ఏడు రోజుల్లో... పెసరట్టు | mahesh katti starts pesarattu movie by the inspiration of ram gopal varma | Sakshi
Sakshi News home page

ఏడు రోజుల్లో... పెసరట్టు

Published Tue, Aug 12 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఏడు రోజుల్లో... పెసరట్టు

ఏడు రోజుల్లో... పెసరట్టు

అతి తక్కువ ఖర్చుతో ఫ్లోకామ్ టెక్నాలజీతో రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ తీసిన వైనం దర్శకుడు మహేశ్ కత్తిని ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో ఆయన ‘పెసరట్టు’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీన్ని కో-ఆపరేటివ్ విధానంలో తీయనున్నామని మహేశ్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించడంతో ఈ చిత్రానికి స్పాన్సరర్స్‌గా వ్యవహరించడానికి పలువురు ముందుకొచ్చారు.

ఈ చిత్రవిశేషాలను మహేశ్ కత్తి చెబుతూ -‘‘32 సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని 7 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. అంతా నూతన నటీనటులతో రూపొందించనున్నాం కాబట్టి, 14 రోజులు వర్క్‌షాప్ నిర్వహించి, 4 రోజులు ఆన్ లొకేషన్లో కూడా ట్రయల్ షూట్ చేయనున్నాం. మరో వారం రోజుల్లో నటీనటుల ఎంపిక పూర్తవుతుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: అరిపిరాల సత్యస్రాద్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, నిర్మాతలు: శ్రీనివాస్ గుణిశెట్టి, ఈడ్పుగంటి శేషగిరి, డి.జి. సుకుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement