంత కథలతోనే సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ తొలిసారిగా బయటివాళ్ల కథతో ‘టెంపర్’ చేశారు. వక్కంతం వంశీ రచయిత. ఓ సీన్లో పూరీ యాక్ట్ చేశారు. ♦ నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ లో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ పాటలో ముస్లిమ్ గెటప్‌లో షాయిరీ పాడుతూ నటించారు. కమలహాసన్ చాలా కాలం తరువాత తెలుగు, తమిళాల్లో ఏకకాలంలో తీసిన ‘చీకటి రాజ్యం’లో రచయిత అబ్బూరి రవితో కలసి కాసేపు తెరపై పాత్రల్లో మెరిశారు. ♦ ‘సచిన్’ (‘టెండూల్కర్ కాదు’ క్యాప్షన్) చిత్రంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ లీడ్ రోల్ చేశారు. ♦ హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలు ఒకే రోజు (మార్చి 21) విడుదల కావడం విశేషం. ‘ఎవడే సుబ్రమణ ్యం’లో కృష్ణంరాజు, ‘షావుకారు’ జానకి, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్ తారలు చాలాకాలం తర్వాత తెరపై కనిపించారు. ♦ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఏడు కథలతో తీసిన ‘చందమామ కథలు’ జాతీయ స్థాయిలో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ♦ దర్శక-నిర్మాత వై.వి.ఎస్. చౌదరి సారథ్యంలో సుమారు నాలుగేళ్ళు నిర్మాణంలో ఉన్న ‘రేయ్ ’ ఈ ఏడాది విడుదలైంది. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తే జ్కి హీరోగా ఇదే తొలి చిత్రం. అయితే దీని కన్నా ముందే ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఇదే ఏడాది విడుదలైంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ హిందీ చిత్రంలో ఎండ్ టైటిల్స్‌లో రజనీకాంత్‌పై స్పెషల్ సాంగ్ వచ్చినట్లే, ఇందులో పవన్ కల్యాణ్‌పై ‘పవనిజం’ సాంగ్ చేశారు. వై.వి.ఎస్. ‘దేవదాస్’ ద్వారా పరిచయమైన హీరో రామ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ♦ నిర్మాణం నుంచి ప్రదర్శన దాకా అన్నీ డిజిటల్మయమైపోయిన ఈ రోజుల్లో ‘జిల్’, ‘రేయ్’ చిత్రాలను కొంత ఫిల్మ్ నెగిటివ్‌లో షూట్ చేసి, తీశారు. తెలుగులో నెగిటివ్‌ను చిత్రీకరణకు ఉపయోగించిన ఆఖరి సినిమాలు ఇవే. ♦ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌తో మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’ తెలుగు వెర్షన్లో హీరోకు నాని డబ్బింగ్ చెప్పారు. ♦ కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్రంలో సీనియర్ దర్శకులు కె.బాలచందర్, కె. విశ్వనాథ్‌లు ఇద్దరూ నటించారు. బాలచందర్ పాత్రకు తెలుగులో మిమిక్రీ కళాకారుడు హరికిషన్ డబ్బింగ్ చెప్పారు. ♦ ‘దొంగాట’ చిత్రంలో ‘ఏందిరో... ఈ మగాళ్లు ’ పాటను మంచు లక్ష్మీ ప్రసన్న స్వయంగా ఆలపించారు. ఈ సినిమాలో ఒక పాటలో నాగార్జున, రవితేజ, నాని, రానా, సుశాంత్, సుధీర్‌బాబు, నవదీప్, శింబు గెస్ట్లుగా కనిపిస్తారు. ♦ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి చాలా ఏళ్ల క్రితం ‘కళ్లు’ సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్... కొక్కొరోకో ’ పాట పాడారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో పాడారు. ఈ ఏడాది దర్శకుడు క్రిష్ నిర్మించిన తమిళ ‘శైవమ్’ రీమేక్ ‘దాగుడుమూత దండాకోర్’లో ఒక పాటలో సీతారామశాస్త్రి గొంతు వినవచ్చు. ఈ సినిమాలో 4 పాటలను సంగీత దర్శకుడే (ఇ.యస్ మూర్తి) రాశారు. ♦ ‘మోసగాళ్లకు మోసగాడు’ లో హీరో సుధీర్‌బాబు కొడుకు మాస్టర్ చరిత్ మానస్ నటించారు. ♦ పెళ్లి నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ తొలిసారిగా ‘365 డేస్’ అనే సినిమా చేశారు. ఇందులో ‘వద్దురా... పెళ్లి వద్దురా...’ పాటను పోసాని కృష్ణమురళి స్వయంగా ఆలపించారు. ♦ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ మరాఠీ చిత్ర రీమేక్ ‘ఆంధ్రా పోరి’తో హీరో అయ్యారు. ♦ తెలుగు, తమిళాల్లో నేరుగా, మలయాళ, హిందీ భాషల్లో అనువాద చిత్రంగా అంగరంగ వైభవంగా ‘బాహుబలి’ విడుదలైంది. సోషల్ మీడియాలో కీలక సమాచారం సెలెక్టెడ్ లీకులతోనే కావాల్సినంత ప్రచారం పొందిన ఈ చిత్రం ‘రేపే విడుదల’, ‘నేడే విడుదల’ లాంటి యాడ్స్ ఏమీ లేకుండా విడుదలై, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సినిమాకూ జరగనంత వ్యాపారం, రానన్ని వసూళ్ళు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన ‘పచ్చబొట్టేసినా...’ పాటను ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేస్తే కోటిన్నర క్లిక్‌లు వచ్చాయి. ♦ చాలా విరామం తర్వాత శ్రీదేవి ‘పులి’ అనే దక్షిణాది చిత్రంలో నటించారు. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ♦ రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’లో చిరంజీవి గెస్ట్ వేషం వేశారు. చిరంజీవి 8 ఏళ్ల తర్వాత తెరపై కనబడి, 150వ చిత్రం మైలురాయి చేరుకున్నారు. ఇక హీరోగా పూర్తిస్థాయిలో నటించే 151వ సినిమానే బాకీ. ♦ అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్’లో ఆఖరి పాటలో నాగార్జున తళుక్కున మెరిశారు. హీరో నితిన్ ఈ సినిమా నిర్మించడం విశేషం. ♦ ఉత్తరాది సంస్థ రాజశ్రీ వారు సల్మాన్‌ఖాన్‌తో తీసిన ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ను తెలుగులో ‘ప్రేమ్‌లీల’గా డబ్ చేశారు. దీనిలో సల్మాన్‌ఖాన్‌కు హీరో రామ్‌చ రణ్ డబ్బింగ్ చెప్పారు. ♦ కమల్‌హాసన్ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో డెరైక్ట్‌గా ‘చీకటిరాజ్యం’ సినిమా చేశారు. ♦ ‘ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారెంటీ’ అనే సినిమాలో రెండు పాటలను దర్శకుడు వంశీ స్వరపరిచారు. ఇందులో ఓ పాత్రను దర్శకుడు దేవీప్రసాద్ పోషించారు. ♦ ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, కష్టపడి స్వయంగా బరువు పెరిగిన ‘సైజ్ జీరో’-ఇలా ఒకే ఏడాది మూడు విభిన్న తరహా చిత్రాల్లో నటించి, హీరోయిన్ అనుష్క ఏడాది పొడుగూతా వార్తల్లో నిలిచారు. ♦ దర్శకుడు గుణశేఖర్ జీవితాన్ని పణంగా పెట్టి, తెలుగువారి చరిత్రయిన కాకతీయ సామాజ్య్ర కథను ‘రుద్రమదేవి’గా అందించారు. భారతదేశంలో స్టీరియోస్కోపిక్ త్రీడీలో తయారైన తొలి చారిత్రక కథా చిత్రం ఇదే. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. అమరావతి సహా దక్షిణాదిలో చాలాభాగాన్ని పాలించిన రుద్రమదేవి వెండితెర చరిత్రపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కరుణ చూపించలేదు. ♦ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కోసం త్రీడీలో డిజిటల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా చేయడం ఇండియాలో ఇదే ప్రథమం అట. ♦ సింగిల్ కేరెక్టర్‌తో ‘పంచమి’ సినిమా (నటి వేద) వచ్చింది. ♦ బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రం ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరుల్లో రోజుకు 4 ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకొంది. ప్రదర్శన రంగంలో డిజిటల్ విధానం వచ్చాక ఇన్ని రోజులు ఓ సినిమా ప్రదర్శితమవడం దేశంలోనే ఇది తొలిసారి. ♦ విమర్శకుడు కత్తి మహేశ్ డెరైక్ట్ చేసిన ‘పెసరట్టు ’ - క్రౌడ్ ఫండింగ్‌తో చేసిన తొలి తెలుగు చిత్రంగా మిగిలింది. ♦ ‘నాగ భైరవి’ పేరుతో ఒక త్రీడీ డబ్బింగ్ హారర్ ఫిల్మ్ రిలీజైంది. తెలుగులో తొలి హారర్ త్రీడీ ఫిల్మ్ ఇదే. ♦ మొత్తం తెలంగాణ తారలు, సాంకేతిక నిపుణులతో రూపొందిన తొలి చిత్రం ‘బందూక్’ ఈ ఏడాదే వచ్చింది. ♦ సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెలుగులో తొలిచిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్’. మంజునాథ్ డెరైక్టర్. ‘మధుర ’ శ్రీధర్ నిర్మాత. ♦ ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన తొలి తెలుగు చిత్రం ‘రెడ్ అలర్ట్’. చంద్రమహేశ్ డెరైక్టర్. సంస్కృతంలో విఘ్నేశ్వరునిపై పాట (రచన వెనిగళ్ళ రాంబాబు, గానం శంకర్ మహదేవన్) పెట్టారు. ♦ ‘బ్రూస్లీ’ై టెమ్లో ‘రామ్‌చరణ్ యాప్’ రిలీజ్ చేశారు. తెలుగులో ఒక హీరో పేరుతో యాప్ రావడం ఇదే ఫస్ట్. -
అమ్మాయితో అమ్మాయి!
ప్రశాంతి, గీతాంజలి ముఖ్యపాత్రల్లో శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఎఫైర్’. ఈ నెల 6న విడుదల కానుంది. ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘ఓ అమ్మాయిని ప్రేమించే మరో అమ్మాయిగా నటిస్తున్నానంటే చాలా మంది అభ్యంతరం చెప్పారు. కానీ సినిమా చూశాక అభినందిస్తున్నారు. రషెస్ చూశాక, రామ్‌గోపాల్‌వర్మగారు నాకు ఫోన్ చేయడం మర్చి పోలేను. ఇంగ్లీషు, హిందీల్లోనే సాహసోపేతమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఎందుకు రాకూడదనే పట్టుదలతో ఈ సినిమా చేశాం’’ అని చెప్పారు. ‘‘అమ్మాయితో రొమాన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎక్కడా అసభ్యత లేదు’’ అని గీతాంజలి చెప్పారు. -
150 ఏళ్ల క్రితం మనిషినని వర్మ నన్ను విమర్శించారు!
మంచు విష్ణు ఆలోచనా సరళి భిన్నంగా ఉంటుంది. స్టార్‌గా ఎదగడం కంటే, నటునిగా ఎదగడమే గొప్ప అంటారాయన. తెరపై ఎంత ధాటిగా హీరోయిజం పలికిస్తారో, అంతే ధాటిగా సమాజంలో జరిగే చెడుపై కూడా స్పందిస్తారు. పెద్దలను గౌరవించడం, ప్రతిభను ప్రోత్సహించడం, కొత్త దారుల్ని అన్వేషించడం... ఇలా అభినందించదగ్గ అంశాలు విష్ణులో చాలానే కనిపిస్తాయి. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘అనుక్షణం’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో విష్ణు ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘అనుక్షణం ప్రచార చిత్రాల్లో ‘అమ్మాయిలూ జాగ్రత్త!’ అని క్యాప్షన్ పెట్టారు. ఇంతకూ ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు? నాకు తెలిసి భారతీయ తెరపై ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. పాటల కోసం, కామెడీ కోసం ఈ సినిమాకు రావొద్దు. ఇదొక మంచి ప్రయత్నం. దాని కోసమే రండి. సినిమా కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. ఇక కథ విషయానికొస్తే... సిటీలో ఓ సైకో కిల్లర్ తిరుగుతుంటాడు. వాణ్ణి పట్టుకోవడమే సినిమా కాన్సెప్ట్. ఇందులో నేను డీజీపీ గౌతమ్ పాత్ర చేశా. స్టార్‌గా కాకుండా, ఒక నటునిగా నాకు గౌరవాన్ని పెంచే సినిమా అవుతుంది. ‘సమాజంలో నేరాలు పెరగడానికి కారణం సినిమాలే’ అని ఈ మధ్య ఓ సర్వే తేల్చింది. ఇలాంటి క్రైమ్ సినిమాల ప్రభావం జనాలపై పడే అవకాశం ఉంది కదా? పనికిమాలిన సర్వేల గురించి నేను అస్సలు మాట్లాడను. వాళ్లెవరండీ సినిమాలను విమర్శించడానికి. ఇంటర్నెట్లో విచ్చలవిడిగా కనిపిస్తున్న పోర్న్ ఫిలిమ్స్‌ని ముందు నిషేధించమనండి. అది చేతకాదు కానీ, సినిమాల గురించి మాట్లాడతారు. నా ఇద్దరు కూతుళ్లు, నా మేనకోడల్ని కలుపుకొని నాకిప్పుడు ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు పిల్లల తండ్రిగా చెబుతున్నాను. నా పిల్లలు గర్వపడేలా సినిమాలుంటాయి. ఎదుటివారిపై దుష్ర్పభావాన్ని చూపించే సినిమాలు నా నుంచి రావు. దట్సాల్. మాస్ ఇమేజ్ ఉన్న మీరు ఇలా ప్రయోగాల జోలికి వెళ్లడం కరెక్టేనా? నాకు స్టార్‌గా ఎదగడం కంటే, నటుడిగా ఎదగడమే ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. మా ముందు తరంలో ఎంతమంది హీరోలున్నా... మా నాన్నగారిని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ గార్లను మాత్రమే జనాలు గుర్తు పెట్టుకున్నారు. కారణం... నటులుగా వాళ్లు చేసిన ప్రయోగాలు అలాంటివి. నేనూ వారి దారిలోనే వెళ్లాలనుకుంటున్నా. వర్మపై అభిమానంతోనా వరుసగా సినిమాలు చేస్తున్నారు? ఒక క్రియేటర్‌గా వర్మగారికి అభిమానులు కానివారెవరు?. మూసలో కొట్టుకుపోతున్న భారతీయ సినిమాకు ఓ దిశను నిర్దేశించిన దర్శకుడాయన. దేశం గర్వించదగ్గ అలాంటి దర్శకునితో పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాను. అయితే.. వ్యక్తిగతంగా ఆయన్ను చాలా అంశాల్లో విభేదిస్తా. ఉదాహరణకు ‘వినాయకుడు’పై ఆయన చేసిన కామెంట్లు. ‘మా మనోభావాలను దెబ్బతీసే రీతిలో మాట్లాడటానికి మీరెవరు?’ అని సూటిగానే అడిగాను. ‘ఏం చేస్తారు?’ అని మొండిగా వాదించారు. ‘నువ్వు నూటయాభై ఏళ్ల క్రితం మనిషివి’ అని నన్ను విమర్శించారు. ఇలాంటి వ్యక్తిగత అంశాలను పక్కనపెడితే, దర్శకునిగా మాత్రం ఆయన లెజెండ్. నిర్మాతగా చెప్పండి. ‘రౌడీ’ మీకు లాభాలు తెచ్చిపెట్టిందా? నిర్మాతగా నాకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అది. నేనే కాదు, వర్మగారి వల్ల ఏ నిర్మాతా నష్టపోడు. ఆయన జడ్జిమెంట్ ఉన్న దర్శకుడు. ఈ వేలం పాట కాన్సెప్ట్ ఎవరిది? దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? ఇది వర్మగారి ఆలోచనే. దీని వల్ల నిర్మాతకు లాభం. దానికి ఉదాహరణ నేనే. ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూర్చే విధానం ఇది. అందుకని పంపిణీదారుల సహకారం లేకుండా ముందుకెళ్లలేం. ఆ విధంగా వారికీ లాభమే. మనోజ్ హీరోగా నేను నిర్మిస్తున్న ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని కూడా ఇదే విధానంతో అక్టోబర్ 2న విడుదల చేయనున్నాం. దాసరిగారు కూడా ‘ఎర్రబస్సు’ని ఈ రీతిగానే విడుదల చేయనున్నారు. మరికొందరు నిర్మాతలు కూడా ఈ విధానంపై అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారు. ‘వేలంపాట విధానం’పై పేటెంట్ హక్కులు మావే. ఇక నుంచి ఈ రీతిగా సినిమాలు విడుదల చేయాలనుకునే ప్రతివారూ మమ్మల్ని సంప్రదించే విడుదల చేయాలి. ఇందుకుగాను ఓ వెబ్‌సైట్‌ని కూడా స్టార్ట్ చేశాం. తెలుగు సినిమా చరిత్రపై ఓ డాక్యుమెంటరీ చేస్తామని చెప్పారు కదా! అది ఏమైంది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఎవరిపై ఆధారపకుండా నా సొంత ఖర్చుతో ఈ డాక్యుమెంటరీ చేస్తున్నాను. తెలుగు సినిమాను ఉద్ధరించిన ఎందరో మహానుభావులు ఇప్పుడు వెలుగులో లేరు. వారందరినీ బయటకు తేవడమే మా డాక్యుమెంటరీ లక్ష్యం. ఉదాహరణకు చిత్తూరు నాగయ్యగారు. ఆయన తెలుగు సినిమా తొలి సూపర్‌స్టార్. కానీ... ఆయనకు తమిళులు ఇచ్చినంత గౌరవం మనం ఇవ్వలేదు. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికోసమే ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ గురించి ఇప్పటివరకూ ఏ ఛానల్వాళ్లూ నన్ను సంప్రదించకపోవడం బాధాకరం. అందుకే యూట్యూబ్‌లో విడుదల చేయాలనుకుంటున్నాను. ‘రావణ’ సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారు? స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆ సినిమా మొదలవుతుంది. నాన్న టైటిల్‌రోల్ చేసే ఆ పౌరాణిక చిత్రంలో నా రోల్ ఏంటో రాఘవేంద్రరావు అంకుల్ ఖరారు చేయలేదు. చివరిగా ఓ ప్రశ్న. ఓ బాధ్యతగల సినిమా వ్యక్తిగా శ్వేతాబసు ప్రసాద్ అంశంపై మీ స్పందన? నిజంగా దారుణం. తనతో పాటు అదే హోటల్లో దొరికిన ఆ బడాబాబుల పేర్లను మీడియా కానీ, పోలీసులుకానీ ఎందుకు బయటపెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడమే ఆ అమ్మాయి చేసిన పాపమా? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్కడ తప్పులు జరగడం లేదు చెప్పండి? మీడియాలో తప్పులు జరగవా. పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా జాతీయ అవార్డు తీసుకున్న ప్రతిభావంతురాలు తను. ఆమెకు ఇలా జరగడం నిజంగా బాధాకరం. నా తదుపరి చిత్రంలో శ్వేతాబసు ప్రసాద్‌కి మంచి పాత్ర ఇస్తా. - బుర్రా నరసింహ -
దేవతలను కించపర్చారని వర్మపై ఫిర్యాదు
హైదరాబాద్: హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లోని మ ల్కాజిగిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారం ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. రెండు రోజుల క్రితం ఓ దినపత్రిక (సాక్షి కాదు)కు రామ్‌గోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో హిం దూ దేవతలు శివుడు, సరస్వతి, లక్ష్మిలను కించపరిచేలా మాట్లాడారని కుషాయిగూడకు చెందిన న్యాయవాది సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. రామ్‌గోపాల్ వర్మపై 295 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదిక రెండు నెలల్లో ఇవ్వాలని జడ్జి శ్రీదేవి కుషాయిగూడ పోలీసులను ఆదేశించినట్లు న్యాయవాది తెలిపారు. -
ఏడు రోజుల్లో... పెసరట్టు
అతి తక్కువ ఖర్చుతో ఫ్లోకామ్ టెక్నాలజీతో రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ తీసిన వైనం దర్శకుడు మహేశ్ కత్తిని ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో ఆయన ‘పెసరట్టు’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీన్ని కో-ఆపరేటివ్ విధానంలో తీయనున్నామని మహేశ్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించడంతో ఈ చిత్రానికి స్పాన్సరర్స్‌గా వ్యవహరించడానికి పలువురు ముందుకొచ్చారు. ఈ చిత్రవిశేషాలను మహేశ్ కత్తి చెబుతూ -‘‘32 సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని 7 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. అంతా నూతన నటీనటులతో రూపొందించనున్నాం కాబట్టి, 14 రోజులు వర్క్‌షాప్ నిర్వహించి, 4 రోజులు ఆన్ లొకేషన్లో కూడా ట్రయల్ షూట్ చేయనున్నాం. మరో వారం రోజుల్లో నటీనటుల ఎంపిక పూర్తవుతుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: అరిపిరాల సత్యస్రాద్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, నిర్మాతలు: శ్రీనివాస్ గుణిశెట్టి, ఈడ్పుగంటి శేషగిరి, డి.జి. సుకుమార్. -
ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్!
సీన్ నం.1 ఎనిమిది నెలల క్రితం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నం. 31లో ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు. మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే చాలా రోజులు పట్టింది. కట్ చేస్తే... సీన్ నం.2 2014 జూలై 31... ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది. ‘కేవ్’ అంటే గుహ. మామూలుగా గుహలుండేది కొండల్లో. మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి? ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి? ‘సాక్షి’కి మాత్రమే "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి? ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..! మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది... పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్, చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా... అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది? పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్. సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది? పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే! మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది? పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు. అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ. ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు? పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా. మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది... పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట. ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా? పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా చాలా కొత్తగా ఉంది! పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా. ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు? పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే. సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది? పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు. - పులగం చిన్నారాయణ The Man Behind.... ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం. ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్ఫార్మల్గా డిజైన్ చేశాం. 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ). ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది. టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు. - జయకిరణ్, ఆర్కిటెక్ట్ ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ... యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి. ఫొటోలు: శివ మల్లాల