mahesh katti
-
చదువంటే బట్టీ పట్టడం కాదు
సినీ విమర్శకుడు, ఇటీవల ‘బిగ్‌బాస్’ షో ద్వారా పాపులర్ అయిన మహేశ్ కత్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎగిసే తారాజువ్వలు’. యశ్వంత్, హాసిని, సౌమ్యా వేణుగోపాల్, అజయ్ ఘోష్, లోహిత్, స్వప్న, అప్పాజీ అంబారిష్ఠ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాణి ఇరగం సమర్పణలో నాగ మల్లారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ పాటలను విడుదల చేశారు. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, శేఖర్ కమ్ముల, రచయిత చిన్నికృష్ణ తొలి పాటను, దర్శకుడు ఇంద్రగంటి, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, గీతాకృష్ణ, శ్రీనివాస్‌రాజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘చదువంటే బట్టీ పట్టడం కాదు.. జీవితాన్ని వడేసి పట్టడం’ అనే అంశాన్ని వినోదాత్మకంగా, సున్నితంగా మా సినిమాలో చెప్పాం’’ అన్నారు మహేశ్ కత్తి. ‘‘ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు నాగ మల్లారెడ్డి. -
ఏడు రోజుల్లో... పెసరట్టు
అతి తక్కువ ఖర్చుతో ఫ్లోకామ్ టెక్నాలజీతో రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ తీసిన వైనం దర్శకుడు మహేశ్ కత్తిని ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో ఆయన ‘పెసరట్టు’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీన్ని కో-ఆపరేటివ్ విధానంలో తీయనున్నామని మహేశ్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించడంతో ఈ చిత్రానికి స్పాన్సరర్స్‌గా వ్యవహరించడానికి పలువురు ముందుకొచ్చారు. ఈ చిత్రవిశేషాలను మహేశ్ కత్తి చెబుతూ -‘‘32 సన్నివేశాలతో సాగే ఈ చిత్రాన్ని 7 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. అంతా నూతన నటీనటులతో రూపొందించనున్నాం కాబట్టి, 14 రోజులు వర్క్‌షాప్ నిర్వహించి, 4 రోజులు ఆన్ లొకేషన్లో కూడా ట్రయల్ షూట్ చేయనున్నాం. మరో వారం రోజుల్లో నటీనటుల ఎంపిక పూర్తవుతుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: అరిపిరాల సత్యస్రాద్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, నిర్మాతలు: శ్రీనివాస్ గుణిశెట్టి, ఈడ్పుగంటి శేషగిరి, డి.జి. సుకుమార్.